Brahmamudi September 11th Episode: నీకు అంత అహంకారామా? కోడలిగా పనికి రావు.. కావ్యపై రాజ్ మండిపాటు

రాహుల్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేదని పగ పెంచుకుంటారు రాహుల్, రుద్రాణి. కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అందరూ గుడికి వెళ్తారు. గుడిలో కనిపించిన కళ్యాణ్ దంపతులను బలవంతం గా అన్నదానానికి తీసుకువెళ్తాడు రాజ్. అక్కడ ధాన్యలక్ష్మి కళ్యాణ్ వాళ్ళని అవమానిస్తుంది. మరోవైపు రాహుల్, రుద్రాణి వేసిన ప్లాన్ వల్ల అపర్ణ హాస్పిటల్ పాలవుతుంది. ఆ నేరం కావ్య మీద పడుతుంది. దీన్ని వలసగా తీసుకొని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 11 వ తేదీ ఎపిసోడ్ 512 లో ఏం జరిగిందంటే..

నీవల్ల ఈరోజు మా అమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, నీవల్ల తప్పు జరిగింది, మా అమ్మకి ఏదైనా జరిగిందంటే నిన్ను క్షమించేది లేదు అంటాడు రాజ్. ఏదైనా జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలా, ఇప్పుడే బయటికి గెంటెయ్ రాజ్ అంటుంది రుద్రాణి. రాజ్ ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆ రుద్రాణి మాటలు పట్టుకుంటే ఈ ఇంట్లో ఎవరి సంసారాలు సవ్యంగా ఉండవు.

Brahmamudi Serial Today s Episode 512 September 11th 2024 Here is full story

కావ్య చేసిందే తప్పే అనుకుందాం పోనీ మొదటి తప్పుగా ఆమెని క్షమించు అని రాజ్ కి చెప్తుంది చిట్టి. రాజ్ అందుకు అంగీకరించకపోవడంతో కావ్యతో నువ్వైనా అతనికి క్షమాపణ చెప్పమ్మా అని అంటుంది. నేను ఎందుకు చెప్పాలి అమ్మమ్మ, నేను ఏం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి, ఈ ఇంటికి కోసం, ఇంటికి అన్నం పెట్టే సంస్థ పరువు ప్రతిష్టల కోసం నేను ప్రాకులాడాను, అత్తయ్య పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్లాను, అనుకోని సంఘటన జరిగితే దానికి నేను ఎందుకు బాధ్యత వహించాలి అంటుంది కావ్య.

ఎంత అహంకారంగా మాట్లాడుతుంది, ఏ తప్పు చేయకుండానే మా వదిన హాస్పిటల్ బెడ్ మీద ఉందా, ఈరోజు ఈ తప్పు చేసింది రేపు ఇంకో తప్పు చేస్తుంది ముందు దీనిని బయటికి ఈడ్చిపారేయ్ రాజ్ అంటుంది రుద్రాణి. ఆమె మాటలకి ధాన్యలక్ష్మి కూడా సపోర్ట్ చేస్తూ పుట్టింటి నుంచి కోట్ల ఆస్తి తెచ్చుకున్న వాళ్లు కూడా ఇంత అహంకారంగా మాట్లాడరు అంటుంది. స్వప్న కోపంతో రగిలిపోతూ ఆ భార్య భర్తల మధ్యలో మీరెందుకు దూరిపోతున్నారు అంటుంది.

Brahmamudi Serial Today s Episode 512 September 11th 2024 Here is full story

సుభాష్ కూడా కోడల్ని వెనకేసుకుని వస్తాడు. రాజ్ ఏమి మాట్లాడకపోవడంతో రుద్రాణి మరింత రెచ్చిపోతూ కావ్యని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది. నువ్వు ఎవరు నన్ను బయటికి పొమ్మండడానికి నీలాగే అందరూ పుట్టింట్లో పడి ఏడవాలి అనుకుంటున్నావా అంటూ రుద్రాణి మీద కేకలు వేస్తుంది కావ్య. మరి ఎవరు చెప్తే ఇంట్లోంచి వదులుతావు అంటుంది రుద్రాణి. నా భర్త అంటుంది కావ్య. విన్నావా రాజ్ నువ్వు చెప్తేనే గాని ఇంట్లోంచి కదలదంట అని రాజ్ ని రెచ్చగొడుతుంది రుద్రాణి.

అప్పుడు రాజ్ మాట్లాడుతూ ఇంత పెద్ద తప్పు చేసి కూడా ఇంకా ఈ తప్పు చేయలేదని ఎలా అంటున్నావు, కోట్లు పోతే పోయాయి, అమ్మకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత, బాధ్యతగా ఉండాలి కదా అయినా క్షమాపణ అడగటానికి నీకు ఏంటి అంత అహంకారం. ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నాకు భార్యగా ఉండే అర్హత లేదు, ఈ ఇంటి కోడలుగా నువ్వు పనికిరావు, ఇష్టం లేకపోయినా పెద్దవాళ్లు చెప్పారని పెళ్లి చేసుకున్నాను, బలవంతంగా నీతో కాపురం చేస్తున్నాను అంటాడు రాజ్. ఆ మాటలకి కావ్య గుండె పగిలిపోతుంది.

Brahmamudi Serial Today s Episode 512 September 11th 2024 Here is full story

ఇన్నాళ్లు నా కాపురం నిలబడిపోయిందని ఆనందపడిపోయాను, కానీ నాతో బలవంతంగా కాపురం చేస్తున్నారని మీరు అంటుంటే నేను విని ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో అర్థం కావటం లేదు, నామీద నాకే అసహ్యంగా ఉంది. నా కాపురం కుదుటపడి పోయినట్లే అని ఎంతో ఆనందపడిపోయానో కానీ మీరు ఇంత బలవంతంగా సంసారం చేస్తున్నారని తెలియదు. ఇంక చాలు,నేను జీవితాంతం మీ ప్రేమ కోసం కొంగు చాచి ఎదురు చూస్తూ ఉండలేను, ఇన్నాళ్లు నన్ను ఈ ఇంట్లో ఉంచినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కావ్య. తరువాయి భాగంలో జీవితంలో మీ భార్యగా నా పాత్ర ముగిసినట్లే ఇక సెలవు అని రాజ్ కి దండం పెట్టి ఇంట్లోంచి ఏడుస్తూ అడుగు బయట పెడుతుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X