Brahmamudi Sep18th episode:రుద్రాణి ప్లాన్‌ని తిప్పికొట్టిన స్వప్న..కావ్యకి బ్లాంక్ చెక్, రాజ్ ఆఖరి ప్రయత్నం !
రాజ్ వల్లే కావ్య వెళ్లిపోయినట్లు తెలుసుకున్న అపర్ణ కొడుకుపై మండిపడుతుంది. తన కోడలు నిప్పని, తప్పు చేసింది నువ్వే కాబట్టి .. నువ్వే వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకురావాలని రాజ్‌ని అపర్ణ ఆదేశిస్తుంది. నీ ప్రాణాల మీదకు తీసుకొచ్చిన దానిని జన్మలో క్షమించనని రాజ్ తేల్చిచెబుతాడు. తానే వెళ్లి కోడల్ని తీసుకొస్తానని అపర్ణ బయల్దేరబోతుండగా సీతారామయ్య దంపతులు ఆపి.. వాళ్లే కావ్య ఇంటికి వెళ్తారు. తాను ఇంటికొస్తే నా స్థానమేంటని పెద్దవాళ్లు ఇద్దరినీ కావ్య ప్రశ్నిస్తుంది. కనకం ఇంటికెళ్లిన సీతారామయ్య దంపతుల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ 518లో ఏం జరిగిందంటే..
వట్టి చేతులతో ఇంట్లోకి వచ్చిన నానమ్మ, తాతయ్యలను ఆ మహారాణి ఎక్కడ అని ప్రశ్నిస్తాడు రాజ్. రానని చెప్పిందని సీతారామయ్య అంటాడు.. అది రాదని తానే ముందే చెప్పానని, మీరు వెళ్తే ఇలాగే అవమానంతో తిరిగి వస్తారని చెప్పానని రాజ్ పేర్కొన్నాడు. మేం మీ భార్య ఇంటి ముందు తలదించుకుని నిలబడాల్సి వచ్చిందని.. దానికి కారణం నువ్వే కదా అని ఇందిరా దేవి అంటుంది. అందుకే కావ్యని ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు మానేయాలని చెబుతాడు రాజ్. మేం మానేస్తామని.. కానీ కావ్య ఇంటికి రావాలంటే వెళ్లాల్సింది నువ్వేనని సీతారామయ్య అంటాడు.

నేను వెళ్లడం జీవితంలో జరగదని రాజ్ చెబుతాడు. ముసలివాళ్లు రాజ్‌ని రెచ్చగొట్టి ఎక్కడ కావ్య ఇంటికి పంపిస్తారోనని భయపడ్డ రుద్రాణి మధ్యలో జోక్యం చేసుకుంటుంది. కావ్య తప్పు చేయదని ఈ ఇంట్లో అందరికీ తెలుసు.. అపర్ణ ఆంటీ లేనిసమయంలో నువ్వు అడ్డంగా రెచ్చిపోయావ్, ఇప్పుడది జరగదని అంటుంది. దీంతో సుభాష్ .. నువ్వు నోరుమూయ్ , ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టి కావ్య మీద పడి ఏడుస్తావేంటీ, కలపాలని ఆలోచన లేదా అని అంటూ రుద్రాణిపై ఫైర్ అవుతాడు. ఇదంతా కాదు.. నువ్వు కావ్య ఇంటికి వెళ్లి తీరాల్సిందేనని ఇందిరా దేవి మనవడితో అంటుంది. నేను వెళ్లి ఆవిడగారి కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలా అని రాజ్ ప్రశ్నించగా.. అడిగినా తప్పులేదని అపర్ణ చెబుతుంది. తల్లి మాటలతో రాజ్‌కు పౌరుషం పొడుచుకొస్తుంది.
నేను వెళ్తానని , కానీ కావ్య రాకపోతే మాత్రం మళ్లీ ప్రయత్నించమని అడగొద్దని తేల్చిచెబుతాడు. రాజ్ వెళ్లగానే రుద్రాణి, రాహుల్‌లు భయపడుతూ ఉంటారు. స్వప్న చేతే కావ్యను ఇంటికి రాకుండా చేయాలని తల్లికొడుకులు ప్లాన్ చేస్తారు. కావ్య ఇక్కడికొస్తే ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుందని.. అప్పుడు అపర్ణకి ఏమైనా జరిగితే, కావ్యకి వెంటనే విడాకులు ఇచ్చేస్తాడని చెబుతుందని కొడుకుతో మాయమాటలు అంటుంది. ఆ మాటలు విన్న స్వప్న భయపడి వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది.
ఏం మాట్లాడుతుందో వెళ్లి చూద్దామని వెళ్లగా.. స్వప్న డమ్మీ ఫోన్ మాట్లాడి షాకిస్తుంది. మీరు ఆడే డ్రామాలకు ఒక్కసారి మోసపోతానని, అన్నిసార్లు కాదని .. మీరేంత ట్రై చేసినా కావ్య ఇంటికి రావడాన్ని ఆపలేరని స్వప్న చెబుతుంది. అక్కడ కనకం - కృష్ణమూర్తిలు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దసరా నాడు ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లని పిలవాలని అనుకున్నానని.. నేను ఏమనుకున్నా రివర్స్‌లో జరుగుతోందని బాధపడుతుంది. దీంతో కృష్ణమూర్తి ఆమెపై సెటైర్లు వేస్తాడు.
ఇంతలో రాజ్ అక్కడికి రావడాన్ని చూసిన వాళ్లిద్దరూ ఎంతో సంతోషపడతారు. వాళ్లిద్దరికీ కామెడీగా దండం పెట్టి.. మా ఇంటి మహాలక్ష్మీ, మీ ఇంటికి వెకేషన్‌కి వచ్చింది, ఎక్కడ సేదతీరుతోందని సెటైర్లు వేస్తాడు రాజ్. భర్తని చూసి షాకైన కావ్య.. ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. మధ్యలో మనం ఉండకూడదని కనకం, కృష్ణమూర్తిలు లోపలికి వెళ్లిపోతారు. నేనొస్తే పట్టించుకోకుండా పనిచేసుకుంటున్నావ్ అని రాజ్ అడగ్గా.. బొమ్మని కిందపడేసి, స్లో మోషన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి మీ కాళ్లపై పడాలా అని అంటుంది.
మీకేం కావాలని కావ్య అడగ్గా.. మా అమ్మ నిన్ను తీసుకురమ్మంది వెళ్దాం రా అని రాజ్ అడుగుతాడు. ఎందుకో అని కావ్య ప్రశ్నించగా.. మా ఇల్లు చీకటిగా ఉందంట, నువ్వొచ్చి దీపం పెడితే తప్ప వెలుగు రాదంట అంటూ సెటైర్లు వేస్తాడు. దీపం పెట్టడానికి ఇంకో ఆప్షన్ వెతుక్కోండి.. మీరు పెళ్లిచూపులు చూసుకుని, ఇష్టపడి, పెళ్లి చేసుకుని ఓ బంగ్లాలో శోభనం చేసుకుని తెల్లారి అగ్గిపెట్టె చేతికిచ్చి దీపం వెలిగించమనండి అంటూ కావ్య వెటకారంగా ఆన్సర్ ఇస్తుంది. నువ్వు రాకపోతే కాళ్లు పట్టుకునైనా లాక్కెళ్తానని రాజ్ అంటాడు.
మీ అమ్మగారు చెబితే వచ్చారా, మీ తాతయ్య వాళ్లు చెబితే వచ్చారా అని కావ్య ప్రశ్నించగా.. ఎందుకో అందుకు వచ్చి చచ్చానుగా , రావొచ్చుగా అంటాడు రాజ్. చచ్చే వచ్చాను, మళ్లీ వచ్చి , మళ్లీ చచ్చేంత ఓపిక నాకు లేదని తేల్చిచెబుతుంది. మీరు తీసుకెళ్లడానికి వచ్చారా, జీవితంలో రాకుండా చేయడానికి వచ్చారా అని ప్రశ్నిస్తుంది. మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోరా అని కావ్య నిలదీస్తుంది. విజ్ఞాన ప్రదర్శనలు ఆపేసి దయచేయాలంటూ రాజ్‌కి చెబుతుంది. మా అమ్మకి ఫోన్ చేసి ఇదే మాట చెప్పమని రాజ్ అడుగుతాడు.. నేను చెప్పనను కావ్య మొండికేస్తుంది. ఎందుకింత పొగరని రాజ్ సీరియస్ అవ్వగా.. రావె పోవే అనడానికి నేనిప్పుడు నీ పెళ్లాన్ని కాదు, నీకు నాకు ఏం సంబంధం లేదని తేల్చిచెబుతుంది. నేను జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే ప్రోమోలో కావ్యకి రాజ్ బ్లాంక్ చెక్ ఇచ్చి కోడలిగా నటించమంటాడు.


Click it and Unblock the Notifications











