Brahmamudi August 26th: కావ్య కోసం రాజ్ ఫైట్... పెళ్లాంపై ఇంత ప్రేముందా బాస్?
బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యను కొంతమంది అల్లరి మూక ఏడిపిస్తుంది. కావ్యపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద కావ్య నిలబడి ఉంటుంది. అటుగా రాజ్ కారులో వెళ్తుంటాడు. కావ్యను చూసి కొంత దూరంలో కారు ఆపుతాడు. ఇక మరోవైపు కావ్యను రౌడీలు ఏడిపిస్తుంటారు. ఇది చూసిన రాజ్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. వారిని ఎలా ఫేస్ చేశాడు.. మరోవైపు అపర్ణ.. కావ్యతో మాట్లాడొద్దని కండిషన్ అందరూ ఫాలో అయ్యారా అనే విషయాలు ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
కల్యాణ్ ను ఏంజిల్ హోటల్ దగ్గరకు రమ్మంటుంది. నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ చేతిలో పట్టుకుని బ్లూ డ్రెస్సులో ఉంటానని చెబుతుంది. దీంతో ఎలాగైనా కలవాలి అని బయల్దేరుతాడు కల్యాణ్. మరోవైపు కావ్య రోడ్డు మీద నిల్చొని ఉంటుంది. అక్కడకు కొంతమంది రౌడీలు వచ్చి... కావ్యను ఏడిపిస్తారు. అప్పుడే రాజ్ కారులో వస్తాడు. భార్యగా నన్ను ఒప్పుకోరని, మరి ఇప్పుడు వస్తారా లేదా అని అనుకుంటుంది కావ్య.

మరోవైపు రాజ్ కారులో ఉండి... ఆలోచిస్తుంటాడు. నా మీద అరుస్తుంది, మరీ వీళ్లను ఏం అనడం లేదని రాజ్ అనుకుంటాడు. అప్పుడే రౌడీలు వచ్చి.. కావ్యను ఎక్కువగా ఏడిపిస్తారు. దీంతో రాజ్ వెనక్కు వస్తాడు. ఆయనలో ఉన్న భర్త ఇప్పుడు బయటకు వచ్చాడన్నమాట అనుకుంటుంది కావ్య. రాజ్ కిందకు దిగుతాడు. ఎవరు నువ్ అని రౌడీలు అడుగుతారు. అమ్మాయికి ఏమవుతావ్ అని ప్రశ్నిస్తారు. వాళ్లను రాజ్ కొడుతాడు. మీరు ఆవిడ భర్త.. రియలైజ్ అయ్యాం సర్ అంటారు. మళ్లీ కొడతాడు రాజ్.. నేను తాళి కట్టానని చెప్పాను కానీ.. భర్తను అని చెప్పానా అని అంటాడు రాజ్. అక్కడ నుంచి రౌడీలు వెళ్తారు. కావ్య వచ్చి కారులో కూర్చొంటుంది.

అప్పును అనామిక దగ్గరకు తీసుకెళ్తుండగా... అదే సమయంలో బైక్ ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ అవ్వదు. దీంతో అటుగా వెళ్తున్న కారును ఆపి.. లిఫ్ట్ అడిగి వెళ్లిపోతాడు. కానీ అందులో ఉండేది అనామిక. ఆ విషయం తెలియక.. మాట్లాడుతూ వెళ్తాడు. మరోవైపు కారులో కావ్య రాజ్ వెళ్తారు. నా మీద బాగానే ప్రేమ చూపించారు అని, అదేదో బయటకు చూపించొచ్చు కదా అనుకుంటుంది. కావ్యతో ఎవరూ మాట్లాడేందుకు వీలులేదని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. ఎవరైనా సరే.. పలకరించినా సరే పలకకూడదని అంటుంది. మాకు కావాల్సింది అదే.. పర్మినెంట్ గా ఇంట్లో నుంచి గెంటేస్తే సరి అని రుద్రాణి అనుకుంటుంది.

అప్పుడే కారులో కావ్య, రాజ్ దిగుతారు. కావ్య బ్యాగును కారులోనే వదిలేస్తుంది. అది పట్టుకుని వస్తాడు రాజ్. అపర్ణకు మండిపోతుంది. రాజ్ వైపు చూస్తుంది. నీ కొడుకు నీ మాటే ఫాలో అవుతాడు అన్నావ్, పెళ్లాన్ని ఫాలో అవుతూ వచ్చాడని రుద్రాణి వెటకారం చేస్తుంది. బాగా కవర్ చేసుకుని వెళ్లిపోయాడని అంటుంది రుద్రాణి. కారులో ఎందుకు తీసుకుని వచ్చాడని అంటుంది.

కల్యాణ్ రెస్టారెండ్ వచ్చేస్తాడు. అనామిక కోసం చూస్తాడు. అప్పుడే ఓ అమ్మాయి వస్తుంది. అనామిక నేనే అంటుంది. మనం మాట్లాడుకునే టైమ్ లేదని, మా ఆయన చూస్తే ఊరుకోరు అని చెబుతుంది. మీకు పెళ్లయిందా అని షాక్ అవుతాడు కల్యాణ్. ఇదిగో గిఫ్ట్ తీసుకోండని అనగా.. మీ ఆయనకే ఇవ్వమని చెబుతాడు కల్యాణ్. ఆయనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చానని, నేను తల్లిని కాబోతున్నానని అంటుంది. గిఫ్ట్ తీసుకుని వెళ్తాడు కల్యాణ్. ఇదంతా దూరం నుంచి చూసిన అనామిక నవ్వుకుంటుంది.

కావ్య టీ పెడుతుంది. అమ్మమ్మ వాళ్లకు ఇవ్వాలా టీ ఇవ్వడం ఆలస్యమైందని అనుకుంటుంది. టీ తీసుకుని వెళ్తుంది కావ్య. ఇందిరా దేవి తీసుకోదు. ముఖం తిప్పుకుంటుంది. రుద్రాణి ఎలాగైనా కావ్యను బాధపెట్టాలనుకుంటుంది. నీకు రెండె ఆప్షన్స్ ఉన్నాయని చెబుతుంది. మీ అత్తగారి దగ్గర బానిసలాగా బతకాలని, లేదంటే.. మీ పుట్టింటికి వెళ్లి మట్టి పిసుకోవ్వాలని చెబుతుంది. కావ్య ఏం సమాధానం ఇచ్చిందో తెలియాలంటే.. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











