Brahmamudi September 21st episode: కావ్యతోనే రాజ్ ఫ్యామిలీని దెబ్బకొట్టేలా.. సందీప్‌కు అనామిక ఎర !!
ఒంటరిగా ఆలోచిస్తున్న రాజ్ దగ్గరికి అతని అంతరాత్మ వచ్చి క్లాస్ పీకుతుంది. పొద్దున్నే కావ్య కాఫీ కప్పుతో కనిపించేసరికి రాజ్ ఉలిక్కిపడతాడు, తీరా అది కల అని తెలుసుకుని షాక్ తింటాడు. షాపింగ్ చేసి ఇంటికొస్తున్న కళ్యాణ్ - అప్పూలని ఓ కారు వచ్చి గుద్దబోతుంది. అందులో నుంచి అనామిక, సామంత్ దిగుతారు.. వారిని చూడగానే వీరిద్దరూ షాక్ అవుతారు. తనకు ఫియాన్సే అని, పెద్ద కంపెనీ ఛైర్మన్ అని సామంత్‌ని అనామిక పరిచయం చేస్తుంది. జాగ్రత్త బ్రదర్.. నిన్ను ఇది నాకిపారేస్తుంది, మాలాగా రోడ్డున పడతావని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ 521లో ఏం జరిగిందంటే..
నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్లతో అర్జెంట్‌గా ఫ్రెండ్‌షిప్ మానేయ్.. లేకపోతే నీ బేబీ వాళ్లతో నీకు అక్రమ సంబంధం అంటగట్టి కోర్టుకు లాగుతుందని సామంత్‌ని హెచ్చరిస్తుంది అప్పూ. నేను చెప్పినట్లు వినకుంటే రాజకుమారుడిలా ఉన్న నువ్వు, దీని కోసం అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టుకుంటూ బతకాల్సి ఉంటుందని చెబుతుంది. ఆ మాటలతో అనామిక రగిలిపోతుంది. ఇంతలో దుగ్గిరాల కుటుంబం మొత్తం కాఫీ తాగుతూ ఉంటుంది.. కావ్య తప్ప ఎవరూ బాగా వంట చేయలేరా , పనిమనిషి శాంతతో వంట చేయించి వీళ్ల సంగతి చెబుతానని రాజ్ అనుకుంటాడు.

శాంతను పిలిచి ఈ రోజు నుంచి నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నానని అనడంతో ఆమె ప్లేట్ కిందపడేసి గట్టిగా అరుస్తుంది. ఈ రోజు నుంచి ఇంట్లో శాంతనే వంట చేస్తుందని రాజ్ చెప్పడంతో .. అంతా ఉలిక్కిపడి లేస్తారు. ఈ ఇంట్లో ఎవరో లేకపోతే ఏదో జరుగుతుందనే దానికి శాంత వంటే సమాధానమని అంటాడు. ఆ నిర్ణయంతో అందరూ భయపడిపోతారు. మధ్యలో స్వప్న కలగజేసుకుని , శాంత వంట చేశాక, ముందు మా అత్తకు పెట్టాలి.. ఆవిడ బాగుంటే మేమంతా ధైర్యంగా తింటామని చెబుతుంది. మీరంతా సైంటిస్టులు నేను ఎలకనా , నా మీద ప్రయోగాలు చేస్తారా అంటూ రుద్రాణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్వు అంతగా ఉలిక్కిపడొద్దు అత్త.. కావాలంటే ముందు నేనే తింటానని రాజ్ అంటాడు.
అక్కడ కృష్ణమూర్తికి విగ్రహాలు తయారు చేయడంలో సాయం చేస్తుంది కావ్య. అది చూసి కనకం కోప్పడుతుంది. కూతురు ఏం చేసినా తలూపుతావ్ అంటూ కృష్ణమూర్తిని తిడుతుంది. నేను అల్లుడు గారింటికి వెళ్తున్నానని, వియ్యపురాలిని పలకరించి వస్తానని అంటుంది. ఆ మాటతో కావ్య, కృష్ణమూర్తి షాక్ అవుతారు. అత్తయ్యని చూడాలని తనకూ ఉందని, ఈ సమయంలో పక్కనే ఉండి బాగోగులు చూసుకోవాలని ఉందని తండ్రితో చెబుతుంది. శాంత వంట చేసి అన్ని సిద్ధం చేసి వడ్డించబోగా.. మాకు వద్దంటే వద్దంటారు కుటుంబ సభ్యులు.
దీంతో నాకే ముందు పెట్టమంటూ రాజ్ అడగ్గా, శాంతి వడ్డిస్తుంది. ముద్ద నోట్లో పెట్టగానే రాజ్ ఫ్రీజ్ అవుతాడు, ఓ గ్లాస్ నీళ్లు గటగటా తాగేస్తాడు. ఆరోజు అద్భుతంగా వంట చేశావ్, ఈరోజేంటీ ఇలా చేశావ్ అని శాంతను ప్రశ్నిస్తాడు. ఆరోజు వంట చేసింది శాంత కాదు, కావ్య చేసిందని అపర్ణ అసలు నిజం చెబుతుంది. కావ్య విలువ ఇప్పటికైనా తెలిసిందా అని అంతా క్లాస్ పీకుతారు. నువ్వు మారతావని ఎదురుచూస్తున్నానని, ఎక్కువ రోజులు వెయిట్ చేయలేనని, అప్పుడు తాను తీసుకునే నిర్ణయం మామూలుగా ఉండదని అపర్ణ హెచ్చరిస్తుంది.
అనామికను తీసుకుని సామంత్ కంపెనీకి వచ్చి, ఛైర్మన్ సీట్లో కూర్చోబెడతాడు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని కొట్టే సంస్థ పుట్టుకురాలేదని సామంత్ అనగా.. ఆ చరిత్రకు చెదలు పట్టిందని, దుగ్గిరాల వారింట్లో ఇంతకు ముందులా పరిస్థితులు లేవని, రాజ్ వైఫ్ ఇల్లు వదిలి వెళ్లిపోయిందని అంటుంది అనామిక. ఇన్ని రోజులు ఆ కంపెనీకి డిజైన్లు ఇచ్చిన కావ్య ఇప్పుడు లేదు .. ఆమె పేదరికాన్ని మనం అవకాశం తీసుకుని, కావ్యని మన వైపుకు తిప్పుకోవాలని చెబుతుంది అనామిక.
అది ఎలా అని సామంత్ అడగ్గా.. ఫోన్‌లో సందీప్ ఫోటో చూపిస్తుంది. మేనేజర్‌ను పిలిచి సందీప్ ద్వారా కావ్య ఈ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేయాలని ఆర్డర్ వేస్తుంది. అనామిక ప్లానింగ్ చూసి సామంత్ సంతోషపడతాడు. అక్కడ నిద్రపోకుండా వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తున్న కూతురిని పడుకోమని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరోవైపు.. ప్రోమోలో వినాయక చవితి ఏర్పాట్లు ఈసారి నువ్వే చేయాలని రాజ్‌కి బాధ్యతలు అప్పగిస్తారు కుటుంబ సభ్యులు. కావ్య సైకిల్ తొక్కుకుని వస్తుండగా.. ఓ కారు వచ్చి ఆమెను గుద్దుతుంది, అందులోంచి రాజ్ దిగుతాడు.


Click it and Unblock the Notifications











