Brahmamudi November 26th Episode: బుల్లెట్‌పై రాజ్ కావ్య రొమాన్స్.. దుగ్గిరాల ఫ్యామిలీ రాహుల్ దారుణమైన కుట్ర

Photo Courtesy: JioHotstar

ఆర్ కంపెనీ గురించి తెలుసుకోవడానికి రాజ్ ఫోన్ కొట్టేసి రాహుల్ చేతిలో పెడుతుంది స్వప్న. దానిని చెక్ చేసిన రాహుల్‌.. నేను అనుమానించింది నిజమే, రాజ్ ఓ కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నాడని అంటాడు. కానీ ఈ ఒక్క ఆధారంతో రాజ్‌ను నిలదీస్తానని అంటుంది స్వప్న. అపర్ణ - సుభాష్‌ల పెళ్లి రోజు కావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటుంది. తాను ఎంత పిలిచినా రాజ్ పలకకపోవడంతో స్వప్న ఇంట్లోని వస్తువులను పగలగొడుతుంది. ఏం జరిగిందని రాజ్ అడగ్గా.. ఆర్ కంపెనీని సీక్రెట్‌గా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం స్టార్ట్ చేస్తున్నావని నిలదీస్తుంది స్వప్న.

సీతారామయ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా కూడా రాజ్‌ను నిలదీయడంతో కావ్య సీరియస్ అవుతుంది. ఆర్ అంటే రాజ్ కాదని, రాహుల్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రాహుల్ తన కాళ్ల మీద తను నిలబడాలని ఇదంతా చేశానని చెబుతాడు. దాంతో రాహుల్, స్వప్నలు బాధపడతారు. వెంటనే భార్యాభర్తలిద్దరూ రాజ్, కావ్యలకు క్షమాపణలు చెబుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 26వ తేదీ ఎపిసోడ్ 888లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 26th 2025 Episode 888 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మీ మనసులో నాకు ఇంత గొప్పస్థానం ఉందని, నా పేరు మీద ఓ కంపెనీని పెట్టి దానికి నన్ను ఛైర్మన్‌ని చేస్తారని కలలో కూడా అనుకోలేదని అంటాడు రాహుల్. నువ్వు మారాలని అనుకుంటున్నాం.. నీకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెబుతాడు రాజ్. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతాడు రాహుల్. ఇప్పటికైనా రాజ్, కావ్య అంటే ఏంటో అర్ధం చేసుకోమని రుద్రాణికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గడ్డిపెడతారు. నాకు చాలా సంతోషంగా ఉందని థ్యాంక్స్ చెబుతుంది స్వప్న.

ఇంట్లో జరిగిన గొడవ తర్వాత రాజ్, కావ్యలతో సీతారామయ్య పర్సనల్‌గా మాట్లాడతాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదని బాధపడతాడు పెద్దాయన. ఎవరు ఎంత ఎదిగినా స్వరాజ్ కంపెనీలోనే భాగం కావాలని నిర్ణయించుకున్నాను. మీ పని వల్ల నా నిబంధనకు భంగం వాటిల్లుతుందని బాధపడతాడు. ఈ కుటుంబంలోని మనిషైన రాహుల్ మరో చెట్టుకు వెళ్లిపోతున్నాడు.. ఇలా ఒక్కొక్కరు బయటికి వెళితే కుటుంబం విచ్ఛిన్నం కాదా అని నిలదీస్తాడు పెద్దాయన. మీకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించాలని అంటాడు రాజ్. రాహుల్ వల్ల ఈ కుటుంబంలో కలతలు వచ్చే పరిస్ధితి వచ్చిందని అది పసిగట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతాడు రాజ్.

రాహుల్ తన తల్లి చెప్పే మాటలు నమ్మి అందరినీ తప్పుగా అనుకుంటాడున్నాడని అంటుంది కావ్య. డబ్బు కోసం కట్టుకున్న భార్యకే అన్యాయం చేయాలని అనుకున్నాడని, వాడిలో మార్పు తీసుకురాకపోతే స్వప్న పరిస్ధితి ఏంటీ? ఎదగాలనే ఆలోచన రావాలంటే ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని అంటాడు రాజ్. ఈ ఇంటి కోడళ్లుగా నాకు, అప్పుకి ఎంతో గొప్పస్థానం ఇచ్చారని కానీ మా అక్కకి మాత్రం ఇంకా ఆ స్థానం దక్కలేదని అంటుంది కావ్య. తన భర్త గౌరవం పెరిగితేనే, తనకు విలువ దక్కుతుందని.. తనను కూడా మాతో సమానంగా తీసుకురావడానికి ఇలా చేశామని చెబుతుంది కావ్య. మన కుటుంబమంతా ఐకమత్యంగా ఉండాలనే ఇలా చేశామని చెబుతాడు రాజ్. కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో ఏ ఒక్క గొడవ జరిగినా నేను తట్టుకోలేనని చెబుతాడు పెద్దాయన. చిన్న కష్టం కూడా రాకుండా మీరే చూసుకోవాలని జాగ్రత్తలు చెబుతాడు.

బంగారు నగల్ని చూసుకుంటూ మురిసిపోతున్న ధాన్యం దగ్గరికి రుద్రాణి రావడంతో నగల్ని సర్దేస్తుంది ధాన్యలక్ష్మీ. నీకు సంపాదించే మొగుడు, దాచుకోవడానికి బీరువా ఉన్నాయి కాబట్టి దాచుకుంటున్నానని అంటుంది. నీకు మొగుడు లేడని ధాన్యలక్ష్మీ నానామాటలు అనడంతో రుద్రాణి మండిపడుతుంది. పది కిలోల బంగారం కొనాలంటే ఎంత అవుతుందని అడుగుతుంది రుద్రాణి. దానికి పది కోట్లు ఖర్చు అవుతుందని ధాన్యలక్ష్మీ చెబుతుంది. నా కొడుకు ఇప్పుడు ఛైర్మన్ అవుతున్నాడని మీతో సమానంగా అవుతానని అంటుంది రుద్రాణి. నేను, అక్క ఈ ఇంటికి అధికారికంగా కోడళ్లం... నువ్వు కూతురు కానీ కూతురివి అని నానామాటలు అంటుంది ధాన్యలక్ష్మీ.

ఈ వందల కోట్ల ఆస్తికి రాజ్, కళ్యాణ్‌లే వారసులు.. నీ కొడుకు పానకంలో పుడక అని చెబుతుంది ధాన్యలక్ష్మీ. రేపు వాళ్లిద్దరూ ఆస్తుల్ని పంచుకున్నాక రాహుల్‌కి అన్యాయం కాదని జాలిపడి రాహుల్‌తో ఓ చిన్న కంపెనీ పెట్టిస్తున్నాడని అంటుంది. ఆ మాటలతో రగిలిపోతుంది రుద్రాణి. నేను అనుకున్నది సాధించాను, నేను ఆర్ కంపెనీ ఛైర్మన్‌ని అని తల్లితో అంటాడు రాహుల్. దీనికే ఇంత సంబరపడిపోతావేంటీ? ఆర్ కంపెనీని సక్సెస్ చేస్తే అది నువ్వు సాధించినట్లు అని చెబుతుంది రుద్రాణి. పైసా ఖర్చు లేకుండా కంపెనీకి ఓనర్‌ని అయ్యానని అంటాడు రాహుల్.

వందల కోట్ల ఆస్తి, స్వరాజ్ కంపెనీ ముందు వీళ్లు నీకిచ్చిన కంపెనీ ఎంత అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ నాకు కట్టబెట్టింది చిన్న కంపెనీ కాదు.. వాళ్ల జీవితాలు ముక్కలు చేసే కత్తిని అని చెబుతాడు రాహుల్. రాజ్, కావ్యలు తెలియకుండానే నాకు బ్రహ్మాస్త్రం ఇచ్చారు.. రాజ్ చేసింది ఎంత పెద్ద తప్పో వాళ్లకి తెలియదని అంటాడు. ఇప్పటి వరకు నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి నాకు సరైన అవకాశం రాలేదు.. అది ఇప్పుడు రాజే నాకు ఇచ్చాడు. నాకు చిన్న కంపెనీని అప్పగించారని వాళ్లు అనుకుంటున్నారు.. నా ఆర్ కంపెనీతో వాళ్ల స్వరాజ్ కంపెనీ మొత్తాన్ని మింగేస్తానని అంటాడు రాహుల్. దొంగ చేతికి తాళాలు ఇచ్చారు.. ఒక్కొక్కరినీ వీధిలోకి లాగుతానని చెబుతాడు.

కావ్య బకెట్ లిస్ట్‌లో భాగంగా రాజ్ ఆమె కోసం బుల్లెట్ తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కావ్య సంతోషిస్తుంది. ఆమెను ఫోటోలు తీసి ఆనందపరుస్తాడు. అయితే కావ్య మాత్రం బైక్ డ్రైవ్ చేయాలని గొడవ చేయడంతో సరేనంటాడు. ఆమె బుల్లెట్ ఎక్కి స్పీడుగా వెళ్లడంతో రాజ్ వణికిపోతూ... భయంతో కావ్యని పట్టుకుంటాడు రాజ్. నా లైఫ్‌లో నేను ఇంత స్పీడుగా ఎప్పుడూ వెళ్లలేదని అంటాడు. నీకు బైక్ డ్రైవింగ్ వచ్చా? అని అడుగుతాడు రాజ్. అప్పూ దగ్గర ఎప్పుడో నేర్చుకున్నానని చెబుతుంది కావ్య. నా భర్తని వెనకాల కూర్చోబెట్టుకుని బైక్ నడపాలని అనుకున్నానని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X