Brahmamudi May 9th Episode : యామినితో చేతులు కలిపిన రుద్రాణి.. బెడిసికొట్టిన కావ్య ప్లాన్, రాజ్ ప్రాణాల మీదకి
రాజ్‌కు వేరే అమ్మాయి భోజనం తీసుకొచ్చి ఇవ్వడంతో కావ్య అలిగి వెళ్లిపోవడంతో కళావతి మిమ్మల్ని ప్రేమిస్తోందని ఆ అమ్మాయి రాజ్‌కు చెబుతుంది. దీంతో కళావతి దగ్గరికి వెళ్లి తన మనసులో మాటను చెప్పబోతుండగా యామిని పిలుస్తుంది. ఆ యామిని కావాలనే ఇదంతా చేస్తోందని కావ్యతో అంటారు అప్పూ- కళ్యాణ్. ఏం చేసినా సరే ఈరోజు మనం అనుకున్నది చేయాలని కావ్య అంటుంది. ఈ మాటలను రుద్రాణి - రాహుల్ విని అసలు వీళ్లు ఏం ప్లాన్ చేశారో తెలుసుకోవాలని అనుకుంటారు.
రాత్రి పార్టీకి అందరూ అందంగా రెడీ అవుతారు. సందీప్ తన భార్యను స్టేజ్ మీదకు రాగానే మాకు మీ ప్రేమ కథ చెప్పాలని శృతి అడుగుతుంది. మిగిలినవాళ్లు కూడా అదే అడగటంతో నా కంటే కళ్యాణ్ - అప్పూల లవ్‌స్టోరీ ఇంట్రెస్ట్‌గా ఉంటుందని సందీప్ చెబుతాడు. దీంతో వారి ప్రేమకథను చెప్పడానికి కళ్యాణ్ - అప్పూలు వేదిక మీదకి వచ్చి మాట్లాడతారు. ప్లాన్ ప్రకారం కావ్య - రాజ్‌ల ప్రేమకథను తమ లవ్‌స్టోరీగా చెప్పడంతో రాజ్‌కు ఏదో గుర్తొస్తుంది. దీంతో కంగారుపడ్డ యామిని, రాహుల్, రుద్రాణిలు పార్టీ ఆపడానికి పవర్ కట్ చేయడానికి వెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 9వ తేదీ ఎపిసోడ్ 717లో ఏం జరిగిందంటే?

పార్టీని ఎలాగైనా చెడగొట్టాలని యామిని, రాహుల్, రుద్రాణిలు అనుకుంటారు.. ఇందుకోసం పవర్ కట్ చేయాలని మెయిన్ దగ్గరికి వెళ్తారు. ఈ సమయంలో ఒకరికొకరు ఎదురవుతారు. మీకు నాకు కావాల్సింది ఒక్కటేనని అర్ధమైందని, ముందు పవర్ ఆఫ్ చేయండి తర్వాత మాట్లాడుకుందామని రుద్రాణితో అంటుంది యామిని. పవర్ కట్ కావడంతో కావ్య టెన్షన్ పడుతుంది. ఇప్పుడు వాళ్లు అనుకున్నది ఎలా సాధిస్తారో నేను చూస్తానని రుద్రాణితో అంటుంది యామిని.
మేనేజర్‌ను పిలిచి వెంటనే పవర్ ఆన్ చేయమని చెబుతాడు రాజ్. ఇంతలో యామిని అక్కడికి వచ్చి కావ్యతో మాట్లాడుతుంది. నీ ప్లాన్ ఫెయిల్ అయ్యిందని చూస్తున్నావా? లేకపోతే ఈ టైంలో పవర్ పోవడం ఏంటీ అనుకుంటున్నావా? అని అడుగుతుంది. పవర్ తెల్లారే వరకు రాదని, ఎందుకంటే దానిని ఆపింది నేనే అని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. మీ లవ్‌స్టోరీ కళ్యాణ్ - అప్పూల ప్రేమకథగా చెప్పావు కదా నీ తెలివి తేటలు సూపర్ అంటుంది.
నన్ను చాలా తక్కువ అంచనా వేశావని.. నేను పక్కన ఉండగా రాజ్‌కి గతం గుర్తొచ్చేలా జరగనిస్తానని ఎలా అనుకున్నావని మండిపడుతుంది యామిని. ఈ రాత్రి ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తొచ్చి తీరుతుందని కావ్య చెబుతుంది. నువ్వు ఇలాగే పగటి కలలు కంటూ ఉండు నేను రాజ్‌ని ఇప్పుడే తీసుకెళ్లిపోతానని కావ్యతో చెబుతుంది యామిని. పవర్ పోయాక మనం ఇక్కడేందుకు వెళ్లిపోదామని రాజ్‌తో చెప్పగా.. నేను ఇక్కడే ఉంటానిన అంటాడు రాజ్. ఆ కళ్యాణ్ చెప్పే కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందని చెబుతాడు. అది కళ్యాణ్ కథలా లేదని నాకు తెలిసిన కథలా అనిపిస్తోందని అంటాడు.
మనం ఏదైనా ప్లేస్‌కి వెళ్లినప్పుడు అక్కడ విన్నవి, చూసినవి మన జీవితంలో జరిగినట్లుగా అనిపిస్తాయని అంటుంది యామిని. రాజ్ చెబుతున్నా వినిపించుకోకుండా అతని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది యామిని. దాంతో కావ్య, అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. దాంతో యామినిని కసురుకున్న రాజ్.. స్టేజ్ మీదకి వెళ్లి పార్టీ ఆగిపోయిందని ఎవ్వరూ బాధపడొద్దని, కళ్యాణ్ లవ్ స్టోరీని నేను పూర్తిగా వినాలనుకుంటున్నానని మీ ఫోన్‌లోని లైట్స్‌ని ఆన్ చేయమని చెబుతాడు రాజ్. దాంతో ఫ్రెండ్స్ అంతా కలిసి ఫోన్‌లోని లైట్‌ను ఆన్ చేస్తారు. తర్వాత కళ్యాణ్ - అప్పూలు కథ చెప్పడం మొదలుపెడతారు.
ఆ కథ వింటుండగా రాజ్ బాగా ఆలోచించడంతో కళ్లు తిరిగి పడిపోతాడు. దాంతో కావ్య, యామిని టెన్షన్ పడతారు. రాజ్‌ను పట్టుకోవాలని యామిని దగ్గరికి రాగా.. కావ్య మండిపడుతుంది. ఈయన నా భర్త, ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసని చెబుతుంది. వెంటనే కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుంది. మీ అందరి మాటలు విని ఆయన ప్రాణాలతో ఆడుకున్నానని, చివరికి ఇక్కడి వరకు తీసుకొచ్చానని కావ్య బాధపడుతుంది. ఇందులో మా తప్పు కూడా ఉంది కదా? మేం ఇచ్చిన సలహాతోనే కదా? నువ్వు ఇలా చేశావని అప్పూ, కళ్యాణ్‌లు చెబుతారు.
మీరు చెప్పినా.. నేను చేయకుండా ఉండాల్సింది కదా అని కావ్య కుమిలిపోతుంది. మీరందరూ చెప్పింది విని రిస్క్ చేశానని.. ఇప్పుడు ఆయనికి ఏమవుతుందోనని టెన్షన్ పడుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ బయటికొచ్చి గతం గుర్తుచేసే పనులు చేయొద్దని నేను చెప్పాను కదా అని మండిపడతాడు. బీపీ ఎక్కువైందని, కొంచమైతే కోమాలోకి వెళ్లిపోయేవాడని చెప్పడంతో అప్పూ, కావ్య, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. ఇలాంటి తప్పు పొరపాటున కూడా చేయొద్దని, అది తన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెబుతాడు.
ఇంతలో యామిని వచ్చి గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఏదో చేస్తానని చెప్పి రాజ్‌ను తీసుకొచ్చి ఐసీయూలో పడేశావని మండిపడుతుంది. ఎప్పటికైనా రాజ్ నా సొంతమని వార్నింగ్ ఇస్తుంది యామిని. నువ్వు రాజ్‌కు నిజం చెప్పగలవా? ఈసారి చెబితే తను ప్రాణాలతో ఉంటాడా? అని ప్రశ్నిస్తుంది. అవకాశం దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని.. మా బావ ప్రాణం మీదకి వచ్చింది కాబట్టే మా అక్క ఆగుతోందని లేకపోతే నీలాంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు కూడా తెలుసని అంటుంది అప్పూ.
మీ అక్కా నువ్వు ఏం చేయలేని నిస్సహాయ పరిస్ధితుల్లో ఉన్నారు కదా అని చెబుతుంది యామిని. ఇప్పుడు తను ప్రాణాలతో ఉండాలంటే నేనే మాత్రమే దిక్కని అంటుంది. ఇక నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది యామిని. రాజ్ కళ్లు తెరిచేసరికి యామిని ఎదురుగా ఉంటుంది. కళావతి గారు ఎక్కడ అని అడుగుతాడు. తను పరాయి మనిషి కదా? నీతో నా బంధం వేరు కదా అని అంటుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











