Brahmamudi November 25th Episode: ఆర్ కంపెనీ గుట్టురట్టు.. రాజ్, కావ్యలకి స్వప్న క్షమాపణలు.. షాక్‌లో రుద్రాణి

Photo Courtesy: JioHotstar

సుభాష్- అపర్ణల పెళ్లి రోజు కావడంతో వారిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. అందరూ వారిద్దరికీ గిఫ్ట్‌లు ఇవ్వగా.. కావ్య మాత్రం డిఫరెంట్‌గా ఇస్తుంది. అపర్ణ చిన్నప్పటి ఫోటోలు ఉన్న ఆల్బమ్‌ను ఇవ్వడంతో ఆమె ఎమోషనలై కావ్యని మెచ్చుకుంటుంది. సుభాష్‌కు రాజ్.. వాళ్ల తాతయ్య ఇచ్చిన తొలి వాచ్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. కావ్య గదిలోకి వెళ్లి రాజ్ పర్సనల్ లాప్‌టాప్‌ను తీసుకొచ్చి రాహుల్‌కి ఇస్తుంది స్వప్న. దాని పాస్‌వర్డ్‌గా కావ్య పుట్టినరోజేనని చెబుతుంది.

అయితే అందులో ఆర్ కంపెనీకి సంబంధించిన వివరాలు లేకపోవడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఖచ్చితంగా ఆ కంపెనీ వివరాలన్నీ రాజ్ ఫోన్‌లో ఉంటాయని భావించిన రాహుల్, స్వప్నలు .. ఆ ఫోన్ కొట్టేయాలని ప్లాన్ వేస్తారు. రాజ్ దగ్గరికి వెళ్లి ఓ ఫోన్ చేసుకోవాలని చెప్పి ఫోన్ తీసుకొస్తుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 25వ తేదీ ఎపిసోడ్ 887లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 25th 2025 Episode 887 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ ఫోన్ తీసుకొచ్చి రాహుల్‌కు ఇస్తుంది స్వప్న. నీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ అని ఆమెను మెచ్చుకుంటాడు రాహుల్. కాల్ మాట్లాడిస్తానని ఫోన్ తీసుకొచ్చానని త్వరగా చూడమని రాహుల్‌తో అంటుంది స్వప్న. ఆర్ అనే కంపెనీని ప్రారంభించబోతున్నారని రాహుల్ చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. దాని కోసం చాలా గోల్డ్‌ని లెక్కల్లో చూపించకుండా ఆ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశారని చెబుతాడు రాహుల్. స్వరాజ్ కంపెనీలో గోల్డ్ మిస్ అయ్యిందంటే అందరూ నిన్నే కదా తప్పుపడతారని అంటుంది స్వప్న. ఇంతకీ ఆర్ ఫ్యాక్టరీ అంటే రాజేనా అని అనుకుంటాడు రాహుల్. ఇది కేవలం మన అనుమానమే, నిజం ఏంటో తెలియకుండా రాజ్‌ని వెళ్లి అడగకూడదని అంటాడు రాహుల్.

నాకు చాలా భయంగా ఉంది.. అసలు రాజ్, కావ్యలు ఇదంతా ఎందు చేస్తున్నారోనని టెన్షన్ నటిస్తాడు. ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం కావాలంటే వెళ్లి వాళ్లనే అడుగుదామని అంటుంది స్వప్న. రాజ్, కావ్యలు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా ఈ ఫోన్‌లో సాక్ష్యం ఉంది కదా దాని గురించే అడుగుదామని అంటుంది స్వప్న. ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మనం వెళ్లి గొడవ చేస్తే బాగుండదని చెబుతాడు రాహుల్. అయినప్పటికీ స్వప్న వెళ్లి గొడవ పడుతుంది. అపర్ణ - సుభాష్‌ల పెళ్లి రోజు కావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేస్తారు. ఇంతలో స్వప్న కోపంగా వచ్చి రాజ్‌ని పిలుస్తుంది. కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పక్కనే ఉన్న వస్తువుల్ని పగలగొడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

నిన్నటి నుంచి దీనికి దెయ్యం పట్టిందని అంటుంది ఇందిర. నాకు దెయ్యం పట్టడం కాదు, మీ మనవడు ఏం చేశాడో తెలిస్తే మీకు పిచ్చి పడుతుందని అంటుంది స్వప్న. నేనేం చేశానని రాజ్ అడగ్గా.. స్వప్న ఫోన్‌లో ఉన్న ఆర్ కంపెనీ వివరాలు బయటపెడుతుంది. ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటీ? ఈ కంపెనీ ఎక్కడిది? స్వరాజ్ గ్రూప్‌కి సంబంధం లేకుండా సెపరేట్‌గా మరో కంపెనీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని నిలదీస్తుంది స్వప్న. ఈ కొత్త కంపెనీ విషయాన్ని ఇంట్లో కానీ, స్వరాజ్ కంపెనీలో కానీ తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారని నిలదీస్తుంది స్వప్న. సీక్రెట్‌గా ఇంత చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో సీతారామయ్య షాకై... అసలు ఏం జరుగుతుందని రాజ్‌ని అడుగుతాడు.

ముందు ఆర్ అనే అక్షరానికి అర్ధం ఏంటీ? రహస్యంగా కొత్త కంపెనీ పెట్టడానికి కారణం ఏంటీ? అది కూడా చెప్పమని నిలదీస్తుంది స్వప్న. ఆ మాటలతో రాజ్‌పై సీతారామయ్య సీరియస్ అవుతాడు. మాకు చెప్పకుండా కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. వాడు ఏ కారణంతో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడో కానీ ఒక కంపెనీ పెట్టడానికి వాడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అంటాడు సుభాష్. ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వాడికి లేదని ప్రకాశం అంటాడు. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబం అని ఎందుకు అంటున్నారని స్వప్న నానామాటలు అంటుంది. కుటుంబానికి తెలియకుండా, పాత కంపెనీకి సంబంధం లేకుండా కొత్త కంపెనీని పెడుతున్నారంటే ఏం అనుకోవాలని నిలదీస్తుంది స్వప్న.

మధ్యలో రుద్రాణి ఎంటరై.. రాజ్, కావ్యలు ఇంట్లో అందరిముందు చెడ్డవాళ్లు కాకూడదు, వాళ్ల రెప్యుటేషన్ పోకూడదని అంటుంది. కానీ వాళ్ల సంపాదన పెరగాలి, ఇంట్లో ఎవరికీ డౌట్ రాకూడదు.. అందుకే ఆర్ అనే కంపెనీతో స్వరాజ్ కంపెనీ నుంచి డబ్బుని కొత్త కంపెనీకి మళ్లించి ఆ కంపెనీని డెవలప్‌ చేయాలని అనుకున్నారని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. స్వరాజ్ గ్రూప్ అందిరిదీ కాబట్టి.. అది మునిగినా, తేలినా సేఫ్‌గా ఉంటుందని ఇదంతా చేశారని అంటుంది రుద్రాణి. అందుకే లెక్కలేనంత డబ్బుని, కేజీల కొద్దీ డబ్బుని కొత్త కంపెనీకి మళ్లిస్తున్నారని స్వప్న అంటుంది. ఇది ఎవరి బాగు కోసం, ఎవరిని నాశనం చేయడానికి చేశారని నిలదీస్తుంది. ఇంకెం చెబుతారు వాళ్ల మోసం బయటపడింది కదా అని అంటుంది రుద్రాణి.

ఇంతలో రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఇంకెప్పుడు మారతావ్, ఇంకెన్నాళ్లు రాజ్ మీద నిందలు వేస్తావని కోప్పడినట్లు నటిస్తాడు. నువ్వొక పిచ్చోడివి, కంపెనీలో ఉండగానే కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.. నీ చేతిలో బెల్లం పెట్టి, వాళ్లు మాత్రం బిల్డింగ్‌లు లేపుతున్నారని అంటుంది రుద్రాణి. అందరూ ఒక కంపెనీని పెట్టుకుని ఆస్తుల్ని పెంచుకుని నిన్ను బలి పశువుని చేస్తున్నారని అంటుంది. ప్రాణం పోయినా నా కొడుకు అలాంటి పనిచేయడని.. రాజ్, కావ్యలు కొత్త కంపెనీ పెడుతున్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అంటుంది అపర్ణ. కళ్ల ముందే సాక్ష్యాధారాలున్నా.. వారిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతుంది రుద్రాణి.

అత్తయ్య చెప్పింది నిజమే.. కొత్త కంపెనీని స్టార్ట్ చేశానని చెబుతాడు రాజ్. ఆ కొత్త కంపెనీ ఆర్ పేరు మీదే స్టార్ట్ చేశాను.. కానీ ఆర్ అంటే రాజ్ కాదు, రాహుల్ అని చెబుతాడు రాజ్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అందరిముందు నా కొడుకుని వెదవని చేయాలనే ఇలాంటి కుట్ర చేశారా అని మండిపడుతుంది రుద్రాణి. నీ భర్త మీద నిందలు వేసి.. లాభాలు వాళ్లు తీసుకుని, నష్టం రాహుల్ మీద వేసి ఓ మోసగాడిని చేయాలని అనుకుంటున్నారని అంటుంది రుద్రాణి. ఇంతలోనే రాజ్ ఎంత నాటకం ఆడుతున్నారో చూశారు కదా? ఆర్ అంటే రాహుల్ అని ప్లేట్ మార్చేశారని అంటుంది స్వప్న. నా కొడుకుని నేరస్తుడిని చేయడానికే ఈ కొత్త కంపెనీ నాటకం చేస్తున్నారని అంటుంది రుద్రాణి. డబ్బు, బంగారం తరలింపు చేసేది నా భర్తని దొంగని చేయడానికా అని నిలదీస్తుంది స్వప్న.

ఆ మాటలతో కావ్య సీరియస్ అవుతుంది. రాహుల్ పేరు మీద కంపెనీ పెడితే మాకొచ్చే లాభం ఏంటీ? అని నిలదీస్తుంది. దోషిని చేసి రాహుల్‌ను ఇంటికి దూరం చేయాలని అనుకుంటున్నామా అని మండిపడుతుంది. మేం కావాలనుకుంటే మా పేరు మీదే చేయగలం.. మరి రాహుల్ పేరు మీదే కంపెనీ ఉండాలని ఎందుకు అనుకున్నామో తెలుసా అని అంటుంది. లెక్కల్లో చూపించకుండా బంగారం, డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం మాకు లేదని చెబుతుంది కావ్య. నీ మొగుడు చేతకాని వాడిలా మిగిలిపోకూడదని ఇదంతా చేశామని స్వప్నతో అంటుంది కావ్య. నీ భర్త సంఘంలో, ఈ ఇంట్లో గౌరవాన్ని కోల్పోకూడదని.. ఇకపై తనకాళ్లపై తను నిలబడాలని చేశామని అంటుంది. రాహుల్‌కు తనకంటూ ఓ సొంత కంపెనీ ఉండాలని, ఒకరి కింద పనిచేయాలన్న తన ఆలోచనని చెరిపేయాలని అనుకున్నామని చెబుతుంది కావ్య.

తనకంటూ రాహుల్‌కి ఒక సొంత కంపెనీ ఉంటే తనకు హోదా వస్తుందని చెబుతుంది కావ్య. రాహుల్ పేరు మీద కంపెనీ ఉంటే వాడిలో ఉన్న బాధపోయి తను ఏంటో నిరూపించుకుంటాడని కంపెనీని పెట్టామని చెబుతాడు రాజ్. స్వరాజ్ గ్రూప్‌కి ఏం సంబంధం లేకుండా చేశామని అంటుంది. రాహుల్ తన సత్తా నిరూపించుకున్నాక కంపెనీ విషయం బయటపెడదామని అనుకున్నామని రాజ్ చెబుతాడు. ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది. నా భర్తకు మీరు పట్టం కడుతుంటే నేను మిమ్మల్ని అనుమానించానని క్షమాపణలు చెబుతుంది స్వప్న. రాహుల్ కూడా క్షమాపణలు చెబుతాడు. మీరు నన్ను గొప్ప పోస్ట్‌లో కూర్చోబెట్టాలని అనుకున్నారని.. కంపెనీ విషయం నాకు తెలిసి నేనే స్వప్నకి చెప్పానని, దాంతో ఆమె ఆవేశంతో ఇలా మాట్లాడిందని చెబుతాడు రాహుల్. జరిగిన గొడవకి కారణం నేనే అంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X