Brahmamudi November 7th Episode: అక్క కాపురాన్ని నిలబెట్టిన కావ్య.. స్వప్న కాళ్లపై పడ్డ రాహుల్

Photo Courtesy: JioHotstar

కోయిలి ఏర్పాటు చేసిన పబ్ సెటప్‌ని చూసి రాహుల్ మండిపడతాడు. కోయిలితో నేను డ్యాన్స్ చేస్తానంటూ ఆమె చేయి పట్టుకోగా.. మందు కలపమని గోల్డ్ బాబు అడుగుతాడు. రాహుల్ కలపకపోయేసరికి అతనిపై కోయిలి సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా మా అక్క విలువ ఏంటో తెలిసిందా? దీనినే నమ్ముకుంటే నువ్వు చివరికి మందు కలుపుకుంటూ ఉండటమేనని వార్నింగ్ ఇస్తుంది కావ్య. పీకలదాకా తాగిన కోయిలి, రాహుల్, గోల్డ్ బాబులు నిద్రపోతారు.

ఉదయాన్నే నిద్రలేచిన రాజ్ వెంటనే గోల్డ్ బాబును నిద్రలేపి కోయిలి గదిలోకి పంపిస్తాడు. ఆ వెంటనే రాహుల్‌ని నిద్రలేపి కోయిలి రూమ్‌లో గోల్డ్ బాబు ఉన్నాడని చెబుతాడు. రాహుల్ వెళ్లి చూడగా గోల్డ్ బాబు, కోయిలిలు వాటేసుకుని పండుకుంటారు. అది చూసిన రాహుల్ కోపంతో రగిలిపోతాడు. డబ్బు కోసమే కోయిలి నిన్ను ట్రాప్ చేసిందని.. వీరిద్దరూ కేరాఫ్ ఫ్లాట్‌ఫాం అని రాజ్ చెప్పడంతో రాహుల్ మండిపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 7వ తేదీ ఎపిసోడ్ 872లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 7th 2025 Episode 872 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కోయిలి నాటకం బయటపడిపోవడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇది నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు, దానికి మన ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెబుతుంది కావ్య. మేం డ్రామాలు ఆడటం లేదు.. నువ్వే కళ్లారా చూశావు కదా అని అంటాడు రాజ్. ఇప్పటికైనా ఇంటికొస్తే బతికి పోతావు.. లేదా అది ఇలాగే రోజుకొకరినీ అంటాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుపడతావని రాహుల్‌కి చెబుతాడు రాజ్. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో రాజ్, కావ్య, గోల్డ్ బాబులు సంబరపడిపోతుంటారు. మనం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది.. ఇప్పటికైనా మనం యాక్టింగ్‌లో కింగ్ అని అంటాడు గోల్డ్ బాబు. ఇక మీ ముసలి వేషాలు ఎందుకు తీసేయమంటాడు.. దాంతో ఇద్దరూ తీసేస్తారు. ఆ కోయిలిని, నన్ను ఒకే బెడ్ మీద చూసేసరికి ఆ రాహుల్ గాడి ముఖం వాడిపోయిందని చెబుతాడు.

మనం నిజం తెలిసేలా చేశాం కానీ ఆ కోయిలి ఏదైనా మాయ చేస్తుందని కావ్య భయపడుతుంది. ఎంత మాయ చేసినా ఆ కోయిలి దగ్గర డబ్బు లేదని ప్రూవ్ చేశాం కదా? ఇక రాహుల్ మాత్రం ఎందుకు ఉంటాడని అంటాడు రాజ్. ఆ అమ్మాయి ఏడ్చి ఏదైనా మాయ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తుంది కావ్య. రాహుల్ గాడికి బంధాలు, అనుబంధాల కంటే డబ్బంటేనే ఇష్టమని కోయిలి దగ్గర డబ్బు లేదని తెలిస్తే 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండడని చెబుతాడు రాజ్. వీరి మాటలన్నీ విన్న కోయిలి భర్త రంజిత్ కొత్త ప్లాన్ వేస్తాడు.

కోయిలిని లాగిపెట్టి కొట్టిన రాహుల్.. నేనంటే ఇష్టమని చెప్పావు, నాతోనే లైఫ్ అన్నావు, నా పెళ్లానికి విడాకులు ఇవ్వమన్నావు, ఇప్పుడు ఎవరో ఒకడు రాగానే ఇలా చేస్తావా అని మండిపడతాడు. నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు, నువ్వు చూసినదంతా నిజం కాదని చెబుతుంది కోయిలి. నీ దగ్గర కోట్ల ఆస్తి ఉంది అన్నది అబద్ధం, మనం పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సుఖంగా ఉండొచ్చని చెప్పినది అబద్ధం అంటాడు. నా దగ్గర కోట్లు ఉన్నాయని తెలిసి నన్ను వలలో వేసుకోవాలని చూశావు.. నా కంటే డబ్బున్న వాడు రాగానే వాడికి లొంగిపోయావు, నువ్వు బజారు దానికంటే హీనమని మండిపడతాడు రాహుల్.

దాంతో కోప్పడిన కోయిలి.. నా డబ్బు కోసం ఆశపడ్డ నిన్ను ఏమనాలని కోయిలి ప్రశ్నిస్తుంది. నా భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు నీ మొగుడిని పక్కన పెట్టుకుని వాడిని మావయ్య అన్నావని మండిపడతాడు. పెళ్లయి, ఒక బిడ్డకు తండ్రివి అయ్యుండి నాతో కులుకడానికి వచ్చిన నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? అని క్లాస్ పీకుతుంది కోయిలి. మేం నిన్ను ట్రాప్ చేసి నీ చేతే నీ పెళ్లానికి విడాకులిచ్చి, నిన్ను పెళ్లి చేసుకుని నీ ఆస్తిని కొట్టేయాలని అనుకున్నామని కోయిలి అంటుంది. నిన్ను మించిన గోల్డ్ బాబు బంగారు బిస్కెట్స్‌తో నాకు తగిలాడు.. నువ్వు నన్నేం చేయగలవు అని ప్రశ్నిస్తుంది కోయిలి. నీలాంటి వాళ్లు నా చేతుల్లో చాలామంది ఔట్ అయ్యారని అంటుంది.

నా కళ్లు బాగా తెరిపించావు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని అంటాడు రాహుల్. అరిచినా, తిట్టినా నా పెళ్లాం దేవత.. నీ కోసం దానిని బాధపెట్టినందుకు నాకు ఇలా జరగాల్సిందే అంటాడు రాహుల్. అది కూడా నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుందని కోయిలి అనడంతో రాహుల్ కోపంతో ఆమెను లాగిపెట్టి కొడతాడు. దాంతో కోయిలి నేల మీద పడిపోతుంది. ఇదంతా రంజిత్ ఫోన్‌లో వీడియో తీస్తాడు. తమ నాటకం సక్సెస్ అయి కోయిలి బండారం బయటపెట్టిన విషయాన్ని రాజ్- కావ్యలు చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషిస్తుంది. రాహుల్ గాడి కళ్లు తెరిపించి, స్వప్న జీవితాన్ని నిలబెట్టారని మెచ్చుకుంటారు.

ఓ దుర్మార్గురాలి వలలో చిక్కుకోకుండా నా కొడుకుని కాపాడారని మీకు రుణపడి ఉంటారని అంటుంది రుద్రాణి. బాధపడుతూ ఇంటికి వచ్చిన రాహుల్‌ గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. రాహుల్ లోపలికి అడుగుపెట్టబోతుండగా స్వప్న ఆగమంటుంది. తప్పులు చేయడం నీకు అలవాటు అయిపోయింది, ఈ ఇంట్లో వాళ్లకి ఆనవాయితీ అయిపోయింది.. నీతో కాపురం నాకు బరువైపోయిందని అంటుంది స్వప్న. నువ్వు పుట్టిందే తప్పులు చేయడానికి, నువ్వు ఎప్పటికీ మారవని నాకు తెలిసిపోయింది.. ఇకపై నీతో కాపురం చేయలేనని తేల్చేస్తుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

కావ్య నచ్చజెప్పాలని చూసినా స్వప్న వినిపించుకోదు. నీ బాధకు, కన్నీటికి నేనే కారణం... నన్ను క్షమించమని రాహుల్ అంటాడు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఇదే చెప్పావు.. నీ మనసు మారిందా? అని నిలదీస్తుంది స్వప్న. రేపు నా బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత ఇలాంటి నీచుడు నీ తండ్రి అని నేను చెప్పలేనని అంటుంది. ఈరోజు ఒకరి మోసం నీ విలువ నాకు తెలిసేలా చేసింది, క్షమించి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని రాహుల్ బతిమలాడతాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నచ్చచెప్పడంతో స్వప్న మనసు మార్చుకుంటుంది. ఇదే నీకు చివరి అవకాశమని చెబుతుంది. నాలో వచ్చిన మార్పుని నువ్వే చూస్తావు కదా అని అంటాడు రాహుల్.

ఇంటికొచ్చాక రాహుల్‌ని లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. ఇలాగే తప్పులు చేస్తూ, లేకి పనులు చేస్తూ దొరికిపోతూ అందరిముందు తలదించుకుంటావా? ఎందుకు పనికిరాని వాడిలా బతుకుతావా? అని నిలదీస్తుంది రుద్రాణి. నువ్వు మహారాజులా బతకాలని కలలు కన్నాను.. నిన్ను అందరూ చీడపురుగులా చూశారని మండిపడుతుంది. బుద్ధి గడ్డి తిని ఇలా చేశా.. ఇలా అవుతుందని అనుకోలేదని అంటాడు రాహుల్. నువ్వు నమ్మాల్సింది బయటివాళ్ల మీద కాదు.. నువ్వు ప్లాన్లు వేయాల్సింది అనామకుల మీద కాదు, దాని మీద నాకు డౌట్ ఉందని కూడా అన్నాను అని గుర్తుచేస్తుంది రుద్రాణి. నేను ఎన్ని వెధవ పనులు చేసినా ఈ ఇల్లు నన్ను క్షమిస్తుందంటే నమ్మకం వల్లేనని అంటుంది. ఇకపై ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా గుడ్డిగా నన్ను ఫాలో అయిపో నేను చూసుకుంటానని చెబుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X