Brahmamudi September 12th episode: జీవితంలో భార్యగా నా పాత్ర ముగిసినట్లే..రాజ్‌కు కావ్య గుడ్ బై!
కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అందరూ గుడికి వెళ్తారు. గుడిలో కనిపించిన కళ్యాణ్ దంపతులను బలవంతం గా అన్నదానానికి తీసుకువెళ్తాడు రాజ్. అక్కడ ధాన్యలక్ష్మి కళ్యాణ్ వాళ్ళని అవమానిస్తుంది. మరోవైపు రాహుల్, రుద్రాణి వేసిన ప్లాన్ వల్ల అపర్ణ హాస్పిటల్ పాలవుతుంది. ఆ నేరం కావ్య మీద పడుతుంది. దీన్ని వలసగా తీసుకొని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది రుద్రాణి. రాజ్ కూడా కావ్య చేసిన తప్పుని క్షమించలేను తనకి భార్యగా ఉండే అర్హత కావ్యకి లేదు అంటాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ 513 లో ఏం జరిగిందంటే..
ఎవరికి ఏమి కానీ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమే మీకు మంచిది, నాకు మంచిది, ఈ జీవితంలో మీ భార్యగా నా పాత్ర ముగిసినట్లే నేను వెళ్తున్నాను అంటూ గుమ్మం దాటి ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది కావ్య. స్వప్న,చిట్టి వాళ్ళు ఆపాలని ప్రయత్నించినా కావ్య ఆగదు. బావ మనవరాలు వెళ్ళిపోతుంది ఆపవేమిటి అని భర్తని అడుగుతుంది చిట్టి. వస్త్రాపహరణం అంటే కేవలం చీర లాగటం మాత్రమే కాదు, ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడటం కూడా. అది చూస్తూ నేను దృతరాష్ట్రుడిని అయిపోయాను, ఏమి మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నాను అంటాడు సీతారామయ్య. అత్తింటి గడపకి కడసారి వీడ్కోలు చెప్పి ఇల్లు దాటి వచ్చేస్తుంది కావ్య. ఈ విషయం కళ్యాణ్ కి ఫోన్ ద్వారా తెలుస్తుంది.

పుట్టింటికి వచ్చిన కావ్య ఇంటి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన కనకం ఇక్కడే కూర్చుండిపోయావేమి లోపలికి రా అంటుంది. లోపలికి రావాలంటే నీ పర్మిషన్ కావాలమ్మా అంటుంది కావ్య ఎందుకు అంటుంది కనకం. నేను పండగకో లేదంటే వచ్చి వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు అత్తింటి గడప దాటి వచ్చాను తలుపులు తీసి ఉన్నాయి కదా అని పుట్టింటిలోకి రాలేనమ్మ, రాకూడదని తెలిసినా ఆ ఇంటి నుంచి రావలసిన పరిస్థితి ఏర్పడింది.
నాకు మీ ఇంట్లో కాస్త చోటు ఇస్తారా, ఒక ముద్ద అన్నం పెడతారా అని ఏడుస్తూ అడుగుతుంది. ఆ మాటలకి కరిగిపోతారు కృష్ణమూర్తి, కనకం. కష్టమో, సుఖమో నిన్ను అత్తింట్లో పడి ఉండమనే తల్లిని కాదు నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటుంది కనకం. కృష్ణమూర్తి కూడా కావ్యకి ధైర్యం చెప్తాడు. కనకం దంపతులిద్దరూ కూతురిని లోపలికి తీసుకువెళ్తారు. మరోవైపు ఇంటికి వచ్చిన కళ్యాణ్ రాజ్ ని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపుకి గదిలోంచి బయటికి వచ్చిన రాజ్ ఏం కావాలి అని అడుగుతాడు.

ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది, అయినా పైనుంచి మాట్లాడితే పైనున్నాను అనుకున్నావేమో నువ్వు తలదించుకొని మాట్లాడుతున్నావు ముందు కిందికి రా అంటాడు కళ్యాణ్. కిందికి వచ్చిన రాజ్ రాయబారానికి వచ్చావా నీతో తన కష్టం చెప్పుకుందా అని అడుగుతాడు. చెప్పుకునేదే అయితే ఈ కౌరవ సభలోనే చెప్పుకునేది, అయినా నువ్వు చెప్పు వదినని ఎందుకు పంపించేసావో, ఎందుకు అవమానించావు అని అడుగుతాడు కళ్యాణ్. అన్ని చెప్పిన వాళ్ళు ఈ విషయం చెప్పలేదా అని అడుగుతాడు రాజ్.
ఆ కారణం వెనుక అకారణమైన నిందలు కనబడుతున్నాయి, అయినా తను ఎంత బాధపడి ఉంటే ఈ అత్తింటి గడప దాటి వెళుతుంది ఒకసారైనా ఆలోచించావా అని అడుగుతాడు కళ్యాణ్. వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేను ఆలోచించను అంటాడు రాజ్. మరి నా గురించి ఎందుకు ఆలోచించావు ఈ ఇంటికి రప్పించడానికి ఎందుకు ప్రయత్నించావు మరి వదిన గురించి ఎందుకు అలా ఆలోచించడం లేదు నాకు ఒక న్యాయం, వదినకి ఒక న్యాయమునా అని నిలదీస్తాడు.

నిన్ను చూసి నేను సంస్కారం నేర్చుకున్నాను, ఇప్పుడు ఆ ఔన్నత్యము, సంస్కారము ఏమయ్యాయి, కట్టుకున్న భార్యని చీకట్లోకి పంపే అంతగా దిగజారిపోయిందా నీ ఔన్నత్యం అని నిలదీస్తాడు కళ్యాణ్. కావ్యలోని నిర్లక్ష్యాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను, అమ్మకి ఏమైనా అయితే తనని కన్నెత్తి కూడా చూడను అంటాడు రాజ్.తప్పుని తప్పు అని చెప్పే స్థాయి నుంచి తప్పు చేసే స్థాయికి ఎలా దిగజారి పోయావు అసలు వదిన చెప్పేది వినటానికి కూడా నువ్వు ప్రయత్నించలేదు అంటాడు కళ్యాణ్.
అప్పుడు ప్రకాష్ కళ్యాణ్ ని మందలిస్తూ నువ్వు నీ అన్నతో మాట్లాడుతున్నానని విషయం గుర్తుంచుకో అని కోప్పడతాడు. అన్నయ్యని క్షమాపణ అడుగుతాడు రాజ్. నువ్వు నన్ను మూర్ఖుడు అని పలు రకాలుగా అన్నావు అయినా పర్వాలేదు మనిద్దరిది రక్తసంబంధం, ఈరోజు పెద్దమ్మ ఉన్న పరిస్థితికి కారణమైన తనని వెనకేసుకొస్తున్నావు నన్ను తప్పు పడుతున్నావు అంటూ కళ్యాణ్ పై కోప్పడతాడు రాజ్.

మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణమైన తనని నేను పిలవను, ఒకవేళ ఇంటికి వచ్చినా ఊరుకోను అని చిట్టి తో అంటాడు రాజ్. ఆయన మనసులో నాకు స్థానం దొరకలేదు అలాంటప్పుడు నేను అక్కడ ఉండి ప్రయోజనం ఏమిటి, నేను ఒంటరిగా బ్రతకడానికే నిర్ణయించుకున్నాను అని అప్పుతో చెప్తుంది కావ్య. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అపర్ణ స్పృహలోకి వస్తూనే కావ్య ఏది అని అడుగుతుంది.


Click it and Unblock the Notifications











