Brahmamudi may 9th episode: అపర్ణ నిర్ణయాన్ని తప్పుపడుతున్న కుటుంబ సభ్యులు.. ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్న కావ్య

బిడ్డకి తండ్రి తన మామగారు అని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. నిజమే బయట పెట్టమని అప్పు చెప్పినప్పుడు నిజం తెలిస్తే అత్తగారు భరించలేరని నిజం ఎప్పటికీ బయటపడకూడదని అంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 9వ తేదీ ఎపిసోడ్ 405 లో ఏం జరిగిందంటే..

ఇప్పటికైనా నోరు విప్పి నిజం చెప్పు, ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకు వస్తావా చెప్పు అని కొడుకుని అడుగుతుంది అపర్ణ. నిజం చెప్పు ఆర్చటానికి, తీర్చడానికి మీ అమ్మ సిద్ధంగా ఉంది అని వెటకారంగా అంటుంది రుద్రాణి. అపర్ణ నిర్ణయాన్ని ప్రకాష్ తప్పుపడతాడు, మీరంటే మాకు గౌరవం ఉంది, మీ నిర్ణయానికి ఎప్పుడు తలవంచుతాము కానీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మేము సమర్థించలేకపోతున్నాము అంటాడు.

Brahmamudi serial May 9th Episode of 409 Here is full story

స్వప్న కూడా ఇప్పటికే కావ్యకి అన్యాయం జరిగింది, ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకువచ్చి కావ్యకి మరింత అన్యాయం చేస్తారా అంటూ ఆవేశపడుతుంది. నువ్వు మాట్లాడొద్దు ఇది మా ఇంటి సమస్య అంటుంది అపర్ణ. ఎవరి ఇంటి సమస్య, ఈ సమస్యని పెద్దది చేయమని మేము చెప్పామా, రాజ్ ని ఇంట్లోంచి పంపించేయమని చెప్పామా, నువ్వు తీసుకున్న నిర్ణయం ఒక తల్లి తీసుకున్నట్లుగా లేదు అని చిట్టి కూడా అపర్ణని మందలిస్తుంది.

అప్పుడు రాజ్ మాట్లాడుతూ మా అమ్మని ఎవరు ఏమి అనొద్దు తన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను నా గురించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా ఆమెకి హక్కు ఉంది అంటాడు. ఇంతమంది ఇన్ని మాట్లాడారు నీ నిర్ణయం కూడా చెప్పు అని కావ్యని అడుగుతుంది అపర్ణ. నా భర్త ఏమి మాట్లాడ లేనప్పుడు నేను కూడా ఏమీ మాట్లాడను, ఆయన మీ నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నేను కూడా మీ నిర్ణయాన్ని గౌరవించి ఆయన వెనకే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాను అంటుంది. కోడలు నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు సుభాష్.

వాడి మీద నాకు నిర్ణయం తీసుకునే హక్కు లేకపోవచ్చు కానీ నా మీద నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంటుంది, రేపు పొద్దున్న కల్లా వాడు నిజం చెప్పకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఆ తర్వాత తన గదిలో కూర్చొని ఆలోచిస్తున్న అపర్ణ దగ్గరికి వచ్చిన సుభాష్ నీ నిర్ణయం నాకేమీ నచ్చలేదు అంటాడు. నా నిర్ణయం వెనుక ఆవేశం కనిపిస్తుంది కానీ నా బాధ మీకు తెలియటం లేదు. నేను రాజ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.

ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే అయినా వాడు నిజం బయటపడతాడని ఉద్దేశంతోనే అలా చేశాను. అయినా కూడా వాడు నిజం బయట పెట్టడం లేదు అంటుంది అపర్ణ. నేను లేని సమయంలో వాడికి ఇష్టం లేని పెళ్లి చేశారు, వాడు కావ్య తో సంసారం చేయడం లేదని నాకు తెలుసు అందుకే వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని బిడ్డని కన్నాడు అంటుంది. బిడ్డ తల్లి ఎవరో తెలిస్తే ఏం చేస్తావ్ అంటాడు సుభాష్.

కోడలు స్థానంలో ఈ ఇంటికి తీసుకు వస్తాను, ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి చేస్తాను వాడు సంతోషంగా ఉండేలాగా చూస్తాను అంటుంది అపర్ణ. ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంటాడు సుభాష్. నా మాటలు మీకు ఆశ్చర్యంగా ఉన్నాయా, కావ్య కోసం ఆలోచిస్తున్నారా తను మాత్రం ఇక్కడ ఏం సుఖపడింది, భర్త దూరం పెట్టాడు వేరే ఒక ఆమెతో బిడ్డను కని ఇంటికి తీసుకువచ్చాడు అలాంటి భర్తతో ఏ భార్య మాత్రం సుఖపడుతుంది అంటుంది అపర్ణ.

తరువాయి భాగంలో లగేజ్ తో సహా కిందికి వచ్చినా రాజ్ నువ్వు ఎవరితోనూ మాటలు పడక్కర్లేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తల్లితో చెప్తాడు. కోపంతో రగిలిపోయిన అపర్ణ ఆ బిడ్డ కోసం సర్వస్వం వదులుకుంటావని, ఇంట్లోంచి వెళ్లిపోతావని నాకు తెలుసు అందుకే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్న అపర్ణని ఆపిన సుభాష్ ఈరోజు నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి, ఈరోజు తో ఈ రహస్యం బద్దలై పోవాలి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X