బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!

బుల్లితెరపై ప్రస్తుతం రేటింగ్ సాధిస్తున్న సీరియల్స్ లో ఒకటి బ్రహ్మముడి. మరి ఈ సీరియల్ స్టార్ మా టీవీలో రాత్రి 7గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది. అయితే ఒకప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రుతలూగించిన సీరియల్ కార్తీక దీపం గుర్తుండే ఉంటుంది. దానికి ఇప్పుడు సీక్వెల్ గా కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోతుంది. రావడం రావడమే బ్రహ్మముడి సీరియల్ ను దెబ్బకొట్టబోతుంది. డాక్టర్ బాబు, వంటలక్క ఎంట్రీతో అంతా ఛేంజ్ అయిపోయింది. అసలు కార్తీక దీపం 2 వల్ల బ్రహ్మముడికి వచ్చిన కష్టం ఏంటి..? అసలు ఏం జరిగిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

బ్రహ్మముడికి ఫుల్ క్రేజ్...
సినిమాలు, సిరీసులే కాదు.. సీరియల్స్ కూడా చాలా మంది ప్రేక్షకులు వీక్షిస్తుంటారు. అలా ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ధారావాహికలు టీవీలకు అతుక్కునేలా చేస్తూంటాయి. ఒక్క ఆడవారినే కాదు.. మగవారిని, వృద్ధులను, పిల్లలను సైతం తమ కథలతో, ట్విస్టులతో ఆకట్టుకుంటున్నాయి నేటి సీరియల్స్. ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. బిగ్ బాస్ ఫేం మానస్, కన్నడ నటి దీపిక ప్రధాన పాత్రల్లో ఈ సీరియల్ సాగుతోంది.

Brahmamudi Serial timing change with Karthika Deepam 2 serial entry Full Details Here

సీరియల్ కు సీక్వెల్...
ప్రస్తుతం ఈ ధారావాహిక రాత్రి 7 గంటల 30నిమిషాయలకు టెలికాస్ట్ అవుతుంది. ఒక ఉన్నత కుటుంబంలోకి పేద కుటుంబం నుంచి వేరు వేరు మనస్తాత్వాలు కలిగిన యువతులు ఆ ఇంటి కోడాళ్లు అయ్యాక ఎలా సాగుతుందనే కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కుతోంది. అయితే ఈ సీరియల్ రాకముందు కార్తీక దీపం సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. ఇక ఈ సీరియల్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లు ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

మరోసారి వంటలక్క, డాక్టర్ బాబు..
ఇక గత ఏడాది ఎట్టకేలకు డాక్టర్ బాబు, వంటలక్క స్టోరీ ముగిసింది. ఇక ఇప్పుడు మరోసారి డాక్టర్ బాబు, వంటలక్క బుల్లితెరపై అలరించేందుకు సిద్ధం అయ్యారు. కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం ఇది నవవసంతం పేరుతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈసారి కూడా వంటలక్క.. వంట మనిషి పాత్ర చేస్తుంది. మరి డాక్టర్ బాబుతో వంటలక్క కలిసి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Brahmamudi Serial timing change with Karthika Deepam 2 serial entry Full Details Here

బ్రహ్మముడికి గట్టి దెబ్బ...
అయితే కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు బ్రహ్మముడిని భారీ దెబ్బకొట్టింది. అదేంటి ఇంకా మొదలు కాకముందే ఎలా దెబ్బకొట్టిందనే కదా మీ అనుమానం. కార్తీక దీపం 2.. గతంలో మాదరిగానే 7.30నిమిషాలకు టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ టైంలో బ్రహ్మముడి టెలికాస్ట్ అవుతుంది. జనాలు బ్రహ్మముడి సీరియల్ ఆ టైంకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు కార్తీక దీపం 2 వచ్చి ఆ స్లాట్ ను లాక్కుకోవాలనుకుంది.

స్టార్ మా సూపర్ ప్లాన్...
దీంతో బ్రహ్మముడి సీరియల్ టైం ఛేంజ్ కానుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా స్టార్ మా వాళ్లు కార్తీక దీపం సీరియల్ ను 8 గంటలకు ప్రసారం కానుందని ప్రకటించారు. అందుకు అలవాటు పడేందుకు ఈ వారం మొత్తం బ్రహ్మముడి సీరియల్ ను 45 నిమిషాలు అంటే 7.30 నిమిషాల నుంచి 8.15 నిమిషాల వరకు టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో జనాలు 8 గంటల తర్వాత కూడా సీరియల్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెక్ట్స్ వారం కార్తీక దీపం ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మముడితో పాటు కార్తీక దీపం 2 కూడా చూస్తారన్నమాట. ఇక కార్తీక దీపం ఎంట్రీతో బ్రహ్మముడి సీరియల్ రేటింగ్ పడిపోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X