Brahmamudi September 17th episode: రాజ్ పంతం .. కనకం ఇంటికి సీతారామయ్య దంపతులు, మెట్టుదిగని కావ్య !!
కోమాలోంచి బయటికొచ్చిన అపర్ణకు కావ్య గురించి రాజ్ అబద్ధం చెబుతాడు. సాయంత్రమైనా కోడలు ఇంటికి రాకపోయేసరికి అపర్ణ ఇంట్లో వాళ్లని నిలదీస్తుంది. రాజ్ వల్లే కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని రుద్రాణి షాకింగ్ న్యూస్ చెబుతుంది. స్వప్న కలగజేసుకుని చెల్లికి జరిగిన అన్యాయంపై అపర్ణకి వివరిస్తుంది. తానే కావ్యని కంపెనీకి వెళ్లమన్నానని.. ఇందులో ఆమె తప్పేం లేదని అపర్ణ చెప్పడంతో రాజ్ సహా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. రాహుల్‌ని క్షణంలో పీకి పారేస్తానని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ 517లో ఏం జరిగిందంటే..
స్వప్న మాటలతో నిజం తెలుసుకున్న అపర్ణ కొడుకుపై కోపపడుతుంది. చెప్పుడు మాటలు విని కావ్య మనసును ముక్కలు చేశావంటూ రాజ్‌పై కేకలు వేస్తుంది. కావ్య నిప్పని.. తప్పు చేసింది నువ్వేనని మండిపడుతుంది. ఎవరు ఎన్ని మాటలు అన్నా పడ్డ కావ్య .. భర్త తన మనసులో స్థానం లేదని చెప్పేసరికి తట్టుకోలేకపోయిందని అపర్ణ అంటుంది. మీ కోడలిది పౌరుషం కాదని, అహంకారంతో వెళ్లిపోయిందని , రాజ్‌ని క్షమాపణలు అడగమని చెప్పినా వినలేదని రుద్రాణి చెబుతుంది. నేనేం తప్పు చేయలేదు.. నా ప్రాణం పోయినా క్షమాపణలు చెప్పనని వెళ్లిపోయిందని అంటుంది.

దటీజ్ కావ్య అంటూ కోడల్ని మరోసారి మెచ్చుకుంటుంది అపర్ణ. మీరెందుకు కావ్యని క్షమాపణలు చెప్పమన్నారని అత్తగారిని నిలదీయగా.. గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని రాజీ కుదర్చాలని అనుకున్నానని ఇందిర చెబుతుంది. కావ్య నాలాంటిది కాదని, మీ కొడుకు చేసిన ద్రోహన్ని దిగమింగి రాజీపడి బ్రతుకుతున్నానని అపర్ణ అంటుంది. ఒకవేళ రాజ్‌ని క్షమాపణలు అడిగిఉంటే నేనే దాని చెంప పగులగొట్టి ఉండేదాన్నని అనడంతో అంతా షాక్ అవుతారు. నీతి నిజాయితీ అని నిన్ను బోల్తా కొట్టించింది, రాహుల్ మీద తప్పుడు కేసులు పెట్టింది, కంపెనీ నుంచి ఏ ఫోన్ రాలేదని రుద్రాణి చెబుతుంది. రాహుల్ ఆనాడే కంపెనీకి వెళ్లనని అందరి ముందు చెప్పాడని, మళ్లీ కావ్య ఆపడం ఏంటని అపర్ణ ప్రశ్నిస్తుంది. నేను, నా కొడుకు తలచుకుంటే ఈ గడ్డిపోచని పీకి పారేయడం ఎంతసేపు.. చెప్పుడు మాటలు విని , కావ్య మనసు విరిగిపోయేలా చేసిన రాజ్‌దే తప్పని మండిపడుతుంది.
కావ్యని బలవంతంగా పెళ్లి చేసుకున్నావా, బలవంతంగా కాపురం చేశావా.. అంటే దాని మీద నీకు ప్రేమ లేదా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది అపర్ణ. గుండెనిండా ప్రేమను నింపుకుని , ప్రేమ లేదని చెబితే ఆ పిచ్చిది ఏమైపోవాలి అని కొడుకుని నిలదీస్తుంది. తల్లి మీదున్న ప్రేమ నీ కళ్లు మూసుకునేలా చేసిందని.. నా కోడలు నిప్పు, నువ్వే వెళ్లి క్షమాపణ అడిగి కావ్యని ఇంటికి తీసుకురావాలని రాజ్‌ని ఆదేశిస్తుంది అపర్ణ. నాకు నీ ప్రాణం ముఖ్యమని, కారణం ఏదైనా సరే .. కోట్లు పోయినాసరే కళావతి నిన్ను వదిలిపెట్టి వెళ్లడం తప్పేనని రాజ్ చెబుతాడు. నీ ప్రాణాల మీదకి తెచ్చిన మనిషిని వెళ్లి పిలిచే ప్రసక్తే లేదని .. ఈ ఒక్క విషయంలో తనను క్షమించాలని రాజ్ వెళ్లిపోతాడు.
అయితే తానే వెళ్లి కావ్యని తీసుకొస్తానని అపర్ణ బయల్దేరబోతుండగా.. సీతారామయ్య ఆపుతాడు, నీ ఆరోగ్యం బాలేదని.. నేను, మీ అత్తయ్య వెళ్లి కావ్యని తీసుకొస్తామని చెబుతాడు. మీరంతా నా కోడలు గడపదాటి వెళ్తుంటే ఏం చేశారని అందరిపై మండిపడుతుంది అపర్ణ. అయినా వినకుండా కావ్య కోసం అపర్ణ బయల్దేరతుండగా ఇందిరా దేవి కలగజేసుకుని.. లోలికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తుంది. మీ వదిన మాట్లాడితే కావ్య కావ్య అంటుందని.. ముసలివాళ్లిద్దరిని ఆపాలని రుద్రాణితో రాహుల్ అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు, కావ్యలాంటి ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్లు అస్సలు ఇంటికి తిరిగిరారని రుద్రాణి సర్దిచెబుతుంది. పొద్దున్నే సీతారామయ్య, ఇందిరలు కావ్య ఇంటికి వెళ్తారు. వాళ్లని చూడగానే కనకం కంగారుపడి కావ్య, కృష్ణమూర్తిలను పిలుస్తుంది.
ఎలా ఉన్నావని అడిగే అర్హత లేకుండా చేశాడని.. వాడు తప్పుచేశాడని, కానీ ఇప్పుడు పంతానికి వెళ్లే సమయం కాదని.. మనవడిని క్షమించి తిరిగి ఇంటికి రావాలని కావ్యతో సీతారామయ్యతో అంటాడు. ఇప్పుడు అత్తయ్యకి ఎలా ఉందని కావ్య వాళ్లని అడుగుతుంది. అపర్ణ కోమాలోంచి బయటికి వచ్చినప్పటి నుంచి నా కోడలు ఎక్కడ అని అడుగుతూనే ఉందని.. నువ్వు తిరిగి ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారని ఇందిర అంటుంది. తనొస్తే ఈ క్షణమే మీతో పాటు తీసుకెళ్లాలని కనకం చెప్పగా.. మీరు అడిగినట్లుగానే వస్తానని, కానీ ఆ ఇంట్లో నా స్థానమెంటని కావ్య వాళ్లని ప్రశ్నిస్తుంది.
ఆయనలో మార్పు వచ్చిందని అనుకున్నానని.. కానీ అదంతా తన తల్లి సంతోషం కోసమే చేశానని చెప్పాడని.. నమ్మి మోసపోయానని కావ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక్కడికి రావాల్సింది నేను , మీ అత్తయ్య కాదని.. తప్పు చేసిన నీ భర్త అని .. వాడే ఇక్కడికి వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తాడని పెద్దవాళ్లు చెప్పి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లగానే నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని కావ్య తల్లిని అడగ్గా.. నేను కూడా నిన్ను పూర్తిగా అర్ధం చేసుకోలేదని, నన్ను క్షమించాలని కూతురిని అడుగుతుంది. అక్కడ కావ్య ఇంటికి వెళ్లిన పెద్దవాళ్ల కోసం ఇంట్లో వాళ్లంతా ఎదురుచూస్తుండగా.. ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











