Brahmamudi May 7th Episode: స్వాతి ప్రేమను గెలిపించడానికి ఇందూ స్కెచ్.. ఇందూని కిడ్నాప్ చేసిన రాజ్‌

Photo Courtesy: JioHotstar

బాకీ తీర్చమంటూ రాకేష్ నేరుగా ఇంటికి రావడంతో అతనిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. మా ఆంటీ నీతో సంబంధం లేదని చెబితే మాత్రం నీకు ఒక్క పైసా కూడా ఇవ్వనని ఐశ్వర్య. దాంతో వారం గడువిస్తాడు రాకేష్. ఈ దెబ్బకు రాజ్‌కి ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది ఐశ్వర్య. దాంతో రాజ్ కూడా సీరియస్ అవుతాడు. ఐశ్వర్యతో నా రిలేషన్ చెడగొట్టావని రాజ్‌పై లక్కీ అలిగి వెళ్లిపోతాడు. నీ పెళ్లి అయ్యే వరకు రేఖ ఆంటీ ఏం చేయలేదని ఇందూ, స్వాతిలు నవ్వుకుంటూ ఉండగా రేఖ పిలుస్తుంది. నట్టింటిలో పంతులుగారు ఉండటంతో అపర్ణ, ఇందూలు స్వాతి షాక్ అవుతారు.

నా కొడుకు మదన్‌తో ఇందూ పెళ్లి చేయబోతున్నానని రేఖ చెప్పడంతో సుభాష్, అపర్ణలు మండిపడతారు. ఇందూ కంటే మదన్ మూడేళ్లు చిన్నవాడని రేఖకి అపర్ణ చెప్పినా వినిపించుకోదు. మీకు ఇష్టం ఉన్నా.. లేకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుందని తేల్చిచెబుతుంది. అర్ధరాత్రి భోజనం చేయకుండా స్వాతి ఏడుస్తుంది. అది చూసిన ఇందూ.. ఏం జరిగిందని అడుగుతుంది. నేను ప్రేమించిన మదన్‌ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 7వ తేదీ ఎపిసోడ్ 1026లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 7th 2026 Episode 1026 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మదన్‌తో నీ పెళ్లి జరగదు.. దీనిని ఆపడానికి ఎవరో ఒక మహానుభావుడు వస్తాడని స్వాతికి మాటిస్తుంది ఇందూ. మొన్న నీకొచ్చిన 10 లక్షల రూపాయలు ఏం చేశావని రాజ్‌ని నిలదీస్తాడు లక్కీ. వేరే అవసరానికి వాడుకున్నానని రాజ్ చెబుతాడు. ఆ అవసరం ఏంటీ? అసలు నువ్వెందుకు పంజాగుట్ట ఆసుపత్రికి వెళ్లావని లక్కీ అడగటంతో రాజ్ షాక్ అవుతాడు. హాస్పిటల్‌లో నువ్వెవరిని కలిశావు? ఆ పది లక్షలు ఎవరికి కట్టావు? అయినా చిన్నప్పటి నుంచి నేను నీతోనే కలిసి పెరిగాను. మనిద్దరి మధ్యా ఏ సీక్రెట్స్ లేవు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఐశ్వర్యకి 10 లక్షలు ఇచ్చి నా లైఫ్ సెటిల్ చేసుకుందామని అనుకున్నాను. కానీ నీ స్వార్ధం నువ్వు చూసుకుంటావని అనుకోలేదని బాధపడతాడు లక్కీ.

అసలు ఆ డబ్బులు నువ్వు ఎవరి కోసం ఖర్చుపెట్టావని ప్రశ్నిస్తాడు లక్కీ. నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నాకు అనవసరం. కానీ ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నా లైఫ్ సెట్ చేయమని బాధపడతూ వెళ్లిపోతాడు లక్కీ. ఇంతలో రాజ్‌కి ఇందూ ఫోన్ చేసి ఓ ప్రాబ్లమ్‌లో పడ్డాను.. నాకు నీ సాయం కావాలని చెబుతుంది ఇందూ. రేపు నా పెళ్లి.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అవతలి వైపు వినేవాళ్లు లేనప్పుడు ఏం చేయగలను, ఈ పెళ్లి జరిగితే నేను నా లైఫ్‌లో అనుకున్నది సాధించలేను. అందుకే దీనిని ఆపాలి.. దీనిని ఆపడానికి నువ్వే కరెక్టే పర్సన్ అని నాకు అనిపించింది. నువ్వు ఈ పెళ్లి ఆపితే నీకు ఆ డబ్బులు నేను ఇస్తానని చెబుతుంది ఇందూ.

ఒక పెళ్లిని ఆపాలి, దీనికి డబ్బులు కూడా ఇస్తానని చెబుతుంది ఇందూ. దాంతో రాజ్ ఒప్పుకుంటాడు. ఎలా పెళ్లిని ఆపాలో కూడా రాజ్‌కి ఐడియా ఇస్తుంది ఇందూ. నువ్వు చెప్పింది నేను చేస్తాను.. కానీ నేను అడిగినట్లు నువ్వు డబ్బులు ఇవ్వాలని చెబుతాడు రాజ్. దానికి ఇందూ సరేనని అంటుంది. మదన్‌తో ఇందూ పెళ్లిని ఎలా ఆపాలా అని భ్రమరాంబ ఆలోచిస్తుంది. మన కూతురిని మదన్‌కిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను.. రేపు చూపిస్తానని శేషంతో అంటుంది భ్రమరాంబ.

ఆస్తిని దక్కించుకోవడానికి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని రేఖతో భూషణ్ అంటాడు. అందరి సమక్షంలో ఇందూ చేత వేలిముద్రలు వేయించుకుందామంటే వాడెవడో కిడ్నాప్ చేశాడు. మనం నానా కష్టాలు పడి ఇందూని విడిపించి తీసుకొచ్చాం. దానితో ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టిస్తే.. ఇందూ పెళ్లయితేనే కానీ ఈ ఆస్తి మీద ఇందూకి హక్కు రాదని తెలిసిందని బాధపడతాడు. కానీ ఈసారి ఏం చేసైనా సరే ఆస్తిని దక్కించుకుంటానని చెబుతుంది రేఖ.

ఆస్తిని దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను.. చచ్చిపోయిన ఇందూ తల్లిదండ్రులు దిగొచ్చినా ఈ పెళ్లిని ఆపలేరని భూషణ్‌తో అంటుంది రేఖ. అమ్మానాన్న అనుకున్నట్లు చేయాలి.. రేఖ ఆంటీ చేతిలోకి ఆస్తి వెళ్లకుండా చేయాలని బాధపడుతుంది. అటు రాజ్ కూడా నాకు డబ్బులు కావాలి.. ఏమైనా చేయాలని అనుకుంటాడు. ఉదయాన్నే పెళ్లి కోసం ఇందూ రెడీ కావడంతో రేఖ సంతోషిస్తుంది. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లి చేస్తున్నాం కాబట్టి అన్ని ప్రూఫ్స్‌ దగ్గర పెట్టుకోమని ఇందూకి చెబుతుంది రేఖ. పెళ్లి గుడిలో అన్నావు.. మళ్లీ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అంటున్నావని మండిపడుతుంది అపర్ణ.

నా నిర్ణయాన్ని మార్చుకున్నానని రేఖ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. నాకు పెళ్లి ఇష్టం లేదు.. కానీ దానితో గుడిలో గౌరీపూజ చేయిస్తానని చెబుతుంది అపర్ణ. అదంతా వద్దు అంటుంది రేఖ. నాకు, నా మనవరాలికి ఇష్టం లేకపోయినా సరే.. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. కనీసం గుడిలో గౌరీ పూజ చేస్తానని అంటుంది అపర్ణ. దుగ్గిరాల వంశానికి, కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఇందూ అధిపతి. నా మనవరాలి పెళ్లిని అంగరంగవైభవంగా చేయాలని అనుకున్నానని బాధపడుతుంది అపర్ణ.

నా కోసమైనా ఒప్పుకోమని అడుగుతుంది ఇందూ. అయినప్పటికీ రేఖ ఒప్పుకోదు. అయితే నేను రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతానని ఇందూ అనడంతో రేఖ షాక్ అవుతుంది. ఇది మనల్ని బెదిరిస్తోంది.. అలా అయితే మనం నిజంగానే ప్రాబ్లమ్‌లో పడిపోతాం, ఈ పెళ్లి ఆపేద్దామని చెబుతుంది భ్రమరాంబ. దాంతో రేఖ మండిపడుతుంది.

మీరు ఎక్కడ వేలిముద్రలు వేయమంటే అక్కడ వేస్తున్నానని అంటుంది. నన్ను, మా నానమ్మని ఒకే ఒక్కసారి గుడికి పంపించండి.. ఇంకేం ఆడగమని చెబుతుంది ఇందూ. ఒక్కసారికి అని అంత గట్టిగా చెబుతున్నావు.. కొందదీసి మళ్లి తిరిగిరావా అని శేషం అడగటంతో ఇందూ షాక్ అవుతుంది. నా కోసం ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేశావు.. నా కోసం పెళ్లికి కూడా ఒప్పుకున్నావు కాబట్టి గుడికి వెళ్లడానికి ఒప్పుకుంటున్నానని చెబుతుంది రేఖ. అయితే మీ నానమ్మతో కాకుండా మా వదినతో వెళ్లమని చెబుతుంది రేఖ. కారులో వెళ్తున్న ఇందూపై భ్రమరాంబ కోప్పడుతుంది. కారు డ్రైవర్‌గా ఉన్న రాజ్... ముఖానికి ముసుగు వేసుకొచ్చి ఇందూని కిడ్నాప్ చేస్తున్నట్లు చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X