Brahmamudi September 14th episode: రాజ్ ఫ్యామిలీకి డాక్టర్ షాకింగ్ న్యూస్, కావ్యకు అండగా కృష్ణమూర్తి
కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో రాజ్‌ని కడిగిపారేస్తాడు కళ్యాణ్. ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయం మాత్రం మార్చుకునేది లేదని, భార్యను ఇంటి నుంచి తీసుకొచ్చేది లేదని చెబుతాడు రాజ్. అటు కూతురి కాపురంలో కలతలు , ఆమె పుట్టింటికి రావడంతో కృష్ణమూర్తి, కనకం బాధపడారు. ఇందిరకి ఫోన్ చేసి జరిగినది తెలుసుకుంటుంది కనకం. ఎలాగైనా అన్నయ్యని వదినని కలపాలని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. ఒంటరిగా ఆలోచిస్తున్న రాజ్ దగ్గరికి ఇందిర వచ్చి ఇంట్లో సమస్యల గురించి ప్రస్తావిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 515లో ఏం జరిగిందంటే..
స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా నిలబడి బాధపడుతున్న మనవడు రాజ్ దగ్గరికి ఇందిరా దేవి వస్తుంది. కోపాలు, తాపాలను నీ భార్య భరించింది.. నువ్వు ఒక్క తప్పు క్షమించలేవా అని మనవడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది. నేను వెళ్లిపోమని చెప్పలేదు , నేను రమ్మని నేను వెళ్లి అడగను.. తిరిగి రావాలని ఎప్పటికీ ఎదురుచూడను అంటాడు రాజ్. బయట అంతా ఇలాగే ఉంటున్నారా, గొడవలొచ్చినా భార్యాభర్తలు కలిసిపోవడం లేదా అని ఇందిరా దేవి ప్రశ్నిస్తుంది. అందరి విషయం వేరు , నా విషయం వేరు నానమ్మ.. నాది ముడిపడిన బంధం కాదు, బలవంతంగా ముడిపెట్టిన బంధం, అది ఎప్పటికీ నిలవదు అంటాడు రాజ్. కావ్యని జీవితంలో క్షమించను.. తనని తీసుకురాను, ఒకవేళ తను వచ్చినా ఊరుకోనని తేల్చిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇంటి గడపై కూర్చొని కావ్య బాధపడుతుండగా ఆమెను చూడటానికి అప్పు వస్తుంది. నువ్వు ఏడవటం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. నీకు అస్సలు సూట్ అవ్వలేదంటూ కావ్య చెబుతుంది. జీవితంలో అలిసిపోయానని అంటుంది. మా పెళ్లి వల్లే సమస్యలన్నీ మొదలయ్యాయయని , నువ్విలా పుట్టింటికి వచ్చావని అప్పు బాధపడుతుంది. సమస్య నీ వల్లో , కవిగారి వల్లో కాదని మా ఆయన ఆలోచన వల్ల అని చెబుతుంది. తల్లిదండ్రులను వదిలేసి నా భర్తే నా ప్రాణం అనుకుని బతికానని, కానీ ఇవాళ నా ప్రేమే ఆయనకు కనిపించలేదని కావ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా మనసులో ఆయనకు స్థానం దొరకలేదు, అలాంటప్పుడు నేను అక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఎక్కడ తప్పు చేశానో అర్ధం కావడం లేదు, నాకు నేను శిక్ష వేసుకుని ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నానని అప్పుతో అంటుంది కావ్య.
మరోవైపు.. ఆసుపత్రి బెడ్‌పై భార్య శరీరంలో కదలికలు వస్తుండటంతో పరుగుపరుగున డాక్టర్‌ను పిలుస్తాడు సుభాష్ . అప్పటికి కుటుంబ సభ్యులంతా ఆమె చుట్టూ చేరగా అపర్ణ కోమాలో నుంచి బయటికి రావడంతో అంతా సంతోషిస్తారు. కొడుకు వంక చూసి కావ్య ఎక్కడని అడగటంతో రాజ్ సహా అంతా షాక్ అవుతారు. దీంతో ఆమెకు ఏం చెప్పాలో తెలియక బయటికి వెళ్లిపోతాడు. అపర్ణను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏదైనా షాకింగ్ న్యూస్ చెబితే మళ్లీ కోమాలోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పడంతో కుటుంబసభ్యులు భయపడతారు.

మీ అమ్మ కావ్యను అడుగుగుతుంది ఎలా మేనేజ్ చేస్తావ్ , ఇది నీ కాపురానికి సంబంధించినదే కాదు.. మీ అమ్మ ప్రాణానికి సంబంధించిన సమస్య అని రాజ్‌తో అంటుంది ఇందిరా దేవి. నానమ్మ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక.. తనను అడగొద్దని వెళ్లిపోతాడు రాజ్. అపర్ణే ఇద్దరిని కలుపుతుందని సుభాష్ ధీమా వ్యక్తం చేస్తాడు. ఇంతలో స్వప్నకు కావ్య కాల్ చేసి అత్తయ్య గారికి ఎలా ఉందని అడగ్గా.. ఆమె కోమాలోంచి బయటపడినట్లు చెబుతుంది. దీంతో కావ్య చాలా సంతోషపడుతుంది. బయటికి వెళ్లి కనకం, కృష్ణమూర్తిలకు ఈ విషయం చెప్పగా వాళ్లు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అత్తయ్యని చూడటానికి వెళ్తున్నావా అని కృష్ణమూర్తి కావ్యని అడగ్గా.. ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని వెళ్తున్నా అంటుంది.

దీంతో నువ్వు ఈ తండ్రికి బరువా అంటూ కృష్ణమూర్తి బాధపడతాడు. ఈ ఉద్యోగం నాకోసం, నేను నేనుగా బతకడం కోసం అంటుంది కావ్య. దానికి ఉద్యోగమే చేయాలా బొమ్మలకి రంగులేసినా కాలక్షేపం అవుతుందని కనకం అంటుంది. అది కాలక్షేపం కోసం కాదు.. తన కాళ్లమీద తను నిలబడాలని కోరుకుంటోందని.. సంపాదన కోసం చేసే ఉద్యోగానికి, సంతృప్తి కోసం చేసే ఉద్యోగానికి చాలా తేడా ఉంటుందని కూతురు వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. కావ్య ఉద్యోగం చేయడం కనకానికి ఏమాత్రం ఇష్టం ఉండదు.. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని , కావ్యకి అడ్డుపడొద్దని కృష్ణమూర్తి సర్దిచెబుతాడు. హాస్పిటల్ నుంచి అపర్ణని ఇంటికి తీసుకొస్తారు, గడపట్లో ఆమెకు స్వప్న దిష్టి తీయబోగా.. అపర్ణ ఆగమంటుంది. ఇలాంటి పనులన్నీ నా కోడలే కదా చేసేది అని అంటుంది. తను రాకుండా స్వప్న వచ్చింది, కావ్య ఎక్కడని అడుగుతుంది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవ్వగా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











