Brahmamudi September 10th episode: ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్న రుద్రాణి.. ఆవేశంలో కంట్రోల్ తప్పుతున్న రాజ్!

రాహుల్ కన్నింగ్ ప్లాన్ తో తన తప్పేమీ లేనట్లు నిరూపించుకుంటాడు. దాంతో పోలీసులు తిరిగి రాహుల్ ని రిలీజ్ చేస్తారు. రాహుల్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేదని పగ పెంచుకుంటారు రాహుల్, రుద్రాణి. కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అందరూ గుడికి వెళ్తారు. గుడిలో కనిపించిన కళ్యాణ్ దంపతులను బలవంతం గా అన్నదానానికి తీసుకువెళ్తాడు రాజ్. అక్కడ ధాన్యలక్ష్మి కళ్యాణ్ వాళ్ళని అవమానిస్తుంది. మరోవైపు రాహుల్, రుద్రాణి వేసిన ప్లాన్ వల్ల అపర్ణ హాస్పిటల్ పాలవుతుంది. ఆ నేరం కావ్య మీద పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 10 వ తేదీ ఎపిసోడ్ 511 లో ఏం జరిగిందంటే..

ఐ సి యు ముందు నించొని అమ్మ బాగానే ఉంది నేను వెళ్లి మాట్లాడితే నాతో మాట్లాడుతుంది కానీ డాక్టర్లు మాట్లాడనివ్వడం లేదు, వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు రాజ్. అన్న పరిస్థితి చూసిన కళ్యాణ్ పెదనాన్న దగ్గరికి వెళ్లి అన్నయ్య పరిస్థితి ఏమి బాగోలేదు ఇక్కడ ఉంటే మరింత డిస్టర్బ్ అవుతాడు మీరు అన్నయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి,పెద్దమ్మ దగ్గర నేను ఉంటాను అంటాడు.

Brahmamudi Serial Today s Episode 511 September 10th 2024 Here is full story

ఈ పరిస్థితులలో వాడు నా మాట వినడు అంటాడు సుభాష్. అప్పుడు కళ్యాణ్ రాజ్ దగ్గరికి వెళ్లి పెదనాన్న పరిస్థితి ఏమి బాగోలేదు, ఇక్కడ ఉండలేరు ఇంట్లో డ్రాప్ చేసి రా అని అన్నతో చెప్తాడు. సుభాష్ కూడా నాకు భయంగా ఉంది ఇంటికి తీసుకువెళ్ళు అని రిక్వెస్ట్ చేయడంతో డాడీని డ్రాప్ చేసి వచ్చేస్తాను అమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళలేక, వెళ్లలేక వెళతాడు రాజ్. అదే సమయంలో ఇంటి దగ్గర అందరూ దిగులుగా కూర్చుని ఉంటారు.

ఇదే మంచి సమయం నీ డ్రామా స్టార్ట్ చేయు అని రుద్రాణి తో అంటాడు రాహుల్. అప్పుడే కాదు, రాజ్ అన్నయ్యని తీసుకొని వస్తాడు కదా అప్పుడు స్టార్ట్ చేస్తాను అంటుంది రుద్రాణి. అంతలోనే రాజ్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఇందిరాదేవి కోడలు పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. మీ అందరూ చూశారు కదా మళ్ళీ అడుగుతారేంటి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని ఆవేశంగా మాట్లాడుతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 511 September 10th 2024 Here is full story

ఏంటా ఆవేశం అంటాడు సుభాష్. అక్కడ ప్రాణాలతో పోరాడుతుంది మా అమ్మ, తనని ఇంట్లో వదిలి తప్పు చేశాను అంటాడు రాజ్. తప్పు నువ్వు చేయలేదు, ఈ మహాతల్లి చేసింది అని కావ్య ని చూపిస్తూ తన డ్రామా ప్రారంభిస్తుంది రుద్రాణి. తను ఉంటానంటేనే కదా మీ అందరూ మాతోపాటు వచ్చారు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది అంటూ మాటల తూటాలు విసురుతుంది. రాజ్ ఆవేశం గా వున్నాడు అతడిని మరింత రెచ్చగొట్టొద్దు, కావ్య అంత బాధ్యత లేని మనిషి కాదు అంటుంది స్వప్న.

అక్కడ మా వదిన ప్రాణాలతో కొట్టుకుంటుంది దానికి కారణం మీ చెల్లెలే ఈ విషయంలో నువ్వు మాట్లాడావంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అంటూ కోడలిపై విరుచుకుపడుతుంది రుద్రాణి. అప్పుడు ఇందిరా దేవి రుద్రాణిని మందలిస్తూ కావ్య అంత బాధ్యత లేని మనిషి కాదు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాటలు అంటావేంటి అంటూ కావ్యని జరిగింది చెప్పమంటుంది. అత్తయ్య పర్మిషన్ తీసుకునే వెళ్లాను అని జరిగిందంతా ఏడుస్తూ చెప్తుంది కావ్య.

Brahmamudi Serial Today s Episode 511 September 10th 2024 Here is full story

నా కొడుకుని మళ్లీ దోషిని చేయడానికి ఎన్ని డ్రామాలు ప్రారంభించింది, అందుకు మా వదిన ప్రాణాలని ఫణంగా పెట్టింది అంటూ రాజ్ ని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. ఇందిరా దేవి రుద్రాణిని మందలిస్తే ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది అని రుద్రాణిని వెనకేసుకొస్తుంది ధాన్యలక్ష్మి. కావ్య ఏదో ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతుంటే నాకు అదంతా అనవసరం నీ మీద నమ్మకం పోయింది, మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది తనకి ఏమైనా జరిగితే నిన్ను ప్రాణాలతో క్షమించను అంటూ భార్య మీద విరుచుకుపడతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 511 September 10th 2024 Here is full story

తరువాయి భాగంలో కావ్య ఈ ఇంటి కోడలిగా పనికిరాదు అంటుంది రుద్రాణి. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అని భర్తని అడుగుతుంది కావ్య. నువ్వు నా భార్యగా ఉండటానికి పనికిరావు ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు అంటాడు రాజ్. ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసింది, ఇక సెలవు అంటూ కన్నీటితో అడుగు బయట పెడుతుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X