Brahmamudi November 8th Episode: కోయిలి దారుణహత్య.. రాహుల్‌ను ఈడ్చుకెళ్లిన పోలీసులు
Photo Courtesy: JioHotstar
కోయిలి బాగోతం బయటపడటంతో ఇప్పటికైనా స్వప్ప గొప్పదనం ఏంటో గుర్తించమని రాహుల్‌కు క్లాస్ పీకుతాడు రాజ్. ఇక ఈ ఇంట్లో ఉండొద్దని మన ఇంటికి వెళ్లిపోదామని చెప్పి గోల్డ్‌బాబుని, కావ్యని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. రాహుల్ గాడికి కోయిలి గురించి కళ్లు తెరిపించామని రాజ్, కావ్య, గోల్డ్ బాబు సంబరాలు చేసుకుంటారు. వీరి మాటలు విన్న రంజిత్ లోపలికి వెళ్లి చూడగా.. రాహుల్ - కోయిలిలు గొడవపడతూ కనిపిస్తారు. నీ కారణంగా నా స్వప్న గొప్పదనం ఏంటో తెలిసిందని కోపంలో కోయిలిని కొట్టడంతో ఆమె వెళ్లి నేలకు కొట్టుకుంటుంది.
కోయిలి ఇంట్లో తాము ఏం చేశామో దుగ్గిరాల కుటుంబానికి చెబుతారు రాజ్ - కావ్య. ఇంతలో రాహుల్ ఇంటికి రావడంతో అతనిని గుమ్మంలోనే ఆపుతుంది స్వప్న. నేను పూర్తిగా మారిపోయానని.. నాకొక అవకాశం ఇవ్వమని అడుగుతాడు. దుగ్గిరాల కుటుంబం మొత్తం చెప్పడంతో రాహుల్‌ను క్షమిస్తుంది స్వప్న. కొడుకుని లోపలికి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. నేను ఆరోజే కోయిలి గురించి డౌట్ పడ్డానని, కాస్తలో తప్పిపోయిందని లేదంటే నీ బతుకు నాశనం అయ్యేదని రాహుల్‌పై మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 8వ తేదీ ఎపిసోడ్ 873లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రాహుల్ కిందకి వస్తాడు. నిన్న జరిగింది ఇంకా మరిచిపోలేదా? అని రాజ్ అడగ్గా.. జరిగింది మరిచిపోకపోతేనే భవిష్యత్‌పై భయం ఉంటుందని అంటుంది స్వప్న. కిచెన్‌లో కావ్య వంట చేస్తుండగా రాజ్ సరసాలు ఆడతాడు. నీ లిప్పుని తాకిన కాఫీ కావాలని అడుగుతాడు. కాఫీ కావాలంటే హాల్‌లో నుంచే అడగొచ్చు కదా అని మండిపడుతుంది కావ్య. ఇంట్లో డల్‌గా కూర్చొని ఉండకపోతే ఆఫీస్‌లో పనులు చూసుకోవచ్చు కదా అని రాహుల్‌తో అంటుంది ఇందిర. వాడు ఆఫీసుకు వెళితే పనులు జరిగినట్లేనని సుభాష్ సెటైర్లు వేస్తాడు. వాడితో ఏం చేయిస్తే దారిలో పడతాడో అర్ధం కావడం లేదని అంటుంది రుద్రాణి. నీ వెంట తిరిగే పని మానుకుంటే అంతా బాగానే ఉంటుందని సెటైర్లు వేస్తుంది అపర్ణ. ఇంతలో ఇంటికి పోలీసులు రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.
ఇక్కడ రాహుల్ ఎవరు అని ఎస్ఐ అడగటంతో నేనే అని చెబుతాడు రాహుల్. దాంతో రాహుల్‌ని అరెస్ట్ చేయమని చెబుతాడు ఎస్ఐ. ఏం జరిగింది? వాడు ఏం చేశాడని అరెస్ట్ చేస్తున్నారని రాజ్ నిలదీస్తాడు. అతను కోయిలి అనే అమ్మాయిని మర్డర్ చేశాడని ఎస్ఐ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇతను కోయిలిని కొట్టడం వల్లే చనిపోయిందని ఆమె భర్త కేసు పెట్టాడని పోలీసులు చెబుతారు. మా వాడు అలాంటి వాడు కాదు.. మీరు ఎవరినో చూసి ఏదో అనుకుంటున్నారని అంటుంది రుద్రాణి. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అవసరం మాకు లేదని చెబుతాడు ఎస్ఐ. మావాడు మనుషుల ప్రాణాలు తీసేంత చెడ్డవాడు కాదు, ఎక్కడో ఏదో తేడా జరిగిందని అంటాడు రాజ్.
నీకు కోయిలి అనే అమ్మాయి తెలుసా? నిన్న నీకు కోయిలికి గొడవ జరిగిందా? ఆ గొడవలో నువ్వు తనని బలంగా కొట్టావా? అని రాహుల్‌ను ఎస్ఐ ప్రశ్నిస్తాడు. జస్ట్ తోశాను, కానీ అంతమాత్రానికే ఎలా చనిపోతుందని రాహుల్ అంటాడు. అదంతా కోర్టులో తేల్చుకోండని చెబుతాడు ఎస్ఐ. ఇతను నిర్దోషని తేలితే జడ్జి గారే వదిలేస్తారని రుద్రాణి బతిమలాడుతుంది. అయినప్పటికీ రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నా కొడుకుని పోలీసులు తీసుకెళ్తుంటే ఎవరూ పట్టించుకోరా అని రుద్రాణి మండిపడుతుంది. ఎస్ఐ అడిగిన ప్రతి ప్రశ్నకు వాడు అవునని సమాధానం చెప్పాక ఎలా ఆపమంటావని రుద్రాణిని ప్రశ్నిస్తాడు సుభాష్. వాడు పెళ్లాన్ని వద్దు అని ఇంకో ఆడదాని వెనుకే పడ్డాడని అనుకున్నాం.. నా మనవడు, మనవరాలి వల్ల వాడికి బుద్ధి వచ్చిందని నమ్మి ఇంట్లోకి రానిచ్చామని, కానీ వాడు ఒక మనిషి ప్రాణమే తీస్తాడని అనుకోలేదని అంటుంది ఇందిర.
వాడు మారి మనిషి అయ్యాడని సంతోషించాలా? లేక ఒక మనిషి ప్రాణం తీశాడని ఆశ్చర్యపోవాలా? అని ఏం అర్ధం కావడం లేదని చెబుతుంది అపర్ణ. తన కళ్లముందే నా భార్యను చంపాడని దాని భర్తే చెప్పాక మనం చేయగలిగింది ఏం ఉంటుందని చెబుతాడు ప్రకాశం. ఇంట్లో గొడవతో స్వప్న ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. స్వప్నని రాజ్, కావ్యలు ఓదారుస్తారు. పోలీసులు రాహుల్‌ని తీసుకెళ్లినందుకు నేను బాధపడటం లేదని, నేను ఇంకోసారి మోసపోయానని బాధపడుతున్నానని అంటుంది స్వప్న. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో? అక్కడ ఏం జరిగిందో? తెలియదు కదా అని అంటాడు రాజ్. రాహుల్‌ని మార్చామని అనుకున్నారు? కానీ వాడు మారిపోయే రకం కాదని చెబుతుంది స్వప్న.
నేను రాహుల్‌ను నమ్మను అంటే మీరే వాడికి ఒక అవకాశం ఇవ్వమన్నారని చెబుతుంది స్వప్న. రాహుల్ డబ్బు మీద ఆశ ఉన్నవాడే, బాధ్యత లేనివాడే, కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్‌కు లేదని అంటుంది కావ్య. కానీ కళ్లముందే సాక్ష్యాలు కనిపిస్తున్నాయని అంటుంది స్వప్న. కళ్లముందు కనిపించేదంతా నిజం కాదని, వాడి గురించి మాకంటే నీకే ఎక్కువ తెలుసని చెబుతారు. మరోవైపు.. రుద్రాణికి కోయిలి భర్త రంజిత్ ఫోన్ చేసి.. మీ కొడుకు చంపేసిన కోయిలి భర్తనని చెబుతాడు. మీరు చాలా తెలివైన వాళ్లని అంటాడు రంజిత్. నా కొడుకుని అన్యాయంగా ఇరికించిందే కాకుండా ఇప్పుడు నన్ను బెదిరించడానికి కాల్ చేశావా అని మండిపడుతుంది రుద్రాణి. మీతో ఒక డీల్ మాట్లాడటానికి ఫోన్ చేశానని చెబుతాడు రంజిత్.
మీ వాడు నా భార్యను చంపుతుండగా లైవ్‌లో తీసిన వీడియో నా దగ్గర సాక్ష్యంగా ఉందని రంజిత్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అది పోలీసులకు ఇస్తే... కోర్టు మీవాడికి జీవిత ఖైదు విధిస్తుందని బెదిరిస్తాడు. కానీ మీ కొడుక్కి శిక్ష వేయడం వల్ల నాకొచ్చిన ప్రయోజనం ఏం లేదని, నా భార్య ఎలాగూ చనిపోయిందని అందుకే డీల్ మాట్లాడుకుందామని అంటాడు రంజిత్. కోర్టులో నువ్వు ఆ వీడియో చూపించకుండా ఉండాలంటే నీకెంత కావాలి? అని అడుగుతుంది రుద్రాణి. నాకు మీరు 2 కోట్ల రూపాయలు ఇస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తానని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతుండగా రంజిత్ ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు అడిగిన విషయాన్ని చెబుతుంది రుద్రాణి.
లంచం ఇచ్చి నీ కొడుకుని కాపాడటమంటే నీ కొడుకు చేసిన హత్యని సమర్ధించడమేనని అంటాడు సుభాష్. నేను నీ రక్తం కాదు కాబట్టే ఎవ్వరూ నాకు సాయం చేయడం లేదని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో మండిపడ్డ ఇందిర.. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ నిన్న కానీ రాహుల్‌ని కానీ పరాయి వాళ్లుగా చూడలేదని అంటుంది. ఇంట్లో ఉంచుకుని నాలుగు మెతుకులు పెట్టి, రెండు చీరలు కొనిస్తే కూతురిలా చూసుకోవడం అంటారా అని మండిపడుతుంది రుద్రాణి. రాహుల్ ఈ ఇంటి మనిషి అని మేం అనుకోకపోతే.. వాడిని వెతుక్కుంటూ కోయిలి ఇంటికి ఎందుకు వెళ్తామని అంటాడు రాజ్. మేం ఎవ్వరూ రాహుల్ హత్య చేయలేదని నమ్మితే.. నువ్వు మాత్రం కొడుకుని నమ్మడం లేదని మండిపడతాడు. వాడు తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి తీసుకురావాలని అనుకుంటున్నామని చెబుతాడు రాజ్.
రాహుల్‌ని ఆ అమ్మాయిని చంపనప్పుడు ఎవరికీ మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది కావ్య. సినిమా డైలాగులు కోర్టుకు సరిపోవని, సాక్ష్యాలు కావాలని చెబుతుంది రుద్రాణి. నేను ఆ రంజిత్‌ని కలిసి నా కొడుకుని బయటికి తీసుకొస్తానని కోపంగా వెళ్లిపోతుంది. నువ్వు రుద్రాణి అత్తయ్య పక్కనే ఉండు, మేం సాక్ష్యాన్ని తీసుకొస్తామని చెబుతాడు రాజ్. మేం ఆ ఇంటికి వెళ్లినప్పుడు కళావతి ఆ ఇంట్లో ఒక కెమెరా పెట్టిందని అందులో అసలు ఏం జరిగిందో తెలిసిపోతుందని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










