Brahmamudi November 21st Episode: కావ్యపై విరుచుకుపడిన స్వప్న.. రాజ్ మనసు ముక్కలు

Photo Courtesy: JioHotstar

కంపెనీలో అడుగుపెట్టిన రాహుల్‌కి ఫైల్స్ చూసే అవకాశం లేకుండా కేవలం సంతకాలు పెట్టే అధికారం మాత్రమే ఉందని శృతి చెప్పడంతో షాక్ తగులుతుంది. ఆ వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్‌‌లో కొన్ని మార్పులు చెప్పాను కదా? వాటిని మార్చారా? లేదా అని అడుగుతాడు. కావ్య మేడం వాటికి అప్రూవల్ ఇచ్చేశారని, తయారీకి కూడా వెళ్లిపోయాయని మేనేజర్ చెప్పడంతో రాహుల్‌కి అహం దెబ్బ తింటుంది. పవర్స్ లేకుండా కుర్చీ నాకెందుకు? ఎలాగైనా పవర్స్ దక్కించుకోవాలని స్వప్నని అడ్డుపెట్టుకుని ఓ కుట్ర చేస్తాడు.

స్వప్నకి ఫోన్ చేసి భోజనాన్ని ఆఫీసుకి తెచ్చేలా చేస్తాడు. స్వప్న ముందే శృతి, మేనేజర్‌లు తనను అవమానించేలా ప్లాన్ చేస్తాడు రాహుల్. దాంతో నీక పదవి ఇచ్చినట్లే ఇచ్చి పవర్స్ లేకుండా చేశారు.. అప్పుడు నువ్వు ఎలా నిరూపించుకుంటావని అడుగుతుంది. వాళ్లు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారని దీంతో సరిపెట్టుకుంటానని నటిస్తాడు. ఇక్కడ కాదు ఇంటి దగ్గర ఎవరితో తేల్చుకోవాలో వాళ్లతో తేల్చుకుంటానని కోపంగా వెళ్తుంది స్వప్న. ఇంటి దగ్గర సుభాష్ - అపర్ణలకు పెళ్లి చూపులు జరిపిస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 21వ తేదీ ఎపిసోడ్ 884లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 21st 2025 Episode 884 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అపర్ణ- సుభాష్‌ల పెళ్లి చూపుల సందర్భంగా అపర్ణని రుద్రాణి ఆడుకుంటుంది. అటుఇటు నడువు, పాట పాడు అని ఏడిపిస్తుంది. అన్ని మా అమ్మాయి గురించేనా, మీ అబ్బాయి గురించి కూడా మేం తెలుసుకోవాలని అనుకుంటున్నామని ధాన్యం అంటుంది. దాంతో సుభాష్ గురించి రాజ్, ప్రకాశంలు ఎలివేషన్స్ ఇస్తారు. అబ్బాయి పేషెంట్ అయినా, డీసెంట్‌గా ఉన్నాడు నాకు నచ్చాడని అంటుంది అపర్ణ. ఆ మాటలతో సుభాష్ మెలికలు తిరుగుతాడు. నేను అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడతానని అంటాడు సుభాష్. అది మాత్రం నిషిద్ధం.. పెళ్లి కాకుండా అమ్మాయితో అబ్బాయి మాట్లాడటం మన ఇంట వంటా లేదని చెబుతాడు సీతారామయ్య.

మరి పెళ్లిచూపుల్లో అబ్బాయిని ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడగటం మీ ఇంటా వంటా ఉందా అని ప్రశ్నిస్తాడు రాజ్. మీరు కూడా మా అమ్మాయిని ఆడమని, పాడమని, నడవమని కూర్చొమని అడిగారు కదా అని అంటుంది ధాన్యం. అది మన సాంప్రదాయం.. దానిని ఫాలో అవ్వాల్సిందేనని చెబుతాడు సీతారామయ్య. ఆ రోజు నుంచి ఈరోజు దాకా అసలు పెళ్లిచూపుల్లో అమ్మాయినే ఎందుకు ప్రశ్నలు అడుగుతుంటారు? అని ప్రశ్నిస్తుంది కావ్య. అందులో ఏం లేదని.. దాని వెనుక ఉన్న మంచిని ఎవరూ గుర్తించలేకపోతున్నారని అంటుంది ఇందిర. ఒకప్పుడు పెళ్లిచూపులు అమ్మాయి ఇంట్లోనే ఏర్పాటు చేసేవారని.. ఇప్పుడు హోటల్, పార్కులు, ఏ బస్టాప్‌లో కలిసి మాట్లాడుకుంటున్నారో ఎవ్వరికీ తెలియడం లేదని చెబుతారు.

అమ్మాయిని చూసుకోవడానికి పూర్వం అబ్బాయి తరపు నుంచి ఓ పదిమంది వచ్చేవారని.. ఇరువైపులా బంధాలు బలంగా ఉండటానికే ఇలా చేసేవారని అంటుంది ఇందిర. ఆరోజంతా అమ్మాయి ఇంట్లోనే ఉండి వాళ్ల అలవాట్లు, గుణగణాలు, ఆర్ధిక పరిస్ధితులు, మానసిక స్థితిగతుల్ని కూడా అంచనా వేసేవారని చెబుతుంది. తమ కుటుంబానికి ఈ కుటుంబం అన్ని రకాలుగా సరిపోతుందని అనుకుంటేనే తాంబూళాల దాకా వెళ్లేవారని అంటుంది. ఒక పెళ్లి రెండు కుటుంబాలను నడిపించే సారథి అని చెబుతుంది. దాంతో చాలా బాగా చెప్పావని ఇందిరను అంతా చప్పట్లతో మెచ్చుకుంటారు. ఇంతలో స్వప్న కోపంగా ఇంటికొస్తుంది.

నా భర్తకు మీరు జీతమిచ్చే యజమానులే, కానీ తిండిపెట్టి ఆకలి తీర్చేవాళ్లు కాదు కదా అని రగిలిపోతుంది. ఏం జరిగిందని రాజ్, కావ్యలు ఆమెను అడుగుతారు. మీరిద్దరూ మారిపోయారని... అందరిముందు అందళం ఎక్కించి, చాటుగా పాతాళానికి తొక్కేవాళ్లని మిమ్మల్నే చూస్తున్నారని అంటుంది. ఆదరించేచోట నిన్నెవరైనా చీదరించుకుంటుంటే నీ భార్య ఒప్పుకుంటుందా? అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది స్వప్న. ఇప్పుడు నా భర్త కూడా ఆఫీసులో అదే పరిస్థితిలో ఉన్నాడని అంటుంది. చెప్పాల్సింది చేయాల్సిన కిందస్థాయి ఉద్యోగులు నా భర్త మాటను పట్టించుకోవడం లేదని చెబుతుంది స్వప్న. ఆర్డర్ వేస్తే చేతులు కట్టుకుని నిలబడాల్సిన వాళ్లు నా భర్తకు గౌరవం ఇవ్వడం లేదని అంటుంది.

గౌరవ మర్యాదలు అడుక్కుంటే రావు.. క్యారెక్టర్‌ని బట్టి వస్తాయని మండిపడతాడు ప్రకాశం. అతను మారాడంటే మీరెవ్వరూ నమ్మరు.. కానీ అవకాశం ఇచ్చి లాగేసుకోవడం మాత్రం అందరికీ తేలికేనని అంటుంది స్వప్న. రాహుల్ మారాడని నేను నమ్మాను కాబట్టే అవకాశం ఇచ్చానని చెబుతాడు రాజ్. అధికారం ఇచ్చారు, అనామకుడిని చేశారు.. మీరు రాహుల్‌కు ఇచ్చిన పోస్ట్ దాని పవర్ ఎంత గొప్పదంటే.. రాహుల్ ఎవ్వరికీ సలహాలు ఇవ్వకూడదట... కానీ సంతకం పెడితే మాత్రం చాలట అంటుంది స్వప్న. రాహుల్ పనివాళ్లని పనిచేయమని చెప్పకూడదట, జస్ట్ ఫ్యాన్ కింద కూర్చొంటే చాలట అంటుంది. ఇదేనా రాహుల్‌కి ఇచ్చిన అధికారం అని నిలదీస్తుంది స్వప్న. ఇంట్లో నుంచే మీ భార్యాభర్తలిద్దరూ ఆఫీసును నడిపిస్తుంటే.. నా భర్తను ఎందుకు ఆఫీసుకు పంపించారని నిలదీస్తుంది.

నిన్ను, నీ భర్తని ఉద్ధరించామని కలరింగ్ ఇవ్వడానికే ఇలా చేశారని.. ఏ రోజు మమ్మల్ని గౌరవించారు, ఏ రోజు నా కొడుకుని మనిషిలా చూశారని నిలదీస్తుంది రుద్రాణి. రాహుల్‌ని రబ్బర్ స్టాంప్‌లా మార్చారని మండిపడుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్‌ని కానీ, కావ్యని కానీ ఇంకో మాట అంటే తల్లివని కూడా చూడను అని మండిపడతాడు. రాజ్ నన్ను నమ్మడం ఎక్కువ? దీనికి వాళ్లకు జీవితాంతం రుణపడాలి, నేను పనిచేస్తున్న కంపెనీ పరాయి వాళ్లది కాదని అంటాడు రాహుల్. అలాంటి చోట గౌరవాలు, అవమానాలు ఉంటాయని చెబుతాడు. రాజ్, కావ్యల మనసు గురించి ఆలోచించాలని.. ఇన్నాళ్లు నన్ను భరించిన దానివి ఇప్పుడు సహించలేకపోతున్నావా అని మండిపడతాడు. మా అమ్మ తప్పుగా ఆలోచించొచ్చు, కానీ కలలో కూడా వాళ్లిద్దరినీ తప్పు పట్టొద్దని అంటాడు.

ఆవేశం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో తెలుసా అని స్వప్నకి నచ్చచెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తాడు. నాది తొందరపాటు కాదు.. లోలోపల దాచుకున్న ఆవేదన అంటుంది. అందుకే అడిగాను, నిలదీశానని అంటాడు. ఇప్పుడిప్పుడే కదా ఇంట్లో వాళ్లు నమ్ముతున్నారని... నువ్వు ఇలాగే చేస్తే నా పరిస్ధితి దిగజారిపోతుందని చెబుతాడు రాహుల్. నేను ప్లేట్లు కడగగలను, డ్రైవర్‌గానూ పనిచేయగలను, కానీ నేను ఆఫీసుకే ఎందుకు వెళ్లానో తెలుసా? నువ్వు చెప్పావని అంటాడు రాహుల్. మన గౌరవ మర్యాదలు ఎక్కడపోయాయో అక్కడే వెతుక్కోవాలని చెబుతాడు. నేను మారానని రాజ్, కావ్యలు ఇంకా అనుకోలేదేమోనని అంటాడు. కావ్యకు అందరూ విలువిస్తారు, దాని మాటే శాసనం... అప్పూకి కూడా అందరూ మర్యాద ఇస్తారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి జాలి చూపిస్తారని బాధపడుతుంది స్వప్న. దానికి కారణం నేనే.. తప్పంతా నాదే, నావల్ల పోయిన మర్యాద కూడా నేనే తిరిగి సంపాదిస్తానని అంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X