Brahmamudi may 6th episode: బాబు ఎవరో తెలుసుకోలేకపోయిన కావ్య.. స్వప్న పైఎత్తుకు చిత్తయిన తల్లీకొడుకులు!
బాబు తల్లిని పట్టుకునే ప్రయత్నంలో రాజ్ ని ఫాలో అవుతుంది కావ్య. భర్త, అత్త మోసం చేసి డబ్బు కాజేసారని తెలుసుకుంటుంది స్వప్న. తెలివిగా వాళ్ల దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 6వ తేదీ ఎపిసోడ్ 402 లో ఏం జరిగిందంటే..
మాయ మేడం రాజ్ సార్ మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అంటాడు ఆ వ్యక్తి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అంటుంది కావ్య. తండ్రి ఎవరో చెప్పకుండా నేను ఎంత కాలం నిందలు మోయాలి, అందుకే మీ ఇంటికి వచ్చి అందరికీ నిజం చెప్తాను అంటుంది మాయ. అంత పని చేయకు, అలా చేస్తే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది నీ ఇష్టప్రకారం గానే ఈ బాబు ఇంటి వారసుడు అవుతాడు అంటూ ఆమెని ఒప్పించి బాబుని తీసుకున్నారు రాజ్ సార్,అప్పుడే తెలిసింది ఆ బాబు రాజ్ సార్ బిడ్డ అని అంతకుమించి తనకేమీ తెలియదని చెప్తాడు.

కోపంగా బయటికి వచ్చేస్తుంది కావ్య. తన వెనుక వచ్చిన అప్పు బావ నీ నమ్మకం మీద దెబ్బ కొట్టాడు ఇంటికి వెళ్లి అందరి ముందు బావ ని నిలదీయు అంటుంది. కాదు ఇందులో ఏదో తిరకాసు ఉంది మా పెళ్ళి రోజు నాతో మనసు విప్పి మాట్లాడుతానని శ్వేతతో చెప్పారంట, అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే ఏదో జరిగింది మనం ఆఫీస్ కి వెళ్తే నిజం తెలుస్తుంది అని కావ్య చెప్పడంతో అప్పు, కావ్య ఇద్దరు ఆఫీస్ కు బయలుదేరుతారు. మరోవైపు రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటే స్వప్న వాళ్ళిద్దరూ వినేలా కోటి రూపాయలు కారు కొంటాను అని ఫోన్లో మాట్లాడుతుంది.
ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత అమ్మ తను కోటి రూపాయలు అంటుంది ముందు ఆ డబ్బు ఉందో లేదో చూడు అని రాహుల్ అనటంతో బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసిన రుద్రాణి ఆ బ్రీఫ్ కేస్ ఖాళీగా ఉండటం చూసి షాక్ అవుతుంది. స్వప్నను వెళ్లి నిలదీస్తాను అంటూ కోపంగా బయలుదేరుతుంది. నువ్వు కోపంలో లాజిక్ మర్చిపోతున్నావు తనని కోప్పడితే ఆ సేటు దగ్గరనుంచి మనమే అప్పు తీసుకున్నామని అందరికీ తెలిసిపోతుంది.
అందుకే ఏం చేయాలో ఆలోచించి ఫోన్ చెయ్యు అప్పుడే ఇంటికి వస్తాను అని చెప్పి చల్లగా జారుకుంటాడు రాహుల్. స్వప్నని వదిలిపెట్టను అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు ఆఫీసుకు వచ్చిన స్వప్న ఆఫీస్ స్టాఫ్ అందరినీ వాళ్ల పెళ్లిరోజు సాయంత్రం ఆఫీస్ కి ఎవరైనా వచ్చారా అని ఎంక్వయిరీ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశపడుతుంది. అప్పుడే అప్పు సెక్యూరిటీని చూసి అక్క ఆఫీస్ కి ఎవరు వచ్చింది రానిది ఎవరికి తెలియకపోయినా సెక్యూరిటీ కి తెలుస్తాయి.
పద అతన్ని ఎంక్వయిరీ చేద్దాం అనడంతో ఇద్దరు సెక్యూరిటీ దగ్గరికి వెళ్తారు మా పెళ్లి రోజు గుర్తుందా అని అడుగుతుంది కావ్య. ఉంది మేడం ఆరోజు బట్టలు కొనుక్కోమని సార్ డబ్బులు కూడా ఇచ్చారు అంటాడు. ఆరోజు ఆఫీస్ కి ఎవరైనా వచ్చారా అంటే రాలేదు మేడం, నేను టీ తాగడానికి క్యాంటీన్ కి వెళ్లాను అప్పుడు వచ్చారేమో కావాలంటే సీసీటీవీలో చూడండి అనడంతో సీసీటీవీ చెక్ చేస్తారు కావ్య వాళ్ళు.

ఆ టైంలో సీసీ ఫుటేజ్ డిలీట్ చేయబడి ఉంటుంది. ఏమైంది అని అడుగుతుంది కావ్య. రాజ్ సార్ డిలీట్ చేశారు అంటాడు సెక్యూరిటీ. దాంతో నిరుత్సాహపడుతుంది కావ్య. హార్డ్ డిస్క్ ఉంటే డిలీట్ అయినవి కూడా చూడవచ్చు అంటుంది అప్పు. సెక్యూరిటీ దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంటారు కావ్య, అప్పు. మరోవైపు అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు. రాజ్ భోజనం దగ్గర కూర్చునే సరికి అపర్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళిపోతే ఆయన సరిగ్గా భోంచేయగలరా, ఆయన చేసిన తప్పేంటి అని భర్తని వెనకేసుకొస్తుంది కావ్య. వాడిని అంటే నువ్వెందుకు అంతలా బాధ పడిపోతున్నావ్ అంటుంది అపర్ణ.
వాడితో పాటు తను కూడా బయటకు వెళ్లిపోవాలి కదా అందుకే అలా మాట్లాడుతున్నట్లు ఉంది,అసలు రాజ్ చేసిన పనికి ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది రుద్రాణి. నాక్కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది భర్త ఎంత తప్పు చేసినా భర్తని వెనకేసుకొస్తుందే కానీ నీలాగా భర్తని వదిలేసి పుట్టింట్లో ఉండటం లేదు, తన గురించి పల్లెత్తు మాట అనే హక్కు నీకు లేదు నోరు మూసుకొని అన్నం తిను అని చెల్లెలికి చీవాట్లు పెడతాడు సుభాష్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











