Brahmamudi September 13th episode: రాజ్ మనసులో స్థానం లేదు.. ఒంటరిగానే బతుకుతా.. కావ్య షాకింగ్ నిర్ణయం

Brahmamudi Serial: అమ్మ చావు బతుకుల్లో ఉంటే అందుకు కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ మన రక్త సంబంధాన్ని పట్టించుకోవడం లేదు ఆ మనిషికే సపోర్ట్ చేస్తూ నన్ను తప్పుబడుతున్నావని కళ్యాణ్‌ని నిలదీస్తాడు రాజ్. మన మధ్య దూరాన్ని పెంచే ఏ విషయమైనా ఇంతటితో వదిలేస్తే మంచిదని తమ్ముడికి సూచిస్తాడు రాజ్. ఇంకా చాలు ప్రశాంతంగా వెళ్లు అంటాడు. దానికి కళ్యాణ్ బదులిస్తూ.. నేను ప్రశాంతంగా వెళ్లాలంటే.. నువ్వు వెళ్లి వదినని ఇంటికి తీసుకురావాలంటాడు. దాంతో తాను ఆ పని ఎప్పటికీ చేయనని తెగేసి చెబుతాడు రాజ్.

తను తప్పు చేశానని ఫీలైంది కాబట్టే వెళ్లిపోయింది.. లేకపోతే అంత మొండిమనిషి ఇక్కడే ధైర్యంగా నిలబడి నిలదీసేది రా.. ఎందుకు పారిపోయిందని కళ్యాణ్‌ని రాజ్ ప్రశ్నిస్తాడు. అయితే నువ్వు మనసు మార్చుకోవా, వదినని తీసుకురావా అని పదే పదే ప్రశ్నిస్తాడు. తాను పొమ్మని అనలేదు.. రమ్మని అనలేనని తేల్చిచెబుతాడు రాజ్. నేను తప్పు చేయలేదురా .. తప్పు చేసింది తను, కాబట్టి నేను తీసుకొచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతాడు రాజ్. కానీ ఏదో ఒక రోజున ఆ నిజమెంటో నీకే తెలుస్తుంది, ఆ రోజు నువ్వు చాలా బాధపడతావని కళ్యాణ్ హెచ్చరిస్తాడు. ఆ రోజు.. ఏ రోజు రాదని రాజ్ అనగా.. అది నీ భ్రమ అన్నయ్య నేను వెళ్తున్నాను గుర్తుపెట్టుకో అంటూ వెళ్లబోతుండగా.. కళ్యాణ్ తల్లి ధాన్యలక్ష్మీ ఎక్కడికి రా అంటూ ఆపుతుంది.

Brahmamudi Serial

వదిన ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత అని తల్లిని నిలదీసి వెళ్లిపోతాడు కళ్యాణ్. ఆ వెంటనే స్వప్న చప్పట్లు కొడుతూ.. ఇంతసేపు ఒక్కరూ మాట్లాడలేదేంటీ, అందరి గొంతు మూగబోయిందా , కళ్యాణ్ అడిగిన ఏ ప్రశ్నికీ జవాబు దొరకలేదా అని నిలదీస్తుంది. అది ఎన్ని అనర్థాలకి మూలం కాబోతుందో మీ అమ్మగారు ఇంటికి తిరిగొచ్చిన నాడు నీకు అర్థమవుతుందని రాజ్‌ని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

ఇంట్లో గొడవ ముగిశాక రుద్రాణి - రాహుల్‌లు సంతోషంతో డ్యాన్స్‌లు చేస్తారు . ఇంతలో డోర్ తీసుకుని స్వప్న లోపలికొస్తూ వీరి మాటలను వింటుంది. ఇంతలో స్వప్న దగ్గరికి వచ్చి.. ఏంటీ ఆపారు , వేయ్యండి చిందులు అంటుంది. తల్లీకొడుకులు కలిసి పార్టీ చేసుకుంటున్నారా .. ఛీ, మీరు అసలు మనుషులేనా, ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయే, కావ్య బయటికెళ్లిపోయింది, అపర్ణ ఆంటీ హాస్పిటల్‌లో ఉంది, ఇలాంటి సమయంలో బాధపడకుండా మీ సంగతి మీరు చూసుకుంటున్నారు సిగ్గులేదా అంటూ మండిపడుతుంది స్వప్న. కొంచెం మనుషుల్లా ప్రవర్తించండి ఛీ అంటూ స్వప్న చిరాకు పడుతుంది.

Brahmamudi Serial Today s Episode 514 September 13th 2024 Here is full story

అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి తిరిగొచ్చి.. ఔను నా చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా, అపర్ణా ఆంటీ హాస్పిటల్‌లో చావు బతుకుల్లో ఉంటే మీరు పార్టీ చేసుకుంటున్నారేంటీ అని డౌట్ పడుతుంది . ఒకవేళ ఆ రెండూ ఇన్సిడెంట్స్ వెనుక మీ హస్తం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. దానికి రుద్రాణి షాకైనా తేరుకుని హస్తం లేదూ పాదం లేదని కవర్ చేస్తుంది. కానీ ఒకవేళ కావ్య వెళ్లిపోవడానికి మీరే కారణమని నాకు తెలిస్తే అప్పుడుంటుంది మీ తల్లికొడుకులిద్దరికీ అని హెచ్చరిస్తుంది.

కూతురు ఎందుకు వచ్చేసిందో తెలియక అక్కడ కనకం, కృష్ణమూర్తిలు దిగులుగా కూర్చొని బాధపడుతుంటారు. కూతురు అలా బాధపడుతుంటే నేను అలా చూస్తూ ఉండలేనని , కనీసం పెద్దావిడకి ఫోన్ చేసైనా ఏమైందో కనుక్కుంటానంటూ ఇందిరా దేవికి కనకం ఫోన్ చేస్తుంది. నా కూతురు ఎందుకు పుట్టింటికి వచ్చేసింది తనేం తప్పు చేసిందని ప్రశ్నించగా అప్పుడు జరిగినదంతా చెబుతుంది ఇందిర. తప్పు చేసింది నీ కూతురు కాదు కనకం.. నా మనవడు అంటుంది. కానీ శిక్ష మాత్రం నా కూతురికి పడింది, మరిప్పుడు దీనికి పరిష్కారం ఏంటమ్మా అని అడుగుతుంది కనకం.

Brahmamudi Serial Today s Episode 514 September 13th 2024 Here is full story

మరోవైపు.. కళ్యాణ్ జరిగినది గుర్తుచేసుకుని బాధపడుతుండగా అప్పూ వచ్చి .. ఎందుకురా బయ్ అలా బాధపడతావని ప్రశ్నిస్తుంది. అక్కడికి వెళ్లి నువ్వు గొడవ పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు అందుకే వెళ్లొద్దు అని చెప్పానని, నువ్వు వెళ్లడం వల్ల అక్కడ ఎవరైనా మారారా అని అంటుంది. వదినకి ఇంత అన్యాయం జరిగిందని తట్టుకోలేకపోతున్నా పొట్టి.. ఎలాంటి సమస్య వచ్చినా వదిన సరిచేయగలదని, కానీ ఆమె వెళ్లిపోయింది తిరిగి వదినను ఎలా తీసుకురావాలో అర్ధం కావడం లేదంటాడు కళ్యాణ్. మీ అన్నయ్య వెళ్లినా మా అక్క మాత్రం కన్వీన్స్ అవ్వదు ఎందుకంటే అక్క తప్పు చేయదు, నిందలు వేస్తే భరించలేదని అంటుంది అప్పు. ఈ విషయంలో మనమే ఏదో ఒకటి చేయాలని కళ్యాణ్ అంటాడు.

Brahmamudi Serial Today s Episode 514 September 13th 2024 Here is full story

ఒంటరిగా మదనపడుతున్న రాజ్ దగ్గరికి ఇందిర వచ్చి ఏం చేస్తున్నావ్, ఏం చేద్దాం అనుకుంటున్నావని అడుగుతుంది. అమ్మ కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుందో, ఇంట్లో సమస్యలతో మీ తాతయ్య కుమిలిపోతున్నాడు. ఇవన్నీ చూడటానికా మేం బతికుందని ప్రశ్నిస్తుంది. అమ్మకి ఇలా జరగడం మన దురదృష్టమే తప్ప.. కావ్య కారణం కాదు, నువ్వు నిందలు వేసి ఇంట్లో నుంచి బయటికి పంపేశావని మండిపడుతుంది. కావ్య వెళ్లిపోయింది, పెద్ద కోడలు ఆసుపత్రి పాలైందంటూ ఇంట్లో పరిస్ధితుల గురించి రాజ్‌కి చెబుతుంది ఇందిర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X