Brahmamudi september 2nd, episode: ప్రాణాపాయ స్థితిలో అపర్ణ.. రాజ్‌పై రాహుల్, రుద్రాణి నేరం!
అప్పు వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్న రాహుల్ కి రుద్రాణి కి చుక్కలు చూపిస్తుంది స్వప్న. రాజ్ ముందు కావ్యని ఫూల్ చేయడానికి స్వప్నని ట్రాప్ చేస్తారు రాహుల్, రుద్రాణి. విషయం తెలియని స్వప్న జరిగింది నిజమేమో అనుకుని కావ్యకి చెప్తుంది. అందరి ముందు రాహుల్ బండారం బయటపెట్టాలనుకుంటారు స్వప్న, కావ్య కానీ వాళ్లే ఫూల్స్ అయిపోతారు. మరోవైపు ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 2 వ తేదీ ఎపిసోడ్ 504 లో ఏం జరిగిందంటే..
నడిచిపోతుంది కదా అని ఇక్కడే ఆగిపోకండి, ప్రపంచానికి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిచయం చేసుకోండి. అప్పుడు మీ ఇల్లు మిమ్మల్ని అసాధ్యుడిగా గుర్తిస్తుంది అని కళ్యాణ్ చేతిలో డబ్బులు పెట్టి అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. తర్వాత వెళ్తున్న దారిలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి జాగ్రత్త అని కళ్యాణ్ ని మరోసారి హెచ్చరించి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు హాల్లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అపర్ణకి ఛాతిలో మంటగా అనిపిస్తుంది. ఆమె ఎదురుగా కూర్చుని వర్క్ చేసుకుంటున్న సుభాష్ అది గమనించి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు.

అయినా ఏమి మాట్లాడదు అపర్ణ. కానీ పెయిన్ ఎక్కువ కావడం తో అపర్ణ ఇబ్బంది పడటం గమనించి ఆమె దగ్గరికి వెళతాడు సుభాష్. కానీ అతడిని కనీసం తనని ముట్టుకొనివ్వదు. వెంటనే సుభాష్ కంగారుగా రాజ్ ని తీసుకొని వస్తాడు. రాజ్ తల్లి కి ధైర్యం చెబుతూ తండ్రి తో డాక్టర్ కి ఫోన్ చేయమని చెప్తాడు. సుభాష్ డాక్టర్ కె ఫోన్ చేసిన కాసేపటికి డాక్టర్ వచ్చి అపర్ణని చెక్ చేస్తాడు. అపర్ణ టాబ్లెట్లు వేసుకోవటం లేదని తెలుసుకుంటాడు.
తర్వాత టాబ్లెట్లు రాసిచ్చి ఎలా వాడాలో రాజ్ కి చెప్తాడు. హాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు సుభాష్. ఆమె టాబ్లెట్లు వేసుకోవడం లేదు అని చెప్తాడు డాక్టర్. మా ఎవరికి చెప్పలేదు అంటుంది ఇందిరా దేవి. ఆమెకి బిపి ఎక్కువగా ఉందని గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎలాంటి ప్రెజర్ ఇవ్వద్దని, అవసరమైతే తనకి వెంటనే కాల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్.

అపర్ణ ని సరిగ్గా పట్టించుకోలేదని కావ్య తో వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. నువ్వు ఇంట్లో మనిషివే కదా నువ్వెందుకు బాధ్యత తీసుకోలేదు అని రుద్రాణిని చివాట్లు పెడుతుంది ఇందిరా దేవి. నేనేం చెప్పినా వదిన పట్టించుకోదు కదా అంటుంది రుద్రాణి. అప్పుడు కావ్య మాట్లాడుతూ లేదు, నేను మొదటిసారి తప్పు చేశాను అత్తయ్య మీద అశ్రద్ధ వహించాను ఇకమీదట అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది కావ్య.
టాబ్లెట్లు ఎలా వాడాలో భార్యకి చెప్పి దగ్గరుండి చూసుకోమంటాడు రాజ్. నీకు వీలు కుదరకపోతే నాకు చెప్పు అంతేకానీ ఇకమీదట అమ్మని అశ్రద్ధ చేయటానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు అప్పుకి తను సంపాదించిన 500 చేతిలో పెడతాడు కళ్యాణ్. జాబ్ లో జాయిన్ అయ్యావా, అంత త్వరగా జాబ్ ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది అని అడుగుతుంది అప్పు.
ఆమెకి నిజం చెప్పకుండా డాటా ఎంట్రీ లో జాబ్ చేస్తున్నాను అని చెప్తాడు కళ్యాణ్. నువ్వు చదివిన చదివికి ఈ జాబ్ చాలా తక్కువ మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటుంది అప్పు. ఉద్యోగం చేస్తేనే ఇలా అయిపోతుంది డ్రైవర్గా చేస్తున్నాను అంటే అసలు చెయ్యనివ్వదేమో అని మనసులో అనుకొని ఈ ఉద్యోగం చేస్తూనే వేరే మంచి ఉద్యోగం చూసుకుంటానులే అని చెప్తాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ ఇంటికి పోలీసులు వస్తారు.
ఇలా వచ్చారేంటి అని అడిగిన సుభాష్ తో దొంగ బంగారం దొరికిందని ఎంక్వయిరీ చేస్తే అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చెందిందని తెలిసింది అందుకే వచ్చాము అంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన మా కంపెనీలో ఎప్పుడు ఇలా జరగలేదు అంటాడు సీతారామయ్య. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు రాజ్ చూసుకోవడం లేదు రాహుల్ చూసుకుంటున్నాడు అని చెప్తుంది అపర్ణ. నేను రెండు రోజుల నుంచే కంపెనీకి వెళుతున్నాను దాని గురించి నాకు పెద్దగా తెలియదు అంటాడు రాహుల్.
నిజం చెప్పు కంపెనీలో అందరు ఉద్యోగులు విశ్వాసం కలవాళ్లే , ఇలాంటి నీచమైన పని చేసే అవసరం నీకే ఉంది అంటాడు సుభాష్. అంటే మాకు విశ్వాసం లేదనా మీరు తప్పు చేసి ఆ తప్పుని నా కొడుకు మీద నెట్టేయాలని చూస్తే నేను ఊరుకోను, ఏమో ఎవరికి తెలుసు ఆ తప్పు రాజ్ చేశాడేమో అంటుంది రుద్రాణి. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ మీ తల్లి కొడుకులకి అసలు విశ్వాసం ఉండదు అంటాడు ప్రకాష్. స్వప్న అభిప్రాయం అడుగుతుంది ధాన్యలక్ష్మి.
నాకు నా భర్త మీదే అనుమానం, రాజ్ ఇలాంటి పని ఎప్పుడూ చేయడు అంటుంది స్వప్న. అసలు నువ్వు నా భార్యవేనా అని స్వప్నని కోప్పడతాడు రాహుల్. ఆ విషయం తెలియకూడదని నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తున్నాను, నేను నీ భార్యని అని తెలిస్తే నా పరువు పోతుంది అంటుంది స్వప్న. అప్పుడు రాజ్ మాట్లాడుతూ ఎక్కడో పొరపాటు జరిగింది రాహుల్, కంగారు పడొద్దు నైతిక బాధ్యత వహిస్తూ నేను పోలీసులకి కోపరేట్ చేస్తాను అంటాడు.
తరువాయి భాగంలో నువ్వు తప్పు చేసి ఆ నేరాన్ని నా కొడుకు మీద వేసేద్దామనుకున్నావా అని రాజ్ ని మందలిస్తుంది రుద్రాణి. పోలీసులు రాజ్ ని అరెస్టు చేసి తీసుకొని వెళ్తుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన కావ్య ఎవరు తప్పు చేశారు అనేది ఈ ఫైల్ చూస్తే మీకే తెలుస్తుంది అని ఒక ఫైల్ పోలీసులు చేతిలో పెడుతుంది. అది చదివిన ఎస్సై నేరం చేసింది రాహుల్ అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











