Brahmamudi September 3rd Episode: రాహుల్‌ను పోలీసులకు పట్టించిన కావ్య.. డిఫెన్స్‌లో రుద్రాణి!
రాజ్ ముందు కావ్యని ఫూల్ చేయడానికి స్వప్నని ట్రాప్ చేస్తారు రాహుల్, రుద్రాణి. విషయం తెలియని స్వప్న జరిగింది నిజమేమో అనుకుని కావ్యకి చెప్తుంది. అందరి ముందు రాహుల్ బండారం బయటపెట్టాలనుకుంటారు స్వప్న, కావ్య. కానీ వాళ్లే ఫూల్స్ అయిపోతారు. మరోవైపు ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు కళ్యాణ్. దొంగ బంగారం కేసులో రాజ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 3 వ తేదీ ఎపిసోడ్ 505లో ఏం జరిగిందంటే..
జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత వహించి తానే అరెస్టు అవుతాను అంటాడు రాజ్. నువ్వు తప్పు చేయలేదని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, చెయ్యని నేరం నెత్తి మీద వేసుకొని జైలుకు వెళ్లవలసిన అవసరం లేదు అంటుంది అపర్ణ. మీరు అనవసరంగా ఒక నిర్దోషిని జైలుకు తీసుకు వెళ్తున్నారు నాకు ఎందుకో రాహుల్ మీదే అనుమానంగా ఉంది అంటుంది స్వప్న. నాకోసం నువ్వు భర్తకి అత్తకి చెడు కావద్దు అని స్వప్నతో అంటాడు రాజ్.

నువ్వు నేరం చేసి నా కొడుకు మీద నెట్టేయ్యాలని చూస్తావా అని రాజ్ ని కోప్పడుతుంది రుద్రాణి. అలా చేయాలనుకున్న వాడే అయితే తాను ఎందుకు అరెస్టు అవుతానంటాడు అంటుంది అపర్ణ. సారీ అండి ఏ విషయమైనా మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పి రాజ్ ని అక్కడినుంచి తీసుకువెళ్లబోతుంటే అప్పుడే కావ్య ఒక ఫైల్ తీసుకువచ్చి పోలీసులకు ఇస్తుంది. ఎవరు నిర్దోషి అనేది ఈ ఫైల్ చూస్తే మీకే తెలుస్తుంది అంటుంది. ఆ ఫైల్ చూసిన ఎస్ఐ రాజ్ నిర్దోషి, మొత్తం నేరం చేసింది ఈ రాహుల్ అంటాడు.
అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను చెప్పాను కదా ఈ ఇంట్లో అలాంటి పాడు పనులు చేసేది రాహుల్ ఒక్కడే, వాడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లండి అంటుంది స్వప్న. నేనే తప్పు చేయలేదు నా మీద నిందలు వేస్తున్నారు అంటాడు రాహుల్. అపర్ణ అతని చెంప పగలగొడుతుంది. నువ్వే తప్పు చేసావని ఇక్కడున్న అందరికీ తెలుసు అయినా నా కొడుకుని అరెస్టు చేసి తీసుకు వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నావు కదా నీకేం ద్రోహం చేసాము అంటుంది. లేదు నా కొడుకుని ఇరికించటానికి ఆ కావ్య ఏదో కుట్ర పన్నుతుంది అంటుంది రుద్రాణి.
తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అలాంటిది నువ్వు నా కోడలిని అంటావా అయినా నీ కొడుకుని ఇంత చండాలంగా పెంచావేంటి అని తల్లి కొడుకులని అసహ్యించుకుంటుంది అపర్ణ. ఇందిరా దేవి కూడా రాహుల్ చేసిన పనికి చివాట్లు పెడుతుంది. తర్వాత రాహుల్ ని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. కావ్య స్వప్నకి క్షమాపణలు చెప్తుంది. నువ్వేం చేసావని క్షమాపణలు చెప్పటానికి, అతని మాటలు నమ్మి అతనికి భార్యని అయ్యాను, నేను మోసపోయాను అయినా నాకు రాహుల్ కి భార్యగా ఉండటం కన్నా ఈ ఇంట్లో నీకు అక్కగా ఉండడమే నాకు సంతోషం అంటుంది స్వప్న. తర్వాత ఇదంతా ఎలా చేశావు అని అడుగుతాడు రాజ్.
రాహుల్ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడే నేను శృతిని అబ్జర్వ్ చేయమని చెప్పాను అంటుంది కావ్య.రాజ్ ని సేవ్ చేసినందుకు ఇంట్లో వాళ్ళందరూ కావ్యని మెచ్చుకుంటారు, కానీ రుద్రాణి మాత్రం కోపంతో రగిలిపోతుంది. మరోవైపు తాను టిఫిన్ చేస్తానని బంటిని రెండు గంటలసేపు కూర్చోబెట్టి ఏదో టిఫిన్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్. పనంతా పూర్తి చేసుకుని వచ్చిన అప్పు ఇంకా టిఫిన్ కాలేదా ఆకలేస్తుంది అంటుంది. అప్పుడే కళ్యాణ్ టిఫిన్ తీసుకుని వస్తాడు. ఇది ఏం టిఫిన్ అని అడుగుతాడు బంటి. ఉప్మా అంటాడు కళ్యాణ్.
దానిని చూసిన బంటి ఉప్మా కాకుండా సాంబార్ చేసినట్లు ఉన్నావు, నాకు భవిష్యత్తు మీద చాలా ఆశలు ఉన్నాయి నేను పెద్దమ్మ ఇంట్లో తింటాను ఆ టిఫిన్ మీరే తాగండి అని చెప్పి పారిపోతాడు. దీనిని తింటే మోషన్స్ అవుతాయి నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను నువ్వు బయట తినేసి వెళ్ళిపో లేదంటే ఆఫీస్ కి లేట్ అవుతుంది అని అప్పు చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు రాహుల్ ని అరెస్టు చేయించినందుకు కావ్య ని మందలిస్తాడు రాజ్.
వ్యక్తిగత విషయాల కోసం సంస్థని నష్టపరచడం ఇష్టం లేదు అందుకే అలా చేశాను అంటుంది కావ్య.కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి తాతయ్య ఏమీ బాగుండటం లేదు, జరుగుతున్న పరిణామాలు ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయేమో అని భయంగా ఉంది అంటాడు రాజ్. అలాంటిదేమీ జరగదు మీరు వెళ్లి కంపెనీ బాధ్యతలు తీసుకోండి అంటుంది కావ్య. తొక్కలో సలహాలు ఇవ్వద్దు అని కోప్పడతాడు రాజ్.
మీరు ఏమైనా అనుకోండి నాకు రాహుల్ ని అరెస్టు చేయించే ఉద్దేశం లేదు కానీ కంపెనీ పరువును కాపాడడానికి అలా చేశాను అంటుంది కావ్య. మరోవైపు కొడుకు అరెస్టుతో ఒంటరి అయిపోయిన రుద్రాణి ఆలోచనలో పడుతుంది, ఒక మెట్టు తగ్గి సెంటిమెంట్ చూపించి నాన్నని ఎలాగైనా రాహుల్ ని బయటకు తీసుకు రమ్మని అడగాలి అనుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది. నా కొడుకు ఈ తప్పు చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు వాడిని ఎలాగైనా బయటికి తీసుకురండి అని తండ్రిని అడుగుతుంది రుద్రాణి, కుదరదు అంటాడు సీతారామయ్య.
తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన రాహుల్ నేను నిర్దోషిని అని తేలింది అందుకే పోలీసులు నన్ను ఇంటికి పంపించేశారు అంటాడు. కొడుకుని చూసిన ఆనందంలో నా కొడుకుని రక్షించమంటే తల్లితో కలిపి నాకు నీతులు చెప్పావు అని రాజ్ ని కోప్పడుతుంది రుద్రాణి. పోలీసులు రిలీజ్ చేశారంటే దాని అర్థం మీ కొడుకు తప్పు చేయలేదని కాదు అని రుద్రాణితో అంటుంది కావ్య.కావ్య ని కోప్పడతాడు రాజ్.


Click it and Unblock the Notifications











