Brahmamudi september 4 th episode: కన్నీటితో రాజ్‌తో రుద్రాణి.. నిర్దోషిగా రాహుల్ ఇంటికి!
రాహుల్ చేసింది నిజమేమో అనుకొని స్వప్న కావ్యకి చెప్తుంది. అందరి ముందు రాహుల్ బండారం బయటపెట్టాలనుకుంటారు స్వప్న, కావ్య. కానీ వాళ్లే ఫూల్స్ అయిపోతారు. మరోవైపు ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు కళ్యాణ్. దొంగ బంగారం కేసులో రాజ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. కానీ రాహుల్ ఆ తప్పు చేశాడు అని కావ్య నిరూపించడంతో రాహుల్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 4 వ తేదీ ఎపిసోడ్ 506లో ఏం జరిగిందంటే..
తన కొడుకుని విడిపించమని తల్లిదండ్రులని అడుగుతుంది రుద్రాణి. అది జరగని పని, వాడికి ఎంత పెద్ద బాధ్యత అప్పగించానో నీకు తెలుసు కదా అలాంటిది వాడు ఇంట్లో వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటానంటే నేను క్షమించను అంటాడు సీతారామయ్య. నా మొహం చూసిన విడిచిపెట్టు నాన్న అని బ్రతిమాలుతుంది రుద్రాణి. నీ మొహం చూస్తే అస్సలు విడిచిపెట్టాలనిపించదు, మేమే కాదు ఈ ఇంట్లో వేరే ఎవరైనా రాహుల్ ని విడిపిస్తాము అంటే మొదట అడ్డుపడేది మేమే అంటుంది ఇందిరా దేవి. వీళ్ళని బ్రతిమాలి కొని లాభం లేదు ఆ రాజ్ దగ్గరికి వెళ్తే కరిగిపోతాడు అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్లి రాహుల్ ని విడిపించమని అడుగుతుంది రుద్రాణి.

వాడు తప్పు చేయలేదు అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు రాజ్ . అవును వాడు తప్పు చేయడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటుంది రుద్రాణి. అలా అయితే కోర్టు వాళ్లే నిర్దోషిగా నిర్ధారించి బయటికి పంపిస్తారు అంటాడు రాజ్. అలా అని చీకట్లో బాణం వేసి ఊరుకోలేము కదా, తల్లి ప్రాణం ఊరుకోవటం లేదు వాడిని ఎలా అయినా విడిపించు, మీ అందరూ కలిసి పెరిగారు కదా ఆ మాత్రం జాలి లేదా కనీసం స్వప్న మొహం చూసిన రాహుల్ ని విడిపించు అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ లోపల సంధించిన అస్త్రాలు ఏవి పనికి రాలేదని ఇక్కడికి వచ్చి ఆఖరి అస్త్రం ప్రయోగిస్తున్నావా అంటుంది.
చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు కదా అలాంటి వాడి మీద జాలి లేదా అంటుంది రుద్రాణి, మాయతో తిరిగాడని నా కొడుకునే క్షమించలేదు కానీ వాడు తప్పు చేయలేదని నిరూపించుకొని కడిగిన ముత్యం లా బయటపడ్డాడు, అలాంటిది తప్పు చేసిన నీ కొడుకుని ఎలా క్షమిస్తాను అయినా నిన్న మేనల్లుడు అని చూడకుండా అన్ని మాటలు అన్నావు, ఈరోజు ఎలా వాడి దగ్గరికి వచ్చి విడిపించమని అడుగుతున్నావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని రుద్రాణిపై కోప్పడి రాజ్ ని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అపర్ణ.

ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది రుద్రాణి, ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి తీరుతాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత బిర్యానీ తింటున్న స్వప్న దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఆడదానివేనా నీ భర్త జైల్లో ఉంటే ఇక్కడ బిర్యాని తింటావా అని కేకలు వేస్తుంది. మీకోసం బాధపడటానికి మీరేమైనా మంచి పనులు చేశారా, మీ కొడుకు కుట్రలో స్వతంత్రాలు చేసి జైలుకు వెళ్ళాడు వాడి కోసం బాధపడకుండా మీరు కూడా కొంచెం బిర్యాని తినండి అంటుంది స్వప్న.
ఏం మహా పతివ్రతవే అనుకుంటూ కోడల్ని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా పోలీసులు రావడం గమనించిన ధాన్యలక్ష్మి మళ్ళీ మన ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి అంటుంది. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. పోలీసులు రాహుల్ తీసుకొని లోపలికి వస్తారు. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు.
రాహుల్ నిర్దోషి అని తేలింది అసలు నేరస్తులను పట్టుకున్నాం అంటాడు పోలీసు. ఎంత ఇచ్చి మేనేజ్ చేసావు అని రాహుల్ ని అడుగుతుంది అపర్ణ. అలాంటిదేమీ లేదు అంటారు పోలీసులు, వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చూశారా నా కొడుకు నిర్దోషిగా బయటపడ్డాడు నిన్న నా కొడుకుని విడిపించమని ఇంటిల్లిపాదిని అడిగితే ఇంటికి పట్టిన అష్ట దరిద్రం వదిలిపోయినట్లుగా మొహాలు పెట్టారు అని ఇంట్లో వాళ్ళందరినీ తిడుతుంది, స్వప్నని కూడా నానా మాటలు అంటుంది.

చివరిగా కావ్య ని కూడా తిట్టబోతే ఆమె తిరగబడుతుంది. మీ కొడుకు ఏమి అమాయకుడు కాదు, మీరు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తారో ఇంట్లో అందరికీ తెలిసిందే అయినా రాహుల్ బయటకు వచ్చి వేరెవరో జైలుకు ఎందుకు వెళ్లారో అన్ని కనుక్కొని బయటకు తీస్తాను, మీరేదో ఇంటిల్లిపాదిని ఎండగట్టినంత మాత్రాన మేము గిల్టీగా ఫీల్ అయిపోయి తలదించుకుంటాము అనుకోవద్దు అంటుంది కావ్య. ఆమెని మందలిస్తాడు రాజ్.
తరువాయి భాగంలో పూజా కార్యక్రమాల కోసం ఇంటిల్లపాది గుడికి వెళ్లాలనుకుంటారు. అపర్ణ నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను రాను మీరు వెళ్ళండి అంటుంది. అత్తయ్యకి తోడుగా నేను కూడా ఉండిపోతాను అంటుంది కావ్య. తర్వాత రాహుల్ తల్లి తో మాట్లాడుతూ ఈ సమయంలో అత్తయ్యకి ఏమైనా జరిగితే ఆ నేరం కావ్య మీద పడుతుంది అంటాడు రాహుల్. ఏమైనా జరగడం అంటే అంటుంది రుద్రాణి. అపర్ణ అత్తయ్య చచ్చిపోతే అంటాడు రాహుల్, ఆ మాటలకి షాక్ అవుతుంది రుద్రాణి.


Click it and Unblock the Notifications











