Brahmamudi November 20th Episode: కంపెనీపై రాహుల్ కన్ను.. భర్త ట్రాప్‌లో స్వప్న, రాజ్‌కి పొంచివున్న ప్రమాదం
Photo Courtesy: JioHotstar
భోజనాల దగ్గరికి రాహుల్‌ని పిలిపించిన రాజ్.. కావ్య కోసం నీకు మరో అవకాశాన్ని ఇస్తున్నానని చెప్పి కవర్ చేతిలో పెడతాడు. నేను కొద్దిరోజులు ఆఫీస్‌కి రానని.. నువ్వే అన్ని బాధ్యతలు చూసుకోమని చెబుతాడు రాజ్. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంటాడు రాహుల్. మొత్తానికి అనుకున్నది సాధించావని రాహుల్‌ని మెచ్చుకుంటుంది రుద్రాణి. ఇన్నాళ్లు మనల్ని బానిసల్లా చూసినవారికి మనం కూడా అదే తిరిగి ఇవ్వాలని చెబుతుంది.
ఆరు నెలలు రాజ్ సీట్‌లో ఉండటం కాదు.. పర్మినెంట్‌గా దుగ్గిరాల కంపెనీని నా చేతుల్లోకి తీసుకుంటానని అంటాడు రాహుల్. ఉదయాన్నే ఆఫీసుకొచ్చిన రాహుల్‌ని చూసి శృతి షాక్ అవుతుంది. నేను తిరిగొస్తానని ఊహించలేదు కదా.. పెండింగ్ ఫైల్స్ తీసుకుని రమ్మని శృతితో అంటాడు రాహుల్. మరోవైపు.. అపర్ణ- సుభాష్‌ల పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరికీ కొత్తబట్టలు ఆర్డర్ చేసి సర్‌ప్రైజ్ చేస్తుంది కావ్య. మీ ఇద్దరికీ పెళ్లిచూపులు జరగలేదు కాబట్టి.. మేం మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 20వ తేదీ ఎపిసోడ్ 883లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కంపెనీలో అన్ని ఫైల్స్ తీసుకొచ్చి రాహుల్ ముందు పెడుతుంది శృతి. వీటన్నింటిని రాజ్ సార్ చెక్ చేశారని.. మీరు సంతకం చేస్తే చాలని శృతి చెప్పడంతో రాహుల్ రగిలిపోతాడు. అంటే నేను ఏ ఫైల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదన్నమాట అనడంతో నేను అదే చెబుతున్నానని అంటుంది. రాహుల్ సంతకం చేస్తుండగా శృతి నవ్వడంతో రాహుల్‌కి కోపం వస్తుంది. ఆ తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్లి నేను డిజైన్స్‌లో కొన్ని మార్పులు చెప్పాను కదా ఏమైంది అని అడుగుతాడు. మీరు కరెక్షన్స్ చెప్పకముందే.. కావ్య మేడం డిజైన్లు చూసి అలాగే ఉంచేయమన్నారని చెబుతాడు మేనేజర్. మేడం ఓకే చెప్పారు.. క్షయింట్స్‌కి కావ్య మేడం ఓకే చేసిన డిజైన్స్ బాగా నచ్చాయి, తయారీకి కూడా వెళ్లిపోయాయని చెబుతాడు.
అంటే నేను డిజైన్స్ చూడనక్కర్లేదు, నేనే ఏ కరెక్షన్స్ చెప్పనక్కర్లేదు, కావేరి మేడం ఫైనల్ చేస్తే చాలా అని ప్రశ్నిస్తాడు రాహుల్. మీరు చూడాల్సిన అవసరం అంతగా లేదు.. కావ్య మేడం చూసుకుంటానని చెప్పారని అంటాడు మేనేజర్. ఆ మాటలతో మండిపడిన రాహుల్... ఇంట్లో వాళ్ల అందరిముందు నాకు పెద్ద పోస్ట్ ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. పవర్స్ అన్నీ వాళ్లకి, పనికిరాని కుర్చీ నాకు అంటూ రగిలిపోతాడు. ఇలాగే ఉంటే నేను ఆఫీసులో ఉన్నా, రోడ్డు మీదున్నా తేడాయే లేదు.. దీనికి అర్జెంట్‌గా ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకుంటాడు రాహుల్. పవర్స్ అన్ని ఎలాగైనా నా చేతుల్లోకి తీసుకురావాలని అనుకుంటాడు. స్వప్న నుంచి నరుక్కుని రావాలి, అప్పుడే దీనికి సొల్యూషన్ దొరుకుతుందని ప్లాన్ చేస్తాడు రాహుల్.
వెంటనే స్వప్నకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఆఫీసులో అన్నింటి మీదా ఒక అవగాహన తెచ్చుకుంటున్నానని చెబుతాడు రాహుల్. ముందు పనిమీద దృష్టి పెడితే వర్క్ బాగా వస్తుందని అంటుంది స్వప్న. నీ కోసం, మన పాప కోసం రాత్రిపగలూ కష్టపడతానని నువ్వు భోజనం చేశావా? అని అడుగుతాడు రాహుల్. నేను ఆఫీసు ఫుడ్ తినను, ఆర్డర్ పెట్టుకోవడం కూడా ఉండదని చెబుతాడు. ఈవినింగ్ ఇంటికొచ్చాక తింటానని చెప్పడంతో నేనే క్యారియర్ తీసుకొని వస్తానని చెబుతుంది స్వప్న. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు రాహుల్ సంతోషిస్తాడు. నువ్వు ఆఫీసుకు రావాలి? ఇక్కడేం జరుగుతుందో నీ కళ్లకు కట్టినట్లు చూపించాలి? అప్పుడే నువ్వు ఇంట్లో ఎలా మంట పెడతావో నీ ఇష్టం అనుకుంటాడు రాహుల్.
అపర్ణ- సుభాష్‌ల పెళ్లి రోజు కావడంతో వాళ్లిద్దరికీ పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది దుగ్గిరాల కుటుంబం. దాంతో ఆటపాటలతో ఇంట్లో అంతా సందడి నెలకొంటుంది. రాహుల్ కోసం క్యారియర్ తీసుకొచ్చి వడ్డిస్తుంది స్వప్న. మళ్లీ నాకు ఇలాంటి అదృష్టం వస్తుందని నేను అనుకోలేదని చెబుతాడు రాహుల్. నేను ఉన్నదే నీకోసం.. నువ్వు ఆకలితో ఉంటే చూస్తూ ఉండిపోతానా? అని అంటుంది స్వప్న. ఫోన్‌లో ఎందుకు బాధగా మాట్లాడావని అడుగుతాడు రాహుల్. అది బాధ కాదు, సంతోషమని చెబుతుంది స్వప్న. నువ్వు నన్ను భోజనం చేశావా అని అడిగి చాలాకాలం అయ్యిందని, ఆ మాట వినగానే ఆనందం వేసిందని చెబుతుంది స్వప్న.
ఇన్ని రోజులు నువ్వు మారాలని, మారతావని ఎదురుచూశాను.. ఇన్నిరోజులకు నా కల నెరవేరిందని అంటుంది స్వప్న. ఇన్నాళ్లూ నన్ను అవమానిస్తుంటే నాలో నేనే కుమిలిపోయా, ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నా బాధంతా పోయిందని అంటుంది స్వప్న. శృతి ఫైల్ తీసుకుని రాహుల్ సంతకం కోసం వస్తుంది. భోజనం చేస్తున్నారు కదా తర్వాత వస్తానని శృతి వెళ్లిపోతుండగా.. రాహుల్ ఆమెను ఆపి విషయమం చెప్పమంటాడు. మీ సంతకం కావాలని అడగ్గా.. ఈ ఫైల్ కూడా నేను చూడక్కర్లేదా? అని అడుగుతాడు. చెప్పాను కదా సార్ మీరూ ఏ ఫైల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదని శృతి చెబుతుంది. నేను ఈ కంపెనీకి ఓనర్‌ని కాకపోవచ్చు కానీ, రాజ్ నాకంటూ ఓ మంచి పొజిషన్ ఇచ్చాడు.. అలాంటిది ఫైల్ ఏంటో చూడకుండా, చదవకుండా సంతకం పెడితే ఎలా? అని అడుగుతాడు రాహుల్.
అన్ని ఫైల్స్ రాజ్ సార్ చెక్ చేశారు, అప్రూవల్ ఇచ్చేశారు.. మీరు సంతకం చేస్తే చాలని శృతి చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. అది మంచిది కాదని, రేపు ఏదైనా పొరపాటు జరిగితే రాజ్‌కి, కావ్యకి నేనేం సమాధానం చెప్పాలని అడుగుతాడు రాహుల్. ఆఫీసుకి వచ్చారు హాయిగా టైంపాస్ చేసి మేం పెట్టమన్న చోట సంతకం పెడితే చాలని అంటుంది శృతి. దాంతో మండిపడ్డ స్వప్న.. ఈ కంపెనీ బాధ్యతలు రాహుల్‌కి అప్పగించారు, అలాంటప్పుడు నిర్ణయాలు కూడా రాహులే తీసుకోవాలని అంటుంది స్వప్న. మేం మామూలు ఉద్యోగులం మాత్రమే... రాజ్ సార్ ఇంట్లో నుంచే ఫైల్స్ చెక్ చేసి డెసిషన్స్ తీసుకుంటున్నారని చెబుతుంది శృతి.
నేను కొత్తవాడిని కదా? ఏదైనా పొరపాటు జరగొచ్చని అన్ని పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని నన్ను జస్ట్ సీటులో కూర్చొబెట్టారని అంటాడు రాహుల్. ఇవన్నీ ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఈ సంతకం కోసమే అయితే నువ్వు ఆఫీసుకు రావడం ఎందుకు? అని నిలదీస్తుంది స్వప్న. రాజ్, కావ్య ఏం చేసినా మన మంచికే కదా అని అంటాడు రాహుల్. ఇలా అయితే ఆఫీసులో నీకు గౌరవం ఏం ఉంటుందని నిలదీస్తుంది స్వప్న. ఇలా అయితే నిన్ను నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావని ప్రశ్నిస్తుంది స్వప్న. ఇంతలో మేనేజర్ రాగా.. డిజైన్‌లో మార్పుల సంగతి ఏమైందని కావాలని అడుగుతాడు రాహుల్. అవన్నీ కావ్య మేడం ఓకే చేశారని.. మీరు లాస్ట్‌లో ఒక సైన్ చేస్తే చాలని మేనేజర్ చెప్పడంతో స్వప్న రగిలిపోతుంది.
ఆఫీసులో వాళ్లు నీకు కుర్చీ ఇస్తే గొప్ప కాదు.. నీ మాటకి, నిర్ణయాలకి విలువ ఇచ్చినట్లు అని చెబుతుంది స్వప్న. ఇలా కాదు.. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటానని కోపంగా ఇంటికి వెళ్తుంది స్వప్న. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రాహుల్ సంతోషిస్తాడు. ఇంట్లో సుభాష్ - అపర్ణలకి పెళ్లిచూపులు ఏర్పాటు చేసి సంతోషంగా గడుపుతుంది దుగ్గిరాల కుటుంబం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











