Brahmamudi November 11th Episode: రాహుల్ మనసు చెడగొట్టిన రుద్రాణి.. కావ్య కోసం వంట చేసిన రాజ్
Photo Courtesy: JioHotstar
జైళ్లో ఉన్న రాహుల్ దగ్గరికి రుద్రాణి, స్వప్న వస్తారు. నేను కోయిలి డబ్బు, ఆస్తి మీద ఆశపడ్డాను కానీ ఆమెను చంపలేదని రాహుల్ అంటాడు. అయినప్పటికీ అతని మాటలను స్వప్న పట్టించుకోదు. భార్యను మోసం చేసినవాడు, ఈ హత్య చేయలేదంటే ఎలా నమ్మమంటావు అంటూ మండిపడుతుంది. రంజిత్ ఇంట్లో ఉన్న ఆధారాన్ని తీసుకొచ్చేందుకు కావ్య - రాజ్ రాగా.. ఇంటి చుట్టూ పోలీస్ సెక్యూరిటీ ఉండటంతో వారిద్దరూ దొడ్డిదారిన ఇంట్లో ప్రవేశించి సీక్రెట్ కెమెరా సంపాదిస్తారు.
కోయిలిని రంజిత్ చంపినట్లు తెలుసుకున్న కావ్య - రాజ్‌లు నేరుగా పోలీస్ స్టేషన్‌కు బయల్దేరతారు. స్టేషన్ వద్దే రుద్రాణిని రంజిత్ కలిసి నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఆధారాన్ని పోలీసులకు ఇస్తానని అప్పుడు రాహుల్ జీవితంలో బయటికి రాడని బెదిరిస్తాడు. ఇంతలో రాజ్- కావ్యలు వచ్చి కోయిలిని నువ్వే చంపే మా రాహుల్‌ని అందులో ఇరికిస్తావా? అని నిలదీస్తారు. వెంటనే అతనిని పోలీసులకు పట్టించి సాక్ష్యాన్ని చూపిస్తారు. దాంతో రాహుల్ నిర్దోషిగా విడుదలవుతాడు. ఇంటికొచ్చిన రాహుల్‌కు దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ పీకుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్ 875లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జైలు నుంచి విడుదలైన రాహుల్‌కి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా క్లాస్ పీకుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసుకున్నావ్.. నిన్ను నమ్ముకున్న నీ భార్యని, పాపని నువ్వు మరిచిపోని క్షణం ఈ కుటుంబం నిన్ను నమ్మడం మొదలుపెడుతుందని కావ్య అంటుంది. నీలో వచ్చిన మార్పును ఎలా చూపిస్తావో నువ్వే ఆలోచించుకోమ్మని చెబుతుంది. దాంతో నేను చేసిన తప్పుల వల్ల ఈ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఎంత ఇబ్బందిపడ్డావో నాకు తెలుసని స్వప్నతో అంటాడు రాహుల్. నేను మారి మనిషిని కావడం తప్పించి నేనేం చేయలేనని చెబుతాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు.. నా వల్ల ఇంకెప్పుడూ తప్పు జరగదని అంటాడు రాహుల్.
నమ్మకం అనేది రాసులు పోసి ఉండదు, నమ్మకం అనేది కళ్లకు కనిపించాలని అంటుంది స్వప్న. ఈ ఇల్లు ఓ పది మంది తలదాచుకునే షెల్టర్ కాదు, దేవాలయం అని చెబుతుంది. అలాంటి దేవాలయంలో నీ ఒక్కడి వల్ల అందరూ బాధపడాల్సి వస్తోందని మండిపడుతుంది. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఉండవని, నమ్మకమే ఉంటుందని.. ఆ నమ్మకం నాకు కలగాలంటే నీ మాటతో కాదు నీ మనసుతో నిరూపించమని వెళ్లిపోతుంది స్వప్న. భార్య మాటలతో ఒంటరిగా బాధపడుతున్న రాహుల్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. వాళ్లంతా అన్న మాటలకు బాధపడుతున్నావా. నువ్వేదో తప్పు చేసినట్లు అంతలా ఎందుకు కుమిలిపోతున్నావని నిలదీస్తుంది.
ఓ చోట తప్పు జరిగింది అంటే పరిస్ధితులు పై నుంచి వస్తాయా? నువ్వు ఇలా కావడానికి ఈ ఇంట్లో వాళ్లే కారణమని అంటుంది రుద్రాణి. మనం అడిగినట్లు ఆస్తిలో వాటా ఇవ్వకుండా, మనకు విలువ ఇవ్వకుండా, నిన్ను మనిషిగా గుర్తించకుండా చేశారని మండిపడుతుంది. నువ్వెందుకు తప్పు చేయాల్సి వచ్చిందని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. బంగారం లాంటి నిన్ను వేలెత్తి చూపించడానికి మాత్రం అందరూ ముందుకు వస్తారని అంటుంది. నీకు నేను ఉన్నా.. మీ అమ్మ చెప్పినట్లు చేస్తే చాలు మనం అనుకున్నది చాలని చెబుతుంది రుద్రాణి. వాళ్లంతా వెర్రి జనం అవతలి వాళ్లను మారమని అంటారు కానీ వాళ్లు మాత్రం మారరని అంటుంది. ఆస్తిలో మన వాటా మనకి వచ్చేవరకు, మన స్థానం మనకు దక్కేవరకు నువ్వు ఎంత దూరమైనా వెళ్లు అనిన చెబుతుంది రుద్రాణి.
తాళి కట్టిన నీ భార్యను, బిడ్డను, ఈ ఇంట్లో వాళ్లని ఎవ్వరినీ లెక్కచేయొద్దు.. నీ రూటు మార్చుకోవద్దని రాహుల్ మనసు చెడగొట్టాలని చూస్తుంది. ఆ మాటలతో రాహుల్ సీరియస్ అవుతాడు. నీ నీచుడిని, రాక్షసుడిని, దరిద్రుడిని అయినా నాకు బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవాలని ఉందని చెబుతాడు. మనిషిగా మారి నా భార్య కన్నీళ్లు తుడవాలని అనిపిస్తోందని, మరి నీకెందుకు ఇంత ప్రతీకారం ఎందుకు అని నిలదీస్తాడు రాహుల్. ఇన్నాళ్లు నువ్వు వేసిన ప్లాన్స్‌కి, చేసిన పనులకు నేను నాశనం అయ్యింది చాలని అంటాడు. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? పది మందిలో నువ్వు తలదించుకుని సరిచెబుతుంటే ఇదంతా నటన అనుకున్నానని అంటుంది రుద్రాణి. నిజంగానే మారిపోయావా? వాళ్లందరికీ బానిసగా ఉండిపోవాలని డిసైడ్ అయిపోయావా? అని మండిపడుతుంది.
వాళ్లందరూ నాకిచ్చిన లాస్ట్ ఛాన్స్.. ఇప్పుడు కూడా నేను మారకపోతే నా స్వప్నకు కూడా నేను అన్యాయం చేసినట్లు అని అంటాడు. ఇకపై నన్ను పురుగు కంటే హీనంగా చూస్తారని, ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేస్తారని చెబుతాడు రాహుల్. అవన్నీ మాయమాటలు, నమ్మొద్దని చెబుతుంది రుద్రాణి. జైళ్లో కూర్చొని చిప్పకూడు తినడం కంటే ఈ కుటుంబాన్ని, నా భార్యను నమ్మి అడుక్కు తినడం ఎంతో గౌరవంగా ఉంటుందని అంటాడు. ఈ రోజు రాజ్, కావ్యలు లేకపోయుంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందని చెబుతాడు రాహుల్. నేను తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో నిరూపించారని, వాళ్ల కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలని ఉందని అంటాడు. ఇకపై నన్ను మార్చాలని చూడొద్దని తేల్చేస్తాడు. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది.. వీరిద్దరి మాటలను విన్న స్వప్న బాధపడుతుంది.
బెడ్‌రూమ్‌లో అతికించిన బాబు ఫోటోలు చూసుకుంటూ బాధపడతాడు రాజ్. ఇంతలో కావ్య వచ్చి నా కోరికల చిట్టా అని పేపర్ ఇస్తుంది. అందులో చికెన్ మంచూరియా చేయాలని ఉండటంతో భార్య కోసం గనులు తవ్వే లైట్‌తో కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్. అది చూసిన ప్రకాశం ఇంట్లోకి దెయ్యం వచ్చిందని ధాన్యలక్ష్మీని తీసుకోస్తాడు. ఇంతలో కావ్య వచ్చి అది దెయ్యం కాదని రాజ్ వంట చేస్తున్నాడని అందరికీ చెబుతుంది. ఇందిర, అపర్ణ, ప్రకాశం, ధాన్యలక్ష్మీలను తీసుకుని కిచెన్‌లోకి వెళ్తుంది. చికెన్ మంచూరియాను తయారు చేసి కావ్యకి ఇస్తూ.. ఇంట్లో వాళ్ల గురించి నానామాటలు అంటాడు రాజ్. ఇది విన్న అందరూ రగిలిపోతారు. కావ్య అందరికీ చికెన్ మంచూరియా తినిపించి ప్లేట్ ఖాళీ చేస్తుంది. ఆ వెంటనే లైట్స్ వెలగడంతో కిచెన్‌లో ఉన్న ఫ్యామిలీని చూసి షాక్ అవుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










