Brahmamudi November 10th Episode: రంజిత్‌ని పట్టించిన రాజ్- కావ్య... నిర్దోషిగా రాహుల్, స్వప్న నిర్ణయమేంటీ?

Photo Courtesy: JioHotstar

కోయిలి బాధ తప్పిపోయి, స్వప్న కాపురం చక్కబడటంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది. ఉదయాన్నే రాహుల్ డల్‌గా ఉండటంతో అన్ని సమస్యలు చక్కబడ్డాయి. ఇకనైనా హ్యాపీగా ఉండమని చెబుతాడు రాజ్. కిచెన్‌లో కావ్యతో రాజ్ సరసాలు ఆడుతుండగా ఇంటి ముందు పోలీస్ జీపు వచ్చి ఆగుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. కోయిలి అనే అమ్మాయిని రాహుల్ హత్య చేసినట్లు ఆమె భర్త కేసు పెట్టాడని.. అందుకే రాహుల్‌ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెబుతారు.

నా కొడుకుని కాపాడమని రుద్రాణి ఇంట్లో వాళ్లని బతిమలాడుతుంది. రాహుల్ డబ్బు మీద ఆశపడేవాడే కానీ.. హత్యలు చేసేవాడు కాదని రాజ్ ఇంట్లో వాళ్లకి నచ్చచెబుతాడు. ఇంతలో రుద్రాణికి కోయిలి భర్త రంజిత్ ఫోన్ చేసి మీ కొడుకు నా భార్యను చంపుతుండగా తీసిన వీడియో నా దగ్గర ఉందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఇది కోర్టులో సాక్ష్యంగా ఇవ్వకూడదంటే నాకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయాన్ని ఫ్యామిలీతో చెబుతుంది రుద్రాణి. మనం డబ్బులిస్తే రాహుల్ హత్య చేశాడని ఒప్పుకున్నట్లు అవుతుందని.. మనం రాహుల్ హత్య చేయలేదని నిరూపించాలని అంటాడు రాజ్. కోయిలి ఇంట్లో కావ్య కెమెరా పెట్టిందని అందులో ఏదో ఒక ఆధారం ఉంటుందని.. మేం ఇప్పుడే వెళ్లి దానిని తీసుకొస్తామని చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 10వ తేదీ ఎపిసోడ్ 874లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 10th 2025 Episode 874 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

జైళ్లో ఉన్న రాహుల్ దగ్గరికి స్వప్న, రుద్రాణిలు వస్తారు. నేను ఏ తప్పు చేయలేదని బాధపడతాడు రాహుల్. మగాడిని అనే మత్తులో మనిషిని అనే సంగతిని మరిచిపోయావు, కట్టుకున్నది చెప్పిన మంచిని వదిలేసి అబద్ధాలతో ఆకలి తీర్చుకునే మీ అమ్మ మాటలే నమ్మి అబద్ధంలోనే నడిచావని మండిపడుతుంది స్వప్న. ఇప్పుడు ఏమైంది జైళ్లో కూర్చొని చిప్పకూడు తినాల్సి వచ్చిందని అంటుంది. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది. నువ్వు బతికి ఉన్నంత కాలం, నీ కొడుకు నీ మాట విన్నంత కాలం ఒకరు అవమానించాల్సిన పని లేదని సెటైర్లు వేస్తుంది స్వప్న. నువ్వు చెప్పింది నిజమే.. నేను ఎన్నో తప్పులు చేశాను, నిన్ను ఎంతగానో బాధపెట్టానని కానీ నేను హత్య చేయలేదని నువ్వు నమ్మితే చాలని అంటాడు రాహుల్.

తాళి కట్టిన భార్యతోనే నేను ఫలానా దానిని ప్రేమించాను, దాని దగ్గర డబ్బుంది, ఇక దానితోనే ఉంటానని చెప్పిన గొప్పమనిషివని అంటుంది స్వప్న. నువ్వు చెప్పింది నిజమేనని, డబ్బు కోసమే వెళ్లానని అంటాడు రాహుల్. నేనేమీ ఆ అమ్మాయిని ఇష్టపడలేదని, తనని చంపాలని నేను ఎందుకు అనుకుంటానని అంటాడు. మావయ్యలకి, రాజ్‌కి చెప్పి నన్ను కాపాడమని బతిమలాడతాడు రాహుల్. ఇన్నాళ్లూ నేను నమ్మితేనే కదా మోసం చేశావు, అయినా జీవితం పంచుకున్న దానిని కదా.. ఇంట్లో వాళ్లు, ఇక్కడ పోలీసులు ఎవరూ నిన్ను నమ్మలేని స్థితికి చేరుకున్నావని అంటుంది స్వప్న.

ఎవరున్నా, లేకపోయినా నీకు నేను ఉన్నాను.. ఎంత ఖర్చయినా సరే నేను బయటికి తీసుకొస్తానని అంటుంది రుద్రాణి. జీవితాలు నాశనమైనా, బతుకులు బూడిదైనా మీరు మాత్రం మారరు అని మండిపడుతుంది స్వప్న. కొడుకుతో తప్పు చేయిండమే కాకుండా తప్పుడు మార్గంలో కొడుకుని కాపాడాలని చూస్తున్నావని ఫైర్ అవుతుంది స్వప్న. నేను తప్పుకుంటే వాడు జైళ్లో ఉంటాడు, నువ్వు రోడ్డున పడతావు, భర్త లేని ఆడదానిగా మిగిలిపోతావని అంటుంది రుద్రాణి. నేను అడ్డదారిలోనే వెళ్తాను, నీకు చేతనైతే నువ్వు రహదారిలోనే వెళ్లి ఎలా కాపాడతావో కాపాడుకో అని అంటుంది రుద్రాణి.

కోయిలి ఇంట్లో పెట్టిన కెమెరా కోసం రాజ్, కావ్యలు అక్కడికి వస్తారు. అయితే ఇంటి చుట్టూ పోలీస్ సెక్యూరిటీ ఉండటంతో షాక్ అవుతారు. దాంతో కిటికీలో నుంచి ఇద్దరూ లోపలికి దూకి కెమెరాను తీసుకొస్తారు. దానిని లాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఆ రోజు రాహుల్- రంజిత్ మధ్య ఏం జరిగిందో చూస్తారు. రాహుల్ కొట్టిన దెబ్బకు కోయిలి కిందపడిపోయి మళ్లీ స్పృహలోకి వస్తుంది. రాహుల్ కొట్టిన తర్వాత కూడా కోయిలి కదులుతూ ఉండటంతో ఈ హత్య రాహుల్ చేయలేదని తెలుస్తుంది. మరి హత్య ఎవరు చేశారో చూద్దామని ఫుటేజ్ చూస్తుండగా రాజ్, కావ్యలకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. వెంటనే ఇద్దరూ కలిసి రాహుల్‌ను కాపాడటానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు.

పోలీస్ స్టేషన్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న రుద్రాణి కోసం రంజిత్ వస్తాడు. నా కొడుకుని ఇరికించడానికే ఫిక్స్ అయ్యావా? అని రుద్రాణి మండిపడుతుంది. సాక్ష్యాలు లేకపోతే ఇరికించడం అంటారు.. కానీ అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని అంటాడు రంజిత్. నా దగ్గర 2 కోట్ల రూపాయలు లేవని రుద్రాణి చెప్పగా.. నాకు అంత ఓపిక లేదని రంజిత్ అంటాడు. నా దగ్గరున్న సాక్ష్యాలతో స్టేసణ్ లోపలికి వెళ్లమంటారా? లేక ఈ ప్రూఫ్‌ని నేను చెప్పిన రేటుకి మీరు కొనుక్కుంటారా? అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. డబ్బు తీసుకుని నువ్వు నన్ను మోసం చేస్తే అని అడుగుతుంది. మీరు నన్ను నమ్మడం తప్పించి వేరే ఆప్షన్ లేదని అంటాడు రంజిత్.

ఇంతలో రాజ్, కావ్యలు అక్కడికొస్తారు... రాహుల్‌ని నిర్దోషిగా నిరూపించడానికి మా దగ్గర ఒకే ఆప్షన్ ఉందని అంటాడు. నీకు నువ్వుగా నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు లొంగిపోతావా? నిన్ను నాలుగు తన్ని నేరాన్ని ఒప్పించమంటావా? అని రంజిత్‌ను బెదిరిస్తారు. వీడి దగ్గర సాక్ష్యాలున్నాయి.. వీడు స్టేషన్‌కి వెళితే రాహుల్ జైళ్లోనే ఉండాలని అంటుంది రుద్రాణి. ఆ అమ్మాయిని చంపింది రాహుల్ కాదు.. వీడు అని చెబుతుంది కావ్య. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. అన్ని పోలీసుల ముందే తేలుస్తానని రంజిత్‌ను లోపలికి లాక్కెళ్తాడు రాజ్.

నేరస్తుడు రాహుల్ కాదు... వీడు అని రంజిత్‌ని పోలీసులకు అప్పగిస్తాడు. కట్టుకున్న భార్యని దారుణంగా చంపి, ఆ కేసుని మా రాహుల్ మీదకి నెట్టింది వీడేనని అంటుంది కావ్య. దానికి సాక్ష్యం ఉందా అని ఎస్ఐ అడగ్గా ఫోన్‌లో ఉన్న వీడియోను చూపిస్తాడు రాజ్. ఆ రోజు స్పృహలోకి వచ్చిన కోయిలిని లేపుతాడు రంజిత్. నువ్వు చేసిన పనికి నాకు ప్రపంచమే తిరుగుతోందని, ఆ రాహుల్ గాడు కోటీశ్వరుడని వాడిని ట్రాప్ చేస్తే మనం లగ్జరీగా బతకొచ్చని చెప్పావని మండిపడతాడు రంజిత్. నేను నీ మొగుడిని అన్న సంగతిని కూడా మరిచిపోయావు.. నీ ప్లాన్‌కి నేను ఒప్పుకున్నాను అని చెబుతాడు. చివరికి అంతా నాశనం అయిపోయిందని అంటాడు రంజిత్.

మనకి డబ్బు వస్తుందనే కదా ఇదంతా చేశామని అంటుంది కోయిలి. నువ్వు దొంగతనం చేసి జైలుకి వెళితే.. నేను అప్పులు చేసి నిన్ను బయటికి తీసుకొచ్చాను కదా అని గుర్తుచేస్తుంది. ఆ రాహుల్ గాడిని ట్రాప్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టించావు ఇప్పుడు మొత్తం పోయిందని అంటాడు రంజిత్. అప్పుల నుంచి బయటపడాలంటే మనకి కోటి రూపాయలు కావాలని చెబుతుంది కోయిలి. అప్పులన్నీ తీర్చి హ్యాపీగా బతకాలని కోయిలిని రాహుల్ కొట్టిన వీడియో చూపిస్తాడు రంజిత్. ఈ వీడియోతో మనకి డబ్బు ఎలా వస్తుందని కోయిలి అడగ్గా.. మనకి కాదు నాకు అని అంటాడు రంజిత్. ఆ రాహుల్ గాడు కొట్టిన దెబ్బలతోనే నువ్వు చచ్చిపోయావని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తాను, ఈ కేసును అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదిస్తానని చెబుతాడు రంజిత్. కోయిలి నన్ను చంపొద్దని బతిమలాడినా పట్టించుకోకుండా కర్రతో ఆమెను కొట్టడంతో చనిపోతుంది.

ఈ వీడియో చూసిన ఎస్ఐ.. రాహుల్‌ని విడుదల చేసి రంజిత్‌ను లోపల వేసేయమని చెప్పడంతో రాహుల్, రుద్రాణిలు ఊపిరి పీల్చుకుంటారు. ఆ వెంటనే రాజ్‌కి థ్యాంక్స్ చెబుతాడు. నీకు టైం బాగుంది కాబట్టి బయటపడ్డావని, కానీ తప్పు చేసిన ప్రతిసారి నువ్వు తప్పించుకోలేవని అంటాడు రాజ్. ఇప్పటికైనా మంచి భర్తగా, మంచి తండ్రిగా బతికి చూపించమని చెబుతుంది కావ్య. ఇకపై నాలో మీరు మారిన రాహుల్‌ని చూస్తానని అంటాడు. మీ మేలు మరిచిపోలేనని, నా కంటే చిన్నవాళ్లు అయిపోయారు.. లేదంటే కాళ్లు పట్టుకునే దానిని అంటుంది రుద్రాణి. స్వప్న కూడా కావ్యకి థ్యాంక్స్ చెబుతుంది.

ఇంటికొచ్చిన రాహుల్‌కి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చీవాట్లు పెడుతుంది. నీ వల్ల రాజ్, కావ్యలు కూడా ప్రమాదంలో పడేవాళ్లని అపర్ణ మండిపడుతుంది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగదని, తనని క్షమించాలని అడుగుతాడు రాహుల్. నువ్వే ఆ హత్య చేయలేదని సాక్ష్యాలు దొరక్కపోతే జీవితాంతం జైళ్లో చిప్పకూడు తినేవాడివని అంటాడు సుభాష్. ఇప్పటికైనా మారకపోతే ఆ దేవుడు కూడా ఈసారి కాపాడలేడని చెబుతుంది ఇందిర. నేను తప్పు చేశానని క్షమించాలని అడుగుతాడు రాహుల్. నువ్వు క్షమాపణలు చెప్పాల్సింది మా అక్కకి.. నిన్ను నమ్ముకున్న నీ భార్య, బిడ్డను బాగా చూసుకుంటేనే ఈ కుటుంబం నిన్ను నమ్ముతుందని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X