Brahmamudi September 9th Episode: ప్రాణాపాయ స్థితిలో అపర్ణ.. పిచ్చివాడైపోతున్న రాజ్
రాహుల్ తప్పు చేశాడని కావ్య నిరూపించడంతో రాహుల్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. అయితే రాహుల్ కన్నింగ్ ప్లాన్ తో తన తప్పేమీ లేనట్లు నిరూపించుకుంటాడు. దాంతో పోలీసులు తిరిగి రాహుల్ ని రిలీజ్ చేస్తారు. రాహుల్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేదని పగ పెంచుకుంటారు రాహుల్, రుద్రాణి. కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అందరూ గుడికి వెళ్తారు. గుడిలో కనిపించిన కళ్యాణ్ దంపతులను బలవంతం గా అన్నదానానికి తీసుకువెళ్తాడు రాజ్. అక్కడ ధాన్యలక్ష్మి కళ్యాణ్ వాళ్ళని అవమానిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 9 వ తేదీ ఎపిసోడ్ 510 లో ఏం జరిగిందంటే..
భోజనం చేసి టాబ్లెట్ వేసుకున్న అపర్ణకి ఒంట్లో నలత ప్రారంభం అవుతుంది. అప్పుడే కావ్య ఆఫీస్ కి వెళ్లి స్టోర్ ఇన్చార్జ్ మీరేనా అని అక్కడ వున్న వ్యక్తి ని అడుగుతుంది. నేనే అంటాడు ఆ వ్యక్తి. ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టు నాకు కాల్ వచ్చింది అంటుంది కావ్య. అలాంటిదేమీ లేదు మేడం అంటాడు ఆ వ్యక్తి. రాహుల్ ఇక్కడికి వచ్చాడా అని అడుగుతుంది కావ్య. లేదు, రానని చెప్పారంట అంటాడు ఆ వ్యక్తి. ఎందుకైనా మంచిది ఒకసారి ఆఫీస్ రూమ్ లో ఫైల్స్ చెక్ చేద్దాం అని చెప్పి అతడిని తీసుకొని వెళ్తుంది కావ్య.

ఆ సమయంలో ఫోన్ ఆ టేబుల్ మీదే మర్చిపోతుంది. అప్పుడే నొప్పితో బాధపడుతున్న అపర్ణ కావ్య కి ఫోన్ చేస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాజ్ కి ఫోన్ చేసి తన పరిస్థితి వివరించి స్పృహ కోల్పోతుంది. మమ్మీకి ఏదో జరిగింది త్వరగా వెళ్దాం పదండి డాడ్ అంటాడు రాజ్. కావ్య అక్కడే ఉంది కదా తనకేమీ జరగదు అంటుంది ఇందిరాదేవి, రుద్రాణి రాజ్ భయాన్ని మరింత పెంచేలా మాట్లాడుతుంటే ఆమెని మందలిస్తుంది. తర్వాత అందరూ అక్కడ నుంచి బయలుదేరుతారు. మరోవైపు ఇంటికి వచ్చిన కళ్యాణ్ నాకు చాలా ఆనందంగా ఉంది, గుడిలో అందర్నీ కలుసుకున్నాను అందుకు ఆ దేవుడికి థాంక్స్ అంటాడు.
అసలు గుడికి వెళ్దాం అని చెప్పిందే నేను అంటుంది అప్పు. అప్పుడు భార్యకి కూడా థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయి ఉన్న అపర్ణ ని చూసి అందరూ కంగారు పడతారు, వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అప్పుడే ఇంటికి వస్తున్న కావ్య కంగారుగా జరుగుతున్నది ఏమిటో అర్థం కాక డ్రైవర్ తో ఆ కార్ ని ఫాలో అవ్వమని చెప్పి తను కూడా వాళ్లతో పాటు వెళుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది.

అప్పుడే కంగారుగా వచ్చిన కావ్య ఏం జరిగింది అని స్వప్నని అడుగుతుంది. తల్లిని వదిలేసి వెళ్లినందుకు కావ్య మీద ఫైర్ అవుతాడు రాజ్, కావ్య చెప్పేది వినిపించుకోకుండా ఆమె మీద కేకలు వేస్తాడు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి అపర్ణకి బిపి ఎక్కువ అవ్వటం మూలంగా కోమా లోకి వెళ్లిపోయిందని చెప్తుంది. ప్రమాదం ఏమీ లేదు కదా అని సుభాష్ అడిగితే మా ట్రీట్మెంట్ కి ఆవిడ రెస్పాన్స్ అయినా తీరును బట్టి మేము చెప్పగలము, అప్పటివరకు ఏమీ చెప్పలేము అంటుంది డాక్టర్.
ఐసీయూ ముందు ఇంతమంది ఉండొద్దు అని కూడా చెప్తుంది.ఆమె మాటలకి బాగా ఎమోషనల్ అవుతాడు రాజ్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు కడతాను ఆవిడకి ఏమి కాకూడదు లేదంటే అంటూ డాక్టర్ మీద ఫైర్ అవుతాడు. అప్పుడు సుభాష్ కొడుకుని కంట్రోల్ అవ్వమని చెప్పి డాక్టర్ కి క్షమాపణ చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. అపర్ణ కి ఇలా ఉంటే ఇంటికి వెళ్లడం ఎలా అంటుంది ఇందిరాదేవి.

ఇక్కడ ఉండి మీరేమైనా ప్రాణం పోస్తారా వెళ్లిపోండి ఇక్కడ నుంచి అందరూ వెళ్లిపొండి అంటాడు రాజ్. కావ్య వైపు చూస్తూ నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, అమ్మకి ఏమైనా జరిగిందంటే మాత్రం నిన్ను క్షమించను అంటాడు. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆనందపడతారు రాహుల్,రుద్రాణి. బాధపడుతున్నట్లుగా నటిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కావ్య అక్కడే ఉంటాను అన్నా కూడా ఇందిరా దేవి వాళ్ళు ఆమెను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు విషయం తెలుసుకున్న కళ్యాణ్ కంగారుగా హాస్పిటల్ కి బయలుదేరుతాడు.
సుభాష్ దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతాడు. కంగారుగా ఉంది ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వటం లేదు అంటాడు సుభాష్. అలాంటిదేమీ జరగదు పెదనాన్న అని అతనికి ధైర్యం చెప్తాడు తర్వాత రాజ్ దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్. అమ్మకి ఏమి కాదు కళ్యాణ్ అమ్మకి బానే ఉంది నేను వెళ్లి మాట్లాడితే మాట్లాడుతుంది కానీ డాక్టర్లు మాట్లాడనివ్వడం లేదు, ఎవరిని నమ్మకూడదు ఆఖరికి ఇంట్లో వాళ్ళని, భార్యని కూడా నమ్మకూడదు అంటూ పిచ్చివాడిలా ఎమోషనల్ అవుతాడు రాజ్.

తరువాయి భాగంలో ఆఫీస్ కి ఎందుకు వెళ్లిందో భర్తకి చెప్తుంది కావ్య. అయితే నీకేంటి, మా అమ్మకి ఏదైనా జరిగిందంటే మాత్రం నిన్ను ఇంట్లో ఉండనిచ్చేది లేదు అంటాడు రాజ్. మీ అమ్మకి ఏదైనా జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉంచుకుంటావా ఇప్పుడే బయటికి పంపించేయ్ అంటుంది రుద్రాణి.


Click it and Unblock the Notifications











