Brahmamudi November 18th Episode: రాజ్ సంచలన నిర్ణయం.. రాహుల్‌కి కంపెనీలో కీలక బాధ్యతలు

Photo Courtesy: JioHotstar

రాహుల్ కొనిచ్చిన చీర మరీ నాసిరకంగా ఉందని స్వప్నపై అందరూ మండిపడతారు. ఇది విలువైనదా? విలువలేనిదా? అన్నది ముఖ్యం కాదు. రాహుల్‌కి నా మీద ఎంత ప్రేమ ఉందన్నదే ముఖ్యమని అంటుంది స్వప్న. ఇంతలో రాజ్ వచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకు టెండర్ ఉంది. ఆ టైంకల్లా బ్యాంక్‌లో 20 లక్షల రూపాయలు డ్రా చేసి టెండర్‌కి కట్టాలని చెప్పి పంపిస్తాడు. రాహుల్‌కి అలాంటి పనులు చెప్పొద్దని ఇంట్లో వాళ్లంతా రాజ్‌పై మండిపడగా.. కావ్య అందరికీ నచ్చజెబుతుంది.

రాహుల్ బ్యాంక్ నుంచి డబ్బును తీసుకుని వస్తుండగా నలుగురు దొంగలు అతని బ్యాగ్ కొట్టేసి పారిపోతారు. అయితే రాహుల్ వాళ్లని కష్టపడి పట్టుకుని డబ్బు సంపాదిస్తాడు. టెండర్‌కి టైం అవుతున్నా రాహుల్ రాకపోవడంతో రాజ్‌కి ఫోన్ చేసి చెబుతాడు ప్రకాశం. దాంతో రాహుల్‌ని అందరూ తిడతారు. ఇంతలో ఒంటి నిండా దెబ్బలతో, డబ్బుతో రాహుల్ ఇంటికొచ్చి జరిగినదంతా చెబుతాడు. కానీ దుగ్గిరాల ఫ్యామిలీ అతని మాటలు నమ్మదు. ఇంతలో సుభాష్ వచ్చి వాడు చెప్పేదంతా నిజమేనని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్ 881లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 18th 2025 Episode 881 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాహుల్ డబ్బుని కాపాడి సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చాడని చెబుతాడు సుభాష్. ఆ మాటలో మండిపడ్డ స్వప్న.. ఇంకా నా భర్త మీ కళ్లకి నేరస్తుడిలా కనిపిస్తున్నాడా? అని ప్రశ్నిస్తుంది. సుభాష్ అంకుల్ చెప్పింది కూడా నాటకమేనని అంటారా? అని నిలదీస్తుంది. 20 లక్షల రూపాయల డబ్బును డ్రా చేసి టెండర్ ఆఫీస్‌కి వెళ్లాల్సిన వాడు.. టైంకి రాకపోతే అనుమానించకుండా ఎలా ఉంటామని చెబుతుంది ధాన్యలక్ష్మీ. మారిన మనిషిని గుర్తించకుండా, అవతలి వాళ్లపై నిందలు వేయొద్దని సీరియస్ అవుతుంది స్వప్న.

నా కొడుకుని అవమానించాలి, వాడి మీద నిందలు వేయడం మాత్రమే వాళ్లకి తెలుసని రుద్రాణి కూడా ఫైర్ అవుతుంది. గతంలో తప్పులు చేసింది మాత్రమే కనిపిస్తోంది కానీ, ఇప్పుడు వారి వాడి ప్రాణాల్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం ఎవరికి కనిపించదని అంటుంది. మా తప్పులు వేలెత్తి చూడటమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతుంది రుద్రాణి. వాళ్లు నన్ను అవమానించడంలో తప్పు లేదని.. ఈ రోజు రాజ్ నాకు అవకాశం ఇవ్వడమే గొప్ప, కానీ నా దురదృష్టం వల్ల ఇలా జరిగిందని అంటాడు రాహుల్. ఒకవేళ నేను ఈ డబ్బుని ఇంటికి తీసుకురాపోయుంటే, ఆ దొంగలు నాకు దొరక్కపోయుంటే ఇంట్లో నా పరిస్ధితి ఏంటా? అని వణికిపోయానని చెబుతాడు. నా అదృష్టం బాగుండి డబ్బును తీసుకొచ్చానని అంటాడు రాహుల్.

నువ్వు డబ్బు తీసుకొచ్చినా కాంట్రాక్ట్ పోయిందిగా అని అపర్ణ నిలదీస్తుంది. ప్రాణాలకు తెగించి డబ్బును తీసుకురాగలిగాను కానీ, ఆ కాంట్రాక్ట్ పోవడానికి నేనే కారణం అయ్యానని చెబుతాడు రాహుల్. ఆ కాంట్రాక్ట్ మిస్ అవ్వలేదు మనకే వచ్చిందని చెబుతాడు రాజ్. ఆ మాటలతో అందరూ సంతోషిస్తారు. నేను ఏం చేసినా నా జాగ్రత్తలో నేనుంటాను... నా ప్లాన్ ఏ తో పాటు ప్లాన్ బీ కూడా ఉంటుందని చెబుతాడు రాజ్. కళావతి చెప్పిందని రాహుల్‌కి ఒక అవకాశం ఇచ్చాను.. రాహుల్ ఏదైనా తప్పు చేస్తే కాంట్రాక్ట్ మిస్ అవుతుంది, అది జరగకుండా ఉండటానికి బాబాయికి క్యాష్ అందే ఏర్పాటు చేశానని చెబుతాడు రాజ్. ఈ డబ్బు తెచ్చినా కాంట్రాక్ట్ రాలేదని ఎక్కడో గిల్టీగా ఉందని, నీ జాగ్రత్త వల్ల కాంట్రాక్ట్ మనకే వచ్చిందని థ్యాంక్స్ చెబుతాడు రాహుల్.

రాహుల్‌కి తగిలిన దెబ్బలకి మందురాస్తుంది స్వప్న. 20 లక్షల కోసం ప్రాణాలకు తెగించాలా? అని అడుగుతుంది. ఈ ఇంటి సొమ్ము 20 రూపాయలు అయినా నా చేతి నుంచి జారిపోకూడదని, అందుకు నా ప్రాణాల్ని కూడా లెక్కచేయను అంటుంది స్వప్న. నీకు ఏమైనా అయితే నేను, పాప ఏం కావాలి అని ప్రశ్నిస్తుంది. నా భర్త ప్రాణాలు ఇచ్చయినా డబ్బు కాపాడాడని గర్వంగా చెప్పుకునే దానివి అని అంటాడు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు.. నమ్మకం పోతే సంపాదించుకోలేం. రాజ్ నన్ను నమ్మాడు.. నేను ఆ డబ్బును వదిలేస్తే, నమ్మకాన్ని వదిలేసి వచ్చినట్లే కదా అని అంటాడు. నేను రెండు గంటలు కనిపించకపోయేసరికి నువ్వు కూడా భయపడ్డావా? లేదా? అని అడుగుతాడు రాహుల్.

ఎందుకంటే ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని, అందరి నమ్మకాన్ని కోల్పోయానని చెబుతాడు. నా లాంటి దరిద్రులకు కూడా అప్పుడప్పుడు అదృష్టం ఉంటుందని ఈరోజే తెలిసింది.. అందుకే దొంగలతో పోరాడి డబ్బు తీసుకురాగలిగేవాడిని అంటాడు రాహుల్. ఇకపై నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, నిన్ను నేను నమ్ముతున్నానని అంటుంది స్వప్న. కానీ నీ కోసం నిన్ను నమ్ముకుని నేను, పాప ఉన్నామని చెబుతుంది స్వప్న. నువ్వు నా వెనకాల దేవతగా నిలబడితే నాకేం కాదని అంటాడు రాహుల్.

రాహుల్ ప్రాణాలకు తెగించి డబ్బును కాపాడాడని వాడికి ఇంకో అవకాశం ఇవ్వాలని రాజ్‌తో చెబుతుంది కావ్య. రాహుల్ దురదృష్టం తనని వెక్కిరిస్తూనే ఉంది, మనమే అర్ధం చేసుకుని ఇంకో అవకాశం ఇవ్వాలని అంటుంది. వాడు అవకాశాన్ని వాడుకునే టైప్ కాదు.. దానితో ఆడుకునే టైప్ అంటాడు రాజ్. మంచో చెడో గతంలో తప్పులు చేసిన మనిషికి మరో అవకాశం ఇవ్వాలని చెబుతుంది కావ్య. రాహుల్‌కి ఒక బాధ్యత గల పని అప్పగించండి అని చెబుతుంది. మా అక్క కళ్లలో ఆనందం చూడాలంటే రాహుల్‌కి మరో అవకాశం ఇవ్వాలని అడుగుతుంది కావ్య. దాంతో రాజ్ నీకోసం ఒప్పుకుంటున్నానని అంటాడు.

20 లక్షల రూపాయల కోసం నీ ప్రాణాల్ని పణంగా పెడతావా? అని రాహుల్‌పై మండిపడుతుంది రుద్రాణి. దొంగతనం, దొంగలు అంతా నేను వేసిన ప్లాన్ అంటాడు రాహుల్. నన్ను ఆఫీస్‌కి పంపడానికి రాజ్, కావ్యలు ఆలోచిస్తున్నారు కదా ఇకపై అంతా నా చుట్టూనే తిరుగుతారని చెబుతాడు రాహుల్. ఇంట్లో నువ్వు గొడవ పెట్టు.. స్వప్నని నేను రెచ్చగొడతానని తన ప్లాన్ చెబుతాడు. భోజనం చేయడానికి రాహుల్ రాకపోవడంతో ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. నా కొడుకుని మీరంతా దొంగలా అవమానిస్తుంటే వాడొచ్చి మీతో ఎలా భోజనం చేస్తాడని నిలదీస్తుంది రుద్రాణి. సమయానికి రాజ్ అన్ని రకాలుగా ఆలోచించి డబ్బు పంపించి టెండర్ మనకి వచ్చేలా చేశాడని అంటాడు ప్రకాశం. రాహుల్‌ మారిపోయాడని తెలుస్తుంటే మీరొక అవకాశం ఇవ్వండని అంటుంది రుద్రాణి. దాంతో రాహుల్‌ని తీసుకురమ్మని స్వప్నకి చెబుతాడు రాజ్. నీ భార్య, పాప గురించి నీతో మాట్లాడతానని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X