Brahmamudi November 15th Episode: సర్వర్‌గా మారిన రాహుల్‌... చిక్కుల్లో కావ్య, షాక్‌లో రాజ్

Photo Courtesy: JioHotstar

ప్రకాశం రాసిన ప్రేమలేఖలో లత అనే అమ్మాయి పేరు ఉండటంతో ఆమె ఎవరు? అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. చీపురుకట్టతో చితకబాదుతుంది. తను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పడంతో ఆమెతో ఫోన్ చేయిస్తేనే నమ్ముతానని అంటుంది ధాన్యం. అది చూసి కళ్యాణ్ - అప్పూ నవ్వుకుంటారు. ఉదయాన్నే రాహుల్ ఎక్కడికో బయల్దేరడంతో ఎక్కడికి అని అడుగుతుంది రుద్రాణి. ఆ స్వప్నని, ఇంట్లో వాళ్లని నేను మంచివాడినని నమ్మించాలని చెబుతాడు రాహుల్. అందుకోసం బయట చిన్న ఉద్యోగం వెతుక్కున్నానని అంటాడు. నువ్వు ఇలాగే చేస్తే నీకు సపోర్ట్‌గా నేను ఉన్నానని చెబుతుంది రుద్రాణి.

రాహుల్‌ను అంత గుడ్డిగా నమ్మొద్దని హితవు పలుకుతుంది ఇందిర. నా బకెట్ లిస్ట్ ప్రకారం మీరు నాకు చీర కట్టాలని కావ్య చెప్పగా... రాజ్ తన భార్యకు చీర కడతాడు. ఇద్దరూ కలిసి కారులో రెస్టారెంట్‌కి వెళ్తుండగా నా కోరిక ఇంకోకటి మీరు తీర్చాలని .. మీరు రౌడీలో ఫైట్ చేయాలని అంటుంది. ఇంతలో భార్యను క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకుని వస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 15వ తేదీ ఎపిసోడ్ 879లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 15th 2025 Episode 879 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యని క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకొస్తాడు రాజ్. నాకు ఏం ఇష్టమో ఊహించి ఆర్డర్ ఇస్తేనే మజా అని అంటుంది కావ్య. నాకు ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకునే ఛాన్స్ ఇవ్వవా అని కావ్యపై మండిపడతాడు రాజ్. అంటే నాకు ఏం ఇష్టమో మీకు తెలియదా అని మండిపడుతుంది కావ్య. నీకు ఇష్టమైంది నాకు తెలియదని నేను అనలేదు కదా అని అంటాడు. అయితే నాకు ఇష్టమైంది మీరే ఆర్డర్ చేయమని చెబుతుంది కావ్య. ఇంతలో రాజ్ బేరర్‌ని పిలిచి రాజ్‌కి నచ్చినవి ఆర్డర్ చేస్తుంది. ఇంట్లో గరిటె నీ చేతుల్లోనే ఉంటుంది, నాకు ఏం ఇష్టమో నీకు తెలియదా అని అంటాడు రాజ్. ఇంట్లో గరిటె మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. కానీ నాకు ఏం ఇష్టమో మీకు తెలియదా? అని మండిపడుతుంది కావ్య. నాకు ఏ ఇష్టం లేదు.. మీ ఇష్టమే నా ఇష్టమని చెబుతుంది కళావతి.

కావ్యకి దాహం వేయడంతో బేరర్‌ని పిలిచి వాటర్ బాటిల్ తీసుకురమ్మని చెబుతాడు రాజ్. ఇంతలో బేరర్‌ డ్రెస్‌లో రాహుల్ ఉండటంతో వారిద్దరూ షాక్ అవుతారు. నువ్వేంటీ? నువ్వు ఇక్కడ బేరర్‌గా పనిచేయడం ఏంటీ? అని అడుగుతుంది కావ్య. మనిషి అన్నాక ఏదో ఒక పనిచేయాలి కదా అని అంటాడు రాహుల్. ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు తీయకూడదని తెలియదా అని మండిపడతాడు రాజ్. ఆ పని చేసిన వాడిని, లెక్కు అందని తప్పులు చేసినవాడిని, ఇప్పుడు కళ్లు తెరిచిన వాడిని అంటాడు రాహుల్. నేను మారాను అంటే ఎవ్వరూ నమ్మడం లేదు.. నిజాయితీగా నా భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి నాకు వేరే మార్గం దొరకలేదని అంటాడు రాహుల్.

నువ్వు మారావని నిరూపించుకోవడానికి ఇలాంటి చోట, ఈ పని చేయనక్కర్లేదు.. నీకంటూ ఓ ఫ్యామిలీ ఉంది, నీకంటూ కష్టం ఉంటే మేం ఉన్నామని చెబుతాడు రాజ్. ఇప్పటిదాకా నా కోసం మీరు చాలా చేశారు.. ఇక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టించలేనని అంటాడు. ఒకప్పుడు నేను బతికిన బతుకు కన్నా నేను అనుభవించిన దరిద్ర్యం కన్నా ఈ పని నీచమైంది కాదని అంటాడు రాహుల్. ఎవరి చేతా మాటలు పడకుండా నా భార్యాబిడ్డలకు ఓ ముద్ద అన్నం పెడితే చాలని చెబుతాడు. ఇక్కడ నీకు నాకు సంబంధం ఉందని ఎవ్వరికీ తెలియదని, ఇప్పుడు మీరు నా కస్టమర్స్ అంటాడు రాహుల్. అతనిలో చాలా మార్పు వచ్చిందని చెబుతుంది కావ్య. కానీ నేను మాత్రం నమ్మడం లేదని అంటాడు రాజ్.

కావ్య వాష్ రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు రౌడీలు ఆమెను టీజ్ చేస్తారు. రాజ్ ఏర్పాటు చేసిన రౌడీలు వీళ్లేనని కావ్య అనుకుంటుంది. అయితే వాళ్లు మాత్రం కావ్యను వేరే అర్ధం వచ్చేలా బూతులు మాట్లాడతారు. కావ్యని రూమ్‌కి తీసుకెళ్తామంటూ బలవంతం చేస్తారు. ఇంతలో రాజ్ వచ్చి మిమ్మల్ని యాక్ట్ చేయమంటే నిజంగానే జీవిస్తున్నారంటూ నాలుగు పీకుతాడు. అసలు నువ్వు ఎవరు? ఎవరికి కొట్టావ్ అని రౌడీలు అడుగుతారు. దాంతో రాజ్ తాను డబ్బులిచ్చిన వ్యక్తికి ఫోన్ చేయగా.. మేం అక్కడికి రాలేదని, వస్తుంటే మధ్యలో టైర్ పంక్చర్ అయ్యిందని చెబుతారు. దాంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. నా భార్య కోసం దేవుడు రియల్ ఫైట్ చేయమని డిసైడ్ అయినట్లున్నాడని అంటాడు రాజ్. ఆ వెంటనే కళావతి జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టనని అందరినీ చితకబాదుతాడు. దాంతో వాళ్లంతా కావ్యకి క్షమాపణలు చెబుతారు.

హోటల్‌లో రాహుల్ బేరర్‌గా ఉండటం నాకు నచ్చలేదని చెబుతుంది కావ్య. మనమంతా ఉండగా రాహుల్ అలాంటి పని చేయడం బాగోదని అంటుంది. వాడు చేసిన తప్పులే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని చెబుతాడు రాజ్. రాహుల్‌కి ఏదైనా పని అప్పగించి చూడండి, అతను ఎంత బాధ్యతగా ఆ పని చేస్తాడో చూడండి, అప్పుడు మీరొక నిర్ణయం తీసుకోండి అని అంటుంది కావ్య. రాహుల్ అంత ఈజీగా మారతాడని నేను అనుకోవడం లేదని అంటాడు రాజ్. ముందు నమ్మి ప్లాన్ అప్పగిస్తేనే కదా? నా కోసం ఒక్క అవకాశం ఇవ్వమని కావ్య బతిమలాడుతుంది. ఏదో ఒకటి చేద్దామని అంటాడు రాజ్.

స్వప్నకి చీర కొనుక్కుని వస్తాడు రాహుల్. నువ్వు ఇలాంటి శారీలు కట్టవని తెలుసు, కానీ నేను పనిచేస్తే వచ్చిన డబ్బుతో ఇది మాత్రమే వచ్చిందని అంటాడు. నువ్వు పనిచేశావా? అని స్వప్న షాక్ అవుతుంది. ఒక రెస్టారెంట్‌లో బేరర్‌గా జాయిన్ అయ్యానని చెప్పడంతో స్వప్న ఉలిక్కిపడుతుంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో నన్ను నమ్మి నాకొక గొప్ప ఉద్యోగం ఎవరిస్తారని అడుగుతాడు రాహుల్. పని చిన్నదా? గొప్పదా అని నేను ఆలోచించడం లేదు.. నువ్వు కోరుకున్నట్లు ఉండగలిగానా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తున్నానని అంటాడు. నా మొట్టమొదటి జీతంతో శారీ కొన్నానని చెబుతాడు రాహుల్. నువ్వు మొదటిసారి నాకోసం ఆలోచించావు.. చీర కాస్ట్‌లీనా? కాదా? అని నేను చూడను అని అంటుంది స్వప్న.

ఇంట్లో వాళ్లు నేను మారాను అంటే నమ్మడం లేదు.. నాకంటూ ఒకపని చూపించమని వాళ్లని అడగలేను, ఏ పని చేయకుండా నిన్ను బాధపెట్టలేనని అంటాడు రాహుల్. నీ బాధ పొగొట్టాలని, నిన్ను సంతోషపెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నేను నమ్ముతున్నానని రాహుల్‌ని హత్తుకుంటుంది స్వప్న. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో రాహుల్ మనసులో సంతోషిస్తాడు. ఉదయాన్నే ఇందిరకి అప్పూ కాఫీ ఇవ్వడంతో నీకు ఈ పనులన్నీ ఎందుకు? నేను ఇస్తాను కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. నాకు ఓ కప్పు కాఫీ ఇస్తే నీ కోడలు అరిగిపోతుందా? అంటుంది ఇందిర. ఇంతలో స్వప్న చాలా తక్కువ రకం చీర కట్టుకుని రావడంతో ధాన్యం షాక్ అవుతుంది. మీకు నచ్చకపోతే ఏంటీ? నాకు నచ్చింది కదా? అని అంటుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X