Brahmamudi May 7th Episode: తండ్రి ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తానంటున్న రాజ్.. నిజం తెలిసిన ఏమీ మాట్లాడలేని
భర్త అత్త మోసం చేసి డబ్బు కాజేసారని తెలుసుకుంటుంది స్వప్న. తెలివిగా వాళ్ల దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుంది. బాబుని గురించి నిజం తెలుసుకోవడానికి ఆఫీస్ కి వెళ్లి ఎంక్వయిరీ చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 7వ తేదీ ఎపిసోడ్ 403 లో ఏం జరిగిందంటే..
నా కోడలు గురించి మాట్లాడే హక్కు నీకు లేదంటూ రుద్రాణిని మందలిస్తాడు సుభాష్. రాజ్ తల్లి తో మాట్లాడుతూ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఎంత బాధ పడతావో నాకు తెలుసు అందుకే నాతో కలిసి భోజనం చెయ్యు అంటాడు. కలిసి భోజనం చేస్తాను,అందరం కలిసి సంతోషంగా ఉందాము కానీ నువ్వు ఆ బిడ్డని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేయ్ అంటుంది అపర్ణ. నాకు ఆకలి చచ్చిపోయింది అని బాధగా ఉంటాడు రాజ్. నాలో అమ్మతనం చచ్చిపోయింది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

నెక్స్ట్ సీన్ లో అప్పు ఫోన్ కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే అప్పు ఫోన్ చేసి ఆ వీడియో నీ మెయిల్ కి పంపించాను డౌన్లోడ్ చేసుకొని చూసుకో అంటుంది. సరే అంటూ కావ్య లాప్టాప్ ఓపెన్ చేస్తుంది. అదే సమయంలో కింద సుభాష్, రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇదంతా నా వల్లే, ఆరోజు నువ్వు ఇంటికి వెళుతూ నా చాంబర్ వైపు రాకుండా ఉండవలసింది అంటాడు. అదే సమయంలో కావ్య లాప్టాప్ లో వీడియో ఓపెన్ అవుతుంది అందులో సుభాష్ ఊరిపోసుకోబోతూ కనిపిస్తాడు.
ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న రాజ్ ఉరి పోసుకుంటున్న తండ్రి ని చూసే షాక్ అవుతాడు. కిందికి దింపి ఏమైంది ఎందుకు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు. నావల్ల మీ అమ్మకి అన్యాయం జరిగింది, విశాఖపట్నం బ్రాంచ్ లో మాయ అనే అమ్మాయితో అనుకోకుండా సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నావల్ల బాబు పుట్టాడని అతడిని మన ఇంటి వారసుడిగా ప్రకటించమని అడుగుతుంది.
నేను ఎన్ని విధాల చెప్పడానికి ప్రయత్నించినా ఒప్పుకోవటం లేదు ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే తన గుండె పగిలిపోతుంది, మన పరువు బజారున పడుతుంది అంటాడు సుభాష్. ఈ మాటలు విన్న రాజ్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ బిడ్డని నా బిడ్డగా ఇంటికి తీసుకు వస్తాను ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని తనపై ఒట్టు వేయించుకుంటాడు రాజ్.సుభాష్ ముందు ఒప్పుకోకపోయినా తండ్రిని ఒప్పించి అతడిని ఇంటికి పంపించి తను మాయ దగ్గరికి వెళ్తాడు.

ఇదంతా లాప్టాప్ లో చూసిన కావ్య షాక్ అవుతుంది, బిడ్డ తండ్రి మామయ్య గారా అనుకుంటుంది. అప్పుడే కింద సుభాష్ మాట్లాడుతూ నువ్వు నాకోసం చేసిన త్యాగం చాలు ఇంక నేను ఇంట్లో అందరికీ విషయం చెప్పేస్తాను అంటాడు. కొడుకు తప్పు చేశాడంటేనే అమ్మ అరుస్తుంది అదే నువ్వు తప్పు చేశావని తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది, నిజం చెప్పి ఆమెని చంపుకోవటం కన్నా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవటమే మంచిది అంటాడు.
సుభాష్ మాట్లాడుతూ నువ్వు జీవితంలో ఎప్పటికీ నన్ను క్షమించకు, ఈ తప్పు చేసినందుకు నేను జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సిందే అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు కృష్ణుడి దగ్గరికి వచ్చి తన బాధని చెప్పుకుంటుంది కావ్య. నా భర్త తప్పు చేయలేదు అని నేను నమ్మాను, ఆ నమ్మకం నిజం అయినందుకు సంతోషించాల, ఆ తప్పు చేసింది మావయ్య గారు కాబట్టి నిజం తెలిసినా నేను మాట్లాడలేను ఏమిటి నాకు ఈ పరిస్థితి అని బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










