Brahmamudi Today Episode: కంగారుగా ఆఫీస్ కి బయలుదేరిన కావ్య.. గుడిలో కళ్యాణ్ ని అవమానించిన ధాన్యలక్ష్మి!

దొంగ బంగారం కేసులో రాజ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. కానీ రాహుల్ ఆ తప్పు చేశాడు అని కావ్య నిరూపించడంతో రాహుల్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. అయితే రాహుల్ కన్నింగ్ ప్లాన్ తో తన తప్పేమీ లేనట్లు నిరూపించుకుంటాడు. దాంతో పోలీసులు తిరిగి రాహుల్ ని రిలీజ్ చేస్తారు. రాహుల్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేదని పగ పెంచుకుంటారు రాహుల్, రుద్రాణి. కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అందరూ గుడికి వెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 7 వ తేదీ ఎపిసోడ్ 509 లో ఏం జరిగిందంటే..

గుడిలో అందరూ పూజ చేస్తున్న సమయంలో రాహుల్ తన పని ముగించుకుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమైంది అని అడుగుతుంది రుద్రాణి. కాసేపట్లో దుర్వార్త వింటావు అంటాడు రాహుల్. దేవుడు భక్తులు కోరికలు తీర్చే పనిలో ఉంటాడేమో అందుకే మనలాంటి వాళ్ళు చేసే పాపాలు అప్పుడప్పుడు ఇగ్నోర్ చేయబడుతుంటాయి అంటుంది రుద్రాణి. అదే సమయంలో రాజ్ కళ్యాణ్ వాళ్ళని చూస్తాడు. ధాన్యలక్ష్మితో మాట్లాడుతూ క్యాటరింగ్ వాళ్లు అన్ని అరేంజ్ చేసేసారు మీ చేతుల మీదుగా భోజనం వడ్డించండి అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.

Brahmamudi Serial Today s Episode 509 September 7th 2024 Here is full story

అప్పటికే రాజ్ చూసేసాడనే కంగారులో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ్ దంపతులు. కానీ వాళ్ళని ఆపి తనతో పాటు రమ్మంటాడు రాజ్. వద్దు అన్నయ్య నేను వస్తే ఎంత ప్రమాదమో నాకు తెలుసు, పూజలో, అర్చనలో నా పేరు చెప్పగలిగారు కానీ నన్ను అక్కున చేర్చుకోలేరు అంటాడు కళ్యాణ్. అలా అని నువ్వే అనుకుంటే ఎలా, ఇవన్నీ చేయమన్నదే మీ అమ్మ అంటాడు రాజ్. మా అమ్మ నా క్షేమం కోరుకుంటుంది కానీ నాకు ఏది ఇష్టమో అది చేయదు అయినా నేను అక్కడికి వస్తే హ్యాపీనెస్ అంతా స్పాయిల్ అవుతుంది అంటాడు కళ్యాణ్.

అప్పు కూడా కళ్యాణ్ కోసం చేయిస్తున్న పూజకి కళ్యాణ్ ని ఎందుకు పిలవలేదు అంటుంది. అయినా వాళ్ళని ఒప్పించి తనతో పాటు తన కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకువెళ్తాడు రాజ్. మరోవైపు అత్తగారిని వంట చేయకుండా అక్కడ నుంచి పంపించేసి తానే వంట చేస్తుంది కావ్య. అంతలోనే కంపెనీ నుంచి స్టోర్ ఇన్చార్జిని అంటూ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అని రాహుల్ మనిషి ఒకడు ఫోన్ చేస్తాడు. అదే విషయం వెళ్లి అపర్ణకి చెప్తుంది కావ్య.

రాజ్ కి ఫోన్ చేస్తాను అంటే తను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు రాజ్ కి నేను చెప్తాను అని చెప్పి కావ్యని పంపిస్తుంది అపర్ణ. కావ్య వెళుతూ అపర్ణ వేసుకోవలసిన ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళుతుంది. మరోవైపు కళ్యాణ్ కోసం ఏడుస్తున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చిన ప్రకాష్ తో వాడికి ఎందుకు అంత పట్టుదల అప్పు ని వదిలేసి వచ్చేయవచ్చు కదా అంటుంది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అప్పుడు వాడు పెళ్ళాన్ని వదిలేసి వస్తాడు అంటాడు ప్రకాష్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా కళ్యాణ్ వాళ్ళని తీసుకువస్తాడు రాజ్.

కుటుంబ సభ్యులందరూ ఆనందపడుతూ కళ్యాణ్ కి బర్త్డే విషెస్ చెప్తారు. ధాన్యలక్ష్మీ కూడా బర్త్డే విషెస్ చెప్తుంది. రాజ్ తో మాట్లాడుతూ తనని ఎవరు పిలిచారు, సంపాదించుకుంటాను అని చెప్పి వెళ్లిన వాడు ఆ మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడా, ఈమధ్య పిలవకపోయినా కూడా పేరంటానికి వచ్చేస్తున్నారా అనే కొడుకుని అవమానించేలాగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి.ఆ మాటలకి భార్యని కోప్పడతాడు ప్రకాష్, కొడుకుని వదులుకొని మనం ఏం సుఖపడతాము అంటాడు.

మిగిలిన వాళ్ళు కూడా ధాన్యలక్ష్మిని మందలిస్తారు. కళ్యాణ్ మాట్లాడుతూ నేను పిలవని పేరంటానికి రాలేదు, పిలిచిన పేరంటానికే మీరు ఎంత అవమానం చేశారో నాకు తెలుసు అయినా నేను తిండికి గతిలేక రాలేదు, ఆ మాత్రం నా భార్య ని పోషించుకోగలను, ఎవరికి తెలుసు వచ్చే సంవత్సరం నా సంపాదనతో నేనే అన్నదానం చేస్తానేమో అంటాడు కళ్యాణ్. తర్వాత రాజ్ తో మాట్లాడుతూ అందుకే నేను రాను అన్నాను అన్నయ్య అంటాడు.

అప్పుడు రాజ్ మాట్లాడుతూ నేను దుగ్గిరాల వారి ఇంటి ఖర్చుతో జరుగుతున్న ఈ అన్నదానానికి నా భార్య చెల్లెలిని, ఆమె భర్తని భోజనానికి పిలిచాను మేము ముగ్గురం భోజనానికి కూర్చుంటాము మాకు నువ్వే వడ్డించాలి పిన్ని అంటాడు రాజ్. వడ్డించను అంటుంది ధాన్యలక్ష్మి . భోజనానికి వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించడం దుగ్గిరాల ఇంటి సాంప్రదాయం అంటూ కళ్యాణ్ ని అప్పుని తీసుకొని భోజనానికి కూర్చుంటాడు రాజ్. కుటుంబ సభ్యులు కూడా బలవంతంగా ధాన్య లక్ష్మీ చేత వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డింప చేస్తారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X