Brahmamudi November 14th Episode: కావ్యతో రాజ్ రొమాన్స్.. దుగ్గిరాల ఫ్యామిలీకి ఊహించని కష్టం
Photo Courtesy: JioHotstar
మంచివాడిగా మారుతోన్న రాహుల్ మనసుని మార్చొద్దని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఆమె వెళ్లిపోగానే.. ఎలా ఉంది నా నటన అని తల్లిని అడుగుతాడు రాహుల్. స్వప్నకి ఎదురెళ్లడం కంటే తన దారికి మనం వెళ్లినట్లుగా నటించి తనని మన దారికి తెచ్చుకోవడం మంచిదని చెబుతాడు రాహుల్. టైం చూసి ఈ కుటుంబాన్ని రాహువు మింగినట్లుగా మింగేస్తానని అంటాడు. నువ్వు ఎక్కడ రాజ్ మాటలకి కరిగిపోయి మారిపోయావోనని టెన్షన్ పడ్డానని చెబుతుంది రుద్రాణి.
ఉదయాన్నే శృతిపై మండిపడ్డ రాజ్.. కొటేషన్ త్వరగా పంపించాలని ఆర్డర్ వేస్తాడు. ఇంతలో కావ్య వచ్చి మీరు నాకు రాసిస్తానన్న ప్రేమలేఖ ఇప్పుడే కావాలని చెబుతుంది. దాంతో రాజ్ బయటికి వెళ్లగా అప్పటికే ప్రకాశం, సుభాష్‌లు కూడా ప్రేమలేఖలు రాస్తుంటారు. నీ పెళ్లాం పెట్టిన ఫిటింగ్ వల్ల మాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మండిపడతాడు సుభాష్. ముగ్గురూ కలిసి కిందా మీద పడి ప్రేమలేఖను పూర్తి చేస్తారు. అది చదివిన కావ్య, అపర్ణ, ధాన్యంలు తమ భర్తలపై మండిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 878లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుభాష్, రాజ్‌లు రాసిన ప్రేమలేఖలపై కావ్య, అపర్ణలు మండిపడతారు. ఇంతలో ధాన్యాన్ని పొగుడుతూ రాస్తాడు ప్రకాశం. చివరిలో లత అనే పేరు రావడంతో ఆ లత ఎవరు? అని నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. అంత కవిత్వం రాస్తే నా కోసం అనుకున్నాను, ఆ లత ఎవరు? అని ప్రకాశంను చీపురుకట్టతో చితకబాదుతుంది. అది చిన్నప్పటి కథ అని ప్రకాశం చెప్పగా.. చిన్నప్పుడే ఇంత కథ నడిపావా? అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అది చూసి రాజ్, కావ్య, సుభాష్, అపర్ణలు నవ్వుకుంటారు.
ఉదయాన్నే రెడీ అయిన రాహుల్‌కి ఎక్కడికి అని అడుగుతుంది రుద్రాణి. పనిచేయడానికి వెళ్తున్నాను అని చెబుతాడు రాహుల్. నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు దొరకవు, కానీ చిన్న చిన్నవి దొరుకుతాయి కదా అని అంటాడు రాహుల్. ఇప్పుడు నువ్వు చీప్‌గా అలాంటి జాబ్స్ ఎందుకు చేయాలి? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. స్వప్న ఇప్పుడిప్పుడే నన్ను నమ్మడం మొదలుపెడుతోంది... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా కష్టార్జితంతో తనను పోషిస్తున్నాను అని తనకు అనిపించడానికే వెళ్తున్నానని అంటాడు రాహుల్. దానికి కష్టపడటం ఎందుకు? కష్టపడినట్లు నటించొచ్చు కదా అని అంటుంది రుద్రాణి.
మనం మోసే చేసేది కూడా నిజాయితీగా చేయాలని, అసలే ఇంట్లో వాళ్ల కళ్లు నా మీదే ఉన్నాయని చెబుతాడు రాహుల్. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలి... నేను ఆ రాజ్ గాడి ప్లేస్‌లో కూర్చోవాలని అంటాడు. కొడుకు మాటలతో నువ్వు పూర్తిగా మారిపోయావ్.. నీ ప్లానింగ్ సూపర్ అని మెచ్చుకుంటుంది రుద్రాణి. బయటకు వెళ్తుండగా రాహుల్‌కు స్వప్న ఎదురై ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఇప్పటి వరకు నా గురించే ఆలోచించాను, ఇక నుంచి నీ గురించి ఆలోచించాలని అనుకున్నానని చెబుతాడు రాహుల్. ఈ ఇంట్లో ఎవరు నమ్మినా? నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మావు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంటాడు. ఈవినింగ్ నీకో సర్‌ప్రైజ్ కూడా ఉందని చెబుతాడు.
ఇంతలో ఇందిర వచ్చి.. ఎక్కడికి వెళ్తున్నాడని అడుగుతుంది. ఏదో పనిమీద వెళ్తున్నాడని చెబుతుంది స్వప్న. వాడిని అలా ఇష్టమొచ్చినట్లు తిరగనిచ్చినందుకే కదా అలా తయారయ్యాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది తెలుసుకోవాలని చెబుతుంది ఇందిర. రాహుల్‌లో మార్పు వచ్చిందని అందుకే తనకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని అంటుంది స్వప్న. అడవిలో ఎలాంటి మృగంతోనైనా స్నేహం చేయొచ్చు.. ఒక్క నక్కతో మాత్రం స్నేహం చేయకూడదని చెబుతుంది ఇందిర. మోసం చేయడం వాడి రక్తంలోనే ఉంది.. జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది.
రెస్టారెంట్‌కి వెళ్దామని అడిగావు కదా? రెడీ అవ్వకుండా పాప్‌కార్న్ తింటున్నావని కావ్యపై మండిపడతాడు రాజ్. నేను చీరలోనే వస్తానని చెబుతుంది కావ్య. నువ్వెప్పుడూ చీరలోనే ఉంటావు కదా? అలాగే రమ్మని అంటాడు రాజ్. నా చీర నేను కట్టుకుంటే గొప్ప ఏం ఉంటుంది? నీ చీర నేను కట్టుకోవాలా ఏంటీ? అని షాక్ అవుతాడు రాజ్. మిమ్మల్ని కట్టుకోమనడం లేదు.. నా చీర నా ఒంటికి మీరు కట్టాలి అని చెబుతుంది. ఇది నా బకెట్ లిస్ట్‌లో ఉందని, మీరు మరిచిపోయారా అని అంటుంది కావ్య. పెళ్లాం ఎంతో ఇష్టంగా చీర కట్టమంటే చీదరించుకుంటున్నారని మండిపడుతుంది కావ్య. మీరు నెక్లెస్ డిజైన్లు వేయమంటే అద్భుతంగా వేస్తారు.. కానీ పెళ్లానికి చీర కట్టమంటే మాత్రం చతికిలపడిపోతారని అంటుంది.
దాంతో కావ్యకి కార్తీక్ చీరకట్టి ఆమెకు ముద్దు పెట్టబోతుండగా కళావతి ఆపుతుంది. చీర సరిగా కట్టకపోవడంతో నాకు చీరకట్టినట్లుగా లేదని, నన్ను చాపలో చుట్టినట్లుగా ఉందని మండిపడుతుంది కావ్య. రొమాన్స్ చేసినంత ఈజీ కాదు పెళ్లానికి చీర కట్టడం అని చెబుతుంది. అయితే నువ్వు కట్టుకో.. నేను చూస్తూ ఉంటానని అంటాడు రాజ్. ధాన్యం కొట్టిన దెబ్బలకి ప్రకాశంకు దెబ్బలు తగులుతాయి. దాంతో భర్తకి మందు రాస్తుంది ధాన్యం. ఇదంతా చూసి కళ్యాణ్ - అప్పూలు నవ్వుకుంటారు. మీ అమ్మ అడిగింది కదా అని ఎప్పుడో స్కూల్‌లో రాసిన లవ్ లెటర్‌ని గుర్తు చేసుకున్నా అని చెబుతాడు ప్రకాశం. మీకు చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ పేరు ఎలా గుర్తుందని నిలదీస్తుంది ధాన్యం.
మీరు ఇంకా మీ పాత గర్ల్‌ఫ్రెండ్‌తో టచ్‌లో ఉన్నారు కదా? అని అడుగుతుంది. నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావని ప్రకాశం అనగా.. ఆ లత అనే అమ్మాయి కెనడాలో సెటిలైపోయిందని ఎలా తీసుకురాను అని అడుగుతాడు ప్రకాశం. మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు దానితో వీడియో కాల్ చేయించి నిజం చెప్పాలని ఆర్డర్స్ వేస్తుంది ప్రకాశం. కావ్య, రాజ్‌లు కారులో వెళ్తుండగా.. నా కోరికను మీరు మరిచిపోయారు. నన్ను రౌడీలు ఎత్తుకుపోతుంటే మీరు వచ్చి వాళ్లతో ఫైటింగ్ చేయాలని అంటుంది కావ్య. నేను కొంతమంది డమ్మీ రౌడీలను సెట్ చేశాను, వాళ్లు నిన్ను కామెంట్ చేస్తారు, ఆ వెంటనే నేనొచ్చి నిన్ను రక్షిస్తానని చెబుతాడు రాజ్. కావ్య కోసం హోటల్‌లో అందంగా క్యాండిల్ లైట్ డిన్నర్ సెట్ చేసి భార్యను సర్‌ప్రైజ్ చేస్తాడు రాజ్. అది చూసి కావ్య సంతోషిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










