Brahmamudi November 29th Episode: రాజ్‌కి రాహుల్ వెన్నుపోటు... దుగ్గిరాల సామ్రాజ్యానికి బీటలు

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల కుటుంబం ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగా ఇకపై నువ్వు నీ కంపెనీ వ్యవహారాలు చూసుకుని డెవలప్ చేయమని రాహుల్‌కు చెబుతారు ప్రకాశం, సుభాష్. ఇకపై కంపెనీ బాధ్యతల్ని నువ్వే చూసుకోవాలని రాజ్‌కు చెబుతాడు సుభాష్. నాతో పాటు కళావతి కూడా ఆఫీస్‌కి వస్తుందని రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. తనకు ఇంట్లో బోర్ కొడుతోందని విసిగిస్తోందని, అందుకే ఆఫీస్‌కు తీసుకెళ్తున్నానని అంటాడు రాజ్. ఇదే సరైన సమయమని భావించిన కళ్యాణ్.. అయితే అప్పూ కూడా డ్యూటీలో జాయిన్ అవుతుందని అంటాడు. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. డెలివరీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్లేది లేదని చెబుతుంది ధాన్యం.

తమ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. వారి మాటల్ని విన్న రాజ్, కావ్యలు అక్కడికి వస్తారు. ఆ పాపకి, ఆ తల్లికి న్యాయం చేయమని మీకు అండగా ఉంటామని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అప్పూ పోలీస్ స్టేషన్‌కి వెళితే చిన్నత్తయ్య ఊరుకోదని, దానికి మనం కారణమని తెలిస్తే అస్సలు క్షమించదని హెచ్చరిస్తుంది కావ్య. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్తూ ఇందిర ఆశీర్వాదం తీసుకుంటాడు రాహుల్. కావ్యకి జాగ్రత్తలు చెప్పి రాజ్‌తో పంపిస్తారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. అప్పూ, కళ్యాణ్‌లు గుడికి వెళ్తున్నామని అబద్ధం చెబుతారు. అయితే చేతిలో బ్యాగ్ కనిపించడంతో ధాన్యానికి డౌట్ వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 29వ తేదీ ఎపిసోడ్ 891లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 29th 2025 Episode 891 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కళ్యాణ్ చేతిలో బ్యాగ్ ఏంటీ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. బ్యాగ్‌లో నా లిరిక్ పేపర్స్ ఉన్నాయని.. నిన్నటి నుంచి ఓ పాట రాయడం కుదరడం లేదని దేవుడి దగ్గర పెన్ను, పేపర్స్ పెట్టి దండం పెట్టుకుందామని అనుకున్నానని అంటాడు కళ్యాణ్. బ్యాగ్ అంత ఎత్తుగా ఉంది? పేపర్స్ అంత ఎత్తుగా ఉంటాయా? బ్యాగ్ చూపించు అని ధాన్యం అనడంతో కళ్యాణ్, అప్పూలు షాక్ అవుతారు. అందులో పట్టుబట్టలు ఉన్నాయేమో అంటాడు ప్రకాశం. దాంతో దేవుడికి పట్టుబట్టలు పెడతానని అప్పూ మొక్కుకుందని, అందుకే తీసుకెళ్తున్నామని కళ్యాణ్ కవర్ చేస్తాడు.

ఆఫీసులో రాజ్, కావ్యలను చూసిన స్టాఫ్ అంతా సంతోషిస్తారు. మీరిద్దరూ ఇలా ఆఫీసుకు రావడం చాలా హ్యాపీగా ఉందని చెబుతుంది శృతి. ఈరోజు స్టాఫ్ కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు? ఎవరైనా లీవ్‌లో ఉన్నారా? అని అడుగుతాడు రాజ్. ఒకరిద్దరు లీవ్‌లో ఉన్నారని చెబుతుంది శృతి. మేనేజర్ సతీష్ కనిపించడం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని అడుగుతాడు రాజ్. సతీష్ గారు రిజైన్ చేశారని శృతి చెప్పడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. అంతేకాకుండా సతీష్ గారు రాహుల్ సార్ కంపెనీలో చేరడానికి వెళ్లారని తెలిసిందని చెబుతుంది శృతి. దాంతో రాజ్య, కావ్యలు ఉలిక్కిపడతారు. ఈ విషయం రాహుల్ మీతో చెప్పాడా అని రాజ్‌ని కావ్య అడుగుతుంది. సతీష్ గారు రాహుల్ కంపెనీకి వెళ్లడమే కరెక్ట్ అంటాడు రాజ్. రాహుల్ ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేశాడు.. అక్కడ అనుభవం ఉన్నవారు ఉండటం మంచిదని చెబుతాడు రాజ్.

మీరు చెప్పినట్లే రాజ్ సార్ కంపెనీ నుంచి వచ్చేశానని.. ఆయనకు ఒక్క మాట కూడా చెప్పలేదని రాహుల్‌తో అంటాడు సతీష్. మనీ అవసరమైన వాడికి ఎథిక్స్ ఉండకూడదని చెబుతాడు రాహుల్. నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగి, నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే సింగిల్ పేమెంట్‌తో కొట్టేస్తానని అంటాడు రాహుల్. ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు సతీష్. స్వరాజ్ కంపెనీ ఇప్పటి వరకు ఏ క్లయింట్స్‌తో బిజినెస్ చేసిందో.. రేపు వాళ్లు నా ముందు ఉండాలని చెబుతాడు రాహుల్. అందరితో నేను మాట్లాడాలి? మీటింగ్ పెట్టమని అంటాడు. ఆ మాటలతో సతీష్ షాక్ అవుతాడు.

రాజ్ సార్ అంటే వాళ్లకు ఎంతో నమ్మకమని చెబుతాడు సతీష్. నువ్వు అన్నా కూడా రాజ్‌కు నమ్మకమే.. కానీ నువ్వు నా దగ్గర వచ్చేశావు కదా అని చెబుతాడు రాహుల్. కానీ డబ్బు అనేది శాశ్వతం.. దానిని ఇనుప పెట్టేలో భద్రంగా దాచుకోచ్చని అంటాడు. ఇన్నాళ్లు గొర్రె తోక జీతంతో జీవితాన్ని లాగుతూ వచ్చావు... ఇక్కడ మాత్రం నీ బ్యాంక్ బాలెన్స్ పెరిగిపోతుందని చెబుతాడు రాహుల్. కానీ రాజ్ సార్‌కి ఈ విషయం చెబితే ఏం చెబుతామని అడుగుతాడు సతీష్. రాజ్ సంగతి నేను చూసుకుంటానని, నేను చెప్పింది మాత్రం నువ్వు చేయాలని వార్నింగ్ ఇస్తాడు రాహుల్. దాంతో సతీష్ సరేనని అంటాడు. స్వరాజ్ గ్రూప్ సామ్రాజ్యంలో మొదటి ఇటుక కూల్చబోతున్నా.. ఇటుక ఇటుక పోగుచేసి కోటను నిర్మించబోతున్నానని అనుకుంటాడు రాహుల్.

మళ్లీ పోలీస్ యూనిఫాం వేసుకున్న అప్పూ.. పాప మిస్ అయిన ఫైల్ గురించి వెతుకుతుంది. కేసు గురించి వివరాలు తెలుసుకుంటుండగా.. పాప శవం డ్రైనేజీలో దొరికిందని చెబుతాడు కానిస్టేబుల్. పాప తల్లిదండ్రుల్ని స్పాట్‌కు తీసుకెళ్లి గుర్తుపట్టమని చెప్పామని.. తండ్రి కన్ఫర్మ్ చేశాడు కానీ, తల్లి మాత్రం ఒప్పుకోలేదని చెబుతాడు కానిస్టేబుల్. చనిపోయింది వాళ్ల పాపే అనడానికి అన్ని ఆధారాలు మ్యాచ్ అయ్యాయని, డీఎన్ఏ కూడా మ్యాచ్ అయ్యిందని చెబుతాడు కానిస్టేబుల్. డీఎన్ఏ కూడా సెట్ అయ్యాక చనిపోయింది మా పాప కాదని రేణుక గారు ఎందుకు చెబుతున్నారని అప్పూకి అనుమానం వస్తుంది. క్లోజ్ అయిన కేసును ఎందుకు ఓపెన్ చేస్తున్నావని అప్పూపై సీఐ సీరియస్ అవుతాడు.

కంపెనీ ఆదాయం తగ్గడంతో రాజ్, కావ్యలు ఆలోచనలో పడతారు. పాత డిజైన్ల ప్లేసులో కొత్త డిజైన్లు పెట్టాలని కావ్యతో చెబుతాడు రాజ్. ఇంత తక్కువ టైంలో పాతవి చేయడం కష్టమని అంటుంది కావ్య. ఎంత కష్టమైనా, ఖర్చు ఎంతైనా పర్లేదని అంటాడు. డిజైన్లు మీరు వేస్తారా అని అని కావ్య అడగ్గా.. డిజైన్లు వేసేది నువ్వే అయినా వాటిని మార్కెటింగ్ చేసేది నేనే కదా అంటాడు రాజ్. ఈ సమానత్వం మన కాపురంలో కూడా ఉండుంటే చాలా సంతోషించే దానిని అంటుంది కావ్య. ఇంట్లో మొత్తం నీ డామినేషనే, ఇంకా సరిపోదా? బానిసలా బతకాలా? అని అడుగుతాడు రాజ్.

పాప తల్లి ఇంటికి అప్పూ వచ్చి ఎంక్వయిరీ చేస్తుంది. స్కూల్‌కి వెళ్లిన పాప ఇంటికి తిరిగి రాలేదని అప్పూకి చెబుతుంది రేణుక. పోలీస్ కంప్లయంట్ ఇవ్వడంతో మూడు రోజుల తర్వాత పోలీసులు వచ్చి డ్రైనేజీలో శవం దొరికింది ఒకసారి వచ్చి చూడమని చెప్పారని అంటుంది. ఆ శవం మా పాపది కాదని, అందరూ ఆ శవం మా పాపదే అన్నట్లుగా మాట్లాడారని బాధపడుతుంది. మా ఆయన మాత్రం ఒప్పుకున్నారని చెబుతుంది. అంత ఖచ్చితంగా చనిపోయింది మీ పాప అని ఎలా చెబుతున్నారని అప్పూ ప్రశ్నిస్తుంది. నేను తొమ్మిది నెలలు మోసి కన్నదానిని, నా పాప ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నిస్తుంది రేణుక. నా పాప ఆచూకీని మీరే కనిపెట్టాలని అప్పూని బతిమలాడుతుంది రేణుక. నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మీరు ధైర్యంగా ఉండండి అని చెబుతుంది అప్పూ. చుట్టుపక్కల వాళ్లని ఎంక్వైరీ చేసిన కానిస్టేబుల్స్ కూడా పాప చనిపోయిందని అప్పూతో చెబుతారు. పాప స్కూల్‌కి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు చనిపోయిన పాప తాలూకా వాళ్లని వెతకమని చెబుతుంది అప్పూ.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేస్తుండగా.. మేనేజర్ సతీష్ సంగతి గురించి రాజ్ అడుగుతాడని రాహుల్ భయపడతాడు. స్వప్న భోజనానికి రాకపోవడంతో రాహుల్, రుద్రాణిలపై అందరూ సెటైర్లు వేస్తారు. రాజ్ అడగకముందే సతీష్ మేటర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X