Brahmamudi November 12th Episode: బయటపడ్డ రాహుల్ మోసం... షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ
Photo Courtesy: JioHotstar
జైలు నుంచి వచ్చిన రాహుల్‌ని ఇకనైనా బుద్ధిగా ఉండమని దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ పీకుతుంది. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు.. ఇకపై ఎలాంటి తప్పు చేయనని స్వప్నతో అంటాడు రాహుల్. నువ్వు నిజంగానే మారిపోయావా? అంటూ రాహుల్‌పై ఫైర్ అవుతుంది రుద్రాణి. ఇకనైనా నన్ను మనిషిగా మారనివ్వు.. లేదంటే నన్ను పురుగు కంటే హీనంగా చూస్తారని అంటాడు రాహుల్. నువ్వు ఇలాగే ఒకరి కింద బానిసలా బతుకుతావా? రుద్రాణి నిలదీస్తుంది. జైళ్లో చిప్పకూడు తినడం కంటే ఇక్కడ బానిసగా గౌరవంగా బతకడమే మేలని చెబుతాడు. వీరి మాటలు విన్న స్వప్న ఎమోషనల్ అవుతుంది.
బెడ్‌రూమ్‌లో ఉన్న బాబు పోస్టర్స్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. కళావతి ఈ ఇంటి సంతోషం కోసం ఇదంతా చేస్తోంది కానీ తన ఆయుష్షు రోజురోజుకు కరిగిపోతోందని పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఇంతలో కావ్య వచ్చి నా కోరికల చిట్టా అని, వీటిని మీరు తీర్చాలని చెబుతుంది. ముందుగా చికెన్ మంచూరియా చేయాలని అందులో ఉండటంతో ఎవ్వరికీ కనిపించకుండా కిచెన్‌లో మంచూరియా చేస్తాడు రాజ్. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీకి దొరికిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్ 876లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కిచెన్‌లోకి ఫ్యామిలీకి దొరికిపోవడంతో కావ్యపై మండిపడతాడు రాజ్.పెళ్లాం కోసం మీరు పడ్డ కష్టం ఇంట్లో వాళ్లకి తెలియాలి కదా అని అంటుంది కావ్య. నాకు నడుము నొప్పిగా ఉంది మందు రాయమంటే ఖాళీగా లేనని చెప్పి, పెళ్లానికి చికెన్ మంచురియా చేసి పెడతావా? అని ఫైర్ అవుతుంది ఇందిర. కన్నతల్లికి తలనొప్పి మందులు తీసుకురమ్మంటే.. తల తిప్పుకుని వెళ్లిపోతావా? నీ పెళ్లానికి చికెన్ మంచూరియా అని వెక్కిరిస్తుంది అపర్ణ. ఆఫీసుకు రావడానికి, సంతకాలు చేయడానికి, మీటింగ్‌కు రావడానికి బిజీ.. కానీ పెళ్లానికి చికెన్ మంచూరియా అని సెటైర్లు వేస్తారు కుటుంబ సభ్యులు.
ఉదయాన్నే రాజ్‌కి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు అనుకుని మీటింగ్ పెడతారు. ఇంత లేటుగా లేస్తే ఎలా? ఇంట్లో పనులుంటాయని తెలియదా? అని రాజ్‌పై మండిపడతారు. ఒక్కొక్కరు ఒక్కో టీ కావాలని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నేనే హోటల్‌లో సర్వర్‌నా? ఈ ఇంట్లో పనిమనిషినా? అని అడుగుతాడు రాజ్. నేను గ్రేట్ బిజినెస్‌మెన్ స్వరాజ్‌ని అని అంటాడు. మరి పెళ్లానికి చికెన్ మంచూరియా చేసి పెడతావా అని మండిపడతారు.
ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే, మాకు కావాల్సినవన్నీ చేసి పెట్టాల్సిందేనని చెబుతుంది ఇందిర. ఇంతలో కావ్య వచ్చి మా ఆయన మీద పడ్డారని అంటుంది. అసలే మా వారు నాజూకు, అందరూ మీద పడితే పచ్చడి అయిపోతారని చెప్పి అందరికీ వారు అడిగిన టీ ఇచ్చేస్తుంది. నిన్ను ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు అంటే కావ్యపై మండిపడుతుంది అపర్ణ. వాళ్ల ఆయన కష్టపడకూడదని కావ్య ఈ పనులన్నీ చేస్తోందని చెబుతుంది ధాన్యలక్ష్మీ. మా ఆయన నాకోసం వంట చేశారని ఏడిపిస్తున్నారా? అని మండిపడుతుంది కావ్య. నాకు ఇష్టమని, నా కోరిక తీర్చడానికి చికెన్ చేసి పెట్టారని అంటుంది, అది మీ అందరికీ తప్పా అని ప్రశ్నిస్తుంది. నీకోసం వంట చేసినవాడు, మా కోసం ఒక కాఫీ ఇవ్వలేడా? అని మండిపడుతుంది ఇందిర.
నేను ఆయనకి ముద్దుల పెళ్లాన్ని, ఆయన బంగారం కాబట్టి ఏం చేసినా నాకోసమే చేస్తారని చెబుతుంది కావ్య. నీ మొగుడికి నీ మీద అంత ప్రేమ ఉంటే మా అందరికీ బిర్యానీ చేసిపెట్టమని చెప్పు అని అంటుంది ఇందిర. మా ఆయన నా కోరికల లిస్ట్ తీరుస్తానని మాటిచ్చారని చెబుతుంది కావ్య. ఇకపై రోజుకొక కోరిక తీరుస్తాడని అంటుంది. నా మనవడికి నీ గొంతెమ్మ కోరికలు చెప్పి వాడితో చాకిరీ చేయించుకుంటున్నావా? ఇందిర ఫైర్ అవుతుంది. నా మీద మా ఆయనికి ప్రేమ ఉన్నట్లు.. మీ హజ్బెండ్స్‌కి ప్రేమ లేదేమో అంటుంది కావ్య. ఆ మాటలతో సుభాష్, ప్రకాశంలు ఉలిక్కిపడతారు. మా ఆయనలా మావయ్యల్ని మీకు ఈరోజు వంట చేసి పెట్టమను అని సవాల్ విసురుతుంది కావ్య. మావయ్యలను మీకోసం ఇన్నేళ్లలో ఏమైనా చేశారా అని అడుగుతుంది.
ఈరోజు తీర్చాల్సిన కోరికలు చాలా ఉన్నాయని రాజ్‌ని లాక్కెళ్తుంది కావ్య. కోడలు చెప్పినట్లు మా కోసం ఈరోజు వంట చేయాలని అడుగుతారు ధాన్యలక్ష్మీ, అపర్ణ. వంట చేయడం పెద్ద మేటర్ కాదని.. నా భార్య మీద ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తామని అంటారు ప్రకాశం, సుభాష్. ఆలోచించకుండా మాట ఇవ్వొద్దని చెబుతుంది ఇందిర. మేమేంటో నిరూపించుకుంటామని వాళ్లిద్దరూ వెళ్లడంతో వారి వెనుకే వారి భార్యలు కూడా కిచెన్‌లోకి వెళ్తారు. ముందు ఉప్మా చేసి పెడదామని సుభాష్, ప్రకాశంలు అనుకుంటారు. వాళ్లు చేసిన ఉప్మా రుచి చూసి అపర్ణ, ఇందిరలు షాక్ అవుతారు. మిమ్మల్ని వంట చేయమన్నందుకు మాకు బుద్ధి లేదని క్లాస్ పీకుతారు.
ఓ వ్యక్తి రాహుల్‌కి ఫోన్ చేసి విసిగిస్తాడు. నేను ఇచ్చే డీల్ ఏంటో తెలిసి కూడా నా ఆఫర్ వద్దని చెబుతున్నావని మండిపడతాడు ఆ వ్యక్తి. నేను ఇంటి బయటే ఉన్నాను, 5 నిమిషాల్లో డీల్ మాట్లాడి వెళ్లిపోమ్మని చెబుతాడు ఆ వ్యక్తి. దాంతో రాహుల్ ఆవేశంగా కిందకి వెళ్లి.. నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెబుతాడు ఆ వ్యక్తి. నేను ఇలాంటి పనులు మానేశాను, నాకు ఏ డీల్ వద్దని అంటాడు రాహుల్. ఫారిన్ నుంచి 10 కేజీల గోల్డ్ ఇండియాకు అక్రమంగా వచ్చిందని, వాళ్లు దానిని బయట మార్కెట్‌లో అమ్మే స్టేజ్‌లో లేరని చెబుతాడు ఆ వ్యక్తి. మనం తప్పించి వాళ్లకి వేరే దిక్కులేదని, నువ్వు తెలివిగా ఈ బంగారాన్ని మీ కంపెనీలోకి చేర్చగలిగితే నీ వాటా 20 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేస్తాడు ఆ వ్యక్తి.
20 లక్షల రూపాయలు ఇస్తామన్నా ఈ డీల్‌కి ఒప్పుకోవా? అని అడుగుతాడు ఆ వ్యక్తి. దాంతో చెయ్యను అని రాహుల్ అంటాడు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కోటి రూపాయలు ఇస్తానన్నా ఇలాంటి పనులు చేస్తానని నేను అనుకోవడం లేదు.. ఇకపై ఎప్పుడూ ఇలాంటి వర్క్స్ కోసం కలవొద్దు, కాల్స్ కూడా చేయొద్దని అంటాడు రాహుల్. ఇలా మారిపోయావేంటీ? ఏమైంది నీకు అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తాడు. తప్పుకి, ఒప్పుకి .. ఆశకి అత్యాశకి మధ్య తేడా ఏంటో తెలుసుకున్నాను, మనిషిగా మారాలనుకుంటున్నానని వెళ్లిపోతాడు రాహుల్. ఇదంతా విన్న రుద్రాణి.. కొడుకుని ఆపుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్ధమవుతుందా? ఒకప్పుడు ఇదే డబ్బు కోసం ఇంత కష్టపడ్డాం, ఎలా వదులుకోవాలని అనుకుంటున్నావని అంటుంది రుద్రాణి.
ఈజీగా డబ్బు వస్తుందని ఇలాంటి పనులన్నీ చేశా? దాని వల్ల ఇంట్లో వాళ్ల నమ్మకాన్ని కోల్పోయానని అంటాడు రాహుల్. ఇక నుంచి అలాంటి పనుల్నీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతాడు. రాజ్ అన్న మాటలకు కరిగిపోయావా? నిన్ను వాళ్లు బానిసలా చేస్తారని హెచ్చరిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు విని తప్పుడు దారిలో వెళ్లాను, అలా నడుచుకునే కంటే మంచివాడిగా ఇంట్లో ఓ మూలన కూర్చోవడమే బెటర్ అని అంటాడు రాహుల్. ఈ మాటలు విన్న స్వప్న చప్పట్లు కొడుతూ వస్తుంది. ఇప్పటి వరకు నాలో చిన్న అనుమానం ఉండేదని, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావని నాకు నమ్మకం వచ్చిందని అంటుంది. నీ మొగుడిని ఈ ఇంటికి బానిసగా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇన్నిరోజులు నీ కొడుకుని ఓ మోసగాడిలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని రివర్స్‌లో తగులుకుంటుంది స్వప్న. మీకు బుద్ధిరాదు.. కనీసం ఇప్పుడిప్పుడే మారాలని అనుకుంటున్న నీ కొడుకు దారికి మాత్రం అడ్డురావొద్దని వార్నింగ్ ఇస్తుంది. మీ అబ్బాయిని మళ్లీ మార్చాలని చూస్తే ఊరుకోనని అంటుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











