Brahmamudi September 19th episode: కావ్య ఆత్మాభిమానంపై కొట్టిన రాజ్.. రివర్స్‌లో షాకిచ్చిన కళావతి !!

నువ్వు వెళ్లనిదే కావ్య ఇంటికి తిరిగిరాదని సీతారామయ్య దంపతులు, అపర్ణ ఒత్తిడి చేయడంతో రాజ్ మెట్టుదిగి కళావతి ఇంటికి బయల్దేరతాడు. రాజ్ కనుక వెళితే కావ్య ఎక్కడ తిరిగొచ్చేస్తుందోనని రుద్రాణి- రాహుల్ భయపడి ప్లాన్ వేస్తారు. అయితే స్వప్న వారి ఎత్తులు చిత్తు చేస్తుంది. రాజ్‌ని ఇంటి దగ్గర చూసి కావ్య షాక్ అవుతుంది. ఇంటికి తిరిగి రావాలని రాజ్ ఎంతగానో బతిమలాడి చూస్తాడు. మళ్లీ వచ్చి మళ్లీ చచ్చే బాధ తనకొద్దని.. తాను ఇంటికి రానని కరాఖండీగా చెప్పేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ 519లో ఏం జరిగిందంటే..

రాజ్‌ను వెళ్లిపోమని చెప్పడంతో కావ్యపై కనకం కోప్పడుతుంది. నువ్వయినా తగ్గొచ్చుగా అని చెబుతుంది.. ఆయన మనసులో ప్రేమ ఉంటే తగ్గేదాన్నని కావ్య అంటుంది. కారు దగ్గరికి వెళ్లిన రాజ్ మళ్లీ తిరిగొచ్చి.. నేనొక అద్భుతమైన ఆఫర్ ఇస్తానని, ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని అమోఘమైన అవకాశం అంటూ చెబుతాడు. ముందు అదేంటో చెప్పాలని కావ్య అడుగుతుంది. నాకు మా అమ్మ ముఖ్యం.. మా అమ్మకి నువ్వు ముఖ్యం.. నువ్వేమో ఎవరెస్ట్ ఎక్కి కూర్చొన్నావ్, కాబట్టి ఒక సెన్షేషనల్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నానని రాజ్ అంటాడు.

Brahmamudi Serial Today s Episode 519 September 19th 2024 Here is full story

వెంటనే చెక్ బుక్ బయటికి తీసి.. నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి నీకెంత కావాలని రాజ్ అడుగుతాడు. ఆ మాటతో కావ్య, కనకం షాక్ అవుతారు. ప్యాకేజీ కావాలా, ఇన్‌స్టాల్‌మెంట్‌లో కావాలా, నెల నెలా జీతం కావాలా.. అని అంటాడు. ఎంత కావాలన్నా ఇస్తారా అని కావ్య అడగటంతో .. ఎంతైనా ఇస్తా, బ్లాంక్ చెక్ మీద నీకు ఇష్టమొచ్చినంత రాసుకో అంటాడు. దీంతో కావ్య సర్దుకుని వస్తానని చెప్పి ఓ చిన్న కవర్‌తో బయటికి వస్తుంది. ఇంత చిన్న కవర్‌లో ఏం పట్టాయ్ అని రాజ్ ఆశ్చర్యంగా అడగ్గా.. మేం పేదవాళ్లం కదా ఉన్నవి తీసుకొచ్చానని అంటుంది.

ఇంతకీ మీ నెల జీతం ఎంత అని కావ్య అడగ్గా.. నా కంపెనీలో నాకు జీతం ఏంటీ, నేనే నెలకు ఖర్చుల కింద రూ.5 లక్షలు డ్రా చేస్తానని ఆన్సర్ ఇస్తాడు రాజ్. అంటే మీ నెల జీతం రూ.5 లక్షలన్న మాట అంటూ సంచిలోని బంగారు నగలను కావ్య కింద పోసి.. ఇవన్నీ రూ.5 లక్షల పైనే ఉంటాయని అంటుంది. బంగారం షాపులో చెక్ చేస్తే దాని విలువ రూ.6 లక్షల పైనే ఉంటుందని చెబుతుంది. ఇవి తీసుకుని మా ఇంట్లో నెల రోజులు ఇంటి అల్లుడిగా నటించండి అని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. పరాయి మొగుడు - కిరాయి పెళ్లాం అన్న ప్రపోజ్ పెట్టినప్పుడు .. నేను పరాయి పెళ్లాం- కిరాయి మొగుడు అన్న కాన్సెప్ట్ తెచ్చానని కావ్య అంటుంది.

Brahmamudi Serial Today s Episode 519 September 19th 2024 Here is full story

ఈ దుగ్గిరాల వంశానికి వారసుడినే నెల జీతానికి కొనాలని చూస్తున్నావా అంటూ రాజ్ ఫైర్ అవుతాడు. ముందు మీరు మా ఇంటికొచ్చి అల్లుడిగా నటించండి, వచ్చే నెల నేనొస్తానని .. బ్లాంక్ చెక్ కూడా అవసరం లేదని కావ్య అంటుంది. ఇప్పటి వరకు మా అమ్మ కోసం 100 మెట్లు దిగొచ్చానని, ఇక జీవితంలో ఒక్క మెట్టు కూడా దిగనని రాజ్ తేల్చిచెబుతాడు. అక్కడ రాజ్ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. కానీ అతను ఒక్కడే వట్టిచేతులతో వచ్చేసరికి అంతా షాక్ అవుతారు.

కావ్య రాలేదని.. నన్ను పూచీక పుల్లలా తీసిపారేసిందని , అయినా నా ప్రయత్నం నేను చేశానని, మళ్లీ నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెబుతాడు రాజ్. దీంతో అపర్ణ కలగజేసుకుని.. నిన్ను అవతలికి పొమ్మన్నాక మళ్లీ ఎందుకు పంపిస్తామని అంటుంది. తర్వాత రాజ్- కావ్యలను ఎలా కలపాలా అని ఇంటి సభ్యులు ఆలోచిస్తూ ఉంటారు. కావ్య వెళ్లిపోవాలని 100 సార్లు అన్నది మా అత్తే కాబట్టి.. ఆమెనే పంపిద్దామని స్వప్న చెప్పడంతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. నా కొడుకు జీవితం ఇలా కావడానికి వీల్లేదని.. ఇద్దరిలోనూ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా, బయటపడకుండా గొడవ పడుతున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Brahmamudi Serial Today s Episode 519 September 19th 2024 Here is full story

ఇంతలో కావ్య ఇంటికి రాజ్ వెళ్లిన విషయాన్ని అప్పూకి కళ్యాణ్ చెప్పగా ఆమె చాలా సంతోషపడుతుంది. వదినని ఇంటికి తీసుకొచ్చే వరకు పెద్దమ్మ వదిలిపెట్టదని కళ్యాణ్ చెబుతుండగా ఇంటి ఓనర్ వచ్చి అద్దె గురించి అడుగుతాడు. అతనిపై అప్పూ జోక్స్ వేస్తుండగా కళ్యాణ్ అడ్డుకుని రెండ్రోజుల్లో అద్దె ఇచ్చేస్తానని చెప్పి ఇంటి ఓనర్‌ని పంపించేస్తాడు. అక్కడ రాజ్ ఒంటరిగా బాధపడుతుండగా.. రాజ్ అంతరాత్మ బయటికొచ్చి అలాగే చూస్తుంది. నేను ఎఫ్పుడు తప్పు చేయను, తప్పు చేసినవాళ్లని క్షమించనని రాజ్ తన అంతరాత్మతో అంటూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. మరోవైపు ప్రోమోలో ఉదయాన్నే రాజ్ నిద్ర లేచి చూడగా.. కావ్య కాఫీ కప్పుతో కనిపించడంతో అతను షాక్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X