Brahmamudi September 24th episode: రాజ్ చవితి పూజ .. ఎస్ఐ ట్రైనింగ్‌కి అప్పూ, రుద్రాణిని కడిగిపారేసిన కనకం
తండ్రితో కలిసి వినాయకుడి విగ్రహాలు తయారు చేసిన కావ్య వాటిని డెలివరీ ఇస్తుంది. ఎంతో ముద్దుగా ఉన్న గణపతి విగ్రహం చూసి షాప్ ఓనర్ ఎంతో ముచ్చటపడి ఆమెకు డబ్బులిస్తాడు. ఇక వినాయక చవితి పూజ కోసం విగ్రహం తయారు చేయాలని అప్పూ ట్రై చేస్తుంది. ఇంతలో బంటి వచ్చి ఆమెపై సెటైర్లు వేస్తాడు. నీకోసం పెదనాన్న విగ్రహం పంపించాడని చెబుతాడు. మరోవైపు ఇంట్లో వాళ్లంతా ఈసారి వినాయక చవితి నిర్వహించే బాధ్యతను రాజ్ చేతుల్లో పెడతారు. సైకిల్ తోక్కుంటూ వస్తున్న కావ్యని రాజ్ కారుతో గుద్దుతాడు.. దీంతో ఆమె పెద్ద గొడవ చేస్తుంది. ఈ జన్మలో నువ్వు మా ఇంటి గడప తొక్కొద్దని కావ్యకి తేల్చిచెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ 523లో ఏం జరిగిందంటే..
రాజ్ - కావ్య గొడవ పడుతూనే ఉంటారు. పెళ్లి నాడు జరిగిన సంఘటన నుంచి నిన్న మొన్నటి ఇన్సిడెంట్ వరకు అన్ని తవ్వకుంటూ ఉంటారు. నేను వెళ్లాలి నీ సైకిల్ అడ్డు తీయమని రాజ్ చెప్పగా.. కావ్య సైకిల్‌ని కారుకు అడ్డంగా పెట్టి.. మీరే తిప్పుకుని వెళ్లమంటూ గద్ధిస్తుంది. ఇంతలో వినాయకుడి విగ్రహం కొనడానికి వచ్చిన రాజ్ చూపు.. కావ్య చేసిన బొమ్మపై పడుతుంది. అయితే దానిని ఓ కస్టమర్ స్పెషల్‌గా తయారు చేయించుకున్నాడని షాప్ ఓనర్ చెబుతాడు, ఇదే కావాలి అంటూ పట్టుబడతాడు. రాజ్ అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన షాప్ ఓనర్ రేటు ఎక్కువ చెబుతాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ షాప్‌నే కొనేస్తానని చెప్పి రూ.10 వేలు అతని చేతిలో పెడతాడు రాజ్ .

ఇంట్లో వాళ్లు చెప్పినట్లుగానే వినాయక చవితి పూజకి కావాల్సిన ఏర్పాట్లను రాజ్ ఇరగదీస్తాడు. పూజకి సిద్ధమవుతుండగా అపర్ణ, ఇందిరలు రాజ్‌ని పిలికి కావ్యకి ఫోన్ చేయమంటారు. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడు కావ్య ఎందుకు అని ప్రశ్నించగా.. వినాయక చవితి పూజను భార్య లేకుండా చేయకూడదని చెబుతారు. అదంతా నాకు ముందు ఎందుకు చెప్పలేదని రాజ్ మండిపడతాడు. నువ్వు ఫోన్ చేయ్.. కావాలంటే నేనే వెళ్లానని , అవసరమైతే లాగి ఒక్కటి పీకుతానని అపర్ణ చెబుతుంది. దీంతో రాజ్ రివర్స్‌లో వినాయకుడికి ఓ దండం పెట్టి.. ఈ ఇంట్లో పక్కన భార్య ఉన్నవాళ్లే పూజ చేస్తారట, నేను మాత్రం ఓ నమస్కారం, రెండు గుంజిళ్లు, మూడు ప్రదక్షిణలు సమర్పించుకుంటానని చెబుతాడు.
ఇంట్లో ఉన్న నాలుగు జంటలు పూజలో కూర్చోండి కానీ నన్ను మాత్రం వదిలేయమంటాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని ఇంత కుట్ర చేస్తారా అంటూ ఫైర్ అవుతుంది. వీడు దేవుడు చెప్పినమాటలే వినలేదని, ఇక మనుషుల మాట వినడని రుద్రాణి సంతోషపడుతుంది. ఇంతలో స్వప్న జోక్యం చేసుకుని భార్యభర్తల సంబంధం గురించి చెప్పగా.. రాజ్ కౌంటరిస్తాడు. అయితే కావ్య చీర పక్కనపెట్టుకుని పూజ చేయమని ఇందిర సలహా ఇస్తుంది. అప్పటికీ వినకపోయేసరికి సీతారామయ్య చేతి కర్ర తీసుకుని కొట్టబోతుంది. వినాయకుడి ముఖంపై ఉన్న వస్త్రాన్ని తొలగించగా.. బొమ్మను చూసిన కుటుంబ సభ్యులు చాలా బాగుందని అంటారు.
పది వేలు పెట్టి స్పెషల్‌గా కొన్నానని రాజ్ చెప్పగా.. రుద్రాణి ఆశ్చర్యపోతుంది. అయినా తొండం అటువైపు తిరిగి ఉందేంటని ప్రకాష్ ప్రశ్నిస్తాడు.. దానికి ఇందిర వివరణ ఇస్తుంది. ఇది కావ్య చేసినట్లుగా ఉందని అపర్ణ డౌట్ పడుతుంది. పూజ చేస్తుండగా కావ్య చీరను చూసి ఆమె వచ్చిందనుకుని భ్రమపడతారు రాజ్, అపర్ణ. స్వప్న హారతి ఇస్తుండగా తాను భ్రమ పడినట్లుగా భావించి అపర్ణ ఏడుస్తుంది.
అక్కడ కళ్యాణ్- అప్పూలతో పూజ జరిపిస్తాడు బంటి. తర్వాత అప్పూకి కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తాడు. అందులో పోలీస్ డ్రెస్ ఉంటుంది. నువ్వు తిరిగి ఎస్ఐ ట్రైనింగ్ తీసుకుని నీ కల నిజం చేసుకోవాలని చెబుతాడు. రాజ్ ఇంట్లో పూజ ముగిసి అంతా ప్రసాదం తీసుకుంటూ ఉండగా.. కనకం అక్కడికొస్తుంది. పండగ పూట ఆమెను అక్కడ చూసి అంతా ఆనందపడతారు.. కావ్య వచ్చిందేమోనని అపర్ణ గుమ్మం వైపు చూస్తుంది. పిలవని పేరంటానికి వచ్చావ్ అని కనకాన్ని రుద్రాణి ప్రశ్నించగా.. అంతా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











