Brahmamudi september 5 th episode: రాహుల్ కి రుద్రాణికి క్షమాపణ చెప్పిన రాజ్.. అర్ధరాత్రి కనిపించకుండా పోయిన అ
అందరి ముందు రాహుల్ బండారం బయటపెట్టాలనుకుంటారు స్వప్న, కావ్య. కానీ వాళ్లే ఫూల్స్ అయిపోతారు. మరోవైపు ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు కళ్యాణ్. దొంగ బంగారం కేసులో రాజ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. కానీ రాహుల్ ఆ తప్పు చేశాడు అని కావ్య నిరూపించడంతో రాహుల్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. అయితే రాహుల్ తప్పు లేదని తెలుసుకొని పోలీసులు తిరిగి రాహుల్ ని రిలీజ్ చేస్తారు ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 5 వ తేదీ ఎపిసోడ్ 507లో ఏం జరిగిందంటే..
మీకేదో పరాభవం జరిగిపోయినట్లు ఇంటిల్లిపాదిని ఎండగడితే మేము గిల్టీ ఫీలింగ్ తో తలదించుకుంటాం అనుకుంటున్నారా అంటుంది కావ్య. అప్పుడు రాజ్ కావ్యని మందలించి చేసిన ఇన్విస్టిగేషన్లు అన్న మాటలు ఇంక చాలు, కనకపోయినా మా అమ్మమ్మ, తాతయ్య మా అత్తకి ఈ ఇంటి ఆడపడుచు హోదా ఇచ్చారు, ఆమె స్థాయిని తక్కువ చేస్తూ మాట్లాడే అర్హత నీకు లేదు అంటాడు. తర్వాత రుద్రాణి దగ్గరికి వెళ్లి ఆమెకి జరిగిన దానికి క్షమాపణ చెప్తాడు, తర్వాత రాహుల్ దగ్గరికి వెళ్లి అతనికి కూడా క్షమాపణ చెప్పి జరిగినదంతా ఒక పీడ కల లాగా మరిచిపో అంటాడు.

దేనిని మర్చిపోమంటావు మీ ఆవిడ ఇచ్చిన బిరుదులు, సన్మానాలని మరిచిపోమంటావా ఇంటిళ్లపాది నన్ను దోషిని చేసి అన్న మాటలు మర్చిపోమంటావా ఎన్నడూ లేనిది అపర్ణ అత్తయ్య కొట్టిన దెబ్బని మర్చిపోమంటావా అని ఆవేశంగా అడుగుతాడు. తర్వాత నేను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కంపెనీకి పట్టిన దరిద్రం దానంతట అదే వదిలిపోయింది అంటుంది స్వప్న. మరోవైపు సీతారామయ్య రాజ్ ని పిలిపించి ఈ కుటుంబం ముక్కలైపోతుందేమో అని భయంగా ఉంది, ధాన్యలక్ష్మి ఆస్తి పంపకాలు చేయమన్నప్పుడే ఇల్లు బీటలు వారటం ప్రారంభించింది.
ఇప్పుడు రాహుల్ జైలుకు వెళ్లి రావడంతో ఆ సమస్య మరింత పెద్దదయింది, ఈ ఇల్లు ముక్కలైపోవటం నేను భరించలేను కనీసం నేను బ్రతికి ఉన్నంతకాలం అయినా నా కుటుంబం ఒక్కటిగా ఉండాలి, అలా ఉంచే బాధ్యత నీదే. అలా ఉంచుతానని నాకు మాట ఇవ్వు అంటాడు సీతారామయ్య. అలాగే అంటూ తాత గారికి మాట ఇస్తాడు రాజ్. మరోవైపు రాహుల్ తో మాట్లాడుతూ ఇదంతా ఎలా జరిగింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది రుద్రాణి. ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఫేస్ చేయాలో ముందే ఆలోచించాను.

అందుకే నాకు బదులుగా వేరే వ్యక్తిని నా బదులు లొంగిపోవటానికి సిద్ధం చేశాను అంటాడు రాహుల్. కొడుకుని మెచ్చుకుంటుంది రుద్రాణి. నన్ను జైలుకు పంపించిన కావ్య ని వదిలిపెట్టేది లేదు అంటాడు రాహుల్. నాకు కావాల్సింది అదే దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటుంది రుద్రాణి దానికోసం మనం ఏమి చేయక్కర్లేదు ఇప్పటికే చేయని తప్పుకి జైలుకి పంపించిందని ఆ రాజ్ కావ్య మీద కోపంగా ఉన్నాడు, నా గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఆ మంచితనం చాలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి అంటాడు రాహుల్.
మరోవైపు తనకోసం పాలు తెచ్చిన భార్యతో ఇకమీదట నువ్వు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు, తాతయ్య ఈ ఇల్లు ముక్కలైపోతుందేమో అని భయపడుతున్నారు అంటాడు. చీడపురుగుల్ని ఏరి పారేస్తే ఇల్లెందుకు ముక్కలవుతుంది, అయినా నేను నిజం నిరూపించాను కాబట్టి మీరు జైలుకు వెళ్ళలేదు లేదంటే ఈపాటికి జైల్లో ఉండేవారు, అది నేను భరించలేను నాకు నా భర్త ముఖ్యం అందుకోసం నేను ఏమైనా చేస్తాను, ఈ ఇంటి కోడలుగా నాకు ఆ హక్కు ఉంది అంటుంది కావ్య.

అలా అయితే నాకు చెప్పి చెయ్యు, ఈ ఇంటిని మొక్కలు అవకుండా చూసుకునే బాధ్యత నాది ఏం జరిగినా నాకు చెప్పి చేయడం నీ బాధ్యత అంటాడు రాజ్. మరోవైపు నిద్రలో మెలకువ వచ్చిన కళ్యాణ్ కి తన పక్కన అప్పు లేకపోవడం చూసి కంగారు పడతాడు, చుట్టుపక్కల అంతా వెతుకుతాడు ఎక్కడా దొరకకపోవడంతో మళ్లీ ఇంటికి వచ్చి మెట్లు మీద కూర్చుంటాడు. అప్పుడే డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన అప్పుని చూసి కోపంతో కేకలు వేస్తాడు ఇప్పుడు నీ బాధ్యత నాది, నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఎంత కంగారు పడ్డానో అంటాడు.
అయినా నువ్వు మళ్ళీ డ్యూటీ కి ఎందుకు వెళ్తున్నావు నా మీద నమ్మకం తగ్గిపోయిందా అని కోప్పడతాడు. మొదటిసారి నువ్వు నా మీద కోప్పడుతున్నావు చాలా అందంగా ఉన్నావు ముందు నాతో రా అని చెప్పి తనతో పాటు గదిలోకి తీసుకు వెళుతుంది అప్పు. అక్కడ కళ్యాణ్ ని కళ్ళు మూసుకోమని చెప్పి బర్త్డే కేక్ కటింగ్ సెటప్ చేస్తుంది కళ్ళు తెరిచిన కళ్యాణ్ ఈ రోజు నా పుట్టినరోజు అనే విషయమే మరిచిపోయాను అనవసరంగా నీపై కోప్పడ్డాను అంటూ అప్పుని దగ్గరకు తీసుకుంటాడు.
మన పెళ్లి అంత షాక్ ఇచ్చింది మరి, అంటూ అతనికో గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయమంటుంది. కళ్యాణ్ గిఫ్ట్ ఓపెన్ చేసేసరికి అందులో పెన్నులు, పేపర్ బండిల్స్ ఉండటం చూసి ఏం చేసుకోమంటావు అంటాడు. కవివి కదా కవితలు రాసుకో అంటుంది అప్పు. ఇల్లు ఎలా గడుస్తుంది అంటాడు కళ్యాణ్. నేను ఉన్నాను కదా అంటుంది అప్పు, ఆమె వైపు కోపంగా చూస్తాడు కళ్యాణ్. ఆమె నవ్వుతూ సరేలే కాళీ ఉన్నప్పుడు రాసుకో అంటుంది.

తరువాయి భాగంలో పూజా కార్యక్రమాల కోసం ఇంట్లో అందరూ గుడికి వెళ్లాలనుకుంటారు. అపర్ణ ఒంట్లో బాగోక పోవడంతో తాను ఇంట్లోనే ఉండిపోతాను అంటుంది. ఆమెకి తోడుగా నేను కూడా ఇంట్లోనే ఉంటాను అంటుంది కావ్య. ఆ తర్వాత తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఇలాంటి సమయంలో అత్తయ్యకి ఏమైనా జరిగితే ఆ నేరం కావ్య మీదే పడుతుంది అంటాడు రాహుల్. ఏమైనా అంటే అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. అత్తయ్య చచ్చిపోతే అంటాడు రాహుల్, అపర్ణ రోజూ వేసుకునే టాబ్లెట్లు మార్చేసే ప్లాన్ వేస్తాడు.


Click it and Unblock the Notifications











