Brahmamudi January 27th Episode : కావ్య హత్యకు రాహుల్ కుట్ర .. కళావతికి కోర్టు నోటీసు పంపిన ప్రకాశం?

ఏనాడూ నన్ను పల్లెత్తు మాట కూడా అనని కావ్య .. ఈరోజు అంత మాట అనాల్సి వచ్చిందంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఆలోచించాలని ప్రకాశంకు నచ్చజెబుతాడు సుభాష్. వీరి మాటల్ని లోపలి నుంచి చూసి కంటతడి పెడుతుంది కళావతి. భోజనం చేయడానికి సుభాష్ - అపర్ణ రాకపోవడంతో కావ్యని నానామాటలు అంటుంది రుద్రాణి. తనను బాగా అర్ధం చేసుకున్నందుకు మామగారికి థ్యాంక్స్ చెబుతుంది కావ్య.

గదిలో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్న అపర్ణకి భోజనం తీసుకెళ్లి తినిపిస్తుంది ఇందిర. గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి రాజ్ రాగా.. అసలు నందగోపాల్‌ చనిపోవడం వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నిస్తుంది. సామంత్ - అనామికలు చెస్ ఆడుతూ నందగోపాల్ హత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 27వ తేదీ .. ఎపిసోడ్ 629లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 629 January 27th 2024 Here is full story

నాతో పెట్టుకుంటే పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమాన్యుడి గతేనని.. ఒక్కసారి లోపలికి వస్తే వాళ్ల కథ అక్కడే ముగిసిపోతుందని అంటుంది అనామిక. ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా నేను వేసిన పద్మవ్యూహంలో చిక్కి విలవిలలాడిపోతుందని సామంత్‌తో చెబుతుంది. ఇకపై ఆ కుటుంబానికి మరిన్ని షాకులు తగులుతాయని అంటుంది. 100 కోట్లు కట్టాలంటే వాళ్ల ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టినా సరిపోవని.. వాళ్ల ఏడుపులు నువ్వు కళ్లారా చూడొచ్చని అంటాడు సామంత్. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చచ్చి ఆ ఇల్లంతా వల్లకాడు కావాలని అప్పుడే నేనే ప్రశాంతంగా ఉంటానని అంటుంది అనామిక. చివరికి స్వరాజ్ గ్రూప్ కంపెనీ కూడా మన చేతికి చిక్కుతుందని చెబుతుంది.

గదిలో ఆలోచిస్తున్న ప్రకాశంకు కోర్టు నోటీసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తుంది ధాన్యలక్ష్మీ. ఆస్తిలో వాటా ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని.. ఇక మాటలతో పనులు కావడం లేదని కోర్టు నోటీసు పంపిద్దామని నిర్ణయించుకున్నాని చెబుతుంది ధాన్యం. ఆ మాటలతో ప్రకాశం షాక్ అవుతాడు. ఆ కావ్య పెద్దా చిన్నా తేడా లేకుండా అంత మాటలు అంటున్నా మీకు సిగ్గు రాలేదా అని నిలదీస్తుంది ధాన్యం. నాకు అన్నీ ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయని.. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ప్రకాశం చెప్పినా ధాన్యం వినిపించుకోదు.

కోట్ల ఆస్తికి వారసుడు అయ్యుండి కూడా నా కోడుకు నరకం అనుభవిస్తున్నాడని... వాడికి అన్యాయం జరగడానికి వీల్లేదని అంటుంది. ఆస్తులన్నీ అయిపోయాక కూర్చొని ఏడవటం తప్పించి ఏం చేయలేమని.. అందుకే జాగ్రత్త పడదామని అంటుంది ధాన్యలక్ష్మీ. మీకు మీ అన్న, మీ అన్న కొడుకే కావాల్సొస్తే.. మీ చేత్తోనే మీరు కట్టిన తాళిని తెంచేయడండి అనేసరికి ప్రకాశం షాక్ అవుతాడు. గత్యంతరం లేని పరిస్దితుల్లో కోర్టు నోటీస్ పేపర్స్ మీద సంతకం పెడతాడు ప్రకాశం.

కావ్య చేతికి అధికారం వచ్చిన తర్వాత రూపాయి కూడా దొరకడం లేదని రుద్రాణితో అంటాడు రాహుల్. ధాన్యలక్ష్మీని నావైపుకు తిప్పుకుని కావ్యకి మన:శాంతి లేకుండా చేస్తున్నానని అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ అత్తయ్యని రెచ్చగొడితే కావ్య ఇంకా రెచ్చిపోతుందని.. ఆ ప్రాసెస్ ఆపేయమని అంటాడు రాహుల్. నాకు ఒక్క అవకాశం ఇస్తే కావ్యని ఈ లోకంలోనే లేకుండా చేస్తానని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. రుద్రాణి చెబుతున్నా వినకుండా కావ్య బట్టలు ఆరబెట్టడానికి వస్తుండగా .. ఆ తీగకి కరెంట్ సప్లై ఇస్తాడు రాహుల్.

ఇంతలో కావ్యకి స్వప్న కనిపించి నువ్వెందుకు బట్టలు ఆరేస్తున్నావని ప్రశ్నిస్తుంది. ఒక్కరోజు ఆరేస్తే ఏం కాదని వెళ్లబోతుండగా.. మా అత్తని పిలిచి ఆరేయమని చెబుతానని అంటుంది . కావ్య బట్టలు ఆ మాటలు పట్టించుకోకుండా బట్టలు ఆరేయబోతుండగా రాజ్ పిలవడంతో లోపలికి వెళ్తుంది. ఇంతలో రుద్రాణి బయటకు రావడంతో బట్టలు ఆరేయమని అంటుంది స్వప్న. రేపు ఫ్యూచర్‌లో ఏదైనా అవసరం వస్తుందని భయపడ్డ రుద్రాణి.. నాకు 25 వేలు ఇస్తే చేస్తానని అంటుంది.

రుద్రాణి బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొడుతుంది.. ఆ అరుపులు కావ్యవే అనుకున్న రాహుల్ సంతోషిస్తుంటాడు. రుద్రాణి అల్లాడిపోతుండటంతో స్వప్న వచ్చి కర్రతో చితకబాదుతుంది. ఇదంతా చూసినా రాహుల్ కరెంట్ స్విచ్చాఫ్ చేస్తాడు. రుద్రాణి స్పృహ తప్పడంతో మమ్మీ చచ్చిపోయిందంటూ రాహుల్ ఏడుస్తాడు. స్వప్న నాడి చూసి రుద్రాణి బతికే ఉందని చెబుతుంది. ఆ వెంటనేనే నీళ్లు తీసుకొచ్చి రుద్రాణి మొహం మీద కొడుతుకుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X