Brahmamudi November 17th Episode: రాహుల్ ట్రాప్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ... ఎండీ పోస్ట్‌‌పై రుద్రాణి కన్ను

Photo Courtesy: JioHotstar

కావ్య ఎగ్జిట్ ప్లాన్‌లో భాగంగా ఆమెను క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకుని వస్తాడు రాజ్.. తన ఫేవరెట్ ఐటెమ్స్ ఆర్డర్ చేయమని కావ్య చెప్పగా.. రాజ్ ఏవేవో ఆర్డర్ చేస్తాడు. నా ఇష్టాలు ఏంటో మీకు తెలియదు, మీ ఫేవరెట్ ఐటెమ్స్ నేను ఆర్డర్ చేస్తానని చెబుతుంది. భార్య తన మీద చూపించే ప్రేమకు ఫిదా అవుతాడు రాజ్. ఇంతలో బేరర్‌గా రాహుల్ కనిపించడంతో కావ్య, రాజ్ షాక్ అవుతారు. ఇలాంటి పనులు చేసి దుగ్గిరాల ఇంటి పరువును బజారున పడేస్తావా? అని మండిపడతారు. నేను మారానంటే నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు, నాకు ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే ఈ ఉద్యోగంలో చేరానని చెబుతాడు రాహుల్.

ఇంతలో కావ్యని రౌడీలు ఏడిపిస్తుండటంతో వాళ్లను తన భర్తే ఏర్పాటు చేశాడనుకుని నవ్వుతూ ఉంటుంది. అయితే వారి అల్లరి ఎక్కువ కావడంతో రాజ్ ఫైట్ చేసి భార్య కోరికను తీరుస్తాడు. ఇద్దరూ కారులో వెళ్తూ రాహుల్‌కి లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది కావ్య. తను సంపాదించిన డబ్బుతో చీర కొని రాహుల్ ఇవ్వడంతో స్వప్న సంతోషించి భర్తను హత్తుకుంటుంది. స్వప్న పూర్తిగా తన ట్రాప్‌లో పడటంతో కంపెనీని చేజిక్కించుకోవాలని రాహుల్ మరో ప్లాన్ వేస్తాడు. ఉదయాన్నే రాహుల్ తీసుకొచ్చిన తక్కువ రకం చీర కట్టుకుని స్వప్న రావడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 17వ తేదీ ఎపిసోడ్ 880లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 17th 2025 Episode 880 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంత నాసిరకం చీరకట్టుకుంటే ఈ ఇంటి పరువు ఏం కావాలని స్వప్నపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఈ చీర నా భర్త నా కోసం తను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నాడని అంటుంది స్వప్న. నేను నీకు ముందే చెప్పాను కదా? ఇలాంటి పరిస్ధితి వస్తుందని నాకు ముందే తెలుసు? అని అంటాడు రాహుల్. ఎవరు ఏమనుకున్నా, నువ్వు నా కోసం తెచ్చావు.. నిన్ను డిజప్పాయింట్ చేయను అని చెబుతుంది స్వప్న. అక్కకి ఈ చీర బాగానే ఉందని ఈ టాపిక్ వదిలేయమని అంటుంది అప్పూ. ఇంతలో రాజ్ వచ్చి.. ఈరోజు 11 గంటలకు టెండర్ ఉంది, అక్కడ 20 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలి. నువ్వు బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని టైంకి టెండర్‌ ఆఫీస్‌కి వెళ్లమని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ముందుగా ఇలాంటి ఆఫీస్ పనులు చూసుకుంటే నీక్కూడా కొంచెం ఐడియా వస్తుందని అంటాడు రాజ్. ఆఫీస్ పనులు వాడు చూడటం ఏంటీ? 20 లక్షల రూపాయలు కట్టమని వాడి చేతికి ఇస్తున్నావని మండిపడతాడు. బాబాయ్ గంట ముందు టెండర్ ఆఫీస్ దగ్గర ఉండాలి, ఈ లోపు రాహుల్ పని పూర్తి చేస్తాడని చెబుతాడు రాజ్. దాంతో రాజ్‌కి రాహుల్ థ్యాంక్స్ చెబుతాడు. ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఇవ్వాలని కావ్య చెప్పిందని అంటాడు రాజ్. ఆ టెండర్ మనకి చాలా ఇంపార్టెంట్.. నువ్వు 11 గంటల లోపు డబ్బు కట్టకపోతే మనకి చాలా లాస్ వస్తుందని అంటాడు రాజ్. నువ్వు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించావు, దానిని నేను సద్వినియోగం చేసుకుంటానని అంటాడు రాహుల్.

కావ్యకి స్వప్న థ్యాంక్స్ చెబుతుంది. రాహుల్‌ కోసం రాజ్‌ని ఒప్పించి నువ్వే ఒక అవకాశం ఇప్పించావని అంటుంది స్వప్న. రాహుల్‌కి ఒక ఛాన్స్ ఇప్పించాలని నేను అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్లని ఎలా ఒప్పించాలో తెలియలేదని చెబుతుంది. నీ మనసుని ఎప్పుడూ నేను అర్ధం చేసుకోలేదు.. కానీ నువ్వు మాత్రం నాకేం కావాలో తెలుసుకుని చేసేస్తావని మెచ్చుకుంటుంది. డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని నా లైఫ్ నేను చూసుకున్నాను, కానీ నువ్వు మాత్రం అమ్మానాన్నల కోసం ఈ ఇంటికి వచ్చావని చెబుతుంది స్వప్న. నా కోసం నీ చదువుని కూడా త్యాగం చేశావు.. నువ్వు మాత్రం నా లైఫ్ కాపాడావని అంటుంది. మనం ఏం చేస్తే తిరిగి అదే దక్కుతుంది, నిన్ను చాలాసార్లు బాధపెట్టానని ఎమోషనల్ అవుతుంది స్వప్న.

అమ్మానాన్నల కోసం, ఈ కుటుంబం కోసం కష్టపడ్డావు కాబట్టే ఆ దేవుడు నీకు మంచి జీవితాన్ని, మంచి భర్తను ఇచ్చాడని మెచ్చుకుంటుంది స్వప్న. నిన్ను, అప్పూను చూస్తుంటే ఒకవైపు ఆనందంగా ఉన్నా.. నా లైఫ్ మాత్రం ఇలా ఎందుకు అయ్యిందని బాధపడేదాన్ని, రాహుల్‌లో మార్పు వస్తే చూడాలని అనుకున్నానని చెబుతుంది స్వప్న. ఇన్నిరోజులకు రాహుల్‌లో ఆ మార్పు కనిపిస్తోంది.. మనిషికి కావాల్సింది క్యారెక్టరేనని బాధపడుతుంది. టెండర్ ఆఫీస్‌కి ఇంకా రాహుల్ రాలేదని ప్రకాశంకు మేనేజర్ చెబుతాడు. రాహుల్ డబ్బు తీసుకుని వస్తాడని ఈలోపు మనం చేయాల్సిన పనులు చేద్దామని అంటాడు ప్రకాశం. డబ్బు డ్రా చేసుకుని బయటకు వస్తుండగా దొంగలు బ్యాగ్ కొట్టేయడంతో వాళ్లని రాహుల్ వెంటాడతాడు.

ఉదయాన్నే దుగ్గిరాల కుటుంబం మొత్తం మాట్లాడుతుండగా రాజ్ వచ్చి కావ్యను పదా అంటాడు. ఎప్పుడు చూసినా అదే యావ ఏంట్రా బాబు అని ఇందిర మండిపడుతుంది. నేను కళావతిని లోపలికి రమ్మనడం లేదు, బయటికి రమ్మంటున్నానని అంటాడు. బైక్ నడుపుతాను అన్నావు కదా నీ కోసం స్కూటీ తీసుకొచ్చానని చెబుతాడు. కానీ నేను నడుపుతాను అన్నది బుల్లెట్ అని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బుల్లెట్ నడపటం చాలా కష్టమని వద్దు అని వారిస్తాడు రాజ్. ఇంతలోఆఫీస్ నుంచి రాజ్‌కి ఫోన్ చేస్తాడు ప్రకాశం. రాహుల్ టెంటర్ ఆఫీస్‌కి ఇంకా రాలేదని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ టెన్షన్ పడుతుండటంతో ఏం జరిగిందని ఇంట్లో వాళ్లు అడుగుతారు. రాహుల్ టెండర్ ఆఫీస్‌కి ఇంకా వెళ్లలేదని చెప్పడంతో ఇదే జరుగుతుందని అనుకున్నామని అంటారు.

మీరెవ్వరూ కంగారు పడొద్దని కావ్య నచ్చజెప్పాలని చూస్తుంది. డబ్బు తీసుకుని పారిపోవాలని చూస్తే ఇంకా తొందరపడొద్దని అంటావా? అంటూ మండిపడుతుంది ధాన్యం. నీ కొడుకుని నమ్మి 20 లక్షల రూపాయలు అప్పగిస్తే మాయమైపోయాడని రుద్రాణిపై మండిపడుతుంది ఇందిర. రాహుల్ ఆ డబ్బు తీసుకుని ఏ పబ్బులోనో, క్లబ్‌లోనో జల్సా చేసుకుంటూ ఉంటాడని ధాన్యం అనడంతో స్వప్న బాధపడుతుంది. నీ మొగుడిని నువ్వు నమ్ముతావేమో కానీ ఇంట్లో ఎవ్వరూ నమ్మరని అంటుంది ధాన్యలక్ష్మీ. ఈ మాటలన్నీ రాహుల్‌ కారులో నుంచి విని మన ఎంట్రీకి రంగం సిద్ధమైందని ప్లాన్ ప్రకారం వెళ్తాడు. ఇంతలో ఒళ్లంతా గాయాలతో రాహుల్ లోపలికి రావడంతో అంతా షాక్ అవుతారు.

ఏం జరిగిందని రాజ్ ప్రశ్నించగా.. నేను సమయానికి టెండర్ ఆఫీస్‌లో డబ్బు కట్టలేకపోయానని చెప్పి సూట్‌కేస్ తిరిగి ఇచ్చేస్తాడు. బ్యాంక్‌లో డబ్బు తీసుకుని వస్తుండగా దొంగలు నా మీద అటాక్ చేసి బ్యాగ్ లాక్కెళ్లారని చెబుతాడు రాహుల్. కానీ మేం నమ్మమని ధాన్యం అంటుంది. ఇంతలో సుభాష్ వచ్చి ఇదంతా నాటకం కాదని, రాహుల్ చెబుతున్నది నిజమేనని చెబుతాడు. రాహుల్ దగ్గర దొంగలు డబ్బు కొట్టేయడం, వాళ్లని రాహుల్ వెంబడించడం నేను చూశానని జరిగింది చెబుతాడు సుభాష్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X