Brahmamudi November 5th Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన కావ్య.. కోయిలిని ముగ్గులోకి దింపిన గోల్డ్ బాబు

Photo Courtesy: JioHotstar

రాజ్ - కావ్యల దెబ్బకి కోయిలికి పులుసు కారిపోతుంది. పనిమనిషి గెటప్‌లో ఉన్న కోయిలిని చూసిన రాహుల్.. నిన్ను ఇలా చూడలేకపోతున్నానని అంటాడు. వీడే కాదు మేం కూడా చూడలేకపోతున్నామని అంటాడు రాజ్. రాహుల్ కజిన్ గోల్డ్ బాబు వస్తున్నాడని వాడికి ఇలా ఉంటే అస్సలు నచ్చదు. ఇంతలో రాజ్ ఫ్రెండ్ గోల్డ్ బాబు వచ్చి... దుబాయ్‌లో 1000 కోట్లు సంపాదించానని, ఇకపై ఇండియాలోనే వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతాడు.

నాకు మంచి పార్ట్‌నర్స్ కావాలని గోల్డ్ బాబు చెప్పగా.. మేం ఉన్నాం కదా? మా కంపెనీలో మీ పెట్టుబడులు పెట్టమని అంటుంది కోయిలి. ఆమెను గది చూపించమని చెప్పి గోల్డ్ బాబు.. సూట్ కేసులో బంగారం ఉన్నట్లు నమ్మిస్తాడు. గోల్డ్ బాబు ట్రాప్‌లో పడిపోయిన కోయిలిని మరింతగా ఆడుకోవాలని చెబుతాడు రాజ్. కోయిలితో నా పెళ్లి జరగకుండా రాజ్ - కావ్యలు అడ్డుపడుతున్నారని ఏదో ఒకటి చేయమని రుద్రాణికి ఫోన్ చేస్తాడు రాహుల్. దాంతో రాజ్ లాప్‌టాప్‌లో ఉన్న ఫైల్‌ను డిలీట్ చేయించి టెన్షన్ పెడుతుంది రుద్రాణి. ఈ దెబ్బతో రాజ్ ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ ఆఫీసుకు వెళ్తాడని మనసులో అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 5వ తేదీ ఎపిసోడ్ 870లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 5th 2025 Episode 870 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ సార్ పంపించిన ఫైల్‌ మొత్తాన్ని పెన్ డ్రైవ్‌లో దాచానని, కానీ అదంతా డిలీట్ అయిపోయిందని శృతి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. వెంటనే రాజ్‌కి ఫోన్ చేస్తే ఇంకో కాపీ పంపిస్తాడని చెబుతాడు ప్రకాశం. నేను ఎంతగా ట్రై చేసినా రాజ్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అంటుంది శృతి. మీటింగ్ టైంకి ఫైల్ మిస్ అయితే ఎంత లాస్ తెలుసా అంటూ సీరియస్ అవుతాడు ప్రకాశం. రాజ్ - కావ్య అక్కడ ఉండటం మంచిది కాదని నేను చెబుతూనే ఉన్నానని.. ఆఫీస్‌లో రాజ్ లేకపోవడం వల్ల ఇప్పుడు 50 కోట్లు నష్టం వచ్చేలా ఉందని అంటుంది రుద్రాణి. నా కొడుకు వల్ల మీకు నష్టం జరగొద్దని.. రాజ్‌ని, కావ్యని వెంటనే రప్పించాలని చెబుతుంది.

వెంటనే రాజ్‌కి ప్రకాశం ఫోన్ చేసి నువ్వు శృతికి ఫార్వార్డ్ చేసిన ఫైల్ డిలీట్ అయ్యిందని జరిగినదంతా చెబుతాడు. డిజైన్ కనుక టైంకి ఇవ్వకపోతే ఆ కంపెనీ వాళ్లు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారని చెబుతాడు ప్రకాశం. దాంతో రాజ్ బయల్దేరుతున్నానని చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలంటే రెండు రోజులు పడుతుందని ప్రకాశం చెప్పగా.. ముందు రాజ్ ఆఫీస్‌కి వస్తే ఏదో ఒకటి చేస్తాడని అంటుంది రుద్రాణి. వెంటనే కావ్యని పిలిచిన రాజ్.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అంటాడు. దాంతో కావ్య షాక్ అవ్వగా.. రాజ్ జరిగినదంతా చెబుతాడు.

రాజ్ బయల్దేరాడా? లేదా అని రుద్రాణి ఇంట్లో గొడవ గొడవ చేస్తుంది. స్వప్న జీవితం చక్కదిద్దాలని రాజ్ - కావ్యలు ఎంతో కష్టపడుతున్నారు.. కానీ మధ్యలోనే రావాల్సి వస్తుందని దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుంది. నా రాత ఇంతేనని సరిపెట్టుకుంటానని స్వప్న ఎమోషనల్ అవుతుంది. మనం ఇక్కడే ఉంటే కంపెనీకి చాలా లాస్ వస్తుందని రాజ్ చెప్పగా.. ఆ ఫైల్ నా దగ్గర ఇంకో కాపీ ఉందని చెబుతుంది కావ్య. దాంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ప్రకాశంకి కావ్య ఫోన్ చేసి ఆ ఫైల్ తన లాప్‌టాప్‌లో ఉందని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. కావ్య తెలివే తెలివి లక్కీగా ఫైల్ సేవ్ చేసిందని సుభాష్ మెచ్చుకుంటాడు. రాజ్- కావ్యలు అక్కడి నుంచి రావాల్సిన పనిలేదని చెబుతుంది అపర్ణ.

లక్కీబాబుకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కోయిలి. మా ఫ్రెండ్ పబ్‌లో పార్టీ ఏర్పాటు చేశాడని.. నన్ను రమ్మని చెప్పాడని అక్కడికి వెళితే ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని అంటాడు గోల్డ్ బాబు. ఈ కోయిలి ఉండగా మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవే ఉండదని అంటుంది. ఫ్రెండ్స్‌ని అంత గుడ్డిగా నమ్మొద్దని, ఫ్యామిలీని నమ్మాలని చెబుతుంది కోయిలి. నాకు ఫ్యామిలీ ఎవరున్నారని గోల్డ్ బాబు అడగ్గా.. నేను రాహుల్‌ని పెళ్లి చేసుకుంటే మనమంతా ఒకే ఫ్యామిలీ అవుతాం కదా అని అంటుంది కోయిలి. డీజే, లైట్స్, ఫారిన్ స్కాచ్, డ్యాన్స్ చేయడానికి ఓ మంచి పార్ట్‌నర్ ఉంటే చాలని అంటాడు గోల్డ్ బాబు. ఇదంతా ఏర్పాటు చేయాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతుందని, అలాగని వీడిని బయటికి పంపిస్తే డబ్బంతా వాళ్ల ఫ్రెండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడని టెన్షన్ పడుతుంది కోయిలి.

ఇంతలో రాజ్- కావ్య వచ్చి ఏం ప్లాన్ చేశావని గోల్డ్ బాబుని అడుగుతారు. ఇలాంటి వాళ్లతో బాగా డబ్బు ఖర్చు పెట్టించి, మత్తులో తేలిస్తేనే నిజాలన్నీ బయటికి వస్తాయని చెబుతాడు గోల్డ్ బాబు. ఆనందం కోసం తాగడం వేరు, నటించడం కోసం తాగేది వేరు.. ఈ రోజు తాగేది, వాగేది వాళ్లని అంటాడు గోల్డ్ బాబు. ఆ రాహుల్‌కి బాగా బుద్ధి రావాలి, మా అక్క విలువేంటో తెలియాలని చెబుతుంది కావ్య. రేపటికి రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి మీ అక్క కాళ్ల దగ్గర పడతాడని అంటాడు గోల్డ్ బాబు. అసలు వడ్డీ అంతా కలిపి నేనే మీ బాకీ తీరుస్తానని రంజిత్ బతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో కోయిలి వచ్చి అర్జెంట్‌గా లక్ష రూపాయలు కావాలని అంటుంది. నేను ఎక్కడి నుంచి తీసుకురాను.. ఇప్పుడే ఆ సేటు బాకీ తీర్చకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని చెబుతాడు రంజిత్.

ఆ గోల్డ్ బాబులో నుంచి గోల్డ్ లాగేసి బాబుని బజారులోకి తోయ్యాల్సిందేనని చెబుతుంది కోయిలి. మనం రాహుల్‌ గాడిని ట్రాప్ చేయాలని అనుకున్నాం.. ఎలుకని పట్టాలని అనుకుంటే ఏనుగు దొరికినట్లు గోల్డ్ బాబు దొరికాడని చెబుతుంది కోయిలి. మనం ఆ రాహుల్ గాడిని ట్రాప్ చేస్తేనే ఖర్చు లేకుండా కోటీశ్వరులం అయిపోతామని, వీళ్లని వదిలేద్దామని రంజిత్ నచ్చచెబుతాడు. గోల్డ్ బాబుని పెళ్లి చేసుకుని నేను మహారాణిని అయిపోతా.. నువ్వు అడుక్కుతిను అంటుంది కోయిలి. ఈరోజు పార్టీ ముగిసేలోగా వాడి ఆస్తి, గోల్డ్ అంతా లాగేస్తానని చెబుతుంది. మీ గోల్డ్ బాబు మనం అనుకున్న పని పూర్తి చేస్తే మనకి ఈ గెటప్‌లు వేసే బాధ తప్పుతుందని రాజ్‌తో చెబుతుంది కావ్య. కొడుకు, కోడలు ముసలివాళ్ల గెటప్‌లో చూసి అపర్ణ, ఇందిర నవ్వుకుంటారు.

మీరిద్దరూ నాకోసం ఇలా వేషాలు వేస్తూ కష్టపడటం నాకు నచ్చడం లేదని అంటుంది స్వప్న. రాహుల్‌కు నిజం తెలిసేలా చేసి మన దారిలోకి తీసుకొస్తామని చెబుతారు రాజ్, కావ్య. గోల్డ్ బాబు కోరుకున్నట్లుగానే కోయిలి ఇంట్లోనే డీజే సెటప్ ఏర్పాటు చేస్తుంది. నీ కోసం కోయిలి ఎప్పుడైనా ఇలా ఖర్చు పెట్టిందా? అని రాహుల్‌ని నిలదీస్తుంది కావ్య. ఇంతలో కోయిలి మోడ్రన్‌గా రెడీ అయి రాగా.. నీ కోసం ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యిందా? అని ప్రశ్నిస్తాడు రాజ్. దాంతో కోయిలిపై మండిపడతాడు రాహుల్. ఇంతలో గోల్డ్ బాబు వచ్చి.. నువ్వు ఈ డ్రెస్‌లో చాలా హాట్‌గా ఉన్నావని అనడంతో కోయిలి మెలికలు తిరుగుతుంది. ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ మా రాహుల్ గాడికి పడిపోయిందని నాకు అసూయగా ఉందని అంటాడు గోల్డ్ బాబు. ఆ మాటలతో రాహుల్ రగిలిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X