Brahmamudi November 22nd Episode: రాహుల్ కోసం స్వప్న దొంగతనం.. రాజ్, కావ్యలకి ముంచుకొస్తున్న గండం
Photo Courtesy: JioHotstar
సుభాష్ - అపర్ణల పెళ్లి రోజు కావడంతో వారిద్దరికీ పెళ్లి చూపులు నిర్వహించి దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. అసలు ఆడపిల్ల ఇంటి వద్దే ఎందుకు పెళ్లి చూపులు జరుగుతాయని కావ్య అడగ్గా.. దాని వెనుకున్న సాంప్రదాయాన్ని వివరిస్తుంది ఇందిర. ఇంతలో స్వప్న కోపం వచ్చి రాజ్- కావ్యలను నానామాటలు అంటుంది. నన్ను, నా భర్తను ఉద్దరిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం ఏంటీ? ఆఫీసులో నా భర్తకు ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదని మండిపడుతుంది. మీరిద్దరే ఇంటి దగ్గరి నుంచి చక్రం తిప్పుతూ.. రాహుల్‌ని ఒక రబ్బరు స్టాంప్ చేశారని ఫైర్ అవుతుంది.
నేను, నా బిడ్డ అంటే ఈ ఇంట్లో అందరికీ లోకువే.. వాడు మారానని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రుద్రాణి కూడా రగిలిపోతుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్- కావ్యలను ఒక్క మాట అన్నా తల్లివని కూడా చూడనని మండిపడతాడు. రాజ్- కావ్యలు నన్ను నమ్మడమే ఎక్కువే.. వాళ్లు నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని అంటాడు. ఆ మాటలతో స్వప్న ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 22వ తేదీ ఎపిసోడ్ 885లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇప్పటి వరకు నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని ఎవరి మీదో రాజ్ అరుస్తుంటాడు. మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి అసలు సంబంధం లేకుండా డిజైన్లు కొత్తగా ఉండాలని అన్నారని.. ఆఫీస్ వాతావరణం కూడా కొత్తగా ఉండాలని అంటున్నారు, అందుకే కొంచెం టైం పడుతుందని అవతి వ్యక్తి రాజ్‌కి చెబుతాడు. మీకు కావాల్సినంత టైం ఇచ్చానని.. కానీ ఇంకా టైం కావాలంటే ఎలా అని రాజ్ నిలదీస్తాడు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి, ఈ కంపెనీకి అస్సలు సంబంధం ఉందని అనుకోకూడదని అంటాడు రాజ్. మీరు అడిగినట్లుగానే రెండు వారాలు టైం ఇస్తున్నాను, కానీ ఈ ఆర్ ఫ్యాక్టరీకి సంబంధించిన లుక్ మాత్రం కొత్తగా ఉండాలని చెబుతాడు రాజ్. ఇదంతా విన్న కావ్య.. కొత్త కంపెనీ మేనేజరా అని అడుగుతుంది.
నాకెందుకు భయంగా ఉంది, తాతయ్య గారు ఎంతో కష్టపడి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సామ్రాజ్యాన్ని సృష్టించారని అంటుంది. అందరూ అదే కంపెనీలో పనిచేశారు, కానీ మీరు దానికి సంబంధం లేకుండా ఒక కొత్త కంపెనీని పెట్టడానికి ట్రై చేస్తున్నారని.. ఈ విషయం తెలిస్తే తాతయ్యగారు బాధపడతారని చెబుతుంది కావ్య. నేను, కానీ నువ్వు కానీ ఈ విషయం చెబితేనే తాతయ్య గారికి తెలుస్తుందని, దీని వల్ల ఎవరికీ నష్టం లేదని అంటాడు రాజ్. కొత్త కంపెనీ వల్ల ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని భయపడుతుంది కావ్య. కంపెనీ పూర్తిగా సెట్ అయ్యే వరకు ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం తెలియడానికి వీల్లేదని చెబుతాడు రాజ్. రాహుల్‌కి కంపెనీలో ఏదైనా ఫ్రీడం ఇద్దామా? అని కావ్య అడగ్గా.. అప్పుడే వద్దు, అతనికి పూర్తిగా తెలిసేంత వరకు పవర్స్ ఇవ్వొద్దని అంటాడు రాజ్. స్వప్న తన భర్తకి గౌరవం కురుకుంటోంది, కానీ రెస్పెక్ట్ కావాలంటే ముందు మనలో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెబుతాడు రాజ్.
ఆఫీసులో శృతిని తన కేబిన్‌లోకి పిలుస్తాడు రాహుల్. ఉదయం నేను మేనేజర్‌కి ఓ ఫైల్ ఇచ్చాను.. దానిని తీసుకురమ్మని ఆర్డర్స్ వేస్తాడు. దాని గురించి మీకు అనవసరమని శృతి అనగా.. ఆ ఫైల్ నేనే తీసుకుంటానని చెబుతాడు రాహుల్. మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి.. ఫైల్ చూసిన రాహుల్‌కి ఆర్ కంపెనీ గురించి తెలుస్తుంది. కొత్త కంపెనీ పెడుతున్న దాని గురించి రాజ్ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని ఆలోచిస్తాడు. వెంటనే శృతి దగ్గరికి వెళ్లి.. దీని గురించి అడగ్గా ఆ విషయం నాకు అనవసరమని రాజ్ సార్ చెప్పారని కౌంటర్ ఇస్తుంది. ఈ కొత్త కంపెనీ గురించి.. ఇంత పెద్ద మొత్తంలో గోల్డ్, క్యాష్ తరలింపు గురించి ఇంట్లో వాళ్లకి తెలుసా? అని ఆలోచిస్తాడు రాహుల్. ఎవ్వరికీ తెలియకుండా రాజ్, కావ్యలు ఏదో చేస్తున్నారని అనుకుంటాడు. ఇంతలో మేనేజర్‌ని పిలిచి ఈ ఆర్ అనే కొత్త కంపెనీ ఏంటీ? అని నిలదీస్తాడు రాహుల్. రాజ్ సార్ ఆర్ అనే పేరు మీద కొత్త కంపెనీ పెడుతున్నారని మేనేజర్ చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు.
కావ్యతో రాజ్ రొమాన్స్ చేస్తుంటాడు. మన పెళ్లిని అమ్మానాన్నలకి మళ్లి చూపిద్దామని కావ్యతో చెబుతాడు రాజ్. అలాగే ఓ బూత్ బంగ్లాలో మన ఫస్ట్ నైట్ కూడా పెట్టమని కావ్య చెప్పడంతో.. నువ్వు ఊ అనేలా కానీ ఇప్పుడే చేసేస్తానని అంటాడు. ఆర్ కంపెనీ గురించి తెలుసుకోవడానికి రాహుల్ నేరుగా ఆ కంపెనీ దగ్గరికే వెళ్తాడు. రాహుల్‌ని చూడగానే మేనేజర్ కంగారుపడతాడు. పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడగ్గా.. ఆ మేనేజర్ అన్ని విషయాలు చెబుతాడు. స్వరాజ్ గ్రూప్ నుంచి ఒక టేబుల్ కానీ, కుర్చీ కానీ ఇక్కడికి రావని ఇదంతా వేరే సెటప్ అని చెబుతాడు మేనేజర్. అనధికారికంగా స్వరాజ్ కంపెనీ నుంచి గోల్డ్, క్యాష్ వస్తుండటంతో ఏదో పెద్ద కుట్రే జరుగుతుందని అనుకుంటాడు రాహుల్. నువ్వు అడ్డంగా దొరికిపోయావు.. నేనేంటో నీకు చూపిస్తానని అంటాడు.
అపర్ణ- సుభాష్‌ల పెళ్లి రోజు కావడంతో వేడుకల గురించి సీతారామయ్య, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణని అందంగా ముస్తాబు చేస్తారు ధాన్యం, అప్పూ, కావ్య. సుభాష్‌ని కూడా రాజ్, కళ్యాణ్, ప్రకాశంలు కూడా రెడీ చేస్తారు. ఇంతలో రాహుల్ హడావుడిగా ఇంటికి రావడంతో ఏం జరిగిందని రుద్రాణి అడుగుతుంది. ఏం లేదని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయమని మండిపడతాడు రాహుల్. ఇదంతా పై నుంచి చూసిన స్వప్న.. రాహుల్ ఎందుకిలా అయిపోతున్నాడని అనుకుంటుంది. ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? ఎందుకలా చిరాకుగా ఉన్నావని అడుగుతుంది స్వప్న. ఈ విషయం ఎవరికి చెప్పాలో? ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని అంటాడు రాహుల్. నాకొక విషయం తెలిసింది.. దాని గురించి నిజం తెలియకుండా మాట్లాడితే.. ఇంట్లో ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉందని అంటాడు.
ఈరోజు ఆఫీసులో ఓ సీక్రెట్ ఫైల్ దొరికిందని.. అందులో ఓ కొత్త కంపెనీని రాజ్- కావ్యలు సీక్రెట్‌గా పెడుతున్నట్లుగా ఉందని చెబుతాడు. ఆ కంపెనీకి స్వరాజ్ గ్రూప్‌కి ఎలాంటి సంబంధం లేదని అనధికారికంగా కంపెనీ పెడుతున్నారని చెబుతాడు. కంపెనీ నుంచి చాలా మొత్తంలో గోల్డ్, క్యాష్ తరలిస్తున్నారని అంటాడు. నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటిది జరుగుతుందని ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఊరుకోరని అంటాడు. ఇది నిజం కాకపోతే నన్నే తప్పుపడుతున్నావా? అని మండిపడతాడని చెబుతాడు. మనకి స్ట్రాంగ్ ఆధారాలు దొరికితే రాజ్‌ని నిలదీయొచ్చని అంటాడు. అయితే రాజ్ పర్సనల్ ల్యాప్‌టాప్‌ని నేను దొంగతనంగా తీసుకొస్తానని అంటుంది స్వప్న. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రాహుల్ సంబరపడిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










