Brahmamudi May 8th Episode : కావ్య మాస్టర్ ప్లాన్.. తెరపైకి రాజ్ ప్రేమకథ, యామినికి ముచ్చెమటలు
కావ్యను ఫాలో అవుతూ రుద్రాణి - రాహుల్‌లు రిసార్ట్‌కి వచ్చారని అప్పూకి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. నువ్వేం కంగారు పడొద్దని వాళ్ల సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది అప్పూ. రాజ్‌ను చూస్తేనే కానీ భోజనం చేయనని సీతారామయ్య పట్టుబట్టడంతో కావ్యకి ఫోన్ చేసి వీడియో కాల్ చేయించమని చెబుతుంది అపర్ణ. దాంతో రాజ్ దగ్గరికి వెళ్లి మా ఇంట్లో వాళ్లు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పడంతో రాజ్ సరేనని అంటాడు. సీతారామయ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ అందరితో ఫోన్‌లో మాట్లాడతాడు రాజ్.
వెయిటర్స్ వేషంలో ఉన్న రాహుల్ - రుద్రాణిలను రాజ్ ఫ్రెండ్స్ ఓ ఆట ఆడుకుంటారు. వారిలో మందు పోయించడంతో పాటు డ్యాన్స్ చేయిస్తుంటారు. ఈ తతాంగాన్ని చూసిన అప్పూ కడుపుబ్బా నవ్వుకుంటుంది . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 8వ తేదీ ఎపిసోడ్ 716లో ఏం జరిగిందంటే?

అందరూ భోజనాలు చేస్తుండగా రాజ్ కోసం కావ్య భోజనం వడ్డిస్తుంది, ఇంతలో వేరే అమ్మాయి భోజనం తెచ్చి ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. దాంతో కావ్య ప్లేట్ విసిరికొడుతుంది. వదినకు కోపం వచ్చిందేమోనని అప్పూతో కళ్యాణ్ అంటాడు. వస్తే మంచిదే కదా, అప్పుడైనా తన ఫీలింగ్స్ అన్నయ్యకి తెలుస్తాయని అంటుంది అప్పూ. ఫీలింగ్స్ వస్తే పర్లేదు కానీ గొడవలు జరగకుండా ఉంటే చాలని అంటాడు కళ్యాణ్. ఇంతలో భోజనం వడ్డించుకుని కావ్య .. రాజ్ దగ్గరికి వస్తుంది.
నా కోసం భోజనం తీసుకొస్తున్నారేమో అనుకున్నానని రాజ్ చెప్పగా.. మీకు తెచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారని కావ్య సెటైర్లు వేస్తుంది. భోజనం చేస్తుండగా రాజ్‌కి దగ్గు రావడంతో కావ్య మంచినీళ్లు ఇస్తుంది. అయితే ఆలోగా భోజనం తీసుకొచ్చిన అమ్మాయి దగ్గరి గ్లాస్ తీసుకుని వాటర్ తాగుతాడు. దాంతో కావ్య రగిలిపోతుంది. ఆ గ్లాస్ నేను ఎంగిలి చేశానని ఆ అమ్మాయి చెప్పగా.. అందుకేనా వాటర్ అంత స్వీట్‌గా ఉన్నాయని రాజ్ అంటాడు. ఆ మాటలతో కావ్య , అప్పూ రగిలిపోతారు.
మీరిద్దరూ లవర్స్ అని తెలియక నేను ఫుడ్ తీసుకొచ్చానని రాజ్‌తో ఆ అమ్మాయి అంటుంది. కళావతి మిమ్మల్ని బాగా ఇష్టపడుతుందని.. అందుకే వేరే అమ్మాయి మీతో క్లోజ్‌గా ఉండటం చూడలేక వెళ్లిపోయిందని చెబుతుంది. దాంతో కావ్యను వెతుక్కుంటూ రాజ్ వెళ్తాడు. నేను ఆ అమ్మాయి దగ్గర ప్లేట్ తీసుకున్నానని బయటికి వచ్చేశారా? అని అడుగుతాడు రాజ్. మీరు ఎవరి దగ్గర తీసుకుంటే నాకెందుకు అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కావ్య. బయటికి రావాలంటే కారణం ఉంటే చాలని అంటుంది. వీరి మాటలను యామిని దొంగచాటుగా వింటుంది.
ఎప్పుడూ మీ మాటే నెగ్గాలని అనుకుంటారని, మీరు చేసిందే కరెక్ట్ అనుకుంటారని, ఎదుటివాళ్ల మనసులో ఏం అనుకుంటున్నారో మీకు అనవసరమని మండిపడుతుంది కావ్య. నేనేం చేశానని కావ్య అడగ్గా.. మీ మనసులో ఏం ఉందో చెప్పండి తెలుసుకుంటానని అంటాడు రాజ్. ఏమీ తెలియనట్లు మాట్లాడొద్దని, నా మనసులో ఏముందో తెలియదా అని చెప్పబోతూ ఆగిపోతుంది కావ్య. ఆ మాటలతో యామిని కంగారు పడుతుంది.
మీరు ఏదో దాస్తున్నారంటూ రాజ్ ఆమెను గుచ్చిగుచ్చి అడుగుతాడు. అయినప్పటికీ కావ్య ఏమాత్రం నిజం చెప్పదు. మీకు చెప్పడం ఇష్టం లేదో, నాతో చెప్పించాలని అనుకుంటున్నారో నాకు తెలియడం లేదని అందుకే నేనే చెప్పాలని డిసైడ్ అయ్యానని అంటాడు రాజ్. నేను మొదటిసారి మిమ్మల్ని రోడ్డు మీద చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోందని, మనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతాడు రాజ్. మీకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయానని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాజ్ చెప్పేలోగా యామిని పిలుస్తుంది. దాంతో కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు.
కలిసి భోజనం చేద్దామని చెప్పి రాజ్‌ను లాక్కెళ్లిపోతుంది యామిని. ఇదంతా ఆమె కావాలనే చేస్తోందని కళ్యాణ్, అప్పూలు చెబుతారు. ఆయనకి గతం గుర్తుకురావడానికి టైం దగ్గరపడిందని కావ్య చెబుతుంది. ఈరోజు మనం అనుకున్నది చేయాలని కళ్యాణ్, అప్పూలతో అంటుంది కావ్య. రాత్రి పార్టీకి అందరూ బాగా రెడీ అవుతారు. కావ్యను వెతుక్కుంటూ రాజ్ రాగా.. యామిని అతని కుర్చీ లాక్కుని కూర్చొంటుంది. ఇంతలో సందీప్ దంపతులు స్టేజ్ మీదకి వెళ్లి అందరికీ స్వాగతం చెబుతారు. ఆ వెంటనే శృతి లేచి.. అసలు మీ పరిచయం ఎలా జరిగింది? పెళ్లి వరకు ఎలా వెళ్లారు? ఆ విషయాలు మాకు చెప్పాలని అడుగుతుంది. మిగిలినవారు కూడా అదే డిమాండ్ చేస్తారు.
నాది మంచి లవ్ స్టోరీయేనని, కానీ మాకు పెళ్లి చేసింది మాత్రం కళ్యాణ్- అప్పూలేనని చెబుతాడు సందీప్. కాబట్టి వాళ్ల లవ్ స్టోరీ చెబితే మంచిదని అంటాడు. దీంతో కళ్యాణ్ - అప్పూలు లేచి స్టేజ్ మీదకి వెళ్తారు. మా కంపెనీ పెట్టి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా వినాయక చవితి చేయాలని అనుకున్నామని చెబుతాడు. పూజకి కావాల్సిన నగలు తీసుకురావడానికి వెళ్లగా మొదటిసారి అప్పూని చూశానని అంటాడు కళ్యాణ్. ఆ మాటలు విన్న రాజ్‌కి ఏదో గుర్తొస్తూ ఉంటుంది.
డబ్బు కోసమే కావాలని నా కారుకి అడ్డుగా వచ్చిందని నేను అనుకున్నానని, మా పరిచయం అలా జరిగిందని కళ్యాణ్ చెబుతాడు. కానీ వాళ్ల అక్క డ్యాన్స్ చూసి తనతో లవ్‌లో పడిపోయానని అంటాడు కళ్యాణ్. ఆ మాటలతో ఈ కథ నేను ఎక్కడో విన్నానని యామినితో చెబుతాడు. వీళ్లని చూసిందే ఇప్పుడు , అలాంటప్పుడు వీళ్ల గురించి నీకు తెలిసే అవకాశం లేదని అంటుంది యామిని. స్వప్నతో ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో మా తాతయ్య పెళ్లికి ఒప్పుకున్నాడని.. కానీ సరిగ్గా పెళ్లి సమయానికి స్వప్న పారిపోయిందని చెబుతాడు కళ్యాణ్. మా ఇంటి పరువు కాపాడటానికి మా అక్క ప్లేస్‌లోనే నేనే ముసుగు వేసుకుని పెళ్లి పీటల మీద కూర్చొన్నానని అంటుంది అప్పూ.
రాజ్‌కి గతం గుర్తొస్తే వాడు యామినిని వదిలేసి తిరిగి మనింట్లో అడుగుపెడతాడని రాహుల్, రుద్రాణిలు టెన్షన్ పడతారు. ఈ పార్టీ అర్ధాంతరంగా ఆపాలని అనుకుంటారు. యామిని కూడా రాజ్‌ను తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటుంది. రాజ్ మాత్రం రానని కరాకండీగా తేల్చేస్తాడు. పార్టీకి ఉన్న పవర్ సప్లై ఆపాలని రాహుల్- రుద్రాణి అనుకుంటారు. యామిని కూడా అదే అనుకుని పవర్ బాక్స్ దగ్గరికి వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











