Brahmamudi November 24th Episode: కావ్య గిఫ్ట్‌తో అపర్ణ కంటతడి... రాజ్ లాప్‌టాప్, ఫోన్ కొట్టేసిన స్వప్న

Photo Courtesy: JioHotstar

రాజ్ సీక్రెట్‌గా ఆర్ కంపెనీ పేరుతో ఓ కంపెనీని స్థాపించే ప్లాన్ చేస్తాడు. దీనికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని కొత్త మేనేజర్ మీద అరుస్తాడు. తనకు రెండు వారాలు టైం ఇస్తే ఆఫీస్, కంపెనీ పనులు పూర్తి చేస్తానని కొత్త మేనేజర్ అంటాడు. ఈ మాటలను కావ్య వింటుంది. మనం చేస్తున్నది తప్పని, తాతయ్యకి తెలిసినా? ఇంట్లో వాళ్లకి తెలిసినా? పెద్ద గొడవ అవుతుందని హెచ్చరిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి క్లారిటీ ఉంది కదా భయపడాల్సిన అవసరం లేదని చెబుతాడు రాజ్. ఆఫీసులో రాహుల్‌ని ఫ్రీగా వదిలేద్దామని కావ్య అడగ్గా.. వాడు ఇంకా ట్రాక్‌లోకి రాలేదని, బాధ్యతల గురించి తెలిసే వరకు వద్దని చెబుతాడు రాజ్.

ఆఫీసు‌లో మేనేజర్ రూంలో ఆర్ కంపెనీ పేరుతో సీక్రెట్ ఫైల్ దొరకడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఫైల్ మొత్తం చదివాక.. ఆర్ కంపెనీ పేరుతో రాజ్ కొత్త కంపెనీ పెడుతున్నట్లు తెలుసుకుంటాడు. ఆ వెంటనే కొత్త కంపెనీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూస్తాడు. ఆ వెంటనే చిరాకుగా ఇంటికి వచ్చి స్వప్నకు జరిగింది చెబుతాడు. రాజ్- కావ్యలు సీక్రెట్‌గా కంపెనీ పెడుతున్నారని, పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం తరలిస్తున్నారని చెబుతాడు. వాళ్లని నిలదిద్దామని స్వప్న అడగ్గా.. దీనికి సంబంధించిన వివరాలు ఆఫీసులో లేవని రాహుల్ చెబుతాడు. అయితే రాజ్ పర్సనల్ ల్యాప్‌టాప్‌ని నేను తీసుకొస్తానని అంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 24వ తేదీ ఎపిసోడ్ 886లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 24th 2025 Episode 886 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

సుభాష్ అపర్ణల పెళ్లి రోజు కావడంతో వారిద్దరినీ ఎంతకూ తీసుకురాకపోవడంతో సీతారామయ్య కోప్పడతాడు. వాళ్లిద్దరిని త్వరగా తీసుకురాకపోతే మీకొచ్చిన నష్టం ఏంటీ? అని అడుగుతుంది ఇందిర. ఇద్దరూ త్వరగా వస్తే కేక్ ముక్క నోట్లో వేసుకుంటానని సీతారామయ్య చెప్పడంతో, మీకు ఇంకా స్వీట్ మీద ఆశ పోలేదా? అని నవ్వుకుంటుంది ఇందిర. ఇంతలో సుభాష్, అపర్ణలను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. మా ఇంటికి వచ్చిన మీ అమ్మాయిని బాగా చూసుకుంటామని రాజ్ చెప్పగా.. అబ్బాయిని కూడా మేం అలాగే చూసుకుంటామని కావ్య అంటుంది.

కవితలు, ఆటపాటలేనా? విషెస్ చెప్పి గిఫ్ట్‌లు ఏమీ ఇవ్వరా అని అడుగుతుంది రుద్రాణి. దాంతో అత్తయ్య గారికి, మావయ్య గారికి ఎవరెవరు ఏమేం గిఫ్ట్‌లు ఇవ్వాలని అనుకుంటున్నారో ఇచ్చేయండి అంటుంది కావ్య. తర్వాత అపర్ణ, సుభాష్‌ల చేతికి దండలిచ్చి మార్చుకోమని చెబుతుంది కావ్య. దాంతో వాళ్లిద్దరూ మార్చుకుంటారు. తర్వాత అందరూ వాళ్లకి గిఫ్ట్‌లు ఇస్తారు. కంపెనీలకు ఓనర్‌లు, కరెన్సీలో తేలిపోయేవాళ్లు మీరు గిఫ్ట్‌లు ఇవ్వరా అని రాజ్, కావ్యలను నిలదీస్తుంది రుద్రాణి. మేం ఇవ్వకపోతే ఎలా? మేమిద్దరం వేర్వేరుగా గిఫ్ట్‌లు తీసుకొచ్చామని రాజ్ చెబుతాడు. ముందుగా కావ్య గిఫ్ట్ తీసుకొచ్చి అపర్ణ చేతిలో పెడుతుంది. మీ కోసం స్పెషల్‌గా చేయించామని చెబుతుంది కావ్య.

అంత స్పెషల్ ఏంటా? అని అపర్ణ ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేసి చూడగా అది అపర్ణ చిన్నప్పటి ఆల్బమ్. తన ఫోటోలు, జ్ఞాపకాలు చూసి అపర్ణ చాలా సంతోషిస్తుంది. నిజంగా ఒక్కసారిగా చిన్నపిల్లని అయిపోయానని కంటతడి పెడుతుంది అపర్ణ. నా చిన్ననాటి జ్ఞాపకాలేవి నా దగ్గర లేవని, మనసులో ఉన్నవి కూడా మరిచిపోయానని కానీ ఈరోజు నీ వల్ల అన్నీ గుర్తుకొచ్చాయని కావ్యకు థ్యాంక్స్ చెబుతుంది అపర్ణ. వీటి కోసం చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు.. నువ్వు సంపాదించావని మెచ్చుకుంటుంది అపర్ణ. ఈ థ్యాంక్స్‌లో సగం మీ అబ్బాయికి చెప్పాలి.. ఎందుకంటే కొన్ని ఫోటోలు మీ అబ్బాయే సంపాదించారని చెబుతుంది కావ్య. మిమ్మల్ని సంతోషపెట్టాలని, సర్‌ప్రైజ్ చేయాలని అనుకున్నామని అంటుంది కావ్య.

ఆ తర్వాత సుభాష్‌కి రాజ్ గిఫ్ట్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూడగా... అందులో వాచ్ ఉంటుంది. అది తాతగారు నీకు మొదటిసారిగా కొనిపెట్టిన వాచ్ అని అంటాడు రాజ్. ఇష్టం కాదు రా, ప్రాణమని చెబుతాడు సుభాష్. కానీ ఎన్నో ఏళ్ల క్రితమే ఇది పాడైపోయిందని, ఎక్కడుందో కూడా తెలియదని చెబుతాడు. అందుకే వెతికి మరి రిపేర్ చేయించి, మీ మొదటి జ్ఞాపకాన్ని మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చానని అంటాడు సుభాష్. కింద అందరూ సెలబ్రేషన్స్‌లో ఉండగా రాజ్ గదిలోకి వచ్చి లాప్‌టాప్ వెతుకుతుంది స్వప్న. ఇంతలో కావ్య లోపలికి రావడంతో స్టిక్కర్స్ కోసం వచ్చానని కవర్ చేస్తుంది స్వప్న. నీ కోసం నీ ఆనందం కోసం మావారితో పోరాడి మరి రాహుల్‌ను ఆఫీసుకు పంపించానని, నువ్వు నా గదిలోకి రాకూడదా? అని చెబుతుంది కావ్య. చెల్లెలు బయటికి వెళ్లగానే రాజ్ ల్యాప్‌టాప్ కొట్టేస్తుంది స్వప్న.

కావ్యకి తెలియకుండా లాప్‌టాప్ తీసుకొచ్చానని.. ముందు నువ్వు.. ఇందులో ఏమైనా ఉందో లేదో చూడమని రాహుల్‌కి ఇస్తుంది. అయితే ఆ లాప్‌టాప్‌కి పాస్‌వర్డ్ ఉండటంతో మనమేం తెలుసుకోలేమని అంటాడు రాహుల్. అయితే దాని పాస్‌వర్డ్ 9126 అని స్వప్న చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. అది కావ్య బర్త్ డేట్.. దానిని పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నానని రాజ్ చెప్పడం నేను విన్నానని అంటుంది స్వప్న. ఆ లాప్‌టాప్‌ని రాహుల్ ఓపెన్ చేసి చూడగా అందులో ఆర్ కంపెనీకి సంబంధించిన ఏ సమాచారం ఉండకపోవడంతో రాహుల్ షాక్ అవుతాడు. నాకు తెలిసి ఈ లాప్‌లాప్‌లో ఎలాంటి వివరాలు లేవు.. మనకి తెలుసుకునే అవకాశాలు కూడా ఉండదు అంటాడు రాహుల్. ఒకవేళ రాజ్ ఫోన్‌లో కొత్త కంపెనీకి సంబంధించిన ఫైల్స్ ఉంటాయేమోనని స్వప్న చెబుతుంది.

ఖచ్చితంగా ఆర్ కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం రాజ్ తన ఫోన్‌లోనే పెట్టుకుని ఉంటాడని చెబుతాడు రాహుల్. తన ఫోన్‌ని నేను తీసుకొస్తానని స్వప్న చెప్పగా.. అప్పుడు రాజ్ నిన్నే అనుమానిస్తాడు. నా వల్ల నీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదని అంటాడు రాహుల్. నీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటా.. ఇప్పుడే వెళ్లి రాజ్ ఫోన్ తీసుకొస్తానని అంటుంది స్వప్న. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రాహుల్ సంతోషిస్తాడు. అపర్ణ - సుభాష్‌లు కేక్ కట్ చేస్తుండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటుంది. రాజ్ ఫోటోలు తీసుకుంటుండగా... స్వప్న వచ్చి నీ ఫోన్ కావాలని చెబుతుంది. దాంతో రాజ్.. కళ్యాణ్‌ని పిలిచి ఫోన్ అడుగుతాడు. కళ్యాణ్ ఫోన్‌ని రాజ్ తీసుకుని తన ఫోన్ స్వప్నకి ఇస్తాడు. తల్లిదండ్రులకు రాజ్ కేక్ కట్ చేసి అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X