Brahmamudi May 8th Episode: ఇందూతో జంటగా దుగ్గిరాల నిలయానికి రాజ్.. అపర్ణ నోరు నొక్కేసిన రేఖ
Photo Courtesy: JioHotstar
మదన్‌తో నా పెళ్లి జరగదు.. నీ ప్రేమను గెలిపించే బాధ్యత నాది అని స్వాతికి మాటిస్తుంది ఇందూ. 10 లక్షల రూపాయలు నువ్వేం చేశావు? పంజాగుట్ట ఆసుపత్రికి ఎందుకు వెళ్లావని రాజ్‌ని లక్కీ ప్రశ్నిస్తాడు. ఆ 10 లక్షలు ఐశ్వర్యకి ఇచ్చి నా లైఫ్‌ని సెట్ చేసుకుందామనుకుంటే మొత్తం పాడు చేశావని బాధపడతూ వెళ్లిపోతాడు. రాజ్‌కి ఇందూ ఫోన్ చేసి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, దానిని ఆపితే డబ్బులు ఇస్తానని డీల్ మాట్లాడటంతో రాజ్ సరేనని ఒప్పుకుంటాడు. ఆస్తిని దక్కించుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తాను.. చనిపోయిన ఇందూ తల్లిదండ్రులు బతికొచ్చినా సరే ఆపలేరని భూషణ్‌తో అంటుంది రేఖ.
ఉదయాన్నే పెళ్లి కోసం ఇందూ రెడీ అవ్వగా.. పెళ్లి గుడిలో కాదు రిజిస్ట్రార్ ఆఫీసులో అని రేఖ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. నా మనవరాలికి గుడిలో గౌరీ పూజ చేయించాలని అనుకుంటున్నానని అపర్ణ అడుగుతుంది. దానికి రేఖ ఒప్పుకోదు.. అయితే ఇందూ ప్రాదేయపడటంతో సరేనని అంటుంది. అయితే అపర్ణతో కాకుండా భ్రమరాంబతో కలిసి గుడికి వెళ్లాలని చెబుతుంది. ఇందూని తీసుకుని గుడికి బయల్దేరుతుంది భ్రమరాంబ. ఆ కారుకి డ్రైవర్‌గా ఉన్న రాజ్.. భ్రమరాంబని దించేసి ఇందూని తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 8వ తేదీ ఎపిసోడ్ 1027లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని కారులోనే కిడ్నాప్ చేస్తాడు రాజ్. చంపేస్తానని బెదిరించంతో భ్రమరాంబ కారు దిగేస్తుంది. అయితే రాజ్ చేతిలో కత్తి లాక్కుని పొడుస్తానని బెదిరిస్తుంది. దాంతో భ్రమరాంబని లాగిపెట్టి కొడతాడు రాజ్. అయితే ఇందూ మాత్రం కాపాడమంటూ యాక్టింగ్ చేస్తుంది. మనిద్దరికీ పాడే కట్టేసేలా ఉన్నాడని కారులో ఇందూని ఎక్కిస్తుంది భ్రమరాంబ. ఈ విషయం రేఖకి తెలిస్తే నన్ను చంపేస్తుందని కంగారుపడుతుంది. ఆ తర్వాత ఇందూ- రాజ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మదన్‌ని పెళ్లి కొడుకులా రెడీ చేస్తుంది రేఖ. ఈరోజు నీ పెళ్లి కొంచెం సంతోషంగా ఉండమని చెబుతుంది. వాడికి ఇష్టం లేని పెళ్లి కదా? ఇంకేం సంతోషంగా ఉంటాడని అంటాడు భూషణ్. నువ్వేం బాధపడొద్దు.. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా దీని వల్ల నీ జీవితం బాగుంటుంది. నువ్వు చేస్తున్న పనివల్ల మీ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల నుంచి కన్న కల నిజం కాబోతోంది. మేమంతా ఇన్నాళ్లుగా చేయలేనిది నువ్వు చేయబోతున్నావు.. నీ వల్ల దుగ్గిరాల ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుందని చెబుతుంది రేఖ. నువ్వు ఈ ఇంటికే యువరాజువి కాబోతున్నావు.. నీతో పాటు మేం కూడా కోటీశ్వరులం కాబోతున్నాం అంటాడు భూషణ్.
నువ్వు ఆ ఇందూ మెడలో తాళి కడితే చాలు.. మిగతాది నేను చూసుకుంటాను, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, ఏం చేసినా అడ్డు చెప్పనని అంటుంది రేఖ. ఇక నుంచి నీ జీవితం చాలా బాగుంటుందని చెబుతుంది. ఇంతలో స్వాతి వచ్చి నువ్వు చాలా బాగున్నావని చెబుతుంది. ఒక చదువురాని దద్దమ్మని పెళ్లి చేసుకుంటున్నానని అంటాడు మదన్. మరి అంత ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది స్వాతి. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది. మీ మమ్మీ కోసం ఏమైనా చేస్తావా? అని అడుగుతుంది. వీడు నా కొడుకు నా కోసం ఏదైనా చేస్తాడు. మీ అక్క గుడి నుంచి వచ్చిందా? లేదా అని సీరియస్ అవుతుంది రేఖ. అక్క ఇంకా రాలేదని స్వాతి చెప్పగా.. రేఖ సీరియస్‌గా కిందకి వెళ్లి అపర్ణని పిలుస్తుంది.
నీ మనవరాలు ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది.. నా మనవరాలికి తోడుగా పంపించావు కదా నువ్వే భ్రమరాంబకి ఫోన్ చేసి కనుక్కోమని చెబుతుంది అపర్ణ. ఇంతలో భ్రమరాంబ ఏడుస్తూ వచ్చి సోఫాలో కుప్పకూలుతుంది. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? నువ్వొక్కదానివే వచ్చావు? ఇందూ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది రేఖ. ఇందూని వాడెవడో వచ్చి ఎత్తుకుపోయాడని భ్రమరాంబ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతకుముందు కిడ్నాప్ అయిన ఇందూ.. మళ్లీ కిడ్నాప్ అంటే ఏమిటి అర్ధమని ప్రశ్నిస్తాడు శేషం.
పోలీసులకు కంప్లయంట్ చేద్దామా అని భూషణ్ అడగ్గా.. మనం ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నామో తెలిసి కూడా పోలీసులకు చెబుతావా అంటూ రేఖ సీరియస్ అవుతుంది. ఆ ఇందూ ఒకే ఒక్కసారి గుడికి పంపించమని అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చిందని శేషం చెప్పడంతో రేఖకి అపర్ణపై అనుమానం వస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశావు.. నేను చెప్పిన మాట నీ మనవరాలు వింటున్నట్లుగా చేసి లాస్ట్ మినిట్‌లో గుడి, పూజ అంటూ నాటకాలాడి బాగా తప్పించావని అంటుంది రేఖ. నాకు సంబంధం లేదని అపర్ణ చెబుతున్నా రేఖ వినిపించుకోదు. మమ్మల్ని అనవసరంగా అనుమానించడం మాని నా మనవరాలు ఎక్కడుందో కనుక్కోమని రేఖతో అంటాడు సుభాష్.
ఇందూకి ఈ పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు. అందుకే తనని దాచిపెట్టారని.. ఇలా నిజం చెప్పరని పైకి వెళ్లి గన్ తీసుకొచ్చి అపర్ణకి గురిపెడుతుంది రేఖ. నేను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది. అయితే షూట్ చేయమంటుంది అపర్ణ. రేఖ కోపంతో అపర్ణని కాల్చబోతుండగా పెళ్లి బట్టల్లో రాజ్, ఇందూ కనిపించడంతో అంతా షాక్ అవుతారు. కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. మన కొడుకని అపర్ణ ఏడుస్తుంది. తను మీ కొడుకు కాదని రేఖ మండిపడుతుంది.
నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని ఏం చేశావని ఇందూని కొట్టబోతుండగా రాజ్ అడ్డుపడతాడు. ఇందూ నా భార్య .. తనని తక్కువ చేసి మాట్లాడినా చేయి ఎత్తడం లాంటివి చేస్తే నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. నువ్వు నాకు పిన్ని అవుతావు.. ఇందూ మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నానని అంటాడు. నా భార్యకు నువ్వు అత్తవి అయినప్పుడు నువ్వు నాకు పిన్నివే అని చెబుతాడు రాజ్. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. మదన్ - ఇందూల పెళ్లి ఆగిపోయిందని భ్రమరాంబ- శేషం సంతోషిస్తారు. వీడు ఇందూని పెళ్లి చేసుకోవడం ఏంటీ? కిడ్నాప్ చేసిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఈ ఇందూ ఏదో నాటకం ఆడుతోందని ఐశ్వర్యకి అనుమానం వస్తుంది.
నేను ఈ పెళ్లికి ఒప్పుకోనని రేఖ మండిపడుతుంది. అసలు మా ఇందూకి నువ్వెలా తెలుసు అని ప్రశ్నిస్తుంది. నేను తనకే కాదు.. మీకు కూడా బాగా తెలుసని అంటాడు రాజ్. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చావు. అంతమాత్రానికే తనని పెళ్లి చేసుకుంటావా అని మండిపడుతుంది రేఖ. మా ఇందూకి ఏం తెలియదు, తను ఒక్క పూట కూడా బయటికి వెళ్లలేదని అంటాడు శేషం. ఆ కిడ్నాపర్‌ని నేనే అని చెబుతాడు రాజ్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications