Brahmamudi November 19th Episode: రాజ్‌ను రెచ్చగొట్టిన రుద్రాణి.. రాహుల్‌ ట్రాప్‌లో కావ్య, స్వప్న

Photo Courtesy: JioHotstar

నా భర్త ప్రాణాలకు తెగించి మరీ డబ్బును కాపాడాడని దొంగ కాదని మండిపడుతుంది స్వప్న. నా కొడుకును అవమానించాలి, నిందలు వేయాలని చూస్తారే గానీ వాడిలో వచ్చిన మార్పును గమనించడం లేదని రుద్రాణి నానామాటలు అంటుంది. నిన్న మొన్నటి వరకు నేను అలా ఉన్నాను కాబట్టే ఇంట్లో వాళ్లంతా నన్ను అనుమానిస్తున్నారని అంటాడు రాహుల్. ఈ డబ్బును నేను తీసుకురాకపోయుంటే.. ఇంట్లో నా పరిస్ధితి ఏంటీ? అని రాహుల్ బాధపడతాడు.

డబ్బు టైంకి తీసుకురాలేకపోవడంతో కాంట్రాక్ట్ పోయిందని రాహుల్ అంటాడు. కాంట్రాక్ట్ మనకే వచ్చిందని.. రాహుల్‌కి చెక్ ఇవ్వడంతో పాటు ప్లాన్ బీ వర్కవుట్ చేశానని రాజ్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ఇకపై నువ్వేం చేసినా నిన్ను నమ్ముకుని నేను, పాప ఉన్నామని అంటుంది స్వప్న. రాహుల్‌కి మరో ఛాన్స్ ఇవ్వాలని కావ్య బతిమలాడటంతో రాజ్ సరేనని అంటాడు. ఇంట్లో వాళ్లంతా ఈ దొంగతనంతో నన్ను నమ్మేశారని.. రాజ్‌ను కూడా నా దారికి తెచ్చుకుని కంపెనీని దక్కించుకుంటానని తన ప్లాన్‌ని రుద్రాణికి చెబుతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 19వ తేదీ ఎపిసోడ్ 882లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 19th 2025 Episode 882 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇకపై నువ్వు తలదించుకునే పరిస్ధితి రాదని రాహుల్‌తో అంటాడు రాజ్. ఆ తర్వాత కావ్య వెళ్లి ఓ లెటర్ తీసుకొచ్చి రాహుల్‌కి ఇస్తుంది. నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్లాలి, నేను ఆఫీసుకు రావడానికి టైం పడుతుంది.. అప్పటి వరకు కంపెనీ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలని అంటాడు రాజ్. అది చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కంపెనీ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను, రేపే వెళ్లి జాయిన్ అవ్వాలని చెబుతాడు రాజ్. నాకు ఇంత పెద్ద బాధ్యతలు వద్దు... 20 లక్షల రూపాయల బాధ్యతలు అప్పగిస్తేనే ఫెయిల్ అయినవాడిని, ఇప్పుడు అంత పెద్ద బాధ్యత నాపైన పెడితే ఎలా అని ప్రశ్నిస్తాడు రాహుల్. ఇంట్లోవాళ్లకి ఇష్టం లేకుండా నేను ఆఫీస్‌కి వెళ్లలేనని అంటాడు.

20 లక్షల రూపాయల విషయంలో నువ్వు ఫెయిల్ కాలేదని, నీ నిజాయితీని నిరూపించుకున్నావని చెబుతుంది కావ్య. నీకు ఇంకో అవకాశం ఇవ్వాలని కళావతి చెప్పింది.. నాకు నీమీద కంటే కావ్య మీదే నమ్మకం ఎక్కువని నీకు తెలుసు.. మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని నమ్ముతున్నానని అంటాడు రాజ్. ఇదే మీరు నాకు ఇచ్చే చివరి అవకాశం.. రాత్రింబవళ్లు కష్టపడతానని థ్యాంక్స్ చెబుతాడు రాహుల్. తప్పు చేసినప్పుడు తప్పు అని ఎలా నిలదీస్తామో... నీ కొడుకు భవిష్యత్ కోసం రాజ్ చేసిన పని సరైంది కాబట్టే అందరం సపోర్ట్ చేశామని రుద్రాణితో అంటుంది ధాన్యం. ఇదంతా రాజ్ ఆలోచన .. ఏదో నువ్వే చేసినట్లుగా మాట్లాడొద్దని అంటుంది రుద్రాణి. ఈ కుటుంబంలో అందరం ఒకటేనని నువ్వు అర్ధం చేసుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తాడు రాహుల్.

రాజ్ నిన్ను నమ్మి.. ఇంత త్వరగా కంపెనీ బాధ్యతలు అప్పగిస్తాడని అస్సలు అనుకోలేదని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఇప్పుడు కూడా రాహుల్ నన్ను పూర్తిగా నమ్మలేదు.. స్వప్న కోసమే కావ్య ఇదంతా చేసింది అంటాడు రాహుల్. నాలుగు కన్నీటి బోట్లు రాలిస్తే కరిగిపోయిందా? అని ప్రశిస్తుంది రుద్రాణి. మన శత్రువు అయినా సరే కావ్య గొప్పదనాన్ని మెచ్చుకోవాల్సిందేనని అంటాడు రాహుల్. ఇన్ని మోసాలు చేసినా మళ్లీ అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం రిస్క్ తీసుకుంది చూడు.. నిజంగా తను గ్రేట్ అని చెబుతాడు. రేపే కంపెనీ బాధ్యతల్ని తీసుకుని, రాజ్ స్థానంలో కూర్చొంటానని అంటాడు రాహుల్.

రాజ్ స్థానంలో కూర్చోవడమే కాదు.. రాజ్‌లా మారిపోవాలి, 6 నెలల వరకు రాజ్ ఆఫీస్‌కు రాడు, నిన్ను ఎలాగైతే ఆఫీస్ నుంచి గెంటేశారో రాజ్, కావ్యలను కూడా గెంటేయాలని చెబుతుంది రుద్రాణి. ఇన్నేళ్లు వాళ్లు మనల్ని కాళ్ల దగ్గర ఎలా పడేసుకున్నారో, వాళ్లని కూడా నువ్వు అలాగే కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకోవాలని చెబుతుంది. నేను గతంలో రాజ్‌ని కాదు, స్వరాజ్ కంపెనీ మొత్తాన్ని నా చేతుల్లోకి తెచ్చుకుంటాను, నన్ను ఎవరూ టచ్ చేయని రేంజ్‌కి వెళ్తానని అంటాడు రాహుల్. అప్పుడు నేను ఈ నట్టింట్లో కూర్చొని వీళ్లని నా బానిసల్ని చేసుకుంటానని అంటుంది రుద్రాణి.

కావ్యతో రాజ్ రొమాన్స్ చేస్తుండగా.. నా బకెట్ లిస్ట్‌లో ఉన్న మరో కోరికను తీర్చాలని చెబుతుంది కావ్య. ఎల్లుండి అత్తయ్య, మావయ్యల పెళ్లి రోజు.. అది వాళ్లకి 30వ పెళ్లి రోజు దీనిని మనం గ్రాండ్‌గా బుక్ చేయాలని చెబుతుంది కావ్య. గ్రాండ్‌గా అంటే ఏదైనా రిసార్ట్ బుక్ చేయనా? అని అడుగుతాడు రాజ్. మీ అందరి సమక్షంలో ఇంట్లోనే చేద్దాం.. ఇన్నిరోజులు నా వల్ల మీరంతా బాధపడ్డారని, అందుకే అత్తయ్య- మావయ్యల పెళ్లి రోజుల్ని సెలబ్రేట్ చేసి వాళ్లని సంతోషపెట్టాలని అంటుంది కావ్య. దానికి రాజ్ కూడా భార్యను మెచ్చుకుంటాడు.

ఉదయాన్నే రాహుల్ ఆఫీసుకు వస్తుండగా చూసి శృతి షాక్ అవుతుంది. రాజ్ సార్ ప్లేస్‌లో రాహుల్ వచ్చాడని తెలుసుకున్న శృతి టెన్షన్ పడుతుంది. నేను మళ్లీ ఆఫీసులోకి రాను అని ఫిక్స్ అయ్యావా? అని అడుగుతాడు రాహుల్. పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకుని క్యాబిన్‌లోకి రమ్మని శృతికి చెబుతాడు. దుగ్గిరాల కుటుంబానికి ఓ కుర్రాడు కొత్త బట్టలు తీసుకుని వస్తాడు. ఈ బట్టలు ఎవరు ఆర్డర్ పెట్టారు అని సుభాష్ అందరినీ అడగుతాడు. ఇంతలో రాజ్ వచ్చి నేనే ఆర్డర్ పెట్టానని చెబుతాడు. ఆర్డర్ పెట్టుకోవడం దేనికి, హాయిగా షాపింగ్ చేయొచ్చు కదా అని అంటుంది అపర్ణ. అంత టైం లేదని, రేపే పండగ అని చెబుతుంది కావ్య. అన్ని పండగలు అయిపోయాయి కదా అని ధాన్యం చెప్పగా.. మా అమ్మానాన్నల పెళ్లి రోజును మించిన పండగ ఏముంటుందని ప్రశ్నిస్తాడు రాజ్. ఆ బట్టలు మీకోసమే తీసుకున్నామని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు.

రేపు అమ్మానాన్నల పెళ్లి రోజును గుర్తుపెట్టుకుంది, బట్టలను ఆర్డర్ పెట్టింది కూడా కళావతేనని చెబుతాడు రాజ్. మీ పెళ్లి సందర్భంగా మరిచిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? అని కావ్య అడగటంతో అలాంటివేమీ లేవని చెబుతుంది అపర్ణ. మీ అత్తయ్య చాలా విషయాలు దాచిందని అంటుంది రుద్రాణి. ఆ రోజుల్లో పెళ్లిచూపులేం లేవని.. పెద్దలు చెప్పినట్లు జరిగిపోయిందని అంటుంది అపర్ణ. మీ అమ్మవాళ్ల నాన్న, మా నాన్న మాట్లాడుకున్నారు.. మా నాన్న ఇంటికొచ్చి పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. తర్వాత పెళ్లి పీటల మీదే మీ అమ్మని చూశామని చెబుతాడు సుభాష్. నేనైతే మీ మావయ్యని పెళ్లి పీటల మీద కూడా సరిగా చూడలేదని అంటుంది అపర్ణ. అయితే అత్తయ్యకి, మావయ్యకి మళ్లీ పెళ్లిచూపులు పెట్టిస్తామని కావ్య చెప్పడంతో అంతా ఓకే చెబుతారు. దాంతో అపర్ణ, సుభాష్‌లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X