Brahmamudi September 20th episode: బిగ్‌షాట్‌ని పట్టిన అనామిక, రాజ్ ఫ్యామిలీకి కొత్త శత్రువు !!

తల్లి ఆరోగ్యం కోసం కావ్య ఇంటికి వచ్చిన రాజ్ ఆమెను ఎలాగోలా వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటాడు. కళావతి ఒప్పుకోకపోయే సరికి ఆమెకు వెల కడతాడు. కోడలిగా నటించడానికి ఎంత కావాలంటూ బ్లాంక్ చెక్ ఇస్తాడు. దీంతో కావ్య, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇంట్లో నుంచి బంగారం తీసుకొచ్చిన కావ్య.. ఇది తీసుకుని అల్లుడిగా నటించమంటూ దెబ్బకు దెబ్బ తీస్తుంది. వట్టి చేతులతో ఇంటికి వచ్చిన రాజ్‌ని చూసి ఇంట్లో వాళ్లు డిజప్పాయింట్ అవుతారు. ఒంటరిగా ఆలోచిస్తున్న రాజ్ దగ్గరికి అతని అంతరాత్మ వచ్చి క్లాస్ పీకుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ 520లో ఏం జరిగిందంటే..

తానేమీ తప్పు చేయలేదని.. ఎవరు చేసినా ఊరుకోనని అంతరాత్మతో చెబుతాడు రాజ్. కానీ ఆత్మారామ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా అలా రాజ్‌ని చూస్తూనే ఉంటాడు. జీవితంలో మీ ఇంటి గడప చెప్పిందని.. ఏ మొగుడికైనా మండదా , నాకూ మండిందని రాజ్ అంటాడు. ఆమెకు బదులు ఇవ్వకుండా వస్తే నాకు నిద్రపట్టదు కదా , కాలింది చల్లారదు కదా .. అందుకే చెక్ బుక్ తీసుకెళ్లి కోడలిగా నటించమని చెప్పా అంటాడు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెబితే.. నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిందని రాజ్ ఆత్మారామ్‌తో చెబుతాడు. కంపెనీ కంటే మా అమ్మ ప్రాణమే ముఖ్యం.. అందుకే కాస్త ఎక్కువగానే తిట్టానని రాజ్ అంగీకరిస్తాడు. నా అంతట నేను ఇంట్లో నుంచి వెళ్లిపోమని ఒక్కమాట కూడా చెప్పలేదని అంటాడు.

Brahmamudi Serial Today s Episode 520 September 20th 2024 Here is full story

నేను ఇంత మాట్లాడినా నువ్వు సైలెంట్‌గా ఉండిపోయావేంటి అని ఆత్మారామ్‌తో అంటాడు రాజ్. నేను సైలెంట్‌గా ఉండి నిజాలన్నీ నీతోనే కక్కించా, కట్టుకున్న భార్యకి జీతం ఇస్తానని ఏ భర్తయినా అంటాడా అని ప్రశ్నిస్తాడు ఆత్మారామ్. నీకు భార్య కావాలా వద్దా , ఎంత మంది భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లడం లేదు, బుద్ధి తెచ్చుకుని వెళ్లి కావ్యని క్షమించమని అడుగు అంటాడు . నేను వెళ్లి క్షమించమని అడగటం జన్మలో జరగదని తేల్చిచెబుతాడు రాజ్.

ఇంటి దగ్గర తమ పెళ్లి ఫోటోను చూసుకుని కావ్య బాధపడుతుంది, కనకం అది చూసి ఆమెను పిలుస్తుంది. పొద్దున్నే కావ్య కాఫీ కప్పుతో తన బెడ్‌రూమ్‌లో ఉండేసరికి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ఎలా వచ్చావ్ అని ఆమెను ప్రశ్నించగా.. షేర్ ఆటోలో వచ్చానని చెబుతుంది. నేను నిన్న మాట్లాడిన మాటలకు భయపడి, బెదిరిపోయి, బాధపడి వచ్చావా అని ప్రశ్నిస్తాడు. నా ఛార్జర్, రెండు తెగిపోయిన చెప్పులు మరిచిపోయానని అవి తీసుకెళ్లడానికి వచ్చానని కావ్య అంటుంది. అయితే ఉండటానికి రాలేదా అని రాజ్ అమాయకంగా అడుగుతాడు. వాళ్లు చెబితే, వీళ్లు చెబితే మొగుడు నా మీద చెయ్యేస్తే గొంగళి పురుగులు పాకినట్లుగా ఉంటుందని, ముందు కాఫీ తాగి రెడీ అవ్వమని భర్తతో చెబుతుంది కావ్య. నేనేందుకు రెడీ అవ్వాలని రాజ్ అడగ్గా.. నన్ను రిటర్న్ డ్రాప్ చేయాలి కదా అని సెటైర్లు వేస్తుంది.

Brahmamudi Serial Today s Episode 520 September 20th 2024 Here is full story

అసలు జీవితంలో మా ఇంటి గడప తొక్కను అన్నావుగా అని రాజ్ అడగ్గా.. నేను గడప తొక్కలేదని దాటుకొనే వచ్చానని కావ్య చెబుతుంది. ఎలాగూ వచ్చావుగా ఉండిపో.. నేనేమీ అనను అని రాజ్ చెప్పగా.. ఎలా ఉండాలి, ఏ హక్కుతో ఉండాలి, ఏ పోస్ట్‌తో ఉండాలని కావ్య ప్రశ్నిస్తుంది. నేనేం చేయాలని రాజ్ అడగ్గా.. కిందకొచ్చి అందరి ముందు నేను నా భార్యని ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని ఓ బాండ్ పేపర్ మీద రాసివ్వాలని అంటుండగా.. పని మనిషి వచ్చి కాఫీ అంటుంది. రాజ్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు.. కావ్య ఎక్కడని ఆమెను అడగ్గా రాలేదని పనిమనిషి సమాధానం ఇస్తుంది. కావ్యను తీసుకురావాలని పనిమనిషి కూడా రాజ్‌ను అడిగేసరికి చిరాకు పడతాడు.

కళ్యాణ్ , అప్పూ షాపింగ్ చేసి ఇంటికి వస్తుండగా.. అనామిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారుతో వారికి డాష్ ఇవ్వబోతారు. దుగ్గిరాల వారి వారసుడు రోడ్డు మీద పడ్డాడని అనామిక అంటుంది. నీలాగా పరాయి వాళ్ల కారుల్లో తిరిగే అలవాటు లేదని అప్పు కౌంటరిస్తుంది. పరాయివాళ్లు ఎవరున్నారు ఇతను నా ఫియాన్సే .. పేరు సామంత్, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అని చెబుతుంది అనామిక. దుగ్గిరాల వారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి నిజమైన ప్రత్యర్ధి.. త్వరలోనే దుగ్గిరాల వారి కంపెనీని పడగొట్టి ఎదురులేని సంస్థగా సామంత్ కంపెనీ ఎదుగుతుందని చెబుతుంది అనామిక. ఆ మాటలతో కళ్యాణ్, అప్పూ బిగ్గరగా నవ్వుతారు. ఓ చీమ ఏనుగు కుంభస్థలం మీద నిలబడి పాతాళంలోకి తొక్కేస్తానని ప్రగల్భాలు పలికినట్లుగా ఉందని కళ్యాణ్ అంటాడు.

Brahmamudi Serial Today s Episode 520 September 20th 2024 Here is full story

ఆ మాటతో సామంత్‌కి కోపమొచ్చి.. నా గురించి నీకు తెలియదని వార్నింగ్ ఇస్తాడు. నీ గురించి మాకు తెలియదని, నీ పక్కనున్న దాని గురించి తెలుసని.. నిన్ను మొత్తం ఊడ్చేసి రోడ్డు మీద పడేస్తుందని అప్పూ హెచ్చరిస్తుంది. నేనేమీ రోడ్డున పడలేదని, ఆస్తులన్నీ వదులుకుని నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని కళ్యాణ్ ఆన్సర్ ఇస్తాడు. రోడ్డున పడటమంటే ఏంటో ఈ అమ్మాయి నీకు చూపిస్తుందని.. దుగ్గిరాల వారిపై పగ తీర్చుకోవడానికి నిన్ను పట్టిందని సామంత్‌కి అప్పూ చెబుతుంది. నాకు పట్టుకున్న దరిద్రం ఆ కోర్టులోనే వదిలిపోయిందని, నీతో ఉన్నప్పుడు ఆ కోటలో ఉన్నా నరకంలా ఉండేదని, ఇప్పుడు అప్పుతో కలిసి చిన్న ఇంట్లో ఉన్నా స్వర్గంలా ఉందన్నాడు. కవిని పెళ్లి చేసుకున్నందుకు అప్పు బాధపడుతుందని, త్వరలోనే వదిలేస్తుందని అనామిక చెబుతుంది. కళ్యాణ్ కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడని , నేను అతనిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని అప్పూ బదులిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X