Brahmamudi November 6th Episode: కావ్య - రాజ్‌ల ప్లాన్ సక్సెస్ ... కోయిలి బండారం బట్టబయలు

Photo Courtesy: JioHotstar

రాజ్ పంపిన ఫైల్ మొత్తం డిలీట్ అయినట్లు శృతి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. 50 కోట్ల ప్రాజెక్ట్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని అందరూ శృతిపై మండిపడతారు. కంపెనీకి 50 కోట్ల నష్టం వచ్చేలా ఉందని వెంటనే రాజ్ - కావ్యలను వచ్చేయమని రుద్రాణి కంగారుపెడుతుంది. దీంతో రాజ్‌కు ఫోన్ చేసిన ప్రకాశం విషయం చెప్పి వెంటనే ఇంటికి వచ్చేయమని చెబుతాడు. రాజ్ - కావ్యలు కూడా బయల్దేరబోతుండగా.. ఆ ఫైల్‌ని సేవ్ చేసిన విషయం కళావతికి గుర్తొచ్చి ప్రకాశంకు చెబుతుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి డల్ అవుతుంది.

నా ఫ్రెండ్ నన్ను పబ్‌కి రమ్మని పిలిచాడని, అక్కడే నా ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడతానని కోయిలికి చెబుతాడు గోల్డ్ బాబు. దాంతో పబ్ సెటప్ అంతా ఇంట్లోనే ఏర్పాటు చేస్తానని చెబుతుంది. ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయానని ఇక నా వల్ల కాదని రంజిత్ అంటాడు. ఈ రాత్రికే ఆ గోల్డ్ బాబు దగ్గర ఉన్న డబ్బు, బంగారం లాగేస్తానని రంజిత్‌ని ఒప్పిస్తుంది కోయిలి. పబ్‌లో ఉండే సదుపాయాలన్నీ ఇంట్లోనే ఉండటంతో రాహుల్‌ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 6వ తేదీ ఎపిసోడ్ 871లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 6th 2025 Episode 871 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంట్లో పబ్ సెటప్ అదిరిపోయింది కానీ నాకు డ్యాన్స్ పార్ట్‌నర్ లేదు, స్టెప్పులు ఎలా వేయాలని అడుగుతాడు గోల్డ్ బాబు. నేనున్నాను కదా అని కోయిలి అనడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తుండటంతో కోయిలి నీకు గర్ల్ ఫ్రెండా? గోల్డ్ బాబుకు గర్ల్ ఫ్రెండా? అని అడుగుతాడు రాజ్. ఎవరు చూసినా వాళ్లిద్దరినీ లవర్స్ అనే అనుకుంటారని అంటుంది కావ్య. దాంతో రగిలిపోయిన రాహుల్... మధ్యలోకి వెళ్లి కోయిలితో డ్యాన్స్ చేయబోతాడు. నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోతానని అంటాడు గోల్డ్ బాబు. దాంతో షాకైన కోయిలి కంగారుపడుతుంది. గోల్డ్ బాబుకి మందుపోసి వాడితో డ్యాన్స్ చేస్తుంది. మరి నా సంగతి ఏంటీ? అని రాహుల్ అడగ్గా.. మనం ఎప్పుడైనా డ్యాన్స్ చేయొచ్చని కానీ ఇంటికొచ్చిన మీ అన్నయ్యని డిజాప్పాయింట్ చేస్తామా? అని తోసేస్తుంది రాహుల్.

నీ గర్ల్ ఫ్రెండ్‌కి నీకంటే డబ్బు ముఖ్యం కాబట్టి నిన్ను పక్కనపెట్టి.. వాడిని ఇంప్రెస్ చేస్తోందని రాహుల్‌తో అంటాడు రాజ్. మా అక్క ఏ రోజైనా ఇలా చేసిందా? అని కావ్య నిలదీస్తుంది. నిన్ను ఇంకొకరి ముందు అవమానించిందా? ఎవరో ఏంటో ఇప్పటికైనా తెలుసుకోమ్మని చెబుతుంది కావ్య. నిజంగా కోయిలి కోటీశ్వరురాలైతే నువ్వుండగా వాడి వెంట ఎందుకు పడుతుందని రాజ్ ప్రశ్నిస్తాడు. వాడి బిజినెస్ డబ్బులు, వాళ్ల కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని ఎందుకు అడుగుతుందని నిలదీస్తాడు రాజ్. దాంతో రాహుల్ ఫుల్‌గా మందు కొట్టేస్తాడు. మందు కలపమని రాహుల్‌ని గోల్డ్ బాబు అడగ్గా.. రాహుల్ ఆ పని నేను చేయనని అంటాడు. దాంతో కోయిలి సీరియస్ అయ్యి.. రాహుల్‌ని మందు కలపమని సీరియస్ అవుతుంది.

ఇప్పటికైనా స్వప్న దగ్గరికి వచ్చేయ్.. లేదంటే నీ బతుకు మందు కలపడంతోనే సరిపోతుందని అంటాడు రాజ్. పార్టీ మధ్యలో కావ్య, రాజ్‌లు డ్యాన్స్ ఇరగదీస్తుండటంతో మీరు నిజంగా ముసలివాళ్లేనా అని కోయిలికి అనుమానం వస్తుంది. దాంతో ఇద్దరూ కవర్ చేసుకుంటారు. పార్టీ అయిపోగానే గుడ్‌నైట్ చెప్పి వెళ్లిపోతుంది కోయిలి. గోల్డ్ బాబు పీకలదాకా తాగడంతో రాజ్ మండిపడతాడు. ఉదయానే నన్ను నిద్రలేపితే అసలు నాటకం మొదలు పెడదామని అంటాడు గోల్డ్ బాబు. జరిగినదంతా తలచుకుని రాజ్, కావ్యలు నవ్వుకుంటూ ఉంటారు. కావ్య నవ్వుకుంటూ ఉండటంతో రాజ్ ఎంతో సంతోషిస్తాడు.

నిన్ను ఇలా నవ్వించినందుకు ఆ గోల్డ్ బాబుకు థ్యాంక్స్ చెప్పాలని అంటాడు రాజ్. ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీకు.. మా అక్క జీవితం ప్రాబ్లమ్‌లో ఉంది అనగానే నాతో కలిసి నాటకం వేయడానికి వచ్చారని అంటుంది కావ్య. స్వప్న నీకు అక్క మాత్రమే కాదు.. మా ఇంటి కోడలు. ఆ ఇంటి మనిషికి సమస్య వస్తే అది నా సమస్యేనని అంటాడు రాజ్. మీ ఇంటి పరువు పోకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారా? అని కావ్య నిలదీస్తుంది. నువ్వు చెబితేనే కదా వచ్చింది అని రాజ్ అలుగుతాడు. నీనంటే మీకు ముందు నుంచి లోకువేనని, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి మీరు చేస్తున్నది అదే కదా అంటుంది కావ్య. నువ్వంటే ఏంటో తెలియదు కాబట్టి అలా చేశానని, ఇప్పుడు నిన్ను ఎలా చూసుకుంటున్నానో నీకు తెలియడం లేదా అని ప్రశ్నిస్తాడు రాజ్. మీ మగాళ్లకి ఆడవాళ్ల గొప్పతనం ఎప్పటికీ తెలియదని, మేమంటే మీకు చిన్నచూపని మండిపడుతుంది కావ్య. మీ కోసం, మీ కుటుంబ సంతోషం కోసం నేను కష్టపడి ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నానని అంటుంది.

ఉదయాన్నే గోల్డ్ బాబుని నిద్ర లేపి ప్లాన్ సంగతి గుర్తుచేస్తాడు రాజ్. రాహుల్ గాడు నిద్రలేచేసరికి నువ్వు కోయిలి గదిలో ఉండాలి కదా అని అంటాడు. మీరేం టెన్షన్ పడొద్దు, నా నాటకం ఇప్పుడు చూస్తారు కదా అని అంటాడు గోల్డ్ బాబు. షర్ట్ నిండా లిప్‌స్టిక్ మరకలు చేసుకుని కోయిలి గదిలోకి వెళ్లి పడుకుంటాడు గోల్డ్ బాబు. ఆ వెంటనే రాహుల్‌ని రాజ్ నిద్రలేపుతారు రాజ్, కావ్య. మీరొచ్చినప్పటి నుంచి నాకు నిద్ర లేదు, ప్రశాంతత లేదని అంటాడు రాహుల్. ఎక్కడ పడుకోవాలో కూడా తెలియడం లేదని అంటాడు.. ఇంతకీ ఆ గోల్డ్ బాబు ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. నువ్వు ఇక్కడ టిఫిన్ తినక.. వాడు లోపల టిఫిన్ తినేస్తున్నాడని అంటాడు రాజ్.

ఇందాక కోయిలి గదిలో ఆ గోల్డ్ బాబుని చూశానని రాజ్ చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. వెంటనే గదిలోకి వెళ్లి చూడగా.. బెడ్‌పై కోయిలి, గోల్డ్ బాబు వాటేసుకుని కనిపిస్తారు. దాంతో రాహుల్, కోయిలి షాక్ అవుతారు. ఏదో తాగిన మత్తులో రాత్రి అలా జరిగిపోయిందని అంటాడు గోల్డ్ బాబు. ఆ మాటలతో కోయిలి షాకై నిజంగా నాకు తెలియదని అంటుంది. ఏం తెలియకుండానే ఇద్దరూ ఒకటే మంచంపై పడుకున్నారా? అని మండిపడతాడు రాహుల్. రాత్రంతా నీకు కాబోయే పెళ్లాం.. గోల్డ్ బాబుతో ఉందా అని అంటాడు రాజ్. ఇలాంటి దానిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? ఇలాంటి దాని కోసం స్వప్నని వదిలేస్తానని అన్నావు? అని మండిపడతాడు. ఇలా రంగులు మార్చేదానిని నా ఇంటి కోడలిగా తీసుకొస్తావా? అని కావ్య ఫైర్ అవుతుంది.

ఇది నిజంగా నిన్ను ప్రేమించిందా? నిజంగా నువ్వంటే ఇష్టం ఉందా? దీని కన్నా స్వప్న ఎంత గొప్పది అని అంటారు రాజ్, కావ్య. దీని దగ్గర చిల్లిగవ్వ లేదు... కేవలం నిన్ను డబ్బుల కోసమే ట్రాప్ చేసిందని అంటారు. వాళ్ల మాటలు నమ్మొద్దు.. నేను అనలేదని చెబుతుంది కోయిలి. గోల్డ్ బాబు బిస్కెట్ల కోసం వాడితో రూమ్‌లో చెండాలంగా అని కావ్య అంటుంది. ఇది, దీని మావయ్య కోటీశ్వరులు కాదు.. కేరాఫ్ ఫ్లాట్‌ఫాం అంటాడు రాజ్. ఇది వద్దు, దీని సావాసం కూడా వద్దు.. దీనికి మన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వొద్దని అంటుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X