Brahmamudi November 13th Episode: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రాహుల్... ప్రేమికులుగా మారిన ప్రకాశం, సుభాష్

Photo Courtesy: JioHotstar

కిచెన్‌లో కావ్య కోసం వంట చేస్తూ ఫ్యామిలీకి దొరికిపోవడంతో కావ్యపై మండిపడతాడు రాజ్. మా కోసం ఏం చేయని నువ్వు.. నీ పెళ్లాం కోసం వంట చేస్తావా అంటూ దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్‌ను తగులుకుంటుంది. మా ఆయనకి నేనంటే ఇష్టం కాబట్టి నాకోసం వంట చేశాడని కావ్య చెబుతుంది. మావయ్యలకి కూడా మీరంటే ఇష్టముంటే మీకోసం వంట చేయాలని సవాల్ విసురుతుంది కావ్య. దాంతో ధాన్యలక్ష్మీ, అపర్ణలు వారి భర్తలను కూడా వంట చేయమంటారు. చేసేది లేక ప్రకాశం, సుభాష్‌‌‌లు కిచెన్‌లో ఉప్మా తయారు చేస్తారు. అది రుచి చూసిన ధాన్యం, అపర్ణలు షాక్ అవుతారు.

మరోవైపు.. రాహుల్‌తో డీల్ మాట్లాడటానికి ఓ వ్యక్తి పదే పదే ఫోన్ చేస్తాడు. ఎంతకీ తమ మాట వినిపించుకోకపోవడంతో నేరుగా ఇంటికి వస్తాడు ఆ వ్యక్తి. ఫారిన్ నుంచి దొంగ బంగారం తెప్పించామని దానిని మీ కంపెనీలోనే పెట్టాలని ఇందుకు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెబుతాడు. మీరు ఎంత ఇచ్చినా సరే.. ఇకపై నేను అలాంటి పనులు చేయనని తేల్చి చెబుతాడు రాహుల్. భర్తలో వచ్చిన మార్పును గమనించిన స్వప్న ఎమోషనల్ అవుతుంది. కొడుకు రోజు రోజుకు మారిపోవడంతో రాహుల్‌ని మార్చాలని చూస్తుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి అత్తగారికి గడ్డి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 13వ తేదీ ఎపిసోడ్ 877లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 13th 2025 Episode 877 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాహుల్ మనసుని మార్చాలని ప్రయత్నిస్తోన్న రుద్రాణికి క్లాస్ పీకుతుంది స్వప్న. మీరు ఎలాగూ మారడం లేదు.. ఇప్పుడిప్పుడే మారుతున్న మీ కొడుకు దారికి మాత్రం అడ్డురావొద్దని వార్నింగ్ ఇస్తుంది. మీ దారికి నేను అడ్డొస్తే.. బుల్డోజర్‌లా తొక్కుకుంటూ వెళ్తానని అంటుంది. స్వప్న లోపలికి వెళ్లగానే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అంటాడు రాహుల్. నా పెళ్లాన్ని నా దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన యాక్టింగ్ అని జరిగింది గుర్తుచేసుకుంటాడు. ముందు రోజు రాహుల్ - రుద్రాణిలు మాట్లాడుకుంటూ ఉండగా స్వప్న వీరి మాటల్ని స్వప్న వినడాన్ని రాహుల్ గమనిస్తాడు. ఇప్పటిదాకా నా పెళ్లాం చూస్తోందని, అందుకే ఇలా మాట్లాడానని అంటాడు.

నువ్వు ఇంట్లో వాళ్ల మాటలకి కరిగిపోయి, మారిపోయుంటావని బాధపడి చచ్చానని చెబుతుంది స్వప్న. నేను నీ కొడుకుని.. నాకు కోర్టులో శిక్ష పడకుండా కాపాడినట్లు నటించి, నన్ను వాళ్ల కాళ్ల దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేస్తోన్న రాజ్ మాటల్ని నమ్మనని అంటాడు రాహుల్. స్వప్నకి ఎదురు వెళ్లడం కంటే తన దారికి మనం వెళ్లినట్లుగా నటించి తనని మన దారికి తెచ్చుకోవడం మంచిదని చెబుతాడు. ఇక నుంచి తనే నా గురించి ప్లాన్ చేస్తుందని, ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు సూర్యుడిని రాహువు మింగేసినట్లు ఫ్యామిలీని మింగేస్తానని అంటాడు రాహుల్.

ఉదయాన్నే శృతిపై మండిపడతాడు రాజ్. ఇప్పటి వరకు ఆ కొటేషన్ ఎందుకు పూర్తి చేయలేదు.. క్లయింట్స్ నాకు ఫోన్ చేసే వరకు ఎందుకు తీసుకొచ్చావని మండిపడతాడు. రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని శృతి చెప్పగా... అంత టైం లేదని, క్లయింట్స్ రేపటిలోగా కావాలని చెప్పారు. ఈరోజు నైట్ మొత్తం మేల్కొని పనిచేస్తావో? లేక సపోర్టింగ్ స్టాఫ్ సాయం తీసుకుని పనిచేస్తావో నాకు తెలియదు. రేపు ఈవినింగ్ లోపు నా కొటేషన్ ప్రిపేర్ చేయాలని ఆర్డర్ వేస్తాడు రాజ్. ఏదైనా డెడ్‌లైన్ పెట్టుకుని పనిచేస్తే పని పూర్తవుతుందని అంటాడు. మీరు సోమవారం ఆఫీస్‌కి వస్తున్నారా? అని రాజ్‌ని శృతి అడుగుతుంది. ఎందుకు అని రాజ్ సీరియస్‌గా ప్రశ్నిస్తాడు. సాహితీ గ్రూప్ వాళ్లతో మీటింగ్ ఉంది.. మరిచిపోయారా అని అడుగుతుంది శృతి. అది డాడీ చూసుకుంటారు.. డొంట్ వర్రీ అని అంటాడు రాజ్. కానీ వాళ్లు మీతోనే మాట్లాడతానని అంటున్నారని చెబుతుంది శృతి. వాళ్లతో నేను మాట్లాడతానని.. ముందు నీ వర్క్ ఫినిష్ చేసి నాకు మెయిల్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు రాజ్

ఇదంతా వింటున్న కావ్య... సీరియస్‌ అవుతుంది. నా కోరికలు తీర్చకుండా మీరు ఆఫీసు పనులు చూసుకుంటారా? అని మండిపడుతుంది. రాత్రి నువ్వు అడిగినందుకే చికెన్ మంచూరియా చేసిపెట్టానని చెబుతాడు రాజ్. నాలుగు చికెన్ ముక్కలు వండితే అయిపోతుందా? నా మీద మీకు ప్రేమ లేదని అంటుంది కావ్య. మీ అమ్మనాన్న, ఫ్యామిలీ, మీ ఆఫీసు ఇవే కదా మీకు ముఖ్యమని మండిపడుతుంది కావ్య. ఆ బకెట్ లిస్ట్‌లో ఉన్న ప్రతి విషయం నాకు గుర్తుందని, అది పూర్తి చేసే వరకు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని చెబుతుంది కావ్య. ఆ లిస్ట్ చూడకుండా నెక్ట్స్ నేను ఏం అడిగానో చెప్పమంటుంది. నీకోసం నేనొక ప్రేమ లేఖ రాయాలి అంతేకదా... ఇప్పుడే రాస్తానని చెబుతాడు రాజ్.

మీరు నా మీద సీరియస్ అవుతున్నారని కోప్పడుతుంది కావ్య. నేను నీ పక్కనే కూర్చొంటానని చెబుతూ కావ్య చెప్పిన పదాల్నే రాస్తానని అంటాడు రాజ్. నిన్ను నా ఊహల్లో ఊహించుకుని రాస్తానని చెబుతాడు. ప్రేమ లేఖ ఎలా రాయాలో తెలియక బయట అటు ఇటు తిరుగుతాడు రాజ్. ఇంతలో అతనికి ప్రకాశం, సుభాష్ కూడా ఏదో రాస్తూ కనిపించడంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వేం చేస్తున్నావో మేం కూడా అదే చేస్తున్నామని చెబుతాడు ప్రకాశం. నీ పెళ్లాం పెట్టిన ఫిట్టింగ్.. నువ్వేం చేస్తే మేం కూడా అదే చేయాలని మీ అమ్మ, మీ పిన్ని అదే చేయమని చెబుతున్నారని అంటాడు ప్రకాశం. బోర్డు మీటింగ్‌లో కూర్చోనే వయసులో ప్రేమలేఖలు రాయాలని అంటున్నారని బాధపడతాడు సుభాష్. నిన్న తిన్న కూర ఈరోజు గుర్తుండదని.. పాతికేళ్ల వెనక్కి వెళ్లి మీ పిన్ని గురించి ఏం రాయమంటావని అంటాడు ప్రకాశం.

ముగ్గురికి ఏం రాయాలో అర్ధం కాక తలగొక్కుంటూ ఉంటారు. ఇంతలో రాజ్ వెళ్లి... ప్రకాశం, సుభాష్‌ దాంట్లో చూసి రాస్తాడు రాజ్. వాళ్లు ముగ్గురు ఎలా రాస్తున్నారో చూడాలని కావ్య, అపర్ణ, ధాన్యలక్ష్మీలు చూసి నవ్వుకుంటారు. 30 ఏళ్ల మన జర్నీ ఎలా జరిగిందో మీ లెటర్‌లో కనిపించాలని ప్రకాశంతో చెబుతుంది అపర్ణ. పాతికేళ్ల మన సావాసం ఏరులై పారాలని చెబుతుంది ధాన్యం. నేను మా ఆయనకి మీలాగా ఏం చెప్పనక్కర్లేదని ఆయనే అల్లుకుపోతాడని అంటుంది కావ్య. ఆయన గుండెల్లోంచి నా మీద కవిత ప్రవాహంలా పొంగుకుంటూ వస్తుందని అంటుంది కావ్య. ఇంతలో రాజ్, ప్రకాశం, సుభాష్‌లు ప్రేమలేఖ రాశామని వాళ్ల భార్యల చేతుల్లో పెడతారు. అయితే ముగ్గురూ లవ్ లెటర్‌ నిండా ఆఫీస్ విషయాలు, వంటలు, పిండి వంటలు గురించి చెప్పడంతో అపర్ణ, కావ్య, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X