Brahmamudi May 7th Episode : రాజ్‌తో సీతారామయ్య వీడియో కాల్.. రుద్రాణికి చుక్కలు చూపించిన అప్పూ

రాజ్‌కు బట్టలు ఇచ్చేందుకు కళ్యాణ్ రూమ్‌లోకి వెళ్తుండగా యామినిని చూస్తుంది కావ్య. వెంటనే దొంగ దొంగ అని అరవడంతో యామిని దాక్కొంటుంది. నువ్వేం చేసినా సరే రాజ్‌ను దక్కించుకోలేవని, మీ ఇద్దరి మధ్యలోకి నేను వస్తానని వార్నింగ్ ఇస్తుంది యామిని. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆయన చేతుల్లో నువ్వు అయిపోతావని చెబుతుంది కావ్య. రూమ్‌లోకి వెళ్లి యామినిని మరింత ఏడిపించేందుకు గాను రాజ్ తనతో సరసాలు ఆడినట్లుగా సౌండ్ చేస్తుంది కావ్య.

బయట ఏవో సౌండ్స్ విన్న రాజ్ బయటికొచ్చి ఏం జరిగిందని అడుగుతుండగా యామిని ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు రాజ్. నువ్వే నాకు మెసేజ్ పెట్టావని ఫోన్ చూపిస్తుంది యామిని. దాంతో కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. ఓ వెయిటర్‌ని లోపలికి పంపించి రాజ్ ఫోన్ నుంచి మెసేజ్ పెట్టించినట్లు గుర్తుచేసుకుంటుంది యామిని. ఏం జరుగుతుందో తెలియక రాజ్, కావ్యలు టెన్షన్ పడతారు. ఎక్కువగా ఆలోచించొద్దు నీ హెల్త్‌కి మంచిది కాదని రాజ్‌తో అంటుంది యామిని. ఈ పార్టీ అయ్యే వరకు నేను నీతోనే ఉంటానని, సరదాగా ఎంజాయ్ చెద్దామని చెప్పడంతో రాజ్ భయపడతాడు. తన ప్లాన్ రివర్స్ కావడంతో కావ్య షాక్ అవుతుంది. పాపను ఆడిస్తున్న ధాన్యలక్ష్మీని చూసిన స్వప్న టెన్షన్ పడుతుంది. పాపని రుద్రాణికి ఇస్తే ఈవిడ దగ్గరికి ఎలా వచ్చిందని అనుకుంటుంది.

రుద్రాణి, రాహుల్ కనిపించకపోవడంతో ధాన్యలక్ష్మీ దగ్గర పాప ఉండటంతో ఆమెపై కోప్పడుతుంది స్వప్న. పాపని మా అత్తయ్యకిచ్చి ఆడించమని చెప్పానని స్వప్న అడగ్గా.. ఏదో అర్జెంట్ పని ఉందని రాహుల్, రుద్రాణిలు బయటికి వెళ్తూ పాపని నాకు ఇచ్చి వెళ్లారని చెబుతుంది ధాన్యలక్ష్మీ. రిసార్ట్‌లోకి వెళ్తుండగా రుద్రాణి, రాహుల్‌లను ఆపుతాడు సెక్యూరిటీ గార్డ్. దాంతో వెయిటర్స్ డ్రెస్‌లో లోపలికి వెళ్తారు తల్లీకొడుకులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 7వ తేదీ ఎపిసోడ్‌ 715లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 7th 2025 Episode 715 Here is Today s full story

కావ్యను ఫాలో అవుతూ రుద్రాణి, రాహుల్‌లు రిసార్ట్‌కు వచ్చినట్లు అప్పూకి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. వాళ్లని ఎలా వదిలేశావని అప్పూ నిలదీయగా.. నేను ఫ్రెష్ అవుదామని వచ్చేలోగా పారిపోయారని చెబుతుంది స్వప్న. వాళ్ల సంగతి నేను చూసుకుంటానని అంటుంది . ఈ మాటలన్నీ రాహుల్, రుద్రాణిలు వింటారు. మన మీద ఎవ్వరికీ అనుమానం రాకముందే ఆ కావ్య ఇక్కడికి ఎందుకొచ్చింది? ఏం చేస్తోంది? అనేది తెలుసుకోవాలని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.

ఇంతలో భోజనం చేయడానికి రావాల్సిందిగా అందరినీ పిలుస్తుంది అపర్ణ. మీ పద్ధతులు నాకు నచ్చడం లేదని సీతారామయ్య కోపంగా అంటాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఈ ఇంట్లో ఎవ్వరూ నా ఇష్టం గురించి పట్టించుకోవడం లేదని, రాజ్‌ప్రాణాలతో ఉన్నాడని శుభవార్త చెప్పారని కనీసం వాడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని తెలుసుకోవాలని నాకు ఉండదా? అని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. ఈరోజు నా మనవడిని చూడాలి, వాడితో మాట్లాడాలని తేల్చిచెబుతాడు. వాడికి గతమే గుర్తులేదంటే ఇప్పుడు వాడితో ఎలా మాట్లాడతావని అడుగుతుంది ఇందిర. ఈరోజు వాడితో మాట్లాడకుండా నేను భోజనం చేయనని అంటాడు సీతారామయ్య. నేను ఇప్పుడే కావ్యతో మాట్లాడి వీడియో కాల్ మాట్లాడిస్తానని వెళ్తుంది అపర్ణ. వెంటనే ఈ విషయం కావ్యకి చెబుతుంది.

రాజ్‌ పక్కనే యామిని ఉండటంతో ఎలా వీడియో కాల్ మాట్లాడించాలో తెలియక కావ్య టెన్షన్ పడుతుంది. పార్టీలో మనిద్దరం డ్యాన్స్ చేద్దామని యామిని చెప్పడంతో నాకు డ్యాన్స్ వచ్చా అని అడుగుతాడు రాజ్. నేను గతం మరిచిపోయాను కదా అందుకే అలా అడిగానని అంటాడు. నువ్వు అద్భుతమైన డ్యాన్సర్‌వని చెబుతుంది యామిని. ఇంతలో ఫోన్ మాట్లాడాలంటూ రాజ్‌కు సైగలు చేసి పిలుస్తుంది కావ్య. యామినిని రెడీ అవ్వమని చెప్పిన రాజ్.. కావ్య దగ్గరికి వెళ్తాడు. ఎందుకలా సైగలు చేస్తున్నారని రాజ్ అడగ్గా.. ఉదయం మిమ్మల్ని మా ఫ్యామిలీకి పరిచయం చేస్తానని చెప్పానని అంటుంది.

అంత మంచి విషయం ఇంత ఆలస్యంగా చెబుతారేంటీ అని ప్రశ్నిస్తాడు రాజ్. వాళ్లు కొంచెం ఎమోషనల్ టైప్ అని.. పరిచయమైన కొద్దిసేపటికే ఫీల్ అయిపోతారని అంటుంది. మా తాతయ్యతో ఒకసారి మాట్లాడమని చెప్పడంతో రాజ్ సరేనని అంటాడు. ఆ వెంటనే కావ్య ఫోన్ చేయడంతో సీతారామయ్యకి ఫోన్ ఇస్తుంది అపర్ణ. నా ఫ్రెండ్ రామ్ అని చెప్పాను కదా ఈయనే అని పెద్దాయనికి పరిచయం చేస్తుంది కావ్య.

తాతయ్య అని పిలుపు విని ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? అసలు ఎప్పుడు వస్తున్నావురా నువ్వు అని అడుగుతాడు సీతారామయ్య. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మా తాతయ్య ఎమోషనల్ అని చెప్పాను కదా అందుకే అలా మాట్లాడుతున్నారని కావ్య కవర్ చేస్తుంది. ఇంట్లో వాళ్లందరితో వీడియో కాల్ మాట్లాడతాడు రాజ్. ఫోన్ మాట్లాడిన తర్వాత ఆకలి దంచేస్తోందని వడ్డిస్తావా అని అపర్ణని అడుగుతాడు సీతారామయ్య.

వెయిటర్ డ్రెస్‌లో ఉన్న రుద్రాణి, రాహుల్‌లను రాజ్ ఫ్రెండ్స్ మందు పోయమని చెప్పడంతో వాళ్లు మండిపడతారు. అది మా పనికాదని రుద్రాణి మండిపడుతుంది. నాకు మందుపోయవా? అసలు మేం ఎవరో తెలుసా అంటూ మండిపడతాడు. నేను కలుపుతానని వాళ్లకి సర్దిచెబుతాడు రాహుల్. నాకు నువ్వు వద్దని ఆ ఫ్రెంచ్ కట్టే కలపాలని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. తర్వాత వారిలో ఒకడు రుద్రాణికి మందు కలపడం నేర్పిస్తూ భుజం మీద చేయి వేస్తాడు. ఆ దెబ్బతో రుద్రాణి చాలా ఫాస్ట్‌గా మందు కలుపుతుంది. దాంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. తర్వాత మాకు ఎంటర్‌టైన్మెంట్ కావాలని డ్యాన్స్ చేయమని అడుగుతారు ఆ ఇద్దరు తాగుబోతులు.

మండిపడిన రాహుల్.. మేం చేయమని తేల్చిచెబుతాడు. దాంతో రుద్రాణి అతనిని కూల్ చేసి డ్యాన్స్ వేయమని చెబుతుంది. రాహుల్ - రుద్రాణిల డ్యాన్స్‌ని దూరం నుంచి చూసి నవ్వుకుంటుంది అప్పూ. మాకు కిక్ రావడం లేదని నువ్వు టేబుల్ ఎక్కమని రాహుల్‌ని అడుగుతాడు ఆ వ్యక్తి. వారి రాద్ధాంతాన్ని చూసిన అప్పూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X