Brahmamudi May 6th Episode: మదన్‌తో ఇందూ పెళ్లి.. తాత- నానమ్మల కోసం తలవంచిన ఇందూ
Photo Courtesy: JioHotstar
ఆస్తి పేపర్ల మీద ఇందూ వేసిన వేలిముద్రలు చెల్లవని.. ఆమెకు పెళ్లయితేనే ఆస్తిపై హక్కు వస్తుందని రాజ్- కావ్యలు రాసిన వీలునామాను చూపిస్తాడు లాయర్. ఇదంతా చూసిన రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. నేను వేసిన వేలిముద్రలు చెల్లవని నాకు ముందే తెలుసు.. నాకు పెళ్లయితేనే ఈ ఆస్తి మీద హక్కు వస్తుందని ఇందూ చెప్పడంతో సుభాష్, అపర్ణలు సంతోషిస్తారు. ఆస్తి మొత్తం చేజారిపోయే పరిస్ధితులు రావడంతో రేఖ, భ్రమరాంబలు ఆలోచిస్తుంటారు. ఆ వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతుంది రేఖ.
ఉదయాన్నే తన కొడుకు మదన్ రావడంతో ఆస్తి మన చేతికి రావాలంటే నువ్వు ఇందూని పెళ్లి చేసుకోవాలని రేఖ తేల్చేస్తుంది. నేను దానిని పెళ్లి చేసుకోను.. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుందని అంటాడు మదన్. నేను చెప్పినట్లు వినకపోతే ఏం చేస్తానో నీకు తెలుసని రేఖ వార్నింగ్ ఇవ్వడంతో మదన్ సైలెంట్ అయిపోతాడు. మదన్‌కి, నా కూతురు స్వాతికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా అని రేఖని అడుగుతుంది భ్రమరాంబ. ఏం ఉందని నా కొడుక్కి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ప్లేట్ తిప్పేయడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. డబ్బు వసూలు చేసుకోవడం ఇంటికొస్తున్న రాకేష్‌తో గొడవ పడుతుంది ఐశ్వర్య. రాజ్ పుట్టుక గురించి నిజం చెప్పకూడదని చలపతి - లక్ష్మీ అనుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 6వ తేదీ ఎపిసోడ్ 1025లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
డబ్బులు కోసం రాకేష్ రావడంతో ఐశ్వర్య కంగారు పడుతుంది. అతనిని పక్కకి తీసుకెళ్లి మా ఆంటీ ఇప్పుడు చాలా కోపంగా ఉంది. నువ్వు వెళ్లి అడిగి మా ఆంటీ కనుక డబ్బులు ఇవ్వకపోతే నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఐశ్వర్య తేల్చిచెప్పడంతో రాకేష్ షాక్ అవుతాడు. నా మాట విని వెళ్లిపోతే నేను నీకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తానని చెబుతుంది. దాంతో ఆలోచనలో పడ్డ రాకేష్.. వారం రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వాలి లేదంటే ఈసారి రచ్చరచ్చ చేసేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే లక్కీకి ఫోన్ చేస్తుంది ఐశ్వర్య. కానీ రాజ్ ఏం మాట్లాడకపోవడంతో కాల్ కట్ చేస్తాడు లక్కీ. నేను తనని ఫేస్ చేయలేను, నువ్వే ఏదో ఒకటి మాట్లాడమని అంటాడు.
నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఆటలుగా ఉందా? నా డబ్బును నాకు ఎప్పుడు ఇస్తావు రా అంటూ ఐశ్వర్య నోరుజారడంతో రాజ్ సీరియస్ అవుతాడు. డబ్బులు ఇవ్వాలన్న సంగతి గుర్తులేదా అంటూ మండిపడుతుంది. నేను నీ కంటే ర్యాష్‌గా మాట్లాడగలను, చెవుల్లో నుంచి రక్తం కారేలా మాట్లాడతానని వార్నింగ్ ఇస్తుంది. నాకు డబ్బులు వచ్చే వరకు నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని తేల్చిచెబుతాడు రాజ్. డబ్బులు ఇవ్వాల్సింది మనమే కదా? ఓపికగా సమాధానం చెప్పాలి కదా అంటాడు లక్కీ. నీ అవసరం తీరిపోయాక నా రిలేషన్ బ్రేక్ చేస్తున్నావు కదా అంటూ లక్కీ బాధపడతాడు.
ఇందూ వంట చేస్తుండగా స్వాతి వచ్చి మీ ఇద్దరి ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుందని అంటుంది. అక్కకి త్వరగా పెళ్లి చేసేద్దామా అని స్వాతి అనగా.. ఆస్తి మీద నాకు హక్కు రావడానికా అని ఇందూ ప్రశ్నిస్తుంది. పెళ్లి టాపిక్ తీసుకురాగానే పక్కకి వెళ్తున్నావు.. లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా వెళ్లిపోదామని అనుకుంటున్నావా అని అడుగుతుంది. అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని చెబుతుంది స్వాతి. నీకు కాబోయే మనవడికి ఇలా ఉండాలి? అలా ఉండాలని లిస్ట్ రాసుకున్నావా అని ప్రశ్నిస్తుంది. ఇందూని పెళ్లి చేసుకునేవాడు తనని అర్ధం చేసుకోవాలి, తన బాధకి ధైర్యం అవ్వాలి, ప్రతి విషయంలో తనని ప్రేమగా చూసుకోవాలి, రేఖ లాంటివాళ్లు ఎంతమంది వచ్చినా ఎదురించి నిలబడాలి. అలాంటి వాడు కనిపించినప్పుడు నేనే ఇందూకి పెళ్లి చేస్తానని చెబుతుంది అపర్ణ.
ఇంతలో ఇందూని, అపర్ణని, సుభాష్‌ని రేఖ పిలుస్తుంది. ఎందుకు పంతులుగారిని పిలిపించావని అపర్ణ అడగ్గా.. ఇందూకి పెళ్లి చేయడానికని రేఖ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అమ్మాయితో ఒక్క మాట మాట్లాడలేదు.. పెళ్లికొడుకు ఎవరో తెలియదు, ఇవన్నీ తెలియకుండా పెళ్లికి ముహూర్తం చూడటం ఏంటీ అని ప్రశ్నిస్తుంది అపర్ణ. పెళ్లి కొడుకు నా కొడుకు మదన్ అని చెబుతుంది రేఖ. పెళ్లి చేయడానికి ఈడూజోడూ బాగుండాలి కదా అని అంటుంది అపర్ణ. దాంతో ఇందూని మదన్ పక్కన కూర్చోబెట్టి జంట ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది రేఖ. చూడముచ్చటగా ఉందని చెబుతుంది భ్రమరాంబ.
ఇందూ కంటే మదన్ మూడు సంవత్సరాలు చిన్నోడు అని చెబుతుంది అపర్ణ. అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడైతే పెళ్లి చేయకూడదని రాజ్యాంగంలో రాసుందా? ఇద్దరూ మేజర్స్ అయితే చాలు. మన పురాణాలు, చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి చేసుకోలేదా అని చెబుతుంది. ఈ పెళ్లి చేస్తే నా మనవరాలు సంతోషంగా ఉండదని సుభాష్ అంటాడు. ఈ ఆస్తిని దక్కించుకోవడానికే ఈ పెళ్లి చేస్తున్నావని మాకు తెలుసని అంటుంది అపర్ణ. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి జరుగుతుందని తేల్చేస్తుంది రేఖ. ఒక ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేయొద్దని చెబుతుంది అపర్ణ. నేను రేపు మదన్‌కి, ఇందూకి పెళ్లి చేయబోతున్నాను అని తేల్చేస్తుంది రేఖ.
రేఖ ఆంటీ అనుకున్నదంతా చేస్తోందని స్వాతి బాధపడుతుంది. మంచి చేయడానికి ముహూర్తాలు కావాలి కానీ చెడు చేయడానికి ఎందుకు? అసలు ఆ మదన్‌తో ఇందూకి పెళ్లేంటీ? వాడు ఇందూ కంటే మూడేళ్లు చిన్నవాడని రగిలిపోతుంది అపర్ణ. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని అక్కడే చెప్పమని స్వాతి చెబుతుంది. ఒప్పుకోకపోతే ఆ రేఖ ఆంటీ ఊరుకుంటుందా అని అడుగుతుంది ఇందూ. ఒక ఇష్టం లేని వ్యక్తి పెళ్లి పేరుతో మన జీవితంలోకి వస్తే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? లేదంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నట్లేనని చెబుతుంది ఇందూ. మన ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయించుకున్నట్లే.. మదన్‌ని తలవంచుకుని పెళ్లి చేసుకుంటావా? ఆ తాళి జీవితాంతం మోయాల్సిందే. మదన్‌ని పెళ్లి చేసుకుంటే ఆ క్షణమే మేం చచ్చిపోయినట్లు లెక్క అంటుంది అపర్ణ. ఆ మాటలతో ఇందూ షాక్ అవుతుంది.
ఇందూ పెళ్లి గురించి స్వాతి బాధపడుతూ ఉండగా ఇందూ వచ్చి చూస్తుంది. స్వాతి ఏడుస్తూ ఉండటంతో ఇందూ షాక్ అవుతుంది. ఏ రోజూ ఏ విషయంలోనూ నువ్వు బాధపడలేదు.. నిజం చెప్పమని నిలదీస్తుంది ఇందూ. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అంటుంది. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను.. కానీ ఇప్పుడు ఆ ప్రేమ నాకు దక్కదని చెబుతుంది స్వాతి. ఎవరిని ప్రేమిస్తున్నావు? అతను ఎవరైనా సరే ఇంట్లో వాళ్లని నేను ఒప్పిస్తానని చెబుతుంది. ఆ మాటలతో ఇందూ షాక్ అవుతుంది. రేపు జరుగుతున్న నీ పెళ్లే నీ చేతుల్లో లేదు.. అలాంటిది నా ప్రేమను ఎలా గెలిపిస్తావని అంటుంది స్వాతి. ఈ పెళ్లి జరగదు.. నేను మాటిస్తున్నానని చెబుతుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications