Brahmamudi May 8th Episode: రుద్రాణిని బెదిరిస్తున్న సేటు.. భార్య ని చూసి ఆశ్చర్యపోతున్న రాజ్!
తెలివిగా వాళ్ల దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుంది స్వప్న. బాబుని గురించి నిజం తెలుసుకోవడానికి ఆఫీస్ కి వెళ్లి ఎంక్వయిరీ చేస్తుంది కావ్య. బిడ్డకి తండ్రి తన మామగారు అని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 8వ తేదీ ఎపిసోడ్ 404 లో ఏం జరిగిందంటే..
నిజం తెలిసినా మాట్లాడలేని పరిస్థితుల్లోకి నెట్టేసావు, నిజం చెప్తే మా అత్తగారు భరించలేరు. ఇప్పుడు ఆయన ఇంట్లోంచి వెళ్లిపోకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించు అని కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. మరోవైపు ఆలోచనలో ఉన్న ప్రకాష్ దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మి ఇంకా ఆఫీస్ కి వెళ్లలేదా అని అడుగుతుంది. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఎలా వెళ్ళమంటావు, రాజ్ రేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అంటే నీకు ఏమీ అనిపించడం లేదా అంటాడు ప్రకాష్.

ఇందులో అనిపించటానికి ఏముంది, రాజ్ ఎప్పుడు అంటాడు కదా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి అని ఇప్పుడు అదే జరుగుతుంది అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు పూర్తిగా మారిపోయావు, ఇదే పరిస్థితి నీ కొడుక్కి వస్తే నువ్వు ఇలాగే ఇంట్లో నుంచి పంపించేస్తావా అంటాడు ప్రకాష్. నా కొడుకు ఎప్పుడు అలాంటి తప్పుడు పనిచేయడు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధాన్య లక్ష్మి. మరోవైపు కావ్యతో మాట్లాడుతున్న అప్పు ఎందుకు నువ్వు నిజాన్ని బయట పెట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు.

పాపం బావగారిని మనం ఎన్ని మాటలు అన్నాము, అన్నీ ఓపిగ్గా భరించారు. ఇప్పుడు మనమే ఆయన ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటుంది. నిజం చెప్పే వారే అయితే ఆయనే చెప్పేవారు, నిజం తెలిస్తే మా అత్తగారు భరించలేదు అంటుంది కావ్య. సరే ఈ పెన్ డ్రైవ్ అయినా జాగ్రత్త చేయు బావగారు నిర్దోషి అని రుజువు చేసే ఒకే ఒక సాక్ష్యం అది అంటుంది అప్పు. ఆ పెన్ డ్రైవ్ ని రాయి తో చితగ్గొట్టేస్తుంది కావ్య. ఎందుకలా చేసావని కావ్యని అడుగుతుంది అప్పు. ఒక మనిషి ప్రాణాలతో ఆడుకునే ఆ సాక్ష్యం నాకు అక్కర్లేదు అంటుంది కావ్య.

మరోవైపు బాధ గా కూర్చున్న ఆపర్ణ ని చూసి కొడుకు రేపు వెళ్ళిపోతాడని భయపడుతున్నట్లుంది అత్తయ్య తను కొడుకుని వదిలేసి ఉండగలదా.. ఆఖరి నిమిషంలో మాట మార్చేస్తుందేమో అంటాడు రాహుల్. అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటాను అంటుంది రుద్రాణి. అలా అయితే నువ్వు విలన్ వి అయిపోతావ్ ఏమో అంటాడు రాహుల్. నాకోసం మాట్లాడితే విలన్ అవుతాను కానీ పరువు ప్రతిష్టల కోసం అంటే ఎవరు ఏమీ అనరు సెంటిమెంటల్ ఫూల్స్అం టుంది రుద్రాణి.
ఆ తరువాత సేటు రుద్రాణికి ఫోన్ చేసి డబ్బులు ఇమ్మని అడుగుతాడు. డబ్బులు కనిపించడం లేదు అంటుంది రుద్రాణి. మళ్లీ ఇదో కొత్త నాటకమా, అదంతా నాకు తెలియదు రెండు రోజుల్లో నా డబ్బు నాకు కావాలి లేదంటే నేనే ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్తాను అని బెదిరిస్తాడు సేటు. ఈ మాటలు విన్న స్వప్న రుద్రాణి ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంటి కోటి రూపాయలు పోయాయా పదండి ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్దాం. ఎవరు తీసారో వాళ్లే తేలుస్తారు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంది.

డబ్బులు నువ్వే కొట్టేశావు అని తెలిసి కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి, బయటికి మాత్రం ఇప్పుడు ఇంట్లో అందరికీ చెప్పడం ఎందుకు నా చావు నేను చస్తాను అంటుంది. మరోవైపు బిడ్డని ఆడిస్తూ అవస్థలు పడుతున్న భర్తని చూసి తండ్రి కోసం ఎన్ని నిందలు భరిస్తున్నారు అనుకుంటుంది కావ్య. భర్తని చూస్తూ రేపు ఇంట్లోంచి వెళ్లిపోతారని తెలిసినా కూడా నిజం చెప్పకుండా ఇంత నిశ్చలంగా ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది.
నాక్కూడా నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదే పరిస్థితి స్వప్నకో అనామిక కో వస్తే కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవారు కానీ నువ్వు అలా చేయలేదు అంటాడు రాజ్. అలా చేస్తే కాపురాలు నిలబడవు అంటుంది కావ్య. కాసేపు బాబుని ఆడిస్తావా నేను కిందకి వెళ్తాను అనడంతో బాబుని తీసుకుంటుంది కావ్య. కిందికి వెళ్లిన కొడుకుని నిజం చెప్పమని నిలదీస్తుంది అపర్ణ. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం


Click it and Unblock the Notifications










